వాడుకరి:Sindhu Meduri/ప్రయోగశాల

నిఖాత్ జరీన్ మార్చు

నిఖాత్ జరీన్
వ్యక్తిగత సమాచారం
జననం14 జూన్ 1996
నిజామాబాద్ జిల్లా, తెలంగాణ
బరువుబరువు 51 కిలోలు (112 పౌండ్లు)
క్రీడ
దేశంభారతదేశం
క్రీడబాక్సింగ్
Weight classఫ్లై వెయిట్

నిఖాత్ జరీన్ భారతీయ వర్థమాన మహిళ బాక్సర్. 2011 లో అంటాల్యాలో జరిగిన AIBA ఉమెన్స్ యూత్ & జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె బంగారు పతకాన్ని సాధించారు. [1]2019 లో, బ్యాంకాక్‌లో జరిగిన 2019 థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో జరీన్ రజత పతకం కైవసం చేసుకున్నారు. [2][2] 2015 లో అస్సాంలో జరిగిన 16 వ సీనియర్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించారు. [4] [3]2020 లో, జరీన్‌కు ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు 10,000 రూపాయల నగదు బహుమతిని,అవార్డును క్రీడా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మరియు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి అందుకున్నారు.(SATS). [3][4]

వ్యక్తిగత జీవితం మరియు నేపథ్యం మార్చు

జరీన్ 14 జూన్ 1996 న భారతదేశంలోని తెలంగాణలోని నిజామాబాద్‌లో ఎండి జమీల్ అహ్మద్ మరియు పర్వీన్ సుల్తానా దంపతులకు జన్మించారు. [5][5] ఆమె కేవలం 13 సంవత్సరాల వయసులో బాక్సింగ్ ప్రారంభించారు. ఆమె బాక్సింగ్ ప్రయాణానికి తండ్రి పూర్తి మద్దతు ఇచ్చారు. . [6][6] జరీన్ తరచుగా బాక్సర్ మేరీ కోమ్ ను తన స్ఫూర్తి ప్రదాతగా భావించేవారు. [7] [7]హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో జలంధర్‌లో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ పోటీల్లో ఆమె బెస్ట్ బాక్సర్ ఛాంపియన్ షిప్ సాధించారు.


2009 లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐవీ రావు ఆధ్వర్యంలో శిక్షణ పొందటానికి జరీన్‌ను విశాఖపట్నంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేర్చుకున్నారు. ఒక సంవత్సరం తరువాత ఆమె 2010 లో ఈరోడ్‌లో జరిగిన నేషనల్స్‌లో ఆమెను 'గోల్డెన్ బెస్ట్ బాక్సర్‌గా' ప్రకటించారు. [8][8]

వృత్తిపరమైన విజయాలు మార్చు

2010 లో నేషనల్ సబ్ జూనియర్ మీట్‌లో జరీన్ తొలి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. 2011 టర్కీలో జరిగిన మహిళల జూనియర్ మరియు యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో, ఫ్లై వెయిట్ విభాగంలో ఆమె తొలి అంతర్జాతీయ బంగారు పతకాన్ని సాధించారు. జరీన్ టర్కిష్ బాక్సర్ ఉల్కు డెమిర్‌తో పోరాడి మూడు రౌండ్ల తరువాత 27:16 తేడాతో ఆమెపై గెలిచారు. [1][9]


అయితే మరోసారి ఇటువంటి విజయాన్ని ఆమె సాధించలేకపోయారు. దీంతో 2013 ఉమెన్స్ జూనియర్ & యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె రజత పతకంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. [8][10] తరువాత ఏడాది(2014) లో సెర్బియాలోని నోవి సాడ్‌లో జరిగిన మూడవ నేషన్స్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఆమె బంగారు పతకం సాధించారు. జరీన్ 51 కిలోల విభాగంలో రష్యాకు చెందిన పాల్ట్సేవా ఎకాటెరినాను ఓడించారు. [12][11]


