వాడుకరి చర్చ:కాసుబాబు/పాతచర్చలు 3

Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.

బొమ్మలు

నేను నాలుగయిడు బొమ్మలు లోడు చేస్తున్నా వాటిని పశ్చిమ గోదావరి వ్యాసంలొ మీకిష్టమయిన చోట ఉంచండి...విశ్వనాధ్. 13:05, 12 సెప్టెంబర్ 2007 (UTC)

అంగ్ల వికీ మూస

సౌకర్యంగా ఉంటుందని మూస:ఆంగ్ల వికీ లింకులు మూస తయారు చేశాను--మాటలబాబు 18:30, 12 సెప్టెంబర్ 2007 (UTC)

సుదాకర్ గారూ వినాయకచవితి శుభాకాంక్షలు. రమదాన్ మొదలయిందిగా ఇప్పుడిక కొంచెం ఫ్రీ అవుతారనుకుంటా! తెవికీని పరుగెత్తించాలి....అన్నట్టు అక్కడేమయినా గుళ్ళున్నాయా? విశ్వనాధ్. 09:21, 15 సెప్టెంబర్ 2007 (UTC)

తెలుగు సినిమా గణాంకాలు

కాసుబాబుగారు, మీరు సభ్యుడు:Mpradeep/movstat పేజీలో చేసిన వినతిని నేను ఇప్పుడే చూసాను. అలా గణాంకాలు తీయమని మీరు నా చర్చాపేజీలో అడగాల్సింది. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా విక్షనరీలో గడుపుతున్నాను. ఇక్కడకు అప్పుడప్పుడూ వచ్చిపోతున్నాను, కాబట్టి ఇక్కడ జరిగేవి నాకు పెద్దగా తెలియటంలేదు. ఏమయినా సినిమా గణాంకాలు తీయటం మొదలుపెట్టాను, ఇంకొంతసేపటికి పూర్తవుతుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:12, 16 సెప్టెంబర్ 2007 (UTC)

ఇక్కడ ఉన్న ఈ లోపం వలన పొద్దున్నుండీ బాటు గణాంకాలు తీసుకోవడానికి చాలా మొరాయించింది. మొత్తానికి పూర్తయ్యింది, సినిమా పేజీల తాజా గణాంకాలు సిద్ధంగా ఉన్నాయి. __మాకినేని ప్రదీపు (+/-మా) 14:55, 16 సెప్టెంబర్ 2007 (UTC)
అక్కడ లోపం ఉన్నదని ఎలా తెలిసింది?--మాటలబాబు 14:58, 16 సెప్టెంబర్ 2007 (UTC)
ఆ పేజీ వచ్చేసరికి బాటు ఆగిపోతుంది మరి. పేజీని గమనిస్తే అందులో ఉన్న లోపం కనపడింది. బాటును తయారు చేసేటప్పుడు ఇలాంటి లోపాలు ఉంటాయని నేను ఊహించలేదు. దానిని సరి చేసిన తరువాత పూర్తి వివరాలు సేకరించింది... __మాకినేని ప్రదీపు (+/-మా) 15:04, 16 సెప్టెంబర్ 2007 (UTC)

మూసలు - UAE/ARE

కాసుబాబు గారూ, మూస:UAE కనిపించలేదు. ARE పేరుతో కూడా లేదు. వేరే పేరుతో ఉందా? ఖర్జూరం కోసం అవసరమైంది. __చదువరి (చర్చరచనలు) 00:04, 18 సెప్టెంబర్ 2007 (UTC)

ఈ మూసను సరైన చోటికి దారిమార్పు చేశాను. ఇప్పుడు పనిచేస్తుంది --వైజాసత్య 01:03, 18 సెప్టెంబర్ 2007 (UTC)

