వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 54

పాత చర్చ 53 | పాత చర్చ 54 | పాత చర్చ 55

alt text=2016 డిసెంబరు 21 - 2017 మే 16 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2016 డిసెంబరు 21 - 2017 మే 16

సాలార్‌జంగ్ మ్యూజియంలో వికీమీడియన్-ఇన్-రెసిడెన్స్ మార్చు

అందరికీ నమస్కారం,
గత వారం సీఐఎస్-ఎ2కె సంస్థ ప్రతినిధులు తన్వీర్ హాసన్, పవన్ సంతోష్ సాలార్‌జంగ్ మ్యూజియం డైరెక్టరుతో జరిపిన చర్చల సారాంశంగా వికీమీడియన్-ఇన్-రెసిడెన్స్ కార్యక్రమాన్ని సాలార్‌జంగ్ మ్యూజియంలో చేయడం అన్నది ఒక ఫలితంగా వెలువడింది. ప్రతిపాదిత కార్యక్రమం ప్రకారం వికీమీడియన్-ఇన్-రెసిడెన్స్ గా వికీమీడియన్లు మ్యూజియంలో వివిధ కళాకృతులను పరిశీలించి, ఫోటోలు తీసి, మ్యూజియం వారి లైబ్రెరీలో మూలాలను వినియోగించుకుని, క్యూరేటర్లతో చర్చిస్తూ, వివరాలు తెలుసుకుంటూ వికీపీడియాలో మ్యూజియంలోని ప్రఖ్యాత, విషయ ప్రాధాన్యత కల కళాఖండాల గురించి, ఆయా కళాఖండాల సమాచారం ఫోటోలు ఉపయోగించి వివిధ కళారీతుల గురించి, తదితర అంశాల గురించి వ్యాసాలు రాసే వీలుంటుంది. వికీమీడియన్-ఇన్-రెసిడెన్స్ గా గుర్తింపు పొంది ఈ కార్యకలాపాలు చేపట్టేవారు, నెలరోజుల పాటుగా సాగే ప్రోగ్రాంలో నమోదు కావాల్సివుంటుందన్నది ప్రతిపాదనలోని ఒక అంశం. చర్చల్లో భాగంగా తన్వీర్ హాసన్ మ్యూజియం డైరెక్టరుకు నేషనల్ మ్యూజియం, ఢిల్లీతో జరుపుతున్న చర్చలను, చేపట్టదలిచిన కార్యక్రమాలను వివరించగా ఒకసారి ఆయా సంస్థల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాకా వాటి అనుభవాలను తీసుకుని సాలార్‌జంగ్ మ్యూజియంకు అనువర్తింపజేసుకుని కార్యక్రమాలు చేయవచ్చని మ్యూజియం డైరెక్టర్ సూచించారు. చర్చల్లో భాగంగా డైరెక్టర్ మ్యూజియం గురించి ది హిందూ వంటి పత్రికల్లో కాలమ్ ప్రచురితం అయిందని, వీటి విషయ ప్రాధాన్యత, వివరాలు తెలిపే పలు మూలాలు కూడా లభిస్తున్నాయని సూచించారు. ఈ అంశాలపై తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేవలసిందిగా కోరుతున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:05, 21 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా చక్కటి ఆలోచన. --రవిచంద్ర (చర్చ) 10:55, 21 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి కార్యక్రమం దీనిద్వారా మరిన్ని కొత్త వ్యాసాలు, చిత్రాలు తెలుగు వికీపీడియాకు వస్తాయని ఆశిస్తున్నాను. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:00, 21 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

గుంటూరు జేకేసీ కళాశాలలో కార్యశాల మార్చు

గుంటూరు జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాలలో డిసెంబరు 23, 24 తేదీల్లో విద్యార్థులకు తెలుగు వికీపీడియా కార్యశాల నిర్వహించనున్నాం. ఇటీవల నిర్వహించిన తెలుగు వికీపీడియా అవగాహన సదస్సులో తెవికీ గురించి తెలుసుకుని, ఆసక్తి చూపుతున్న విద్యార్థులకు ప్రధానంగా ఈ కార్యశాల నిర్వహించనున్నాం. ఈ అంశంపై తెవికీపీడియన్లు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:39, 22 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు ద్వారా తయారైన వ్యాసాల విషయమై మరో చర్చ మార్చు

