వర్తమాన తరంగిణి

వర్తమాన తరంగిణి 1842 జూన్ 8 న మద్రాసులో సయ్యద్ రహమతుల్లా స్థాపించిన వార పత్రిక.[1] ఇది ఒక ముస్లిం వెలువరించిన తొలి తెలుగు వార పత్రిక. ఇది ఒక దశాబ్దం పైగా కొనసాగింది.[2] చిన్నయసూరి రచనా ప్రారంభ దశలో "వర్తమాన తరంగిణి" అను పత్రికకు వ్రాయుచుండెడివాఁడు.[3] ఈ పత్రిక వాడుక భాషలోనే వెలువడింది. [4] బుచ్చిరెడ్డిపాళెంనుంచి వర్తమాన తరంగిణి మాసపత్రిక సాహిత్యానికి, వార్తలకు సమప్రాధాన్యాన్నిస్తూ వెలువడింది.[5] ఈ పత్రికకు సంపాదకులుగా పువ్వాడ వెంకట్రావు పనిచేసాడు.[6]

విశేషాలు మార్చు

మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు: "మేము మిక్కిలి ధనవంతులము కాము. ఆంధ్ర భాష యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిష్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి"

మూలాలు మార్చు

  1. రాపోలు, ఆనంద భాస్కర్ (1988). జర్నలిజం చరిత్ర - వ్యవస్థ. p. 40. Retrieved 28 December 2017.
  2. "హిత సూచని – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-04-16.
  3. "పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/91 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2023-04-16.
  4. "పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/113 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2023-04-16.
  5. "పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/122 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2023-04-16.
  6. https://sarasabharati.files.wordpress.com/2013/01/telugu-news-papers.jpg. "తమిళనాట తొలి తెలుగు పత్రిక". {{cite web}}: External link in |last= (help)CS1 maint: numeric names: authors list (link)