సప్తగిరి గోపగాని వికీపీడియాకు స్వాగతం. సప్తగిరి తల్లిదండ్రులు పెట్టిన పేరు కాగా గోపగాని వాళ్ల ఇంటిపేరు. తల్లి సరోజన, తండ్రి నారాయణ గౌడ్‌. స్వస్థలం గోదావరిఖని (ఇప్పటి పెద్దపల్లి జిల్లా పూర్వ కరీంనగర్‌ జిల్లా). గోదావరిఖని-రామగుండంలోని ఫెర్టిలైజర్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఫ్యాక్టరీ సమీపంలోని కాలనీలో నివాసం. విద్యాభ్యాసం తొలుత శ్రీ సరస్వతీ శిశుమందిర్‌, గౌతమీనగర్‌లో శిశు తరగతినుంచి ఐదవ తరగతి వరకు చదివారు. ఆరవ తరగతి, ఏడవ తరగతి అప్పట్లో ఎఫ్‌సీఐ టౌన్‌షిప్‌లో కొనసాగిన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో చదివారు. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు హన్మకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. హన్మకొండ రెడ్డికాలనీలోని బీసీ-బీ సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ పదోతరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత అమ్మమ్మ ఊరు వీణవంక మండలం ఘన్ముక్లలో ఉంటూ జమ్మికుంటలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ అభ్యసించారు.