వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 25
- 1655 : శని గ్రహానికి చెందిన అతిపెద్ద ఉపగ్రహం అయిన టైటన్ ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నాడు. (చిత్రంలో)
- 1914 : అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ జననం.
- 1927 : పాండిచ్చేరి రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి పి.షణ్ముగం జననం.(మరణం.2013)
- 1983 : తెలుగు పాత్రికేయుడు మణికొండ చలపతిరావు మరణం.
- 1992 : మిర్ అంతరిక్ష కేంద్రములో 10 నెలలు గడిపిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ తిరిగి భూమి పైకి చేరారు.
- 2008 : పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.