తొలగించిన వ్యాసాలు listసవరించు

వికీపీడియా:గూగుల్ యాంత్రిక అనువాద వ్యాసాల జాబితా - 2020 జనవరి 19

రాయాలిసవరించు

హర్షద్ మెహతా అనగానే గుర్తుచ్చేది భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని (1992 సెక్యూర్టీస్) అతిపెద్ద కుంభకోణం.

హర్షద్ మెహతా అనగానే గుర్తుచ్చేది భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని (1992 సెక్యూర్టీస్) అతిపెద్ద కుంభకోణం. ఈ కుంభకోణానికి సూత్రధారి అయిన హర్షత్ మెహతా మరణానంతరం, ఆయన కుటుంబానికి 27 ఏళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ వచ్చింది. మెహతా కుటుంబంపై ఉన్న ట్యాక్స్ డిమాండ్ ను ఇన్ కం ట్యాక్స్ ట్రిబ్యునల్ తిరస్కరించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ట్యాక్స్ ఊబిలో కూరుకుపోయిన మెహతా భార్య జ్యోతి, సోదరుడు అశ్విన్ కు భారీ ఊరట కలిగింది. 1992లో ఆదాయ పన్ను శాఖ మెహతా కుటుంబానికి రూ.2వేల కోట్లు పన్ను విధించింది. దీనిపై దశాబ్దాలుగా హర్షద్ మెహతా కుటుంబం కోర్టులు చుట్టూ తిరిగింది. బ్యాంకుల పిటిషన్లకు ఎన్నో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేసింది. సుదీర్ఘ కాలం క్లయిమ్స్ పర్వం కొనసాగింది. ఎట్టకేలకు మెహతా కుటుంబానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. కోట్ల ట్యాక్స్ నుంచి ఉపశమనం దొరికింది.


హర్షద్ మెహతా ఎవరంటే.. ఇండియాలో ఫస్ట్ టైం జరిగిన అతిపెద్ద స్కాం.. హర్షద్ మెహతా కుంభకోణం (1992 సెక్యూర్టీస్ స్కాం). చాలా తక్కువ మందికి మాత్రమే ఈ కుంభకోణం గురించి తెలుసు. ఇండియాలో బిగ్ బుల్ మార్కెట్ అయిన దలాల్ స్ట్రీట్ లో ‘హర్షద్ మెహతా’ అనే వ్యక్తి స్టాక్ షేర్ బ్రోకర్. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు (15 రోజుల వ్యవధిలో) లోన్లు తీసుకోవడం.. దాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతుండేవాడు. అదే 15 రోజుల్లో స్టాక్ మార్కెట్లో లాభాలు గడించి బ్యాంకులకు చెల్లించేవాడు. ఒక్క బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు, అలా ఒక్కో బ్యాంకులో లోన్లు మీద లోన్లు తీసుకుంటూ మనీ రోటేట్ చేస్తుండేవాడు. RF deal, (రెడీ ఫార్వడ్ డీల్, బ్యాంకు రీసిప్ట్).. పలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటూ మెహతా బురిడి కొట్టించాడు. స్టాక్ మార్కెట్ ను తెలివిగా ఉపయోగించుకుని తన మార్కెట్ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. ఆ విషయం గుర్తించిన బ్యాంకులు అతని దగ్గర నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం మొదలుపెట్టాయి. ఆ తరువాత హర్షద్ పై బ్యాంకులు 72 క్రిమినల్ కేసులను నమోదు చేశాయి.


ఇందులో అన్నీ సివిల్ కేసులే ఫైల్ చేశాయి. ఈ కేసులను విచారించిన సుప్రీంకోర్టు హర్షద్ ను దోషిగా తేలుస్తూ 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25వేలు జరిమానా విధించింది. మెహతాను థానె జైలుకు తరలించారు. డిసెంబర్ 31, 2001 రోజు ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకులు జరుపుకుంటోంది. ఆ రాత్రి ఉన్నట్టుండి మెహతా తన కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే థానె సివిల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి 12.30 గంటలకు హర్షద్ తుదిశ్వాస విడిచారు. తన 47ఏళ్ల వయస్సులోనే మెహతా మరణించాడు. అప్పటికే ఆయనపై 27 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.


