స్వాగతం మార్చు

Vallepu Shankar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!  

Vallepu Shankar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Nrgullapalli (చర్చ) 00:54, 29 జూన్ 2020 (UTC)Reply

Vadde caste పేజీ గురించి మార్చు

శంకర్ గారూ, నమస్కారం. మీరు వికీపీడియాలో ఖాతా సృష్టించుకోగానే Vadde caste అనే పేజీ సృష్టించారు. సంతోషం, అభినందనలు. సృష్టించుకోక ముందు కూడా అజ్ఞాత లాగా ఉండి ఆ పేజీని సృష్టించారు. అప్పుడు ఆ పేజీని తొలగించాను. కానీ ఇప్పుడు తొలగించలేదు. ఎందుకంటే మీతో ఆ విషయం గురించి చర్చించవచ్చు కాబట్టి (అజ్ఞాతతో చర్చించలేం). పోతే..

ఆ వ్యాసానికి సంబంధించి కింది విషయాలను గమనించాలి..

  1. ఈసరికే ఒడ్డెర పేరుతో ఈ విషయమ్మీద ఒక వ్యాసం ఉంది. మీరు రాయదలచిన విశేషాలను ఆ పేజీలో రాయాలి. కొత్త పేజీ అవసరం లేదు. బహుశా మీరు వడ్డెర అనే పేరుతో వెతికి ఉండవచ్చు. నేను వర్గం:కులాలు అనే పేజీలో చూస్తే నాకు ఆ పేజీ కనిపించింది. వడ్డెర అనే పేరే కరెక్టయితే చెప్పండి, మార్చేద్దాం.
  2. ఈ కొత్త పేజీకి ఇంగ్లీషులో పేరు పెట్టారు. తెలుగు వికీపీడియాలో పేజీలు, పేర్లతో సహా, తెలుగులోనే ఉండాలన్న సంగతి మీకు తెలియదని నేను అనుకోను. తెలుగులో పేరు పెట్టడంలో మీకు ఏమైనా ఇబ్బంది ఎదురై ఉంటే చెప్పండి, ఇక ముందు మీకు ఆ ఇబ్బంది కలగకుండా నేను మీకు సాయం చెయ్యగలను.
  3. ఇకపోతే వికీపీడియాలో మనం రాసినది నిజమో కాదో పాఠకులకు ఎలా తెలుస్తుంది? అలా తెలియాలంటే మనం రాసేదానికి ఆధారాలు చూపించాలి. మీరు రాసిన పేజీలో కూడా ఆధారాలు చూపించడం అవసరం. అది ఎలా చెయ్యాలో నేను మీకు చూపిస్తాను లెండి. ఆధారాలు సేకరించి పెట్టుకోండి.
  4. పేజీలో విషయం రాసాక చివర మీ సంతకం చేసారు. అలా చెయ్యకూడదు. సంతకాలు "చర్చ", "వాడుకరి చర్చ" లాంటి చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. మీరు ఈ పేజీ పేరును చూడండి - "వాడుకరి చర్చ:Vallepu Shankar" అని ఉంటుంది. అందులో కోలనుకు ముందు ఉన్న "వాడుకరి చర్చ" అనేది, ఈ పేజీ వికీపీడియా లోని వాడుకరి చర్చ అనే విభాగానికి (దీన్ని పేరుబరి అంటాం) చెందినది అని సూచిస్తుంది.
  5. మీరు ఆ పేజీలో రాసిన పాఠ్యాన్ని "ఒడ్డెర" పేజీలో చేర్చండి. ఆ తరువాత ఈ కొత్త పేజీని నేను తొలగిస్తాను.

వికీపీడియా గురించి మీకు ఇంకా ఏమైనా సాయం కావలిస్తే అడగండి, నేను చెయ్యగలను. __చదువరి (చర్చరచనలు) 01:06, 30 జూన్ 2020 (UTC)Reply