గూగుల్ అనువాదాల ద్వారా తయారైన వ్యాసాల విషయంలో గతంలో చర్చలు జరిగాయి. వాటిలో చాలావాటిని సంస్కరించలేం, తీసెయ్యాల్సిందే అని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కానీ కొందరు సంస్కరించాలని అభిలషించారు. అంచేత ఆ వ్యాసాలు ఇంకా కొనసాగుతున్నాయి. చివరిసారి 5 నెలల కిందట జరిగిన చర్చలోనూ అదే జరిగింది. వాటిని సంస్కరిస్తామని కొందరు వాడుకరులు ముందుకు రావడంతో తొలగింపు నిర్ణయం అమలు కాలేదు. ఈ ఐదు నెలల కాలంలో సంస్కరణ దిశగా ముందడుగు పడిన దాఖలాలేమీ లేవు. (ఒకవేళ పడి ఉంటే నేను మిస్సయ్యుంటాను). వాడుకరి:Pavan santhosh.s గారు ముందుకు తెచ్చిన శుద్ధి ప్రణాళికలో కూడా వారు పాల్గొన్నట్లు కనిపించలేదు. తొలగింపు నిర్ణయాన్ని అమలు జరపడంపై సముదాయం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి, సంస్కరణ దిశగా తాము ఏమేం చేసారో, అద్యతనభావిలో తమ ప్రణాళిక ఏమిటో ఆ సభ్యులు ప్రకటిస్తే నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఉంటుందని వినతి.__చదువరి (చర్చరచనలు) 08:32, 24 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అలాంటి వ్యాసాలను తొలగించడమే మంచిది.ఎవ్వరికి అర్థం కాని వ్యాసాల వలన ఉపయోగం శూన్యం.అలాగే రసాయన విభాగానికి చెందిన మూలకాల వ్యాసాలు చాలా ఏక వాక్య వ్యాసాలు ఉన్నాయి, కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి చేర్పులు లేకుండా.అటువంటి వాటిని తొలగిస్తే వాటి స్థానంలొ కొత వ్యాసాలు రాస్తా.Palagiri (చర్చ) 12:49, 24 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ శుద్ధి అనే దానికి ఏ రకమైన ప్రయత్నాలు చేసినా అవి ఎప్పుడూ ఆగుతూనే ఉంటాయి. కొత్త వ్యాసాల సృష్టి కంటే, ఉన్న వ్యాసాలు మెరుగుపరచడం, మొలక వ్యాసాలను అభివృద్ది చేయడం అత్యావశ్యం. ప్రస్తుతం రాసేదానికి గుర్తింపు రావాలనే, పొందాలనే భావన అధికంగా ఉంది. ఎప్పటికపుడు వీటిపై చర్చలు జరుగుతాయి, కొందరు సభ్యులు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని వారికి తోడ్పాటు ఉండదు. కనుక ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావడం లేదు. సీనియర్ సభ్యులు ముందుకు వచ్చి ఈ వికీ ప్రక్షాళనకు కొన్ని ప్రణాళీకలు తయారు చేసి చర్చించి వాటిపై కృషి చేస్తే బావుంటుంది అని నా ఆలోచన..--Viswanadh (చర్చ) 02:52, 25 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ అంశాన్ని చర్చకు తెచ్చినందుకు చదువరి గారికి ధన్యవాదాలు. నేను రూపొందించిన ప్రణాళిక విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం చాలా ముదావహం. ప్రస్తుతం మొదటి విడతగా 116 వ్యాసాలను ప్రతిపాదిస్తూ ప్రాధాన్యత క్రమాన్ని నిర్దేశించేందుకు ప్రయత్నం ప్రారంభించాను. ఈ ప్రయత్నం ద్వారా తీసేయవలసిన వ్యాసాలను కానీ, అభివృద్ధి చేయాల్సిన వ్యాసాలను కానీ గుర్తించవ్చు. తద్వారా ఓ 70-90 వ్యాసాల భవిష్యత్తు తేల్చవచ్చు. తొలగించినా, అభివృద్ధి చేసినా నిర్దిష్టమైన పద్ధతి ద్వారా చేయాలన్న ఆలోచన వల్లే ఈ ప్రయత్నం తలకెత్తుకున్నాను. ఐతే ఇప్పటికి ఎన్నింటిని అభివృద్ధి చేశారన్నది మాత్రం మీనా గాయత్రి వంటి వారు చెప్తే బావుంటుంది. ఒకసారి మొదటి దఫా ప్రాధాన్య క్రమం నిర్దేశించుకున్నాకా, స్వల్పకాలిక ఎడిటథాన్ల ద్వారా అభివృద్ధి, తొలగింపు చేయవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:26, 27 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఏడాది 34 గూగుల్ అనువాద వ్యాసాలు అభివృద్ధి చేశాం. గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో 59 వ్యాసాలు ఉన్నాయి. వీటిలో 74 శాతం ఇటీవల అభివృద్ధి చేసినవే కావడం గమనార్హం. వ్యక్తిగత బిజీ, 100 వికీ డేస్ కారణంగా నాకు కొన్ని రోజులుగా ఈ వ్యాసాలు రాయడం కుదరట్లేదు. అయితే ప్రాధాన్యతా క్రమం నిర్ధారించడం వంటి కార్యకలాపాలు వల్ల ముఖ్యమైన వ్యాసాలు కష్టపడి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ పని వల్ల ఇంకా ఈజీగా వ్యాసాలు రాయచ్చు అని నా అభిప్రాయం. అందుకే ఈ ప్రాధాన్యతా గుర్తింపు, ఎడిటథాన్ లలో పాల్గొంటాను.--Meena gayathri.s (చర్చ) 09:30, 27 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఎన్నోసార్లు గూగుల్ అనువాద వ్యాసాలని శుద్ధి చేద్దామని ప్రయత్నించి విఫలుడనయాను. వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త వ్యాసాలు రాయడం తేలిక అని నా అభిప్రాయం. Vemurione (చర్చ) 21:36, 1 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ అనువాద వ్యాసాల ప్రాధాన్యత క్రమ నిర్ధారణ మార్చు