బొమ్మలు - సహాయం

వైజా సత్యా! సెలవుల్లో నేను కొన్ని వూళ్ళ ఫొటోలు సేకరించాను. (అంతా వీడు పిచ్చాడని నవ్వుతున్నారు!) అవి హడావుడిగా అప్‌లోడ్ చేస్తాను. కాని నాకు సమయం తక్కువ ఉన్నది. కనుక ఫార్మాటింగ్ వంటి విషయాలు, శీర్షికలు మీరు వీలయితే (ఎవరైనా గాని) సరి చూడండి. 6 మెగా పిక్సెల్ కెమెరాలో ఒకో బొమ్మా 2.5 మెగాబైట్లు వస్తున్నది. నేను అప్‌లోడ్‌కు ముందుగా కుదించాలా? అలాగే ఉంచెయ్యనా? --కాసుబాబు 09:04, 13 అక్టోబర్ 2007 (UTC)

నేను మా ఊళ్ళో ఫొటోలు తీస్తుంటే నా వైపు కూడా పిచ్చివాడి వలె చూశారు. చూస్తే చూడని అని నా పని నేను చేసుకొని పోయాను. ఫొటోలు వాటి పూర్తి రిజల్యూషన్ తోనే అప్లోడ్ చేయండి, వాటిని కుదించనవసరం లేదు. మీరు అప్లోడ్ చేయండి వాటి సంగతి మేము చూసుకొంటాం--బ్లాగేశ్వరుడు 13:24, 13 అక్టోబర్ 2007 (UTC)
అలాగే ఎక్కించండి. కుదించొద్దు. మిగిలినవి మేము చూసుకుంటాంలే --వైజాసత్య 16:48, 13 అక్టోబర్ 2007 (UTC)
నవ్వితే నవ్వారు గానీ.. కాసుబాబు గారు, బొమ్మలు సూపరు --వైజాసత్య 03:00, 15 అక్టోబర్ 2007 (UTC)
బొమ్మలు చాలా బాగున్నాయి. మా ఊరు నిడదవోలు లొ ఫోటోలు తీస్తుంటే మీరు పత్రిక విలేఖరా అని అడిగారు--బ్లాగేశ్వరుడు 03:02, 15 అక్టోబర్ 2007 (UTC)
మావూళ్ళో ఇంటర్నెట్ చాలా నిదానంగా ఉన్నది. మిగిలిన బొమ్మలు తరువాత, హైస్పీడ్ నెట్ దొరికినప్పుడు అప్ లోడ్ చేస్తాను. --కాసుబాబు 03:24, 15 అక్టోబర్ 2007 (UTC)
అదే మంచి ఆలోచన తరువాత లోడ్ చేయండి. బొమ్మలుచాలా బాగున్నాయి --బ్లాగేశ్వరుడు 03:27, 15 అక్టోబర్ 2007 (UTC)
సుదాకర్ గారూ గుంటుపల్లి పొటోలు అదిరినయ్. ప్రస్తుతం గుంటుపల్లె వ్యాసం పెద్దగా లేదు కనుక పొటోలను గ్యాలరీగా కాక మామూలుగా పెడితే చూసేందుకు బావుమ్టాయిగా. అంటే ప్రతీ పొటోను క్లిక్ చేసి చూడాల్సిన అవసరం లేకుమ్డా వ్యాసమ్లోనే చూడచ్చు కద..ఒకవేళ కావాలంటే వ్యసం పెరిగాక గ్యాలరీలో పెట్టచ్చు.. ఏమంటారు...విశ్వనాధ్. 08:14, 5 నవంబర్ 2007 (UTC)
కృతజ్ఞతలు. మావూరినుండి గుంటుపల్లికి 20 కిలోమీటర్లే. కాని వికీ పుణ్యమా అని ఇప్పుడే సందర్శించాను. మీకు తోచిన విధంగా అమరికల మార్పుకు ప్రయత్నించండి. రంగాపురం, గద్దేవారిగూడెం, ద్వారకా తిరుమల కూడా ఒకమారు పరికించండి. --కాసుబాబు 08:48, 5 నవంబర్ 2007 (UTC)

