Rajusj
పేరు : ఎ.వి.హెచ్ . రాజు . జే . స . ఫూరు : కడప. శ్రీ రామాంజనేయపురం. ప్రస్తుతం : ఆంద్ర లొయోల కళాశాల. విజయవాడ. విభాగం : తెలుగు. ఇతరుల్లో మీకు నచ్చేది : వినయం . అవును! ఇతరులు ఎంత వినయం గా ఉంటె నాకు అంత నచ్చుతారు. గొప్పలు చెప్పకుండా, క్రమశిక్షణ దృష్టిలో ఉంచుకుని మెలిగే వారంటే నాకు చాల గౌరవం. ఎదుటివారిలో నచ్చనిది : దాపరికం. మనసులో ఒకటి ఉంచి, పైకి సరళంగా , ఉదారంగా మాట్లాడటం నాకు ఎదుటి వారిలో నచ్చని విషయం. మీలో మీకు నచ్చనిది : నాలో నాకు నచ్చనిది, ఒక ప్రత్యేక సమయాన్నంటూ దేనికీ కేంద్రీకరించక పోవటం. సరైన రోజువారీ లక్ష్యం లేక పోవటం. నాలో నాకు నచ్చినది : ఉదార స్వభావం. (generosity )నా వద్ద ఉన్నది ఇతరులకు పంచి తినటం నాకు చాలా సంతృప్తినిస్తుంది. నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి : నాకు జన్మనిచ్చిన తల్లి, జుల్యానమ్మ. తన స్ఫూర్తి తోనే నేను యేసు సభలో చేరి ఆరు సంవత్సరాలు తర్ఫీదును ముగించగలిగాను. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది : నా జీవితం దేవునికి అంకితం చేశాను గనుక, ఆయన బాటలో నడచి, ఇంకనూ తనను విస్వసింపని వారికి సహకరించడం. నా గొడవ.................... నా జన్మ స్థలం మలెగుడిపాడు. కడప. నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడను. నా ఆశలను, కోరికలను నా గొడవగా చెప్తాను వినండి. నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నపుడు, మా వసతి గృహ యజమాని ఫాదర్. రత్నం గారు. ఒక రోజు తాను చెప్పిన ప్రసంగం ద్వారా నా మనసులో ఉన్న ఉబలాటం గురించి, మరియూ అది ఏమిటో కూడా తెలుసుకున్నాను. అది ఏమనగా? ఒక మంచి గురువు అవ్వాలని మరియూ పేదలకు సాయం చేయాలని. అప్పట్లో ఫాథర్ చెప్పగా విన్నాను కానీ, ఈ నా కోరిక మీద అంత అవగాహన లేదు. క్రైస్తవ మతం లో పెరిగిన నాకు, నా తల్లి దండ్రుల ప్రోత్సాహం కూడా దక్కింది. నేను ఒక క్రైస్తవ గురువు అవుతానని మా ఇంట్లో చెప్పగానే వారు ఏంతో సంతోషంతో అంగీకరించారు. నాకు కూడా చాలా సంతోషం కలిగింది. మా ఇంటికి దగ్గర్లో ఉన్న కొంత మంది ఫాధర్లని కలిసి నా కోరికను తెలిపాను. ఆవిధంగా, ఆ ఫాదర్ల ద్వారా ఈ గురు జీవితం లోకి అడుగు పెట్టాను. ఈ గురు తర్ఫీదు వలన నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. జీవితం మరియూ దానియొక్క విలువ ఏంటో నాకు బాగా అర్థం అయింది. చాలా గడియల ప్రార్ధన ద్వారా నేనిది అర్థం చేసుకున్నాను. అదేమనగా? మానవుడు తన జీవితాన్ని ఏ విధంగానైనా జీవించ వచ్చు. జీవితం అనేది