గూగుల్ అనువాద వ్యాసాల ప్రాధాన్యత క్రమ నిర్ధారణకు ఇక్కడ ఓ ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా తొలిగా 116 వ్యాసాల ప్రాధాన్యత నిర్ధారిస్తున్నాం. డిసెంబరు 26న ప్రారంభించిన ఈ ప్రక్రియ జనవరి 2తో ముగియనుంది. 5గురు సభ్యులు చేయాల్సిన ఈ ప్రాధాన్యత క్రమ నిర్ధారణలో ఇప్పటికే చదువరి, మీనాగాయత్రి గార్లు తమను తాము నమోదు చేసుకుని, వారి ప్రాధాన్యతలు ఇచ్చేశారు. రాజశేఖర్ గారు నమోదు చేసుకున్నారు ఇంకా ప్రాధాన్యత ఇవ్వాల్సివుండగా, మరో ఇద్దరు నమోదు చేసుకుని ప్రాధాన్యతలు నిర్ధారించే అవకాశం ఉంది. ఐతే ఇది జనవరి 2తో ముగియనుంది కాబట్టి దయచేసి ఆసక్తి కలిగిన సభ్యులు ఇక్కడ నమోదు చేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 06:42, 1 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ అనువాద వ్యాసాల ప్రాధాన్యత క్రమం నిర్ధారణ కార్యక్రమం మొదటి దఫాలో ప్రాధాన్యతలు నిర్ధారించేందుకు నాతో కలిపి 5గురు పాల్గొన్నారు. పాల్గొన్నందుకు చదువరి, మీనాగాయత్రి, రాజశేఖర్, రవిచంద్ర గార్లకు ధన్యవాదాలు. ప్రస్తుతం గూగుల్ అనువాద వ్యాసాల మొదటి దఫా నిర్ధారణ పూర్తయింది. తీసేయాల్సిన వ్యాసాలు, ఉంచాల్సిన వ్యాసాలు చెరొకటీ 50కి అటూ ఇటూ రావడంతో 90కి పైగా వ్యాసాల భవితవ్యం తేలింది. వీటిపై తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేసేందుకు ఓ ఎడిటథాన్ రేపటి నుంచి పదిరోజుల పాటు నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నాను. దయచేసి మీ స్పందనలు తెలియజేయగలరు. (పాల్గొనదలిచిన సభ్యులు వాక్యానికి వాక్యం సరిజేసుకునే కష్టతరమైన పద్ధతిలో చేయనక్కరలేదు, తేలిగ్గా వికీపీడియా ట్రాన్స్ లేషన్ టూల్ వాడి తేలిగ్గా అనువదించవచ్చు. వికీపీడియా ట్రాన్స్ లేషన్ టూల్ వాడకం ఎలాగో స్క్రీన్ కాప్చర్ వీడియో కూడా తీశాం, ఉపయోగించుకోగలరు). --పవన్ సంతోష్ (చర్చ) 10:20, 4 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ప్రయాణాల్లో ఉండటం చేత, ఎక్కువ చెయ్యలేను. నాలుగింటిని మాత్రం ఎంచుకున్నాను, ఆ పేజీలో గుర్తు పెట్టాను.__చదువరి (చర్చరచనలు) 11:04, 4 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణా ప్రభుత్వం డిజిటల్ మీడియా డిపార్ట్ మెంటుతో చర్చలు మార్చు

అందరికీ నమస్కారం,
తెలంగాణా ప్రభుత్వం డిజిటల్ మీడియా డిపార్టుమెంటుతో మన గత చర్చల నేపథ్యంలో డిసెంబరు మూడో వారంలో ప్రణయ్ రాజ్, పవన్ సంతోష్, తన్వీర్ హాసన్లు తెలంగాణా ఐటీ మరియు డిజిటల్ మీడియా డిపార్ట్ మెంట్ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను కలవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ కింది ఆలోచనలు, ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి:

  • 2015, 2016 సంవత్సరాల్లో తెలంగాణా ప్రభుత్వం నుంచి తెలంగాణా రాష్ట్ర పురస్కారాలు అందుకున్న ప్రముఖులకు ఆ సందర్భంగా విడుదల చేసిన అవార్డు సైటేషన్లు, ప్రభుత్వం దగ్గర ఉన్న ఇతర వివరాలు, ఫోటోలు స్వేచ్ఛా లైసెన్సుల్లో విడుదల చేయడం, తద్వారా తెలుగు వికీపీడియాలో ఆ వ్యాసాలను అభివృద్ధి చేయడానికి వీలిస్తుంది. తెలంగాణాకు చెందిన 120 మందికి పైగా విశిష్ట వ్యక్తుల గురించి నాణ్యమైన వ్యాసాలు వచ్చే వీలుంది.
  • తెలంగాణా నుంచి ఆసక్తి కల టీచర్లు, జర్నలిస్టులు తదితర వృత్తుల వారికి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్వహించే డిజిటల్ వనరుల అభివృద్ధి కార్యశాలలో తెలుగు వికీపీడియా ప్రధానమైన భాగంగా నేర్పించి, వారిలో ఆసక్తి కలవారితో మరిన్ని కార్యక్రమాలు, కార్యకలాపాలు కొనసాగించడం.
  • తెలుగు వికీపీడియాలో వ్యక్తులు, ఘటనలు, సాంస్కృతికాంశాలు, చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు, గ్రామాలు వంటివాటి వ్యాసాల్లో బొమ్మలు కోరబడుతున్న వాటి జాబితా తెలంగాణా ప్రభుత్వ డిజిటల్ మీడియా, ఐటీ డిపార్ట్ మెంటుకు అందిస్తే, వారు తమ ఆర్కైవుల నుంచి కానీ, మరి ఇతర మూలాల నుంచి కానీ లభించే ఫోటోలను స్వేచ్ఛా లైసెన్సుల్లోకి విడుదల చేయడం. తద్వారా తెలుగు వికీపీడియా వ్యాసాలను ఫోటోల పరంగా అభివృద్ధి చేయడానికి, నాణ్యతాభివృద్ధికి అవకాశం ఉంటుంది.
  • సీఐఎస్-ఎ2కె 2017 ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా స్వేచ్ఛా నకలు హక్కులు, స్వేచ్ఛా లైసెన్సుల పట్ల అవగాహన కల్పించేందుకు ఉద్దేశిస్తూ చేపట్టనున్న ఫ్రీడం ఇన్ ఫెబ్ (Freedom in feb) ప్రచారోద్యమంలో తెలంగాణా ప్రభుత్వ డిజిటల్ మీడియా & ఐటీ డిపార్ట్ మెంట్ మద్దతు కోరగా, ఆ నెల జరిగే కార్యక్రమాలు పరిశీలించి మద్దతునిచ్చే ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు.
  • తెలంగాణా ప్రభుత్వ ఐటీ డిపార్ట్ మెంటు వారితో ఈ అంశాలపై సీఐఎస్-ఎ2కె లెటర్ ఆఫ్ ఇంటెంట్ సమర్పించడం