రూ.4 కోట్లు ట్యాక్స్ ఎగవేత 1992, ఫిబ్రవరి 28 నుంచి మెహతా కుటుంబంపై ఆదాయ శాఖ చర్యలు చేపట్టింది. అప్పటినుంచి వరసగా వారి సంబంధిత ఆస్తులపై తనిఖీలు చేపట్టింది. సోదాల్లో ఎన్నో డాక్యుమెంట్లు, షేర్ మార్కెట్ కు సంబంధించిన సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుంది. 1992, జూన్ 4న సీబీఐ మెహతా కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై సెర్చ్ ఆపరేషన్ జరిపింది. అనంతరం హర్షద్ మెహతా తన 1992-93 ఏడాది ఆదాయంపై ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేశాడు. ట్యాక్స్ డిపార్ట్ మెంట్ దాన్ని తిరస్కరించింది. మెహతా ఫ్యామిలీ రూ.4 కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు 1995లో ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. చివరికి ఈ వ్యవహారం కాస్తా ఇన్ కం ట్యాక్స్ ట్రిబ్యునల్ కు చేరింది. 23ఏళ్ళ తరువాత ట్రిబ్యునల్.. మెహతా కుటుంబ పన్ను కట్టాలనే ఐటీ శాఖ డిమాండ్ ను తోసిపుచ్చింది. క్లీన్ చిట్ ఇచ్చింది. పన్ను కట్టాల్సిన అవసరం లేదని తేల్చింది.


జేబులో రూ.40తో ముంబై వచ్చి.. 1954 జూలై 29న గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లాలో ఓ పేద కుటుంబంలో జన్మించాడు. మెహతా తండ్రి ఓ ప్యూన్. తన జేబులో రూ.40తో ముంబై నగరానికి వచ్చాడు. 1976లో ముంబైలోని లాలా లజ్ పత్ రాయ్ కాలేజీ కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తి చేశాక కొన్ని ఏళ్లపాటు పలు కంపెనీల్లో ఉద్యోగం చేశాడు. న్యూ ఇండియా అస్యు రేన్స్ కంపెనీ లిమిటెడ్ లో సేల్స్ పర్సన్ గా చేరాడు. షేర్ మార్కెట్ పై ఉన్న ఆసక్తితో 1980లో జాబు వదిలేసి స్టాక్ బ్రోకర్ గా అవతరమెత్తాడు. అక్కడి నుంచి సబ్ బ్రోకర్ నుంచి స్టాక్ బ్రోకర్ అంచెలు అంచెలుగా ఎదిగి స్టాక్ మార్కెట్ లో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కోట్లు కూడబెట్టాడు.

1984లో తన సోదరుడితో కలిసి సొంత కంపెనీ స్థాపించాడు. గ్రో మోర్ రీసెర్చ్ అండ్ అసెట్ మేనేజ్ మెంట్ అనే సంస్థను నెలకొల్పాడు. అనంతరం బాంబ్వే స్టాక్ ఎక్సేంజీ లో బ్రోకర్ గా చేరాడు. 1986లో ట్రేడింగ్ ఫుల్ యాక్టివ్ గా ఉంటూనే.. 1990 ప్రారంభంలో ఫేమస్ స్టాక్ బ్రోకర్ గా ఫేమస్ అయ్యాడు. అప్పటి నుంచి మెహతా కంపెనీలో ఎందరో ప్రముఖులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు.

indiaసవరించు

COVID-19 pandemic in India
 
Map of confirmed total cumulative number of cases
మూస:Collapsed infobox section begin
 
 
 
Map of deaths due to the pandemic
మూస:Collapsed infobox section end
వ్యాధిCOVID-19
వైరస్ స్ట్రెయిన్SARS-CoV-2
ప్రదేశంIndia
మొదటి కేసుThrissur, Kerala[1]
10°31′39″N 76°12′52″E / 10.5276°N 76.2144°E / 10.5276; 76.2144Coordinates: 10°31′39″N 76°12′52″E / 10.5276°N 76.2144°E / 10.5276; 76.2144
మూల స్థానంWuhan, Hubei, China[2]
కేసులు నిర్ధారించబడింది10,890,909
బాగైనవారు10,479,223
మరణాలు
154,996
ప్రాంతములు
28 states and 8 union territories[3]