ఎన్నో వరాలు మరియూ బహుమానాలతో కల కల లాదేడిగా మార్చుకోవచ్చు లేదా నిందావమానాలతో విల విల లాదేడిగానైన మార్చుకోవచ్చు. జీవితాన్ని తనదైన రీతిలోకి తీర్చిదిద్దడం ఒక మంచి కల అవుతుంది. మనకందరికీ తెలిసినట్టుగా, జీవితం అనేది ఆశామాశీగా చేసుకొనే హాస్యం కాదు. ఈ జీవితం దారిపొడవునా మనకు ప్రతీ విషయం అర్థం అయ్యేటట్లు అనుభవాలను, ఆనంద క్షణాలను వివరించి వాటి రుచి ఎలా ఉంటుందో చూపిస్తుంది.ఇతరులు మనకు ఎన్ని చెప్పినా, ఎన్ని సార్లు చెప్పినా మనసుకేక్కే విషయాలు కొన్ని మాత్రమే ఉండవచ్చు. కాని మనవంతు మనమే ఆ చెప్పిన విషయాలను అనుభవిస్తే?ఆ అనుభవం చాలా గొప్పదిగా మన జీవితం లో స్థిరపడిపోతుంది. చాలా మంది మనలో, నా జీవితం ఇలా ఉంది, అలా ఉంది, అస్సలు జీవితానికి అర్థం లేదని వాపోతూ ఉంటారు. కానీ మన జీవిత విధానంలో జీవిత అంతరార్ధం తెలుసుకోగలిగితే మనం మన జీవితానికి న్యాయం చేసిన వారం అవుతాం అనునది అక్షరాలా సత్యం. అని నా చిన్న అవగాహన. నేను చిన్న పిల్లలనుండి .................................. ఇవి కాక, ఇంకా ఎక్కువ విషయాలు నేను చిన్న పిల్లలనుండి నేర్చుకున్నాను. అమాయకులైనా, పిల్లలు మనకి చాలా విషయాలు వారికి తెలియకుండా నేర్పిస్తారు. చిన్న పిల్లల చిరునవ్వు నన్నెపుడూ ముగ్ధుణ్ణి చేస్తుంది. ఎల్లప్పుడూ అలాంటి చిరు నవ్వుతోనే ఉంటూ అదే నవ్వును ఇతరులకు కూడా పంచమని నా మనసు లో తట్టుతూ ఉంటుంది.అందరూ కూడా చిన్న పిల్లల్లాంటి మనస్తత్వం కలిగి ఉంటె ఎంత బావుండు అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ ఇది సాధ్యమా.? అనే ప్రశ్న నాలో మిగిలిపోతుంది. నిజానికి, అటువంటి ప్రశ్నలకు నా వద్ద సమాధానాలు లేనట్టే నేను భావిస్తాను. కానీ చిన్నపిల్లల వంటి మనస్తత్వం కలిగి ఉండటం ఈ కంప్యూటర్ యుగంలో చాలా కష్టం. అందుకే కొన్ని విషయాలు చూసి చూడకుండా వదిలేస్తుంటాను.. నవ్వించిన నాన్న............ ఆ నాడు నా పుట్టిన రోజు. అందరూ ఎంతో సరదాగా, సంతోషంగా ఉన్నారు. పుట్టినరోజు జరపడానికి వచ్చిన బంధువులందరూ వారు తెచ్చిన బహుమానాలను ఇచ్చారు. నా ఒక్కగానొక్క చెల్లి కూడా బహుమతి ఇచ్చింది. కానీ, ఆరోజు, సాయంత్రం ఎవరో తిట్టారని ఏడ్చుకుంటూ నాన్నకు వచ్చి చెబితే అది విన్న మా నాన్న ఎంతో బుజ్జగించి,, ఊరడించి ఆ విషయం మరచిపో అన్నాడు. కానీ దిగాలుగా ఉన్న నన్ను చూసి నచ్చక, నాన్న మరియూ తన స్నేహితులూ కలిసి ఆడ వేశాలలో వచ్చి నా ముందు ఒక పాటకి డ్యాన్సు చేసారు. ఆడ వేషం లో ఉన్న మా నాన్నని సగం పాట తర్వాతనే కనుగొన గలిగాను. అది ముందే