వికీపీడియా:డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (DLI ) లో ఉన్న తెలుగు పుస్తకాల వివరాలు
శుద్ధి పరచిన మొత్తం జాబితా వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI final catalogueచూడండి.
పరిచయం
మార్చుభారత డిజిటల్ లైబ్రరీ లో ఉన్న తెలుగు పుస్తకాలన్నింటినీ ఒక చోట తెలుగులో చేర్చే ప్రయత్నం.
DLI సైటులో కాపీరైటు సమస్యలేని తెలుగు పుస్తకాలని వెతికితే 23,363 పుస్తకాలు మనకి కనిపిస్తాయి. వీటిలో నకళ్ళు చాలా ఉన్నాయి. అంటే ఒకే పుస్తకం వేరే వేరే స్కానింగ్ సెంటర్లలో స్కాన్ చెయ్యబడితే ఆ పుస్తకం నకలుగా ( వేరే బార్ కోడ్ తో) కనిపిస్తుంది. ఇలాంటి నకళ్ళలో ఉత్తమ ప్రతిని మాత్రమే ఉంచినట్లయితే ఈ సంఖ్య కాస్త తగ్గొచ్చు.
తెలుగు సాహిత్యం ఎన్నో ప్రతిరూపాల్లో ఈ పుస్తకాల్లో కనిపిస్తుంది. బుర్రకథ, హరికథ , యక్షగానం , నాటకం, ఏకాంకికలు, నవలలు , ద్విపదలు ,కథలు ,వ్యాసాలు లాంటి సాహిత్య రూపాలతో పాటు, అతి పురాతన పుస్తకాలు, విద్యా, వైజ్ఞానిక , రాజకీయ లాంటి విభిన్న అంశాలకు చెందిన ఎందరో ప్రముఖులు రాసిన అతిపురాతన పుస్తకాలు భారత డిజిటల్ లైబ్రరీ లో స్కాన్ చెయ్యబడి tif రూపంలో పొందు పరచబడ్డాయి. వీటిలో కావాల్సిన పుస్తకాన్ని, కావసిన విధంగా .. అంటే పేరు వారీగా కానీ, రచయిత వారీగా గానీ, సంభందిత వర్గం వారీగా కానీ, పేజీల వారీగా కానీ నచ్చిన విధంగా sort చేసుకునే విధంగా విషయం ఉండాలనే లక్ష్యంతో ఈ పని మొదలు పెట్టబడింది.
ఈ పని ప్రారంభ దశలో ఉంది.