బొమ్మ:Templescene (himalayanacademy).jpg బొమ్మ అత్యద్భుతముగా ఉన్నది. మంచి సైటు తెలిపినందుకు ధన్యవాదాలు --బ్లాగేశ్వరుడు 18:34, 9 నవంబర్ 2007 (UTC)

సరైన లైసెన్సు టాగ్

ప్రదీప్, ఇటువంటి బొమ్మలకు ఉచితమైన Licence Tag ను సూచించగలవా? --కాసుబాబు 08:19, 10 నవంబర్ 2007 (UTC)

వారు బొమ్మలను విడుదల చేసినప్పుడు ఎటువంటి అవసరాలకైనా ఉపయోగించుకోవచ్చంటూనే, అమ్మకాలను అడ్డుకున్నారు. ఇటువంటి బొమ్మలు, విద్యావసరాలకు లేదా వానిజ్యపరమైన ప్రయోజనాలకు ఉపయోగించలేని బొమ్మల కోవాలోకి వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వర్గంలోకొచ్చే బొమ్మలు వికీపీడియా మౌలిక సిద్దాంతాలకు సరిపడవు. వీటి ఉపయోగించగలిగే మూస {{వాణిజ్యావసారాలు కానివాటికి ఉపయోగించవచ్చు}}. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:07, 10 నవంబర్ 2007 (UTC)
కాసుబాబుగారు, ఆంగ్లవికీలోని ఈ సభ్యుని పేజీలో ఉన్న కాపీహక్కుల వివరాలను ఒకసారి పరిశీలించండి. హిమాలయ అకాడమీవారు, ఈ సభ్యుడికి మరియు en:User:Anantashakti అనే సభ్యుడికీ GFDL లైసెన్సుతో అప్లోడు చేసుకోగలిగే హక్కును ఇచ్చారు. వీరిని అడిగి మీకు కావలిసిన బొమ్మలను కామన్సులో అప్లోడు చేయించుకోగలరేమో ప్రయత్నించండి. వీరు కామన్సులో ఇప్పటికే అప్లోడు చేసిన బొమ్మలు కొన్ని మీకు పనికి వస్తాయేమో పరిశీలించండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 22:14, 10 నవంబర్ 2007 (UTC)

కృతజ్ఝతలు

కాసుబాబు గారూ, నా రచనలు గమనిస్తూ మంచి సూచనలు తెలియజేసినందులకు మీకు కృతజ్ఝతలు తెల్పుతున్నాను. తెవికిలో ఆర్థికశాస్త్ర వ్యాసాలు ఏమియూ లేవు. ఇటీవలే నేణు కొన్ని వ్యాసాలు మొదలుపెట్టినాను. అర్థశాస్త్ర పరంగా నాకున్న పరిజ్ఝానం ప్రకారం నా ప్రయత్నం నేను చేస్తాను. సామాజిక శాస్త్రాలలో ముఖ్యమైన అర్థశాస్త్రమునకు తెవికి మొదటి పేజీలో అసలు లింకే లేదు. ఈ విషయాన్ని నేను మొదటే తెలియజేశాను . ఇప్పుడైనా లింకు ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆర్థిక వేత్తలు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల జీవితాలపై, ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలపై నేణు రచనలు చేయాలనుకుంటున్నాను. మీరు ఇలాగే నా రచనలను గమనిస్తూ సీనియర్ సభ్యులుగా తగు సూచనలు ఇస్తుంటారని కోరుకుంటున్నాను.C.Chandra Kanth Rao 20:11, 16 నవంబర్ 2007 (UTC)

సినిమా జాబితాలు

ప్రదీప్!

