వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/ప్రచారం ముసాయిదాలు, స్థితి

ఆహ్వాన ప్రకటన ప్రచారం మార్చు

Draft message for WikimediaIndia-l మార్చు

Dear fellow Wikimedians,

I will start by introducing myself to the community. I am Ravi Vyzasatya based in Maryland,USA. I have contributed to Telugu Wikipedia since 2005 and to a lesser extent in Telugu Wiktionary and Wikisource. I did serve as admin in all these projects. Although my primary interest is in writing well researched articles in the area of South Indian history, I do help the community by running bot scripts and taking care of miscellaneous administrative tasks.

Telugu wikipedia will be 10 years old in another week from now. On this auspicious occasion Telugu Wikimedia Community is organizing celebrations under the leadership of an organizing committee headed by Vishwanath B.K, Pranayraj as Secretary, Kasyap as Treasurer along with Rahimanuddin, WMIN SIG lead Telugu, Vishnuvardhan, CIS-A2K Program Director as members. We have also constituted an awards committee with myself as President, Arjuna Rao Chavala, WMIN Co-founder and its first President as Secretary and A. Rajasekhar, T. Sujatha, NWR 2011 award winners from Telugu Wikis and A. Radhakrishna, Former WMIN SIG lead for Bangalore as members. The award is named after Komarraju Lakshmana Rao[1], pioneer Telugu encyclopedian who undertook the first modern encyclopedic effort in Telugu, perhaps the first among Indian languages (c.1912-13). It is also quite fitting tribute to Lakshmana Rao to honor his memory in the centennial anniversary of such pioneering effort. The award carries a citation and cash prize of Rs 10,000/. Organizing committee and awards committee members are ineligible for the awards to avoid any perceived or real conflict of interest.

We are inviting nominations [2] for awards on Telugu Wikimedia projects. Nominations are due by 9th Dec 2013 2359 (UTC). Members can self -nominate or be nominated by others, in consideration for these awards. Nomination process has been developed by Arjuna building upon the NWR 2011 nomination process[3] pioneered by another WMIN Cofounder and the then EC Member Arunram . We express our sincere appreciation for the same. We think that this initiative with nominal cash prize by Telugu community may be the first of its kind and will complement the existing recognition mechanisms and help encourage budding wikimedians in their initial years of contribution. We invite all Indian wikimedians to participate in the award nomination process as you may be familiar with our Telugu Wikimedians through their efforts in English, Kannada, Tamil language Wikimedia projects. For the benefit of wider Wikimedia community, we have provided for relevant remarks on the nomination pages in English and also invite nominations or support for the existing nominations in English, if you choose to do so.

We solicit your wishes on this happy occasion and will be sharing the updates about the celebrations, awards and other related Telugu wiki activities as things roll out.

Sincerely,

Ravi Vyzasatya

References 1.English wiki page on Komarraju Lakshmana Rao, the first Encylopaedist among Indian languages from India https://en.wikipedia.org/wiki/Komarraju_Venkata_Lakshmana_Rao

2. Award details page in Telugu https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%95%E0%B1%8A%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81_%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A3%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AE%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82

3. Nominations page in Telugu https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%A6%E0%B0%B6%E0%B0%BE%E0%B0%AC%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BF_%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80_%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0_%E0%B0%8E%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%95/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A6%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81

