వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 28
- 2004: ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం
- 1821: పెరూ జాతీయ దినోత్సవం.
- 1909: ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి, కాసు బ్రహ్మానందరెడ్డి జననం (మ.1994).
- 1914: మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య ఈ యుద్ధానికి నాంది పలికింది.
- 1956: రంగస్థల నటుడిగా, అధ్యాపకుడిగా పేరుగాంచిన దీక్షిత్ మాస్టారు జననం (మ.2019)
- 1978: న్యూజీలాండ్ క్రికెట్ క్రీడాకారుడు జాకబ్ ఓరమ్ జననం.
- 1979: భారతదేశ 5వ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ ప్రమాణస్వీకారం. (చిత్రంలో)
- 2007: ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ లో ముదిగొండ వద్ద పోలీసు కాల్పులు జరిగి, ఏడుగురు మరణించారు.