వనపర్తి పురపాలకసంఘం
వనపర్తి జిల్లాకు చెందిన పురపాలకసంఘం
(వనపర్తి పురపాలక సంఘము నుండి దారిమార్పు చెందింది)
వనపర్తి పురపాలక సంఘము వనపర్తి జిల్లాకు చెందిన 1 పురపాలక సంస్థ ఇది 1984 నుంచి పురపాలక సంఘంగా ఉన్నది. అంతకు క్రితం 1962 నుంచి 1966 వరకు కూడా పురపాలక సంఘంగా ఉండేది. ఆ కాలంలో బాలకృష్ణయ్య పురపాలక సంఘం చైర్మెన్‌గా పనిచేశారు. మేజర్ గ్రామపంచాయతీగా మార్పు చేసిన పిదప కూడా బాలకృష్ణయ్య సర్పంచిగా ఎన్నికయ్యారు. 1983లో ఈయన వనపర్తి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇది మూడవ గ్రేడు పురపాలక సంఘంగా కొనసాగుతోంది.
జనాభా
మార్చు2001 నాటికి పట్టణ జనాభా 50262 కాగా, 2011 నాటికి 60949కు పెరిగింది.
ఆదాయ-వ్యయములు
మార్చు2012-13 నాటికి పురపాలక సంఘం ఆదాయం 7.09 కోట్ల రూపాయలు, ఖర్చు 5.40 కోట్ల రూపాయలు.[1]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-04. Retrieved 2014-03-10.