వరంగల్లు జిల్లా కథా సర్వస్వము

తెలుగు పుస్తకము

హనుమకొండలోని ప్రముఖ సాహిత్య సంస్థ శ్రీలేఖ సాహితి తన 108వ ప్రచురణగా 108 మంది వరంగల్లు జిల్లా కథారచయితల 108 కథలను వరంగల్లు జిల్లా కథా సర్వస్వము పేరుతో ప్రకటించింది. 800 పుటల ఈ బృహద్గ్రంథానికి టి.శ్రీరంగస్వామి సంపాదకుడు. ఈ గ్రంథంలో 1927 -2015 సంవత్సరాల మధ్య వెలువడిన కథలున్నాయి.[1]

వరంగల్లు జిల్లా కథా సర్వస్వము
కృతికర్త:
సంపాదకులు: డా. టి.శ్రీరంగస్వామి
ముఖచిత్ర కళాకారుడు: నాగుల యుగంధర్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథా సంకలనము
విభాగం (కళా ప్రక్రియ): సాహిత్యం
ప్రచురణ: శ్రీలేఖ సాహితి, వరంగల్లు
విడుదల: 2016, జనవరి 11
పేజీలు: XX+ 780

కథల జాబితా మార్చు

క్రమసంఖ్య కథ పేరు రచయిత పేరు
1 పరివారిక శిక్ష దూపాటి శేషమ్మ
2 ప్రణయ బంధము శేషాద్రి రమణ కవులు
3 లండన్ విద్యార్థి ఒద్దిరాజు రాఘవ రంగారావు
4 రక్తమూల్యము ఒద్దిరాజు సీతారామచంద్రరావు
5 పాశ్చాత్య వ్యామోహము బి.వి.రంగారెడ్డి
6 లలిత టి.హయగ్రీవాచారి
7 స్వాతంత్ర్య మకుటమునకు జయమగు గాత భండారు చంద్రమౌళీశ్వరరావు
8 మనమే నయం కాళోజీ నారాయణరావు
9 నా స్నేహం పెండ్యాల శేషగిరిరావు
10 నిట్టూర్పు ప్రతిమ
11 బీద పెళ్ళి సముద్రాల లక్ష్మీ నరసయ్య
12 గజేంద్ర మోక్షము పొట్లపల్లి రామారావు
13 చీకటి రాజ్యం అడ్లూరి అయోధ్యరామయ్య
14 గంగన్న నందగిరి ఇందిరాదేవి
15 నిప్పు పూలు దాశరథి కృష్ణమాచార్య
16 పీడకల బిరుదురాజు రామరాజు
17 లోకుల మాటలు వినరండి - ప్రపంచ వైఖరి చూడండి వడ్లకొండ నరసింహారావు
18 దేశ సేవకుడు శొంఠి కృష్ణమూర్తి
19 ఆందోళికం కందుకూరి లింగరాజు
20 తిరిగి రాను పెండ్యాల చిన రాఘవరావు
21 ప్రతీకారం పేర్వారం జగన్నాథం
22 ఆరుణి భండారు సదాశివరావు
23 ఆయనింకా రాలేదు డా. ఎం.వి.తిరుపతయ్య
24 మర్రిచెట్టు డా.దాశరథి రంగాచార్య
25 కసి అంపశయ్య నవీన్
26 నేను ప్రేమించిన వ్యక్తి మహేశ్వరం రత్నాకర్ రావు
27 నరాంతకుడు దూపాటి సంపత్కుమారాచార్యులు
28 నాకీ తాళి వద్దు నెల్లుట్ల వెంకటేశ్వరరావు
29 బోనస్ పులుగు శ్రీనివాస్
30 సమర్చనం పైడిముక్కల ఆనంద్ కుమార్
31 పలికించెడివాడు కోవెల సుప్రసన్నాచార్య
32 గొల్లకథ కె.రాంమోహన్ రాజు
33 తిరిగిరాని వసంతం ఎడమ శ్రీనివాసరెడ్డి
34 ఫోటోగ్రాఫర్ కాళోజీ రామేశ్వరరావు
35 సంగీత శిక్షణ డా. పర్చ అంజనీదేవి
36 గంటీలు ననుమాస స్వామి
37 ప్రాప్త కాలజ్ఞుడు ప్రభాకర్ జైని
38 అమ్మను కదరా కన్నా... ఎ.విజయకుమార్ (విజయార్కె)
39 కిటికీ పక్క సీటు ఏ.వి.అనిల్ ప్రసాద్
40 అప్పుల మంటలు బాణోతు జైసింగ్ రాథోడ్ (ఫర్జాన్ సింగ్)
41 ఆకాశవీధిలో... చిర్ర రాజు
42 మట్టి బంధం అనిశెట్టి రజిత
43 బాల్యం బతుకు దార్ల రామచంద్ర
44 అద్దాల మేడ సయ్యద్ ఖుర్షీద్
45 నగరం డా. సదానంద్ శారద
46 నిర్ణయం డా. మహమ్మద్ తహసీన్ అలి
47 నీలితెర పల్లె శీను
48 గిఫ్ట్ డా.యన్.వి.యన్.చారి (కిషోర్)
49 బాలార్క అపూర్వ నిర్మాణం కె.సూర్యముఖి
50 ఉషోదయం డా.ఆకునూరి విద్యాదేవి
51 వరుస డా.రాపోలు సత్యనారాయణ (రసన)
52 ఎదిరి చూపులు పి.వి.యస్.వాసు
