వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 40వ వారం

కల్పనా చావ్లా

కల్పనా చావ్లా ఒక ఇండో-అమెరికన్ వ్యోమగామి, మెకానికల్ ఇంజనీర్. భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో జన్మించింది. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించింది. 1997 లో మొదటి సరిగా కొలంబియా స్పేస్ షటిల్ లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటరుగా ఆమె అంతరిక్షంలోకి వెళ్ళింది. 2003 లో రెండవసారి అదే రకమైన స్పేస్ షటిల్ లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేసింది. ఆ నౌక ప్రమాదానికి గురవడంతో మరణించిన ఏడు మంది సిబ్బందిలో ఈమె కూడా ఒకటి. 2003 ఫిబ్రవరి 1 న వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆమె మరణానంతరం కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అందించారు. పలు వీధులు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఈమె పేరు మీదుగా నామకరణం చేశారు. భారతదేశంలో కూడా ఆమెకు జాతీయ హీరోగా గుర్తింపు లభించింది.
(ఇంకా…)