మెయిల్ జాబితాలకు తెలుగు సందేశం చిత్తుప్రతి మార్చు

తెలుగు నెజ్జనులందరికీ నమస్కారాలు,

వచ్చేవారం తెలుగు వికీపీడియా పదో పుట్టినరోజు. ఈ శుభ సందర్భంగా తెలుగు వికీజనులందరూ కలిసి పండగ చేసుకోవాలని నిశ్చయించడమైనది. ఈ ఉత్సవాలను నిర్వహించడానికి తెవికీ నిర్వాహకుడు, వికీపీడియా అభివృద్ధి ఎంతగానో తోడ్పడిన బి.కె.విశ్వనాధ్ గారు అధ్యక్షుడిగా ఒక ఉత్సవ నిర్వహణా సంఘం ఏర్పడింది. ఈ సంఘానికి ప్రణయ్‌రాజ్ గారు కార్యదర్శిగానూ, పలివెల కశ్యప్ గారు కోశాధికారి గానూ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. వీరితో పాటు తెలుగు వికీమీడియా భారత పర్వం యొక్క నాయకుడు రహ్మానుద్దీన్ గారు, సి.ఐ.ఎస్-ఏ2కె కార్యనిర్దేశకుడు విష్ణువర్ధన్ గారు కూడా ఈ సంఘంలో సభ్యులు. అలాగే పదేళ్ళ తెలుగు మీడియావికీ ప్రస్థానంలో విశేషకృషి చేసిన వారిని గుర్తించి, సత్కరించేందుకు ఒక పురస్కార ఎంపిక సంఘం కూడా ఏర్పడింది. దానికి నేను అధ్యక్షత వహిస్తుండగా, వికీమీడియా భారత చాప్టర్ సహ-స్థాపకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు అర్జునరావు గారు కార్యదర్శి ఎన్నికయ్యారు. ఈ పురస్కార సంఘంలో డా. రాజశేఖర్ గారు, టి.సుజాత గారు మరియు పూర్వ వికీమీడియా భారత చాప్టరు యొక్క బెంగుళూరు ప్రతినిధి అయిన ఏ.రాధాకృష్ణ గారు కూడా ఈ ఎంపిక సంఘంలో సభ్యులు.

ఈ పురస్కారానికి తెలుగు భాషలో తొట్టతొలి (బహుశా భారతీయ భాషలలోనే తొట్టతొలి) ఆధునిక విజ్ఞానసర్వస్వపు కృషికి శ్రీకారం చుట్టిన శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారి పేరు మీదగా కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం అనే పేరు ఎంపిక చేయబడింది. 1912-1913 ప్రాంతంలో విజ్ఞానసర్వస్వపు కృషిని ప్రారంభించిన కొమర్రాజు లక్ష్మణరావు, ఆ కృషిని ప్రారంభించి వంద సంవత్సరాలు నిండటం కూడా ఒక విశేషం. ఇలా తెలుగు వికీకి పదేళ్ళు నిండటం, లక్ష్మణరావు గారి విజ్ఞానసర్వస్వానికి వందేళ్ళు ఒకేసారి నిండటం గొప్ప విశేషం. ఈ విధంగా తెలుగు మీడియావికీ ప్రాజెక్టులలో కృషిచేసిన వారిని తలచుకొని వారి సేవలను గుర్తిస్తున్న తరుణంలో కొమర్రాజు లక్ష్మణరావు గారి కృషిని కూడా స్మరించుకోవటానికి చక్కని అవకాశం. ఈ పురస్కారంలో భాగంగా ఒక్కొక్క గ్రహీతకు ఒక ప్రశంసా పత్రంతో పాటు, పదివేల నగదు బహుమతి కూడా ఇవ్వబడుతుంది. పరస్పర వైరుధ్యాసక్తులకు తావు లేకుండా, ఉత్సవాల నిర్వహణా సంఘం సభ్యులు మరియు పురస్కారాల ఎంపిక సంఘం సభ్యులు ఈ పురస్కారాలు అందుకోవటానికి అనర్హులుగా ప్రకటించడమైనది.

