వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కథియావారి గుర్రం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 17:04, 6 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
కథియావారి గుర్రం వ్యాసంలో భాష కృతకంగా ఉంది. గతంలో భాషా సవరణకు ట్యాగు పెట్టినప్పటికీ మార్పులేమీ జరగలేదు. నవంబరు 3 లోగా వ్యాసం మెరుగు పడకపోతే పేజీని తొలగించాలి. పేజీలో ఉన్న వివిధ లోపాలు ఇవి:
- యాంత్రికానువాదాన్ని పెద్దగా సవరించకుండా ప్రచురించారు. అందుచేతనే భాష కృతకంగా ఉంది.
- వికీ అనువాద పరికరం కాకుండా వేరే యంత్రాన్ని వాడారు. అందుచేతనే మూలాలు రాలేదు, మూలాల అంకెలు మాత్రమే వచ్చాయి. ఇతర యంత్రాలను వాడకూడదని కాదు గానీ, వికీకి అనుబంధంగా ఉన్న అనువాద పరికరం వలన అనేక ఇతర ప్రయోజనాలున్నాయి - ఉదాహరణకు: మూలాలు ఆటోమాటిగ్గా వస్తాయి, మూసలు ఆటోమాటిగ్గా వస్తాయి, వర్గాలు ఆటోమాటిగ్గా వస్తాయి, అంతర్గత లింకులు ఆటోమాటిగ్గా వస్తాయి, వికీడేటా లింకు, తద్వారా అంతర్వికీ భాషాలింకులూ, ఆటోమాటిగ్గా వస్తాయి. ఈ ప్రయోజనాలేవీ ఇతర యాంత్రికానువాదాల్లో ఉండవు.
- వ్యాసంలో పేరును సరిగ్గా రాయలేదు - కతియావారి, కాతియావారి, కథియావారి, కాతివారి ఇలా అనేక విధాలుగా రాసారు.
__చదువరి (చర్చ • రచనలు) 23:28, 26 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇది అనువాద యంత్రాన్ని ఉపయోగించి రాసిన వ్యాసమని నా అభిప్రాయం. నవంబరు 2 లోపు వికీకి అనుగుణంగా మార్చనిచో తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:51, 28 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇది శుద్ధి చేయబడని గూగుల్ అనువాద వ్యాసం. పైన తెలియజేసిన సమయంలో శుద్ధి చేసి విస్తరిమనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:19, 4 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.