వికీపీడియా:తెలుగు గ్రంథాలయం, వికీ అవగాహనా కార్యక్రమం, రాజమండ్రి


తెలుగు గ్రంథాలయం ప్రాజెక్టులో భాగంగా రాజమండ్రి పట్టణంలో ఉన్న చారిత్రక గ్రంథాలయం అయిన గౌతమీ గ్రంథాలయం వద్ద వికీ అవగాహనా కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు, పుర ప్రజలకు తెలియజేయడానికి బేనర్, పోస్టర్స్ రూపొందించి వివిధ ప్రదేశాలలో ప్రదర్శనకు పెట్టడం జరిగింది.

కార్యక్రమం మార్చు

బుధవారం రాజమండ్రి శ్రీ గౌతమీ గ్రంథాలయం (రాజమండ్రి) లో తెలుగు వికీపీడియా అవగాహనా కార్యక్రమం జరిగింది, ఉదయం 9 గంటలకు మొదలైన ఈ కార్యక్రమానికి నేను, నాకు సహాయానికి వచ్చిన పవన్ సంతోష్ ఇరువురం మధ్యాన్నం 1 గంట వరకూ వికీపీడియా గురించి అందరికీ వివరించాం - పలువురు విద్యార్థుల ద్వారా వారి ఊళ్ళకు సంబంధించిన నేక వ్యాసాలలో అందరి ముందు సులభంగా ఎలా టైపు చేయవచ్చో చూపించాం. సుమారుగా నూట యాభై మంది హాజరైన ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఆఖరులో మధ్యాన్నం వికీ శిక్షణ జరుగునని చెప్పడం వలన చాలామంది తిరిగి మధ్యాన్నం శిక్షణ కొరకు వచ్చారు. వారి ద్వారా కొన్ని మార్పులు చేయిస్తూ, తెలుగు టైపింగ్ నేర్పించడం జరిగింది. రెండు IP అడ్రసులే ఉండడం వలన కేవలం 12 మందికి మాత్రమే వాడుకరి ఖాతాలు తెరవగలిగాము. గౌతమీ గ్రంథాలయంలోనే కంప్యూటర్ విభాగం ఉండటం వలన ఈ కార్యక్రమం మరింత బాగా జరిగింది.

పాల్గొన్న పెద్దలు మార్చు

  • సూర్యనారాయణ మూర్తిగారు.
  • నరసింహశర్మగారు
  • పాఠకులు
  • విద్యార్థులు

ఇతర విశేషాలు మార్చు

  • ఇక్కడ కొందరు అడిగిన ప్రశ్నలకు బదులుగా అప్పటిఅప్పుడు రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి వ్యాసాన్ని సృష్టించడం జరిగింది.
  • లాబ్‌లో కంప్యూటర్లు తక్కువ ఉండటం వలన మళ్ళీ ఒకరోజు పెట్టమని హాజరు అవుతామని కొందరు విద్యార్థులు, ఔత్సాహికులు కోరారు.

చిత్రమాలిక మార్చు