ఈ ప్రతిపాదనలపై తెవికీపీడియన్లు తమ సూచనలు, ఆలోచనలు తెలియజేయమని కోరుతున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:18, 25 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణా ప్రభుత్వ సాంస్కృతిక శాఖతో చర్చలు మార్చు

అందరికీ నమస్కారం,
తెలంగాణా ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టరు మామిడి హరికృష్ణ గతం నుంచి తెలుగు వికీపీడియా విషయంలో జరుగుతున్న కృషిపై ఆసక్తి చూపుతూ, తెవికీ అభివృద్ధికి ఏదోక విధంగా సహకరించాలన్న ఆకాంక్ష వ్యక్తం చేస్తూన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గతం నుంచి ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న ప్రణయ్ తో కలిసి, పవన్ సంతోష్, తన్వీర్ హాసన్లు డిసెంబరు మూడవ వారం రవీంద్ర భారతి ప్రాంగణంలో ఉన్న ఆయన కార్యాలయంలో వారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన చర్చకు వచ్చిన అంశం:

  • తెలుగు వికీపీడియన్లు ఉపయోగించుకోవడానికి, వ్యాసాలు రాయడానికి ఉపకరించే రిఫరెన్సులతో ఏర్పాటుచేయగల తెలుగు వికీపీడియా గ్రంథాలయానికి సహకారాన్ని కోరాం. దీనికి అవసరమయ్యే రిఫరెన్సు గ్రంథాలు, జెస్టర్, ప్రాజెక్టు మ్యూస్ వంటి వాటిలో అవసరమయ్యే తెలుగు వికీపీడియన్లకు ఉచితంగా అక్కౌంట్లు వంటివాటికి స్పాన్సర్ చేసేందుకు ఆయన అంగీకరించారు.

ఈ అంశంపై తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేయమని కోరుతున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 13:04, 25 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

విజయవాడ పుస్తక ప్రదర్శనలో తెలుగు వికీపీడియా స్టాల్ మార్చు

గతంలో రచ్చబండ చర్చల్లో తెవికీ సభ్యుల అభిప్రాయాలను అనుసరించి పుస్తక ప్రదర్శనల్లో చేస్తున్న వికీపీడియా స్టాల్స్ నిర్వహణలో భాగంగా విజయవాడలో జనవరి 2 నుంచి 11 వరకూ జరుగనున్న వార్షిక పుస్తకాల పండుగలో వాలంటీర్ల లభ్యతను అనుసరించి సాధ్యమైనన్ని రోజులు తెలుగు వికీపీడియా స్టాల్ నిర్వహిస్తున్నాం. దీనికి ఎన్టీఆర్ ట్రస్టు వారు తమ స్టాల్స్ నుంచి ఒక స్టాల్ కేటాయించి మద్దతునిస్తున్నారు. కార్యక్రమంలో తమ భాగస్వామ్యం గురించి కానీ, సూచనలు కానీ, ఇతరేతరమైన అభిప్రాయాలు కానీ తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:21, 29 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

విజయవాడ పుస్తక ప్రదర్శనలో తెలుగు వికీపీడియా స్టాల్ నిర్వహణకు దాదాపుగా రూ.15000 ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాం. ఇందులో ప్రధానంగా వసతికి రూ.8000 ఖర్చు అవుతోంది. ఎన్టీఆర్ ట్రస్టు సౌజన్యంతో స్టాల్ ఉచితంగా లభిస్తోంది, మిగిలిన నిధుల కోసం సీఐఎస్-ఎ2కె నుంచి వెచ్చించనున్నాం. విజయవాడ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి చెందిన, పాఠకులు, పుస్తక విక్రేతల నుంచి మంచి స్పందన కలిగిన పుస్తక ప్రదర్శన కావడాన్నీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యయం మరింత తక్కువలో మెరుగ్గా చేసేందుకు ఆలోచన ఉన్నా, మరేదైనా సూచనలు, కానీ అభిప్రాయాలు కానీ ఉన్నా తెలియపరచగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 15:00, 31 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అందరికి నమస్కారం. గత 28 సంవత్సరాలుగా విజయవాడ పుస్తక ప్రదర్శన జరుగుతుంది. ఈసారి ఎన్టీఆర్ ట్రస్టు ఈ పుస్తక ప్రదర్శనలో భాగస్వామిగా ఉన్నారు. వారు తెవికీకి స్టాల్ ఉచితంగా ఇవ్వడం శుభ పరిణామం. హైదరాబాద్ పుస్తక ప్రదర్శన మాదిరిగానే విజయవాడ పుస్తక ప్రదర్శన కూడా జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి చెందినది. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో స్టాల్ కు రెంట్ చెల్లించవలసి వచ్చింది. నేను మరియు కశ్యప్ హైదరాబాద్ కి చెందినవారిమే కాబట్టి ప్రత్యేక వసతి అవసరం రాలేదు. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా విజయవాడ పుస్తక ప్రదర్శనలో తెవికీకి స్టాల్ ఉచితంగా లభిస్తుంది. వసతికి మరియు ఇతరములు చూసుకోవలసివుంటుంది. కనుక రూ.15000 లు అమోదించగల విషయమే. నేను జనవరి 2 నుండి 11 వరకు విజయవాడ పుస్తక ప్రదర్శనలో తెవికీకి స్టాల్ లో ఉండగలను. ఆసక్తిగల వికీపీడియన్లు స్టాల్ నిర్వాహణకు రావచ్చు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 15:13, 31 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాలో వివిధ అంశాలు నేర్పే వీడియోల నిర్మాణంలో సహకారం మార్చు