53 బడి కౌంటర్ పి.వీరబ్రహ్మాచారి (సరళరేఖ)
54 అనురాగ్‌బాబు డా.తక్కెళ్ళ బాలరాజు
55 ఎవరు మారాలి...? డా.వి.వీరాచారి
56 ఆత్మబంధం నమిలికొండ బాలకిషన్‌రావు
57 ఈద్ నమాజ్ బాసిత్
58 పాడెకట్టె వడ్డెబోయిన శ్రీనివాస్
59 గంగేచ యమునేచైవ డా.భండారు ఉమామహేశ్వరరావు
60 భూమి పి.చంద్
61 మూగసైగ గుండెబోయిన శ్రీనివాస్
62 పావురాల కథ పెండ్యాల వరవరరావు
63 మామయ్య పాఠం సింగరాజు రమాదేవి
64 లోపలి మనిషి డా.టి.శ్రీరంగస్వామి
65 ప్రియమైన దయ్యం కోడూరి విజయకుమార్
66 రాగం మార్చిన కోయిల... వజ్జీరు ప్రదీప్
67 కంచే చేను మేస్తే... కందాళ సుదర్శన్
68 వ్యత్యాసం వరిగొండ కాంతారావు
69 పిచ్చిది అన్వర్
70 పినాసి సుబ్బారావు నామని సుజనాదేవి
71 సంస్కారం మెట్టు మురళీధర్
72 దేవుని మీద మన్నుబొయ్య డా.పసునూరి రవీందర్
73 దుఃఖాగ్ని రామా చంద్రమౌళి
74 ఎదురు చూపులు... మ్యాకం రవికుమార్ (పాంచజన్య)
75 ఐస్ ముదిగొండ శివకౌముదీదేవి
76 ఆదర్శ విధ్వంసం జూపాక సుభద్ర
77 పరిగె డా.కె.ఎల్.వి.ప్రసాద్
78 అమ్మ పెట్టిన భిక్ష మద్దెర్ల రమేశ్
79 బతుకమ్మ వేముగంటి శుక్తిమతి
80 భార్య మనసు తమ్మెర రాధిక
81 నన్ను ముట్టుకోకు... ఆచార్య తోట జ్యోతిరాణి
82 మనసున ఉన్నదీ చెప్పాలనున్నది డా.చిలుకమారి సంజీవ
83 మనమే చేస్తే...? డా.బండారి సుజాత
84 ఇది కథ కాదు... జీవితం నాగుల యుగంధర్
85 గువ్వ ఎగిరిపోయినా... గూడు చెదిరిపోదులే వై. విజయలక్ష్మి
86 అజ్ఞానం సిగ్గుపడింది డా.తెన్నేటి సుధాదేవి
87 బడి బాట డా. మంథని శంకర్
88 మరో మహాలక్ష్మి టి.సంయుక్త
89 పెద్దక్క సలహా పి.వి.రమణారావు (ఎలెక్ట్రాన్)
90 మరపురాని యాది శీతల రాజేశం
91 ఉత్పల ప్రతాపురం రామానుజాచారి
92 స్నేహబంధం రంగు చక్రపాణి
93 అనుబంధాలు మాదారపు వాణిశ్రీ
94 వందేమాతరం అద్దంకి సత్యనారాయణ (సత్యశ్రీ)
95 ఒక ఊరి కథ మండవ సుబ్బారావు
96 మనుషులమేనా! వరిగొండ సత్యసురేఖ
97 సంస్కృతి - సంప్రదాయాలు కొలిపాక సుచరిత (కౌస్తుభ)
98 కాసులవేటలో... కానరాని బంధాలు ఏరుకొండ శశిరేఖ
99 దారి దీపం భండారు విజయ
100 వెన్నెల డా.శంకరమంచి శ్యాంప్రసాద్
101 ఆత్మీయత డా.డి.భిక్షపతి
102 కృతజ్ఞత చల్లా జయపాల్‌రెడ్డి
103 రాచిప్ప కొండపల్లి నీహారిణి
104 నడక ముచ్చట్లు గోపగాని రవీందర్
105 అమ్మ(అత్తమ్మ) మనసు యం.లక్ష్మీ ప్రసన్న
106 గురువయ్య సారు కానిగీ బడి డా.వాణి దేవులపల్లి
107 ఋణం చెన్నూరి సుదర్శన్
108 కాలం మారినా... నెల్లుట్ల రమాదేవి

విశేషాలు మార్చు

  • ఈ గ్రంథం 2016, జనవరి 11న వరంగల్లు ప్రెస్ క్లబ్‌లో అనిశెట్టి రజిత చేత ఆవిష్కరించబడింది.
  • ఈ కథా సంకలనానికి ప్రముఖ తెలంగాణ సాహిత్య పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ అక్షరాలేసిన తొవ్వ పేరుతో ముందుమాటను వ్రాశాడు.
  • ఈ కథా సంకలనంలో మొదటి కథ, చివరికథ రచయిత్రులవే కావడం యాధృచ్ఛికమే అయినా మొత్తం పాతిక మంది రచయిత్రుల కథలు ఈ సంకలనంలో చోటు చేసుకోవడం గమనార్హం.
  • ఈ సంకలనంలో అనుబంధంగా డా.మహమ్మద్ తహసీన్ అలి వ్రాసిన శ్రీలేఖ సాహితి కథాసంకలనాల వైపు ఓ చూపు అనే పరిశీలనాత్మక వ్యాసం ఉంది.

అభిప్రాయాలు మార్చు

మూలాలు మార్చు