కనిపెట్టిన బందువులందరూ నవ్వుతున్నారు. అది అర్థం అయ్యి నేను కూడా ఆ దిగులు మర్చిపోయి నవ్వడం మొదలు పెట్టాను. అలా మా నాన్న నన్ను మాత్రమే కాక బందువులందరినీ కడుపుబ్బా నవ్వించాడు. మిస్ అయిన అన్న............. ఒక రోజు మా పెద నాన్న కొడుకు అనగా మా అన్న రైలు లో ప్రయాణం చేస్తున్నాడు. అతడు చదువుకోలేదు. ఏదో పని మీద ఒక ప్రదేశం నుండీ ఇంకో ప్రదేశానికి వెళ్తున్నాడు. అలా ప్రయాణం చేస్తుండగా రైలులో అతనికి నిద్ర వచ్చింది. పక్కనున్న ముసలవ్వతో ఓ గంట తర్వాత తనను నిద్ర లేపమని చెప్పి , సరే అని చెప్పిన ఆమె మాటలు విని పైకి ఎక్కి నిద్రపోయాడు. చాలా సేపైన తర్వాత లేచి చూస్తే, తను ఉన్న కంపార్ట్ మెంట్ లో ఒకరో ఇద్దరో అలా కూర్చుని ఉన్నారు. ముసలవ్వ కోసం వెతికాడు, కానీ ఎవరూ లేరు. అలా కాసేపటికి రైలు దిగాడు. అక్కడ తెలుగు కాకుండా ఇంకేదో భాష మాట్లాడుతున్నట్టు కనిపెట్టాడు. దిక్కు తెలియని పరిస్తితి. జేబులో డబ్బులయితే ఉన్నాయి కానీ ఏమైనా కొనుక్కోవటం ఎలా? ఇంటి వద్ద ఎదురు చూస్తున్న పెదనాన్న ఎక్కడబ్బా వీడు ఇంకా రాలేదు అంటున్నాడు. అలా అనుకుంటుండగా ఇంట్లో ఫోన్ రింగ్ అయింది. ఎవరని చూస్తే మా అన్నయ్య బెంగుళూరు లో ఉన్నట్టు విన్నాడు. సంగతి అర్థం చేసుకున్న పెదనాన్న నన్నూ మా తమ్ముడినీ పంపించి మీ అన్నను తీసుకురండ్రా అని పంపాడు. ఆ విధంగా మా అన్నవల్ల మాకు బెంగుళూరు చూసే అవకాశం దక్కింది. ఆకలంటే ??????.... మా పెదనాన్నతో కలసి పక్క వూరిలో నూతన గురువు మొదటి దివ్య పూజలో పాల్గొనటానికి వెళ్లాను. వెళ్ళేటప్పుడు ద్విచక్ర వాహనం పై పెదనాన్న వెనకాల ఎంతో సంబరంగా వెళ్లాను. అలా వెళ్ళటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అపుడు అక్కడ ఒక పెద్ద వేదిక మీద పూజ మొదలు పెట్టబోతున్న గురువును చూసాను.ఇంకో అరగంటలో పూజ మొదలవుతుందని ఎవరో పక్కన్నుంచి అంటున్నారు. అలా పూజకు వచ్చిన వారందరూ చాలా ఆనందంగా ఎదురు చూస్తూ, నూతన గురువుని చూసి ముచ్చట పడుతున్నారు. పూజ ఎంతో ఘనంగా జరిగి ముగిసింది. మా దురదృష్టానికి మా బండి పంక్చర్ అయ్యింది. ఎటూ వెల్ల లేని స్తితి. పెదనాన్న నన్నక్కడే ఉండమని అతను పంక్చర్ సరిచేపించడానికి వెళ్ళిపోయాడు. నాకు అక్కడ తెలిసిన వాళ్ళుకూడా లేరు. ఓ ప్రక్క అందరూ పూజ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలలో మునిగి ఉన్నారు. ఇంకో ప్రక్క పెదనాన్న కోసం వెతుకుతూ వేచి చూస్తున్న నాకు సాంస్కృతిక కార్యక్రమాలేవి పట్టట్లేదు. మరో ప్రక్క కడుపు కాలుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలవల్ల