అందరికీ నమస్కారం,

పలు కార్యక్రమాల్లో భాగంగా సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ, పుస్తకాల పండగల్లోనూ మనం రీచ్‌ విస్తృతంగా పెంచే ప్రయత్నం చేస్తున్న అంశం తెలిసిందే. ఐతే రీచ్ పెంచినప్పుడు వికీపీడియా గురించి తెలుసుకుని, వికీపీడియాలో రాసేందుకు ఆసక్తి పెంచుకున్న వ్యక్తులకు వికీపీడియాలో రాసేప్పుడు అవసరమయ్యే మౌలికాంశాల నుంచి అడ్వాన్స్డ్ అంశాల వరకూ నేర్చుకోవాలని ఆశించేవి చాలానే ఉంటాయి. అలా నేర్చుకుందుకు వీలుగా know-how తరహాలో, స్క్రీన్ కాప్చర్ ద్వారా వీడియోలు తయారుచేసి అందుబాటులోకి తీసుకురావాని ప్రయత్నిస్తున్నాం. ఇందుకు ఓ నమూనాగా ఇప్పటికే చేసిన ఈ వీడియో చూడగలరు.

వికీపీడియా కంటెంట్ ట్రాన్స్ లేషన్ ఉపకరణం గురించి know-how తరహా వీడియో

ఈ తరహా వీడియోలు మరిన్ని - అంటే ఖాతా సృష్టించుకోవడం నుంచి మొదలుకొని అడ్వాన్స్డ్ అంశాల వరకూ పలు వీడియోలు తయారుచేయాలని ఆలోచన చేస్తున్నాం. ప్రధానంగా ఈ వీడియోలు అన్నీ దాదాపు 5 నిమిషాలలోపు నిడివి ఉండాలని ఆలోచన. అలానే స్క్రీన్ కాప్చర్ వీడియోల్లో వాయిస్ అవసరం లేకుండా చేయాలని, ఒకవేళ వాయిస్ తో చెప్పాల్సి వుంటే దాన్ని స్క్రీన్ కాప్చర్ పద్ధతిలో కాకుండా మనిషి కనిపించేలా చెప్పాలని మరో ఆలోచన. (స్క్రీన్ కాప్చర్ తరహా వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నప్పుడు 70 శాతానికి పైగా మ్యూట్ లో చూస్తుంటారని అధ్యయనం, మనిషి మాట్లాడుతున్నట్టు కనిపిస్తే తప్ప ఆడియో పెట్టుకోరు) వీడియోలు ఏయే అంశాలపై ఉండాలనే జాబితా, వీడియోల స్టోరీ బోర్డు సహా ఈ అంశాలపై మీ అభిప్రాయాలు, సూచనలు, మీరు చేయగల సహకారం వంటివి తెలుపగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:28, 30 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా మంచి పని. వికీపీడియాను కొత్తవారికి అలవాటు చెయ్యడానికి, వారి ఇబ్బందుల్ని తొలగించడానికీ ఇది బాగా పనికొస్తుంది. ఈ పనిని తలకెత్తుకున్నందుకు మీకు నా నెనరులు. నాక్కూడా ఏదైనా పనిని కేటాయిస్తే నేనూ చేస్తాను. పోతే, నా సూచనలు కొన్ని:
  1. ఒక వీడియోలో ఒక్క విషయం గురించి మాత్రమే చెప్పాలి
  2. వీడియోలు వీలైనంత తక్కువ నిడివితో ఉండాలి. 5 నిముషాలు ఎక్కువౌతుందేమో చూడండి. చెప్పాల్సిన విషయం ఎక్కువ ఉంటే, భాగాలుగా విడగొట్టవచ్చేమో చూడాలి.
  3. వికీపీడియా ఇంటర్‌ఫేసు కొత్త వాడుకరికి ఎలా కనిపిస్తుందో వీడియోలో కూడా అలాగే కనబడాలి. అంటే -
    1. వీలైనంతవరకు సాధారణ వాడుకరి లాగా లాగినై చెయ్యాలి.
    2. అభిరుచుల్లో అన్నీ డిఫాల్టు సెట్టింగులు పెట్టుకోవాలి.
  4. వీడియోలను రెండు స్థాయిలుగా చేద్దాం.
    1. ప్రాథమిక స్థాయి: ఈ వీడియోల్లో ఎలా చెయ్యాలో మాత్రమే చెబుదాం.
    2. ఉన్నత స్థాయి: వీటిలో ఎందుకు చెయ్యాలో చెబుదాం. తెరపట్టు వీడియోలు మాత్రమే కాక, వికీపీడియనుల చేత చెప్పించనూ వచ్చు.
  5. తెరపట్టు వీడియోలో కూడా ఆడియో ఉంటే బానే ఉంటుందని నా ఆలోచన.
  6. చెయ్యాల్సిన వీడియోల జాబితా, ఒక్కోదానికీ స్టోరీబోర్డూ తయారు చేసుకుని, పని మొదలుపెడదాం.
  7. వికీప్రాజెక్టు గొడుగు కింద ఈ పనులు చేద్దాం.
  8. పనులు ఎవరు చేసినా ఒకే సాఫ్టువేరును వాడదాం.
  9. కొన్ని వ్యాసాలను ఎంచుకుని వీడియోలన్నిటినీ వాటిలోనే చేద్దాం.
  10. వీడియో ఫైళ్ళకు ఒక క్రమపద్ధతిలో పేర్లు పెడదాం. ఓ కచ్చితమైన సంప్రదాయాన్ని పెట్టుకుని దాన్నే అనుసరిద్దాం.
  11. ఇక నేను చెయ్యగలిగే పని - మీరు ఏది చెబితే అది.
__చదువరి (చర్చరచనలు) 05:12, 31 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్, చదువరి లకు ధన్యవాదాలు. పవన్ గారు మీ అలోచన మరియు ప్రయత్నం బాగుంది. గతంలో వీటి గురించిన చర్చ జరగడమేకాకుండా వీడియోలకు కావలసిన విషయాన్ని తెలుగులోకి అనువాదం కూడా చేయడం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈసారి అలా జరగకుండా చూడాలి. చదువరి గారు మంచి సూచనలు అందించారు. వాటితో నేను ఏకీభవిస్తున్నాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:23, 4 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వాడుకరులు, కొంత పాత వాడుకరులకు వికీపీడియా ఎడిటింగ్ విషయంలో కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయని నా పూర్వానుభవం ద్వారా తెలుసుకున్నాను. వాటిలో కొన్ని:

  1. ఫోటోలు ఎక్కించడం
  2. ఇన్ఫోబాక్సులు పెట్టడం, ఉన్నవాటిని సవరించడం(ఎటు సవరిస్తే సరైన మార్పో తెలీడం కష్టం)
  3. లింకులు, మూలాలు ఇవ్వడం(సైట్, బుక్ వంటి చాలా రకాలు సవివరంగా ఉండాలి లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ)
  4. అనాధ పేజీలు, అగాధ పేజీల గురించి సవివరమైన అవగాహన కల్పించాలి. మనం కొత్త వ్యాసం రాసేటప్పుడు ఏవి చేస్తే ఈ రెండు కేటగిరీల్లోకీ రాకుండా నాణ్యమైన వ్యాసం రాయొచ్చో వివరించాలి.(చదువరిగారు పైన "ఎందుకు చెయ్యాలో చెబుదాం." అన్న దాంట్లోకి కూడా ఈ విషయం వస్తుంది)
  5. అతి ముఖ్యంగా వికీ స్టైల్(వార్తాపత్రికలో ఉండే స్పెషల్ ఐటెం వ్యాసాలకూ, ఈ వ్యాసాలకూ తేడా తెలియాలి)
  6. ట్రాన్స్ లేషన్ టూల్ గురించి సవివరంగా ఒక వీడియో తప్పకుండా ఉండాలి. అందులో ఆ టూల్ లో ఎడిటింగ్ లో ప్రతీ చిన్న విషయం గురించీ వివరించాలి(అనువాదాలకు ఈ టూల్ చాలా బాగుంటుంది. ఒక్కసారి అర్ధమై, పని చేస్తే దానిని వదిలిపెట్టడం చాలా కష్టం. నాదీ అదే పొజిషన్ నిజానికి).
  7. నోట్స్ కూ, మూలలకూ తేడా. ఏలా ఇస్తే అది నోట్స్ అవుతుంది, ఎలా ఇస్తే అది మూలం అవుతుంది అనే విషయాలతో పాటు, ఏది మూలంగా పనికివస్తుంది, ఏది నోట్స్ గా పనికివస్తుంది కూడా తెలియజేయాలి.
  8. పేరాగ్రాఫులు, శీర్షికలు, బిందుజాబితాలు ఎలా ఇవ్వాలి అనే దాని గురించి
  9. పట్టికలు తయారు చేయడం గురించి
  10. ఇవన్నీ సోర్స్ ఎడిటింగ్, విజువల్ ఎడిటింగ్ రెండిట్లోనూ వివరిస్తే బాగుంటుంది.

వీటన్నిటినీ సమీక్షించి, వేటి గురించి వీడియోలు ఉండాలి, వేటికి అవసరంలేదు, ఏవేవి కలిపి చెప్పాలి, వేటి గురించి విడిగా వీడియోలు చేయాలి అన్నది అందరం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. --Meena gayathri.s (చర్చ) 05:57, 6 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వీడియో వనరుల తయారీ 2017 పేరిట ఓ ప్రాజెక్టు ఉప పేజీ తయారుచేసి పని మొదలుపెట్టాను. ఈ సూచనలు పరిగణనలోకి తీసుకున్నాం. దయచేసి అందరూ సహకరించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:13, 25 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

జనవరి మొదటి వారం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో కార్యశాల ఏర్పాటు మార్చు

అందరికీ నమస్కారం,
2017 జనవరి 6, 7 తేదీల్లో రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో తెలుగు వికీపీడియా కార్యశాల నిర్వహణకు ఏర్పాటుచేశాం. ఈ కార్యశాలలో ప్రధానంగా విద్యార్థులకు తెలుగు వికీపీడియా గురించి అవగాహన, పరిచయం, తెవికీలో ఎలా రాయాలన్న అంశం వగైరాలు నేర్పదలుచుకున్నాం. తెలుగు వికీపీడియన్లు కార్యశాలలో తమ భాగస్వామ్యం కానీ, సూచనలు కానీ, సలహాలు కానీ అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:16, 31 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తొలినుండి హైదరాబాద్ కేంద్రంగా మాత్రమే వికీ అభివృద్ది జరుగుతున్నది. వికీ అభివృద్ది అన్ని ప్రాంతాలలో జరగాలి. దీనికి నన్నయ విశ్వవిద్యాలయం‌ద్వారా రాజమహేంద్రవరంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా నా వైపుగా చేతనైనంత సహకారం‌అందించగలను..--Viswanadh (చర్చ) 05:35, 1 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి కార్యక్రమం... నవంబర్ నెలలో రాజమహేంద్రవరంలో జరిగిన పుస్తక సంబరాల్లో నేను పాల్గొన్న సమయంలో స్థానిక ఆర్ట్స్ కళాశాలని సందర్శించడం జరిగింది. అది 1857లో ప్రారంభించిన కళాశాల... అక్కడ చాలా సమాచారం ఉందని గ్రహించాను... అంతేకాకుండా ఆ కళాశాల ప్రిన్సిపాల్ డేవిడ్ కుమార్ గారు కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు... ఆయన్ని కలిసి ఆర్ట్స్ కళాశాలలో కూడా వికీపీడియా కార్యశాల నిర్వహిస్తే బాగుంటుంది... Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:27, 1 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