ఈ పురస్కారాలకు అర్హులైన సభ్యులకై ప్రతిపాదనలు[2] ఆహ్వనిస్తున్నాము. ప్రతిపాదనలు దాఖలు చేయవలసిన గడువు డిసెంబరు 9, 2013 సమయం 23:59 (గ్రీ.ప్రా.కా). వికీమీడియా కృషి చేసిన సభ్యులెవరైనా ఈ పురస్కారాలకు తమ పేరును స్వయంగా ప్రతిపాదించుకోవచ్చు లేదా ఇతరులచే ప్రతిపాదించబడవచ్చు. ఎంపిక సంఘం అన్ని ప్రతిపాదనలను పరిశీలించి పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తుంది. ప్రతిపాదనా పద్ధతిని 2011 NWRలో అప్పటి కార్యనిర్వహణా సంఘం అధ్యక్షుడు అరుణ్‌రాం రూపొందించి, అమలుపరచిన ప్రతిపాదనా పద్ధతిని[3] మరింత మెరుగుపరచి అర్జున గారు రూపొందించారు. నగదు బహుమతి ప్రోత్సాహకంగా ఇవ్వటం భారతీయ వికీల్లో ఇదే ప్రథమం. ఇప్పటికి వరకు ఉన్న ప్రోత్సాహకాలతో ఇది మరింత మంది క్రియాశీలక సభ్యులను, కొత్తసభ్యులను ఉత్సాహపరుస్తుందని ఆశిస్తున్నాం. సభాముఖంగా మీరు ఈ పురస్కారాలకు అర్హులనీ భావించిన సభ్యులను పురస్కారానికై ప్రతిపాదించాలని కోరుతున్నాను.

అంతేకాక ఈ శుభసమయంలో మా ప్రయత్నం జయప్రదం అయ్యేందుకు మీరు ఆశీస్సులు కోరుతున్నాము. ముందు ముందు తెవికీలో జరుగుతున్న విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకొనే ప్రయత్నం చేస్తాము.

భవదీయుడు,

రవి వైజాసత్య,

తెలుగు వికీపీడియా సంపాదకుడు.

మూలాలు 1. తెలుగు వికీలో కొమర్రాజు లక్ష్మణరావు పేజీ https://te.wikipedia.org/wiki/కొమర్రాజు_వెంకట_లక్ష్మణరావు

2. పురస్కార వివరాలు, నియమ నిబంధనలు https://te.wikipedia.org/wiki/WP:KLRWP

3. ప్రతిపాదనల పేజీ https://te.wikipedia.org/wiki/Wikipedia:Komarraju_LakshmanaRao_Wikimedia_Award_Proposals

ఆహ్వాన ప్రకటన ప్రచారం మార్చు

ఇతరవికీప్రాజెక్టుల రచ్చబండలో ప్రచారానికి ప్రకటన ముసాయిదా

  • వికీసోర్స్ రచ్చబండలో ప్రవేశపెట్టాను. --అర్జున (చర్చ) 04:58, 3 డిసెంబర్ 2013 (UTC)
  • వికీబుక్స్ లో నేను ప్రవేశపెట్టాను, విక్షనరీలో రాజశేఖర్ గారు ప్రవేశపెట్టారు.--అర్జున (చర్చ) 02:45, 4 డిసెంబర్ 2013 (UTC)
  • నా ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్ ప్లస్ లో పంచాను. --అర్జున (చర్చ) 06:00, 3 డిసెంబర్ 2013 (UTC)
  • తెలుగు బ్లాగు, తెలుగు వికీపీడియా గూగుల్ గుంపులకు, వికీమీడియా ఇండియా బట్వాడా జాబితాకు ప్రకటన పంపించాను --వైజాసత్య (చర్చ) 02:48, 4 డిసెంబర్ 2013 (UTC)

ఫలితాల ప్రకటన మార్చు

మెయిల్ జాబితాలకు తెలుగు సందేశం చిత్తుప్రతి మార్చు

విషయం:కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కార ఫలితాలు

తెలుగు నెజ్జనులందరికీ నమస్కారాలు,

తెలుగు వికీపీడియా పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రారంభించబడిన కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కారానికి[1] వచ్చిన ప్రతిపాదనలను[2] ఎంపిక మండలి పరిశీలించడం పూర్తి అయ్యింది. ముందుగా ప్రతిపాదిత సభ్యులకు, ఆయా ప్రతిపాదనలను ప్రారంభించి, మద్దతు ఇచ్చి, విస్తరించి ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొన్న తెలుగు వికీ సభ్యులందరికీ మరియు మీ తోడ్పాటుకి ధన్యవాదాలు.

