వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 6
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 6 నుండి దారిమార్పు చెందింది)
- 1860: భారతీయ శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్) చట్టమైన రోజు.
- 1892: బ్రిటన్కు చెందిన చెందిన ఆంగ్ల కవి టెన్నిసన్ మరణం (జ.1809).
- 1893: భారత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాధ్ సాహా జననం (మ.1956).(చిత్రంలో)
- 1896: తెలుగు రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ జననం (మ.1978).
- 1942: ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు బి.ఎల్.ఎస్.ప్రకాశరావు జననం.
- 1963: నెహ్రూ జంతుప్రదర్శనశాల హైదరాబాదులో స్థాపించబడినది.
- 1967: తెలుగు సినిమా దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య మరణం (జ.1898).
- 1974: భారతదేశపు మాజీ రక్షణ మంత్రి వి. కె. కృష్ణ మేనన్ మరణం (జ.1896).
- 1981: ఈజిప్టు మూడవ అధ్యక్షుడు అన్వర్ సాదత్ ఛాందసవాద సైనిక అధికారులచే హత్య చేయబడినాడు (జ.1918).
- 2012: భారత స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి మరణం (జ.1921).