2018 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
01వ వారం
సలేశ్వర తీర్థం, శ్రీశైలం అడవులలోని పర్యాటక ప్రదేశం. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం.
అడవి దున్నలు, కేరళ లోని చిన్నర్ అభయారణ్యంలో తెల్ల అడవి దున్న, అడవి దున్న. 70 సంవత్సరాల తర్వాత మన దేశంలో లభించిన తెల్ల అడవి దున్న చిత్రం
ఫోటో సౌజన్యం: N.A.Nazeer
04వ వారం
[[బొమ్మ:|300px|center|alt=శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిట్టమూరు మండలంలోని "మల్లం" గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం.]]
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిట్టమూరు మండలంలోని "మల్లం" గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం.
సుందరవనాలు (సుందర్బన్స్) "మడ అడవులలో" ఒక పెద్ద పులి. సుందర్ అనగా "అందమైన", బన్ అనగా "అరణ్యం" లేదా "అడవి"
ఫోటో సౌజన్యం: Soumyajit Nandy
11వ వారం
అమెరికాలోని మియామిలో 108 సాలగ్రామాల మాలతో అలంకరించిన వెంకటేశ్వరస్వామి వారి మూర్తి.
ఫోటో సౌజన్యం: Nvvchar
12వ వారం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గిద్దలూరు సమీపంలోని అడవిలో ఒక "మర్రిచెట్టు", దాని ఊడలు. ఇది బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతిపెద్ద వృక్షం. దీనినే వటవృక్షం అంటారు. ఇది బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక దేశాలలో విరివిగా పెరుగుతుంది.
ఫోటో సౌజన్యం: Ramireddy
13వ వారం
ఒరిస్సాలోని కటక్ నగరంలోని బారాబతి కోట ముఖద్వారం.
ఫోటో సౌజన్యం: Kamalakanta777
14వ వారం
తెలంగాణ రాష్ట్రములోని పాల్వంచ వద్ద ప్రముఖ ఆలయం పెద్దమ్మ గుడి.
అడ్డాకులతో తయారు చేసిన విస్తరాకులు. అడ్డ చెట్టు ఆకులు పలుచగా, నాణ్యతగా, విస్తారంగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి పూర్వం నుంచి ఈ చెట్టు ఆకులను విస్తరాకుల తయారిలో ఉపయోగిస్తున్నారు.
90వ దశకంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం.
ఫోటో సౌజన్యం: Aero Icarus
27వ వారం
పద్మాక్షి అమ్మవారి చిత్రం. పద్మాక్షి దేవాలయం హన్మకొండ నగరంలో ఉంది.ఇది 12వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన దేవాలయం.ఈ ఆలయం హిందూ, జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తూ చూపరులను విస్మయానికి గురిచేస్తున్నది.
యల్లాప్రగడ సుబ్బారావు. భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము (ఫంగస్) నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణము చేశారు.
చెరియాల పటచిత్రాల కళ తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ జిల్లా ప్రాంతానికి చెందినది. ఈ కళ స్థానిక మూలాంశాలతో చిత్రిస్తారు, దీనిని నకాశి కళగా కూడా వర్ణిస్తారు. స్థానిక పురాణాలు మరియు జానపద కథల నుండి ఈ పటచిత్రాలు సూచిస్తాయి.
ఫోటో సౌజన్యం: Rangan Datta Wiki
39వ వారం
ఉలవ మొక్క. ఉలవలు (లాటిన్ Macrotyloma uniflorum) నవధాన్యాలలో ఒకటి. ఉలవల్లో ప్రోటీన్ ఎక్కువ. పెరిగే పిల్లలకు మంచి టానిక్. ఉలవల్లో ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధ పదార్థాలూ ఎక్కువే.