2015 లో అస్సాంలో జరిగిన 16 వ సీనియర్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో జరీన్ బంగారు పతకం సాధిచారు. [4][12] 2019 లో, కొన్ని సంవత్సరాల విరామం తరువాత, బ్యాంకాక్‌లో జరిగిన థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో రజతం సాధించడం ద్వారా మరో అంతర్జాతీయ పతకాన్ని సాధించారు. [2][13]

బల్గేరియాలోని సోఫియాలో జరిగిన 2019 స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో 51 కిలోల విభాగంలో ఫిలిపినో ఐరిష్ మాగ్నోను ఓడించి జరీన్ బంగారు పతకాన్ని సాధించారు. [9][14] అదే సంవత్సరం జూనియర్ నేషనల్స్‌లో జరీన్ స్వర్ణం సాధించి ‘ఉత్తమ బాక్సర్‌గా’ ఎంపికయ్యారు. టోక్యోలో జరగనున్న ఒలంపిక్స్‌కు మేరీ కోమ్‌ను ఎంపిక చేసినప్పుడు, తనను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మేరీ కోమ్‌తో తనకు పోటీ పెట్టాలని డిమాండ్ చేస్తూ సంచలనం సృష్టించారు. అయితే మేరీతో జరిగిన బౌట్‌లో ఆమె ఓటమి పాలయ్యారు. [7][15]

జరీన్‌కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌లో  భాగమైన వెల్స్‌పన్ గ్రూప్ పూర్తి సహాయ సహకారలను అందిస్తోంది. [10][1] ఆమె తన సొంత పట్టణం నిజామాబాద్, తెలంగాణకు అధికారిక రాయబారిగా నియమితులయ్యారు. [11][16]


మూలాలు మార్చు

  1. 1.0 1.1 Apr 30, PTI / Updated:; 2011; Ist, 21:28. "4 Indians win gold in AIBA Women's Youth & Junior World Championship | Boxing News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. "This silver medal at Thailand Open is a huge confidence boost for me ahead of the World Championships: Nikhat Zareen - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  3. "Indtoday News | Hyderabad Local News | Telangana" (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-08-23. Retrieved 2021-02-17.
  4. Sep 29, TNN / Updated:; 2020; Ist, 17:59. "Athletes Deepthi, Maheswari, Nandini and boxer Nikhat presented scooters | More sports News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  5. "Indian Boxing Federation Boxer Details". www.indiaboxing.in. Retrieved 2021-02-17.
  6. "Nikhat Zareen packs a punch". The Hindu (in Indian English). Special Correspondent. 2015-02-26. ISSN 0971-751X. Retrieved 2021-02-17.{{cite news}}: CS1 maint: others (link)
  7. Sportstar, Team. "Women who inspire us: Nikhat Zareen". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  8. "India's Nikhat Zareen wins silver at Youth World Boxing | Firstpost". web.archive.org. 2013-09-29. Retrieved 2021-02-17.
  9. Apr 30, PTI / Updated:; 2011; Ist, 21:28. "4 Indians win gold in AIBA Women's Youth & Junior World Championship | Boxing News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  10. "India's Nikhat Zareen wins silver at Youth World Boxing | Firstpost". web.archive.org. 2013-09-29. Retrieved 2021-02-17.
  11. "currentaffairs_details_responsive". www.jagranjosh.com. Retrieved 2021-02-17.
  12. "Indtoday News | Hyderabad Local News | Telangana" (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-08-23. Retrieved 2021-02-17.
  13. "This silver medal at Thailand Open is a huge confidence boost for me ahead of the World Championships: Nikhat Zareen - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  14. "Strandja Memorial Boxing Tournament 2019: Nikhat Zareen, Meena Kumari Devi strike gold; Manju Rani settles for silver - Sports News , Firstpost". Firstpost. 2019-02-19. Retrieved 2021-02-17.
  15. Sportstar, Team. "Women who inspire us: Nikhat Zareen". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  16. "Nikhat Zareen is brand ambassador of Nizamabad". The Hindu (in Indian English). Special Correspondent. 2014-12-13. ISSN 0971-751X. Retrieved 2021-02-17.{{cite news}}: CS1 maint: others (link)