మధ్యాహ్న భోజనం ఆలస్యం అవుతుందని కొందరు చెప్పారు. అది కళ్ళు తిరిగి పడిపోయే పరిస్తితి. పెదనాన్న కోసం ఎదురు చూస్తూ, చూస్తూ , ఉండగా భోజనాలు మొదలైన సూచనలు అగుపించాయి. తూలుతూ తూగుతూ నిరాశతో తిరిగిపడేంత నీరసంతో అన్నం పెట్టె వరుసలో నిలబడాల్సి వచ్చింది. ఎంతసేపటికి వరుస తగ్గట్లేదు. కడుపులో ఒక్క గుక్క నీరు లేదు. ఉదయం తిన్న ఒక్క దోసె ఎప్పుడో అయిపోయింది. అలా నావంతు రాగానే అన్నం గిన్నె తీస్కోని పక్కనే తినటం ప్రారంభించాను. అపుడు నాకు నిజంగా, స్వయంగా అర్థం అయ్యింది, ఆకలి బాధ ఎలా ఉంటుందో? కానీ అది నాకు ఓ మంచి అనుభూతి. ఎందుకంటే ఇపుడు నాకు ఆకలి బాధ అంటే ఏంటో తెలుసు. కాబట్టి ప్రియ మిత్రులారా !!!!!!! ఇంతటితో నా గురించిన సమాచారం ఆపివేస్తాను. ఇప్పటికి ఇది చాలు. నాకు వీలు ఉన్న తరుణం చూసుకొని మీకు నాలో ఉన్న తీపి జ్ఞాపకాలను ఇంకా ఎన్నో చెప్తాను..............................................రాజు. బొద్దు పాఠ్యం
(1 వ పేజీ.) దలిత సాహిత్యం - విహంగ వీక్షణం
"చాతుర్వర్ణ్యం మయా స్రుష్టం గున కర్మ విభాగశః తస్స్య కర్తారమపి మాం విద్ద్య కర్తారమ వ్యయమం" (భగవద్గీత 4-13) చాతుర్వర్నాలు గున కర్మలను బట్టి ఏర్పడ్డాయనేది భగవద్గీత, మను స్మతులు చాటి చెబుతున్నాయి. మను స్మృతి కర్మలను అనుసరించి జన్మ ఏర్పడుతుందని వివరణ ఇస్తుంది. " శుభాశుభఫలం కర్మ .............. ఉత్తమాధమ మధ్యమా" (మనుస్మృతి 12-3,4) మనస్సు, వాక్కు, దేహం ఇవి చేసే కర్మ శుభాశుభఫలములను కలిగిస్తున్నది. ఈ కర్మ వల్లనే జీవులకు ఉత్తమ, మద్ద్యమ, అధమ గతులు ఏర్పడుతున్నాయి. (మనుస్మృతి, తెలుగు తాత్పర్య సహితం, డా. ఎన్. ఎల్. నరసింహాచార్య) బ్రాహ్మణ స్త్రీకి - శూద్ర పురుషునికి పుట్టిన వాడు "చండాలుడు" అని మనుస్మ్ృతి చెబుతుంది. శూద్రుని వలన వైశ్య స్త్రీకి పుట్టిన వాడు అయోగుడు, క్షత్రియ స్త్రీకి పుట్టిన వాడు క్షత. వీరంతా వర్న సంకరులు. వీరే అవర్ణులు, అంటే ఏ వర్నానికి చెందనివారు. వారే " పంచమ వర్నం" వీరు సమాజం లో నిమ్నస్తానం లో ఉన్న వారు. వీరినే దళితులుగా భారతీయ సమాజం లో కుల వ్యవస్త బలపడిన తరువాత పిలవటం జరిగింది. "దళితము" అంటే ఖండింప బడినది, చ్చేదింప బడినది, వికసించినది అనే అర్థాలు కనిపిస్తున్నాయి. అస్పుృష్యత కారణంగా సమాజం నుండి "విడగొట్టబడిన వారనే" అర్థం లో సాహితీ వేత్తలు దళితులను వివరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ పదాన్ని ఒక కులానికో లేదా కొన్ని కులాలకో పరిమితం చేయకూడదనే వాదనలు ఉన్నాయి.