ఫోటో లైసెన్స్సవరించు

{{Non-free use rationale poster | Article =ప్రేమమ్ | Use = Infobox | Media = film | Name = | Distributor = | Publisher = | Graphic Artist = Thought Station | Type = | Website = | Owner = | Commentary = | Description = | Source = 1 | Portion = | Low resolution = | Purpose = | Replaceability = | Other information = }

ప్రేమసవరించు

వాలెంటైన్‌ ఎవరు..? వాలెంటైన్‌ అనే ఒక ప్రవక్త. ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు. క్రీస్తుపూర్వం 270లో రోమ్‌ దేశంలో జీవించిన వాలెంటైన్‌ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు. దీంతో యువతలో వాలెంటైన్‌ పట్ల క్రేజ్‌ పెరిగింది. అదే సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్‌ కుమార్తె వాలెంటైన్‌ అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ చూపిస్తున్నాడన్న నెపంతో వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్‌ గెలాసియన్స్‌ వాలెంటైన్‌ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటినుంచి ఖండాంతరాలను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు పండుగగా జరుపుకునేలా ప్రేమికుల దినోత్సవం విస్తరించింది. ఈ రోజును ఒక్కో దేశంలో ఒక్కోలా జరుపుకొంటారు.

మనదేశంలో : మనదేశంలో 20-30 ఏళ్లుగా ప్రేమికుల రోజును జరుపుకొనే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సంఖ్యతో పాటు పాశ్చాత్య సంస్కృతిని నిషేధించాలనే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇంగ్లీష్‌ ప్రధాన భాషగా చలామణిలో ఉన్న అన్ని దేశాల్లో ప్రేమికుల దినోత్సవాన సెలవు ఇచ్చే విధానం ఉంది. మనదేశంలో అలా లేదు.

ఇటలీలో.. : ఇటలీలో ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం మొట్టమొదటిసారి చూసిన వ్యక్తే తమ జీవిత భాగస్వామిగా మారతారనే భావన ఉంది. అలా కనిపించిన వారితో తర్వాతి ప్రేమికుల దినోత్సవానికి వివాహం కూడా అయిపోతుందని నమ్మకం.

జర్మనీలో.. : జర్మనీలో ప్రేమికుల రోజున పంది బొమ్మ లేదా పంది బొమ్మ ఉన్న గ్రీటింగ్‌ కార్డును ఇచ్చిపుచ్చుకోవడం శుభసూచకంగా భావిస్తారు. దీంతో వాలెంటైన్‌ డేకు ముందు పంది బొమ్మలకు జర్మనీలో డిమాండ్‌ పెరుగుతుంది.

అర్జెంటీనాలో.. : అందరికీ ప్రేమికుల రోజు ఉంటే అర్జెంటీనా వాసులకు ప్రేమికుల వారం ఉంది. ఆ దేశంలో జూలై 13 నుంచి 20వ తేదీ వరకూ వారం పాటు వాలెంటైన్‌ వీక్‌గా జరుపుకొంటారు.

కొరియాలో.. : కొరియాలో రెండు సంప్రదాయాలున్నాయి. ఏప్రిల్‌ 14ను వైట్‌ డేగా భావిస్తూ ఓ పక్క ప్రేమికులు ఉత్సాహంగా సెలబ్రేట్‌ చేసుకుంటుంటారు. మరోపక్క ప్రేమలో పడనివారు ఇదేరోజును బ్లాక్‌ డేగా భావిస్తూ నల్లటి దుస్తులు ధరిస్తారు.

జపాన్‌లో.. : జపాన్‌లో వాలెంటైన్స్‌ డేన ప్రేమికులు బహుమతులుగా చాక్లెట్లను ఇచ్చుకుంటారు. అందుకోసం ప్రత్యేకంగా చాకెట్లు తయారుచేస్తారు. ఇలా చాక్లెట్లు బహుమతిగా అందుకున్న వారు నెల తర్వాత అవతలి వారికి చాక్లెట్లతో పాటు బహుమతులనూ అందజేస్తారు.

పక్షుల కోసం : ఫిబ్రవరిలో పక్షులు తమ జంటల కోసం ఎక్కువగా వెతుకుతాయి. కాబట్టి పక్షులూ ప్రేమను తెలుపుకొంటాయనే ఆలోచనతో ఈ రోజును ఎంపిక చేశారు.