భాస్కరనాయుడు గారి మీడియా ఫైలు మార్చు

భాస్కరనాయుడు గారు కామన్స్ లోకి ఎక్కించిన వీడియో ఫైలు అక్కడ "మీడియా ఆఫ్ ది డే" గా ప్రదర్శింపబడుతోంది, చూసారా? భాస్కరనాయుడు గారూ అభినందనలందుకోండి.__చదువరి (చర్చరచనలు) 12:56, 3 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అద్భుత: భాస్కరనాయుడు గారూ, అందుకోండి అభినందనలు. --పవన్ సంతోష్ (చర్చ) 08:59, 4 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఏదీ నాకు కనిపించలేదే? మొదటి పేజీలో భాస్కరనాయుడు గారు ఎక్కించిన వీడియోలు కనిపించలేదు--రవిచంద్ర (చర్చ) 09:08, 4 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
అర్థం అయింది. నిన్న ప్రదర్శించినట్లున్నారు. ఇదీ లింకు. భాస్కరనాయుడు గారికి అభినందనలు. మీరు ఇలాగే మరుగున్న పడిపోతున్న కళారూపాలను మరిన్ని మీ కెమెరాలో బంధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.--రవిచంద్ర (చర్చ) 09:11, 4 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
అభినందనలు.Palagiri (చర్చ) 13:12, 4 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
అభినందనలు భాస్కరనాయుడు గారూ.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:46, 4 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
సూపర్ భాస్కరనాయుడు గారు -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:30, 4 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Invitation for Office Hours with WMF's Global Reach team మార్చు

Hi,

On behalf of Wikimedia Foundation’s Global Reach Team, we would like to invite all the South Asian Wikimedia communities to our office hours to discuss our work in the region.

Meeting Details

Date: Thursday, 19th January 2017

Time: 16:00 UTC/21:30 IST

Duration: 1 hour

Language: English

Google Hangout Location:

https://hangouts.google.com/hangouts/_/ytl/w5sE6IZTXERWH0VvKtDRiAm9WE1eZ5mYcnQm0h7dHok=?hl=en_US&authuser=0

If you are not able to join the hangout, you can watch the live stream with a few seconds lag at

https://www.youtube.com/watch?v=qD-VCpQkVSk

Etherpad: https://etherpad.wikimedia.org/p/Global_Reach_South_Asia_Office_Hours

Agenda

  • Introduction of Global Reach Team and office hours
  • Research around New Readers and our partnership themes
  • Feedback for next office hours
  • Q&A

We plan to hold these office hours at regular intervals. FYI, office hours for South East Asia and Central Asia/Eastern Europe will be held separately; given the size of communities, we needed to break down the regions.

Please feel free to add your questions, comments, and expectations in the Etherpad document shared above. You can also reach out to sgupta@wikimedia.org and rayyakkannu@wikimedia.org for any clarification. Please help us translate and share this invitation in community social media channels to spread the word.

Thanks,

Ravishankar Ayyakkannu, Manager, Strategic Partnerships, Asia, Wikimedia Foundation --18:55, 17 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

We thank everyone for participating in the Office hours with WMF's Global Reach team. Meeting notes can be found here. You can also watch the YouTube recording here.
--Ravishankar Ayyakkannu, Manager, Strategic Partnerships, Asia, Wikimedia Foundation. 10:20, 1 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Train-the-Trainer 2017: Invitation to participate మార్చు

Sorry for writing in English, please translate this message to your language, if possible

Hello,
It gives us great pleasure to inform that the Train-the-Trainer (TTT) 2017 programme organised by CIS-A2K is going to be held from 20-22 February 2017.

What is TTT?
Train the Trainer or TTT is a residential training program. The program attempts to groom leadership skills among the Indian Wikimedia community members. Earlier TTT have been conducted in 2013, 2015 and 2016.

Who should join?

  • Any active Wikimedian contributing to any Indic language Wikimedia project is eligible to apply.
  • An editor must have 500+ edits.
  • Anyone who have already participated in an earlier iteration of TTT, can not apply.

Please see more about this program and apply to participate or encourage the deserving candidates from your community to do so: CIS-A2K/Events/Train the Trainer Program/2017

If you have any question, please let us know.
Regards. Tito Dutta (CIS-A2K) sent using MediaWiki message delivery (చర్చ) 05:35, 18 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ట్రైన్-ద-ట్రైనర్ 2017: పాల్గొనేందుకు ఆహ్వానం మార్చు


నమస్కారం,
అందరికీ నమస్కారం, సీఐఎస్-ఎ2కె నిర్వహించనున్న ట్రైన్-ద-ట్రైనర్ (టిటిటి) 2017 కార్యక్రమం 20-22 ఫిబ్రవరి 2017 తేదీల్లో జరగనుంది.

టిటిటి అంటే ఏమిటి? ట్రైన్-ద-ట్రైనర్ లేదా టిటిటి అనేది రెసిడెన్షియల్ ట్రైనింగ్ కార్యక్రమం. కార్యక్రమం భారతీయ వికీమీడియా సముదాయ సభ్యుల్లో నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. గతంలో 2013, 2015, 2016 సంవత్సరాల్లో టిటిటి నిర్వహణ జరిగింది.