  • ఇప్పుడు తెలుగు సినిమాల పేర్లు (1) అకారాది క్రమంలో ఒకో అక్షరానికీ ఒకో జాబితా ఉంది (2) సంవత్సరం ప్రకారం ఒకో జాబితా ఉంది. (3) సంవత్సరం ప్రకారం ఒకో వర్గముంది.
  • అన్ని సినిమాల పేర్లు (ఇప్పుడు వికీలో ఉన్నవి) రెండు జాబితాలలోకి తీసుకురావడం కుదురుతుందా? (అ) అకారాది క్రమంలో అన్ని సినిమాలు ఒక జాబితా (ఆ) సంవత్సరం ప్రకారం అన్ని సినిమాలు ఒక జాబితా - కావాలి. సినిమా లింకులు సరి చేయడానికీ, ఏదైనా సినిమా ఉందో లేదో చూడడానికీ ఇది ఉపయోగంగా ఉంటుంది.
  • ఇది 'బాట్' ద్వారా సాధ్యం కావచ్చునని నిన్ను అడుగుతున్నాను

--కాసుబాబు 09:17, 19 నవంబర్ 2007 (UTC)

కుదురుతుంది. కానీ నాకు కొంత సమయం(3-4 రోజులు) కావాలి. అంత సేపు ఆగుతానంటే తప్పకుండా అలాంటి పేజీలను తయారు చేస్తాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 10:34, 19 నవంబర్ 2007 (UTC)
మీకు కావలసినట్లుగా తెలుగు సినిమాల జాబితాలను తయారు చేసాను వాటిని విడుదల సంవత్సరం వారీగా తెలుగు సినిమాల జాబితా మరియు పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితా అనే పేజీలలో వచ్చేటట్లు చేసాను. ఒక సాని పరిశీలించి వాడుకోవడం మొదలు పెట్టండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 12:02, 25 నవంబర్ 2007 (UTC)

కృతజ్ఞతలు

మీ అభినందనలకు నా కృతజ్ఞతలు కాసుబాబు గారు!   దేవా/DeVచర్చ 09:18, 22 నవంబర్ 2007 (UTC)

గుంటుపల్లి

గుంటుపల్లి గురించి మరికొన్ని వివరాలను చేర్చగలరా. గుంటుపల్లి వెళ్ళేందుకు రవాణా, వైద్య సౌకర్యాలు, నీటి వసతి, బస (సత్రాలు,హొటల్స్), ఇతర ప్రబుత్వ కార్యాలయాలు లాంటివి..విశ్వనాధ్. 06:39, 5 డిసెంబర్ 2007 (UTC)

ప్రయత్నిస్తాను. మళ్ళీ జనవరిలో ఇండియా వెళ్ళే ప్లాను ఉంది! --కాసుబాబు 06:47, 5 డిసెంబర్ 2007 (UTC)
మొదటి పేజీలోని గద్దేవారి గూడెం బడి ముందు అసెంబ్లీ చేస్తున్న పిల్లలపొటో ముందు సరిగా చూడలేదు. కాని దానిని చూస్తుంటే బలే అనిపిస్తుంది. నిజంగా సూపర్ పొటో అది. ఒకవేళ మీరే గనుక తీసి ఉంటే మీకు నా ఎక్కువ అభినందనలు. పోటీలకు పంపాల్సిన అంత మంచి పొటో అది. గమనించి చూసాక మిమ్మల్ని తప్పక అభినందించాలనిపించింది..విశ్వనాధ్. 13:10, 12 డిసెంబర్ 2007 (UTC)
కృతజ్ఞతలు. ఫొటో నేనే తీశాను. (మా తమ్ముడు అక్కడ ఉపాధ్యాయుడు). ఈ ఫొటోను ఇంకో వారం పాటు మొదటి పేజీ బొమ్మగా కొనసాగించాలని నా అభిమతం. --కాసుబాబు 16:48, 13 డిసెంబర్ 2007 (UTC)

కాసుబాబు గారు నమస్తే. మీ అభినందనలకు కృతజ్ఞతలు. nisar 18:22, 12 డిసెంబర్ 2007 (UTC)