ఈ పురస్కారానికి 28 ప్రతిపాదనలు రాగా వాటిలో 18కి ప్రతిపాదిత సభ్యులు అంగీకారం తెలిపారు.ఈ పురస్కారపు తొలివిడతగా ఈ సంవత్సరం, గత దశాబ్ది కాలంలో చేసిన కృషిని గుర్తిస్తూ పది పురస్కారాలు ఇవ్వాలని ఎంపిక మండలి నిర్ణయించింది. దీనికి ఎంపికైన అభ్యర్ధులు, మూల్యాంకన వరుసక్రమంలో చదువరి,ఎం.ప్రదీప్, చావా కిరణ్, వీవెన్, పాలగిరి, రవిచంద్ర,అహ్మద్ నిసార్, శశి,జె.వి.ఆర్.కె.ప్రసాద్,మరియు భాస్కర నాయుడు. వీరికి దశాబ్ది ఉత్సవాలలో నగదు బహుమతి మరియు పురస్కారము ఇవ్వబడుతుంది. వీరి చిత్రాలు, పురస్కార ప్రధానాంశాలు తెలుగు మరియు ఆంగ్లములో [3] చూడవచ్చు. కృషి గణాంకాలు మరియు వికీ అభివృద్ధికి దోహదపడిన గుణాత్మక అంశాల విశ్లేషణ[4] మరియు మూల్యాంకనం [5] కూడా చూడవచ్చు.

అంగీకారం తెలపని ప్రతిపాదిత సభ్యులు మరియు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి తోడ్పడిన ఇతర సభ్యుల కృషిని గుర్తిస్తూ ఎంపిక మండలి ప్రశంసాపత్రమివ్వాలని నిర్ణయించింది. దీనికి ఎంపికైన మొత్తము 30 సభ్యుల వివరాలు[6] చూడవచ్చు. వీరికి ప్రశంసా పతకం (ఎలెక్ట్రానిక్) త్వరలో వారివాడుకరి చర్చాపేజీలలో ఇవ్వబడుతుంది.

ఈ పురస్కారాలను రూపకల్పన దిశ నుండి దాదాపు వేయి గంటల సమయాన్ని వెచ్చించిన ఎంపిక సంఘం సభ్యులు, అర్జునరావు,రాజశేఖర్, రాధాకృష్ణ మరియు సుజాతగార్లకు నా కృతజ్ఞతలు. ఈ పురస్కారాలను రూపకల్పన చేసి, ఎంపిక సంఘం కార్యదర్శిగా కార్యభారాన్నంతా చాలా మటుకు మోసిన అర్జునరావు గారికి ప్రత్యేకకృతజ్ఞతలు. పురస్కారాలకై కావలసిన నిధులు సమకూర్చడానికి అంగీకరించిన తెవికీ దశాబ్ది ఉత్సవ కార్యనిర్వాహక వర్గానికి[7] ధన్యవాదాలు.

వైజాసత్య కొలరావిపు ఎంపిక మండలి అధ్యక్షుడు

1. పురస్కార వివరాలు, నియమ నిబంధనలు https://te.wikipedia.org/wiki/WP:KLRWP
2. ప్రతిపాదనల పేజీ https://te.wikipedia.org/wiki/Wikipedia:Komarraju_LakshmanaRao_Wikimedia_Award_Proposals
3. పురస్కార విజేతల వివరాలు https://te.wikipedia.org/wiki/WP:KLRWP/2013/Winners
4. ప్రతిపాదన అంగీకరించిన సభ్యుల కృషి గణాంకాలు మరియు అభివృద్ధికి దోహదపడిన అంశాల విశ్లేషణ https://te.wikipedia.org/wiki/File:KLRWP-2013_Applicants_work_Statistics_and_Factors_Aiding_Growth.pdf
5.మూల్యాంకనం https://te.wikipedia.org/wiki/WP:KLRWP/2013/Scoring
6. ఎంపిక మండలి ప్రశంసాపత్ర విజేతల వివరాలు https://te.wikipedia.org/wiki/WP:KLRWP/2013/Jury_Appreciation_Winners
7. తెవికీ దశాబ్ది ఉత్సవ కార్యనిర్వాహక వర్గం https://te.wikipedia.org/wiki/WP:TEWIKI10/Committee

Draft message for WikimediaIndia-l మార్చు

Subject:Komarraju Lakshmana Rao Wikimedia Puraskaram Results

Dear fellow Wikimedians,

Thank you all for your encouragement of Telugu Wikipedia community's initiative to recognize the contributors by a special award called Komarraju Lakshmana Rao Wikimedia Puraskaram[1], named after first modern encyclopedist in Telugu, perhaps the first among Indian languages (c.1912-13).

