Dr.Atla Srinivas Reddy గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Dr.Atla Srinivas Reddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 23:47, 1 నవంబర్ 2018 (UTC)



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 30


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 23:47, 1 నవంబర్ 2018 (UTC)

జీవితాన్ని నడిపించేది సాధించాలనే కసి - అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్, ARPP - INDIA (అసోసియేషన్ ఆఫ్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్స్ అండ్ ప్రొఫెషనల్స్ - ఇండియా) జాతీయ అధ్యక్షుడు 9703935321

మార్చు

తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని ఆశించేది తల్లిదండ్రులే..! బుడిబుడి అడుగుల నుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ పిల్లవాడి బంగారు భవిష్యత్తుకు బాటలు సుగమం చేసేది తల్లిదండ్రులే..! పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తమకే తగిలినట్టు విలవిల్లాడేది తల్లిదండ్రులే..! మరి పిల్లలు చేస్తున్నది ఏంటి? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే కన్నవారికి దైర్యంగా ఉండాల్సిన తరుణంలో తల్లిదండ్రులకు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వారిపై మార్కుల ఒత్తిళ్లు తేవడం సమంజసమేనా? కొద్దిగా ఆలోచించండి.........

ఇతరులతో పోల్చుకోవడం సరికాదు

విద్యార్థి దశలో పరీక్షలు సాధారణమే అయినప్పటికీ జీవన ప్రయాణంలో విద్యార్థి ఒక గమ్యాన్ని ఎంచుకోవడంలో ఈ ఫలితాలు కొంత మేర దోహదం చేస్తాయని గుర్తించాలి, పరీక్ష ఫలితాల ఆధారంగా లక్ష్య నిర్దారణ చేసుకోవాలి. ప్రతి విద్యార్థి ప్రత్యేకం తనలో ఉన్న నైపుణ్యాలు తన తోటి విద్యార్థులలో ఉండొచ్చు, ఉండక పోవచ్చు. ఎట్టి పరిస్తితులలో ఇతరులతో పోల్చుకోవడం సరికాదు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, అనుత్తీర్ణులయ్యామనో బాధ పడొద్దు. మార్కులు ర్యాంకులే ప్రధానం కాదు. ప్రపంచంలో లక్ష్యాలేన్నో ఉన్నాయి అందులో మనమూ ఒకటి సాధిద్దాం. ఒక సమిధలా వెలుగుదాం. ప్రపంచానికి ఒక వెలుగును ప్రసాదిద్దాం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏది ఉండదు, ఓటమి అన్నది ఎప్పుడు అపాయకారి కాదు. మనకు ఈ రెంటిని సాధించాల్సిన దానికి కావాల్సింది మనో దైర్ఘ్యం, ఆత్మ విశ్వాసం, పట్టుదల.


మార్కులు వంశ ప్రతిష్ట గా చూడొద్దు

విద్యార్థుల ప్రతిభకు మా ర్కులు కొలమా నం కానే కాదు. మార్కుల ఆధా రంగా వారి తెలివితేటలను కొలవకూడదు. ప్రపంచంలోని మేధావులంతా మార్కులేమీ సాధించిన వారుకాదు. పిల్లల చదువులను, మార్కులను తల్లిదండ్రులు వంశ ప్రతిష్టగా భావిస్తుంటారు. ఇది తప్పు. విద్యాసంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి పెట్ట కూడదు.


విద్యార్థులకు భరోసా తల్లిదండ్రులే

ఫలితాల ప్రకటన తో వచ్చిన మార్కులతో ఎవరు అధైర్యపడకూడదని, నిరుత్సాహానికి గురికావద్దని, తాము అండగా ఉన్నామని తల్లిదండ్రులు పిల్లలకు, ఉపాధ్యాయులు విద్యార్థులకు భరోసా ఇవ్వాలి. తల్లిదండ్రులు తమ పిల్లల గురించి అత్యధిక అంచనాలను కలిగి ఉండకూడదని, పిల్లల వాస్తవిక స్థాయిని గుర్తించి తల్లిదండ్రులు పిల్లలకు భరోసా ఇవ్వాలి.


చులకనగా చేసిన సమాజం ముందే తలెత్తుకొని జీవింఛాలి

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ విద్యార్థులకు మరో అవకాశం ఉంటుంది. సప్లిమెంటరీలు రాసి మళ్లీ పాస్ కావచ్చు. గత పరీక్షల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. చులకనగా చేసిన సమాజం ముందే తలెత్తుకొని జీవించవచ్చు. కానీ ఇదేమీ ఆలోచించకుండా క్షణికావేశంలో విద్యార్థులు మనోవేధనకు లోనవుతున్నారు. పరీక్ష తప్పానని, ర్యాంకులు రాలేదని, ఎక్కువ మార్కులు తెచ్చుకోలేదని, విద్యాపరమైన ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని అనేది అక్షర సత్యం,