గ్రామాలు

కాసుబాబుగారు! మీరు రాస్తున్న గ్రామం వ్యాసం చాలా బాగుంది. మన తెలుగువికీలో గ్రామాల బొమ్మలకు కొదువ లేదనుకుంటా! మీరు బొమ్మలను మార్చండి. నేను కూడా ప్రయత్నిస్తాను. మెస్ టైమ్ అయ్యింది. కొద్దిసేపటి తర్వాత ప్రయత్నిస్తా! దేవా/DeVచర్చ 15:49, 15 డిసెంబర్ 2007 (UTC)

తెలుగు సినిమా పాటలు

నేను చేస్తున్న పనిని గుర్తించినందుకు ధన్యవాదాలు. వికీపీడియా నిబంధనల ప్రకారం పూర్తిపాట వ్రాయవచ్చునా అనేది నా సందేహం. దయచేసి నా సందేహ నివృత్తి గావించండి.Rajasekhar1961 09:13, 2 జనవరి 2008 (UTC)Reply

మొదటిపేజీ బొమ్మ, వ్యాసాలు

ప్రదీప్! (1) 'ఈ వారం వ్యాసం పరిగణన' లాగానే 'ఈ వారం బొమ్మ పరిగణన' మూస ఉంటే బాగుంటుంది. (ఇప్పటికే ఉందా?). ప్రయత్నించగలవు. (2) జనవరి, ఫిబ్రవరి మాసాలలో నేను సెలవు, ప్రయాణాలలో ఉంటాను. ఈ లోగా వీలయిన్ని మొదటి పేజీ బొమ్మలు, వ్యాసాలు సిద్ధంగా ఉంచుతాను. బాకీ ఉన్నవాటిని గమనించగోరుతున్నాను. --కాసుబాబు 08:00, 3 జనవరి 2008 (UTC)Reply

బొమ్మలకు {{ఈ వారం బొమ్మ పరిగణన}} అనే మూస ఉంది. ఆ బొమ్మను మొదటి పేజీలో ప్రదర్శించాలని నిర్ణయించేసినప్పుడు {{ఈ వారం బొమ్మ}} అనే మూసను చేరిస్తే సరిపోతుంది. పరిగణింపబడుతున్న బొమ్మలన్నీ వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలు అనే వర్గంలో చేరితే. ఇప్పటికే ప్రదర్శించిన బొమ్మలన్నీ వర్గం:ఈ వారం బొమ్మలు అనే వర్గంలో చేరతాయి. __మాకినేని ప్రదీపు (+/-మా) 00:10, 4 జనవరి 2008 (UTC)Reply
ప్రదీప్! ఈ వారం వ్యాసంగా ఇదివరకు ప్రదర్శించివేసినవి కూడా వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలులో ఉంటున్నాయి. బొమ్మలకు చేసినట్లుగా రెండు వర్గాలు చేయగలవా? --కాసుబాబు 17:37, 6 జనవరి 2008 (UTC)Reply
వ్యాసాలకు కూడా రెండు వర్గాలు ఉన్నాయి, ప్రదర్శించిన వాటిని వర్గం:ఈ వారం వ్యాసాలు అనే వర్గంలోనూ, పరిగణిస్తున్న వాటిని మరియు ప్రదర్శించబోతున్నవాటినీ కలిపి వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు అనే వర్గంలో ఉంటాయి. అయితే {{ఈ వారం వ్యాసం}} అనే మూస ఉపయోగించినప్పుడు, తేదీని బట్టి వ్యాసాన్ని అప్పటికే ప్రదర్శించేసారా, లేక ప్రదర్శించబోతున్నారా, అనేది నిర్ణయించి ఆ చర్చాపేజీని తగిన వర్గంలోకి దానంతటదే మారుస్తుంది. అయితే పేజీ సోర్సులో ఎటువంటి మార్పులూ జరగజక పోవటం వలన, మీడియావికీ కాషేను తాజాకరించదు(won't update). అందువలన మనమే వ్యాసాన్ని ప్రదర్శించిన తరువాత దాని చర్చాపేజీని మార్చటానికి తెరిచి ఎటువంటి మార్పులూ చేయకుండా భద్రపరిచితే, మీడియావికీ కాషేను తాజాకరించాలని తెలుసుకుంటుంది, ఫలితంగా పేజీ సరైన వర్గంలో చేరుతుంది. పేజీలో ఎటువంటి మార్పులూ చేయకపోవటం వలన "ఇటీవలి మార్పులలో" అది కనపడదు. మొదట్లో వ్యాసాన్ని ఈ-మెయిలుగా పంపినప్పుడు ప్రతీసారీ చర్చాపేజీలను సరైన వర్గంలోకి పంపటానికి అలా చేస్తూ ఉండేవాడిని, ఈ మధ్య కాలంలో అలా చేయటం మరిచాను... __మాకినేని ప్రదీపు (+/-మా) 20:24, 6 జనవరి 2008 (UTC)Reply