We got 28 nominated proposals for the awards[2] out of which 18 were complete, based on the acceptance criteria outlined in the initial announcement. Selection council analyzed all proposals based on quantitative metrics like wiki statistics and qualitative assessment of each nominee's contribution and it's impact on Wiki 's growth and development. We would like to thank all the people who participated in the nomination and proposal development process and also those who helped to improve the process by their feedback during its roll out. As this is the debut year for the awards, Selection council decided to award 10 recipients recognizing their contributions during the last decade of Telugu Wikipedia. In the order of final assessment score, the awardees are Chaduvari, M Pradeep, Chava kiran, Veeven, Palagiri, Ravichandra, Ahmed Nisar, Veera.sj, JVRK PRASAD and Bhaskaranaidu. They will be presented with cash prize and certificate during the Telugu Wiki Ten Celebrations . You can see their pictures, citation remarks in Telugu and English [3]. The background material[4] and scoring sheet[5] are also available, if you are interested.

To recognize members who contributed significantly to Telugu wikimedia projects but could not/ did not give their consent for the award nomination and/or did not get selected for the award, Selection council decided to award Jury appreciation certificates. These will be given to 30 members selected by the council[6]. An electronic certificate will be presented in their user talk pages shortly

It's been an arduous effort and the selection council members have put in nearly 1000 hours of effort as a group in the past couple of months since award conception. Can't thank enough the selection council members Arjuna Rao Chavala, A. Rajasekhar, T. Sujatha and A. Radhakrishna. Special thanks to Arjuna Rao Chavala, Selection council secretary for taking the major responsibility for this initiative. We also thank Tewiki 10 Celebrations committee[7] for ensuring necessary funds to support this award.

As with any first time endeavor, I am sure there is room for improvements in this process. We appreciate your feedback and suggestions for future attempts.

Sincerely,

Ravi Vyzasatya

1. Award details and rules (in Telugu) https://te.wikipedia.org/wiki/WP:KLRWP
2.  Proposals  https://te.wikipedia.org/wiki/Wikipedia:Komarraju_LakshmanaRao_Wikimedia_Award_Proposals
3.  Award winner details  https://te.wikipedia.org/wiki/WP:KLRWP/2013/Winners
4. Applicants work statistics and factors aiding growth   https://te.wikipedia.org/wiki/File:KLRWP-2013_Applicants_work_Statistics_and_Factors_Aiding_Growth.pdf
5.Scoring sheet  https://te.wikipedia.org/wiki/WP:KLRWP/2013/Scoring
6. Jury Appreciation certificate winners https://te.wikipedia.org/wiki/WP:KLRWP/2013/Jury_Appreciation_Winners
7. Tewiki 10 Celebrations Committee  https://te.wikipedia.org/wiki/WP:TEWIKI10/Committee

ప్రచారం స్థితి మార్చు

  1.   వికీపీడియాలో స్థల ప్రకటన, వైజాసత్య 28 డిసెంబర్ 2013
  2.   రచ్చబండ ప్రకటన వికీసోర్స్, విక్షనరీలలో . --అర్జున (చర్చ) 05:57, 29 డిసెంబర్ 2013 (UTC)
  3.   తెలుగు వికీ మెయిలింగు లిస్టు , వైజాసత్య 29 డిసెంబర్ 2013
  4.   Wikimedia India mailing list,వైజాసత్య 29 డిసెంబర్ 2013
  5.   twitter, అర్జున 29 డిసెంబర్ 2013
  6.   Facebook, అర్జున 29 డిసెంబర్ 2013
  7.   Google+, అర్జున 29 డిసెంబర్ 2013