పిల్లల ఉజ్వల భవిష్యత్తును కోరుకునేది తల్లిదండ్రులే

తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల స్నేహ భావంతో ఉండాలి. పరుష పదజాలంతో దూషించకూడదు. పిల్లల స్నేహాలు, విద్యాలయాలలో వారి ప్రవర్తన, చదువు తీరునూ పరిశీలిస్తుండాలి. చదువు తమ వంశ ప్రతిష్ట అంటూ గర్వాలకు పోకుండా పిల్లల పట్ల సానుకూలంగా ఉండాలి. మార్కులే ధ్యేయంగా పెంచకూడదు. 90% మార్కులు వచ్చిన వారు ఎంత ప్రతిభావంతులో 40% మార్కులు వచ్చిన వారు కూడా అంతే ప్రతిభావంతులనే చిన్న విషయాన్ని పిల్లలకు అర్థం చేయించాలి. ఒకసారి పరీక్షలో తప్పితేనే జీవితం నష్టం పోదనే భరోసా ఇవ్వాలి. మళ్లీ చదివి పాస్‌ కావచ్చనే ధైర్యం ఇవ్వాలి. ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులను తిట్టకుండా, వేధించకుండా సముదాయించాలీ, తిరిగి పాసయ్యేలా ప్రోత్సహించాలి. విద్యార్థులు ప్రతి విషయానికి క్షణికావేశానికి లోనుకాకూడదు.మీ సమస్యను స్నేహితులు, తల్లిదండ్రులు, సన్నిహితంగా ఉండే ఉపాధ్యాయులతో చర్చించాలి. ఏ విషయమైనా తల్లిదండ్రులతో చర్చించాలి.మన ఉజ్వల భవిశ్యత్తును కోరుకునేది తల్లిదండ్రులే.


మార్కులు కాదు.. విజ్ఞానం ముఖ్యం

విద్యార్థులకు మార్కులు కాదు.. విజ్ఞానం ముఖ్యమనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెంచకూడదు. పిల్లలపై ఫలితాలు వచ్చే సమయంలో ఓ కన్నేసి ఉంచాలి. అధ్యాపకులు కూడా మార్కులు తక్కువగా వచ్చే విద్యార్థులను చిన్నచూపు చూడకూడదు. మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్‌ అయినా విద్యార్థులు డిప్రెషన్‌కు గురి కాకూడదు.


ప్రపంచంలోని మేధావులంతా మార్కులేమీ సాధించిన వారుకాదు

విద్యార్థుల ప్రతిభకు మా ర్కులు కొలమా నం కానే కాదు. మార్కుల ఆధారంగా వారి తెలివితేటలను కొలవకూడదు. ప్రపంచంలోని మేధావులంతా మార్కులేమీ సాధించిన వారుకాదు. పిల్లల చదువులను, మార్కులను తల్లిదండ్రులు వంశ ప్రతిష్టగా భావిస్తుంటారు. ఇది తప్పు. విద్యాసంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి పెట్ట కూడదు.


జీవితాన్ని నడిపించేది సాధించాలనే కసి

విద్యార్థులు అదైర్య పడకూడదు. విద్యార్థులు అదైర్య పడితే తల్లిదండ్రులకు బాధ కలిగించిన వాళ్లవుతారు. మార్కులే జీవితానికి ప్రాతిపదకన కాదు. జీవితాన్ని నడిపించేది సాధించాలనే కసి. పట్టుదల ఆత్మవిశ్వాసం. ఇవీ కలిగిన వ్యక్తులే ముందుకు వెళ్తారు. ఏదైనా సాధిస్తారు. ప్రపంచ విజేతలుగా నిలుస్తారు. 2401:4900:4BC0:1114:1:0:D295:103C 07:52, 8 అక్టోబరు 2022 (UTC)Reply

Depression

మార్చు

పి.సి.ఓ.ఎస్. తో కృంగిపోతున్న మహిళలు డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ మహిళల మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపుతున్న పి.సి.ఒ.ఎస్. పి.సి.ఒ.ఎస్. పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్ మహిళల మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పి.సి.ఓ.ఎస్. మహిళలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పి.సి.ఒ.ఎస్. వల్ల మహిళల్లో అసమతుల్య హార్మోన్ల కారణంగా నెలసరి పీరియడ్స్ లలో ఇబ్బంది, గర్భధారణ కష్టతరం, అధిక బరువు, జుట్టు రాలడం వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. దీనితో మహిళలు డిప్రెషన్, సోషల్ యాంగ్జయిటీ, ఓ.సి.డి. వంటి మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. మహిళలపై జరిపిన పరిశోధనలలో మూడ్ డిజార్డర్లను ఎదుర్కొనే ప్రమాదం మూడు రెట్లు అధికంగా ఉంటుందని రుజువు చేశాయి. భాగస్వామి సహకారం లేనందున మహిళలు తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారి సూటిపోటి మాటలతో ఆత్మన్యూనత భావానికి లోనవుతున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి నిరంతరం ఒత్తిడి పనిచేస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో నిరాశ నిస్పృహలు వెంటాడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు ముఖ్యంగా భాగస్వామి సహకారం లేనందున మహిళలు మరింతగా కృంగిపోతున్నారు. మహిళల మానసిక ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. శారీరక ఆరోగ్యం ఎంత ప్రధానమో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే అవసరం. మహిళలు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి 1. పి.సి.ఒ.ఎస్. తో బాధపడుతున్న మహిళలు తమ లక్షణాలను పట్టించుకోవడం లేదు. పి.సి.ఒ.ఎస్. రోగంగా కాకుండా అదొక కండిషన్ గా మాత్రమే భావించండి. 2. మహిళలు కౌన్సిలింగ్ థెరపీ సెషన్లు తీసుకోవడానికి వెనుకడుగు వేయొద్దు. కౌన్సిలింగ్ మానసిక ధైర్యాన్ని మహిళల్లో పెంపొందిస్తాయి. 3. సైకాలజిస్ట్ సైకోథెరపిస్టుల సహాయాన్ని తీసుకుంటూనే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చేయాలి. 4. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ప్రతిరోజు 6 నుండి 8 ఎన్ని గంటలు నిద్రపోవడం చేయాలి. 5. యోగా మెడిటేషన్ ప్రతి రోజు సాధన చేయాలి. Dr.Atla Srinivas Reddy (చర్చ) 16:53, 27 నవంబరు 2022 (UTC)Reply