చాలా కృతజ్ఞతలు

కాసుబాబు గారూ నమస్తే, తెలుగు వికిపీడియా చాలా బాగుంది. నేను మావూరి గురించిన సమాచారం ఎక్కడ పెట్తాలి అని ఆలోచిస్తున్న సమయం లో తె.వికి గురించి ఈనాడు లో చూడడం జరిగింది. తెవికి లో యల్లాయపాళెం గురించి (1946 ముందు) కొంత సమాచారం మీరు ఇదివరకే రాసి వున్నారు. చాలా కృతజ్ఞతలు. మీకు ఆ సమాచారం ఎక్కడ లభించిందో చెప్పగలరా? సభ్యుల సహకారం తో నెల్లూరు జిల్లాలోని యల్లాయపాళెం గురించి మరింత పరిచయం చేయగలిగాను. దీనికి చాలా సంతోషంగా ఉంది. వెబ్ లో తెలుగు ప్రభ పెంచడానికి నా వంతు సహకారం అందించగలను.

జితేష్.. Jitesh.dega 06:05, 7 ఫిబ్రవరి 2008 (UTC)Reply

దక్షిణ భారతదేశ వ్యాసం గురించి

దక్షిణ భారతదేశ వ్యాసం చాలా బాగం పూర్తి చేశాను. కొన్ని కష్టమైన వక్యాలు అనువదించ లేక పోయాను. వాటిని కొంచెం అనువదించి, సంపూర్ణ తెలుగు వ్యాసంగా తయారు చేయగలరా! రవిచంద్ర 12:33, 7 ఫిబ్రవరి 2008 (UTC)Reply

చాలారోజులనుండి ఆవ్యాసం అలాగే ఉంటే మీకు చెప్పాను. మీకు తీరిక దొరికినప్పుడే చేయండి. రవిచంద్ర 13:10, 7 ఫిబ్రవరి 2008 (UTC)Reply

బొమ్మల కాపీహక్కులకు ఒక బాటు

నేను నిర్వహిస్తున్న బాటుద్వారా కాపీహక్కులు లేని బొమ్మలను కనుక్కుని వాటిని అప్లోడుచేసిన సభ్యులను హెచ్చరించటానికి మరియూ ఆ కాపీ హక్కులను ఎట్లా చేర్చాలో సలహాలు ఇవ్వటానికి ఒక బాటును తయారు చేసాను. ఆ బాటును నడపటానికి ఆమోదం కోసం ఇక్కడ చేర్చాను. అక్కడ మీ అభిప్రాయం తెలుపగలరు __మాకినేని ప్రదీపు (+/-మా) 08:56, 8 ఫిబ్రవరి 2008 (UTC)Reply

Return to the user page of "కాసుబాబు/పాతచర్చలు 3".