గ్రేట్‌ గ్రీటింగ్‌

అమెరికా, డెన్మార్క్‌, యూకే, ఇటలీ, జపాన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో వాలెంటైన్స్‌ డేను పెద్ద పండుగలా చేస్తారు. క్రిస్మస్‌ తర్వాత ఎక్కువగా గ్రీటింగ్స్‌ పంచుకునే రోజుగా వాలెంటైన్స్‌ డే గుర్తింపు పొందింది. ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల గ్రీటింగులు అమ్ముడవుతాయని అంచనా.


ప్రేమకు అడ్రెస్‌

ప్రేమికుల రోజున ధరించే డ్రెస్‌ కూడా ఒక సందేశాన్ని పంపుతుంది. ఆ సందేశా న్ని పసిగట్టేలా రంగులకూ కొన్ని అర్థాలు ఏర్పాటు చేసుకున్నారు.

పింక్‌ : గోయింగ్‌ టు ప్రపోజ్‌

బ్లూ : వెలకమ్‌ ఫర్‌ అప్లికేషన్స్‌

ఆరెంజ్‌ : ఆల్రెడీ ఇన్‌ లవ్‌

బ్లాక్‌ : నాట్‌ ఇంట్రస్టెడ్‌

ఎల్లో : లవ్‌ ఫెయిల్యూర్‌

గ్రీన్‌ : లవ్‌ యాక్సెప్టెడ్‌

వైట్‌ : డబుల్‌ సైడ్‌


ఏడు రోజుల పండగ

వాలెంటైన్స్‌ వీక్‌లో మొదటి రోజైన ఫిబ్రవరి ఏడును రోజ్‌ డేగా ప్రేమికులు భావిస్తారు. తమ అనుబంధాన్ని పెంచుకోవడం కోసం గులాబీలను అందజేస్తారు.

ఇష్టపడిన వారికి మొదటిసారి ప్రపోజ్‌ చేయడం కోసం ఫిబ్రవరి ఎనిమిదిని ప్రపోజ్‌ డేగా సెలబ్రేట్‌ చేసుకుంటారు.

ప్రేమ బంధం ఎప్పటికీ తీయగా ఉండాలనే ఉద్దేశంతో ప్రేమికులు చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకుంటారు. అందుకోసం ఫిబ్రవరి తొమ్మిదిని చాక్లెట్‌ డేగా జరుపుకొంటారు.

బహుమతులెన్నున్నా అమ్మాయిలు టెడ్డీబేర్‌లను బాగా ఇష్టపడతారు. టెడ్డీని బహుమతిగా ఇవ్వడం ద్వారా తామెప్పుడూ ప్రేయసి వెన్నంటే ఉన్న భావన కలిగించవచ్చు. అందుకోసం ఫిబ్రవరి 10ని టెడ్డీ డేగా జరుపుకొంటారు.

నమ్మకానికి గుర్తుగా ప్రామిస్‌ చేసుకుంటారు. అదే ఫిబ్రవరి 11న ప్రామిస్‌ డేగా ఎన్ని కష్టాలొచ్చినా విడిపోకూడదనే ఉద్దేశంతో జరుపుకొంటారు.

ప్రేమికులు తమప్రేమను ముద్దు ద్వారా తెలియపరుచుకునే రోజు ఫిబ్రవరి 12. దీన్నే కిస్‌ డేగా వ్యవహరిస్తారు.

ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తమ ప్రేమను పంచుకునే రోజు హగ్‌ డే. ఫిబ్రవరి 13ను హగ్‌ డేగా జరుపుకొంటారు.

వీటన్నింటినీ ఒక్క రోజులోకి మార్చితే ఫిబ్రవరి 14. అదే ప్రేమ పండగ. ప్రేమికుల దినోత్సవం

  1. "Kerala confirmed first novel coronavirus case in India". India Today. 30 January 2020.
  2. Sheikh, Knvul; Rabin, Roni Caryn (10 March 2020). "The Coronavirus: What Scientists Have Learned So Far". The New York Times. Retrieved 24 March 2020.
  3. "Home | Ministry of Health and Family Welfare | GOI". mohfw.gov.in. Retrieved 3 మార్చి 2021. Check date values in: |access-date= (help)