ఎవరు పాల్గొనవచ్చు? ఏదైనా భారతీయ భాషా వికీమీడియా ప్రాజెక్టులో కృషిచేస్తున్న ఏ చురుకైన వికీమీడియన్ అయినా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వాడుకరి కనీసం 500+ దిద్దుబాట్లు చేసినవారై వుండాలి. గత టిటిటిల్లో పాల్గొన్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకునే వీలు లేదు.

ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు ఈ కింది లింకులో చూసి, పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవడం కానీ, మీ సముదాయం నుంచి అర్హులైన వాడుకరులను పాల్గొనేలా ప్రోత్సహించడం కానీ చేయగలరు: ట్రైన్-ద-ట్రైనర్ 2017 మెటా పేజీ


మీకు మరేదైనా సందేహం కానీ, ప్రశ్నలు కానీ ఉంటే, దయచేసి మాకు తెలియజేయండి. ధన్యవాదాలు,
--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:52, 18 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పుడు సమాచారం లేదా ఊహాత్మక సమాచారం చేర్చుట మార్చు

చాలా రోజుల నుంచి సెలవులో ఉండుట వల్ల నిర్వహణ కార్యక్రమాలు చేయుటకు వీలుకావడం లేదు. ఇప్పుడే పరిశీలించిన నేటి దిద్దుబాట్ల ప్రకారం చెప్పాలంటే Nrgullapalli గారు వేలాది గ్రామవ్యాసాలలో తప్పుడు లేదా ఊహాత్మక సమాచారం చేర్చుతున్నట్లుగా గమనించాను. అలాగే మండలం లేదా మండల కేంద్రం కాని గ్రామవ్యాసాలలో కూడా ఆయా జిల్లాలలోని మండలాల వర్గంను చేరుస్తున్నారు. ఈ విషయం సదరు సభ్యుడికి కొన్ని మాసాల క్రితమే సూచించిననూ మళ్ళీ మళ్ళీ అదే పొరపాటు చేయడంలో నిమగ్నమైయున్నారు. ఉదా:కు వర్గం:చిత్తూరు జిల్లా మండలాలు వర్గంలో ఇది వ్రాసే సమయానికి 326 పేజీలు వచ్చిచేరాయి. గుంటూరు జిల్లాలో 140, ప్రకాశం జిల్లాలో 130 మండలాలు ఉన్నట్లుగా ఆయా వర్గాలు సూచిస్తున్నాయి. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేవలం గత రెండు రోజుల దిద్దుబాట్లు పరిశీలించిననూ ఈ సభ్యుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రమైననూ, ఏ జిల్లా అయిననూ, ఏ మండలం అయిననూ చేతికందిన ప్రతిగ్రామ వ్యాసంలో "గ్రామంలో ప్రధానపంటలు" అనే విభాగం పెట్టి అందులో "[[వరి]], అపరాలు, కాయగూరలు అని చేరుస్తున్నారు. నా వద్ద ఉన్న ప్రభుత్వ అధికార గణాంకాల ప్రకారం మండలం మొత్తం మీద ఒక్క హెక్టారు కూడా అపరాలు సాగులేని మండలాలలో కూడా ఆ మండలపు అన్ని గ్రామాలలో అపరాలు సాగు చేస్తున్నట్లు చూపించడం మరియు ఏ ప్రాంతపు గ్రామమైనా ఒకేరకపు పంటలు పండిస్తున్నట్లు చూపించడం తప్పుడు లేదా ఊహాత్మక సమాచారంగా చెప్పబడుతుంది. ఆ సమాచారం ఎలా లభ్యమైందీ అనే విషయంపై అనుమానాలున్నప్పుడు ఆయా వాక్యాల చివరన మూసలుపెట్టడం తోటిసభ్యుల విధి. (ఇప్పుడే నేను కొన్ని గ్రామవ్యాసాలలో "ఆధారం కోరబడినది" అనే మూసపెట్టాను) దానికి సరైన వివరణ ఇవ్వడం మరియు సరైన ఆధారం చూపించడం సమాచారం చేర్చిన సభ్యుడి బాధ్యత. వివరణ ఇవ్వకుండా అభ్యంతరపర్చిన సమాచారాన్నే మళ్ళీ చేర్చడం వికీనిబంధనలకు విరుద్ధముగా పరిగణించబడుతుంది. తోటి సభ్యులు కూడా ఈ విషయంపై దృష్టిపెట్టగలరని మనవి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:21, 19 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అవును ఈ మధ్య కొంత చెత్త చేరుతున్నది Palagiri (చర్చ) 08:25, 22 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
Palagiri గారు చెత్త అనే పదానికి నిర్వచనం ఇస్తే సభ్యులు సంతోషిస్తారు --Nrgullapalli (చర్చ) 01:25, 23 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ సంధర్బాన్ని బట్టి అనవసర సమాచారం చెత్తగా Palagiri గారు అభిప్రాయపడి ఉండవచ్చు. అన్నిపేజీల్లో ఒకే మాదిరి కాక ఊరి లేదా ఆయా ప్రాంతాలలో పండించే పంటల వివరాలను మూలాధారంగా ఉదహరించడం వరకూ పర్వాలేదు కాని లేనివి చేర్చడం అనవసరం..--Viswanadh (చర్చ) 14:53, 25 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
Nrgullapalli గారూ, "చెత్త" అనే మాటను మీరు అభ్యంతరపెట్టడం కాకుండా, పాలగిరి లాంటి పెద్దవారు అలా ఎందుకన్నారో ఆలోచించి, సరైన స్ఫూర్తితో తీసుకుని ఉండాల్సింది. చంద్రకాంతరావు గారు వెలికితీసిన విషయాల గురించి మీరు వివరణ ఇచ్చి ఉండాల్సింది. చిత్తూరు జిల్లా మండలాలు వర్గంలో 326 పేజీలు ఎందుకున్నాయో, ఈ సంఖ్య ఇంతలా ఎందుకు పెరిగిందో, అందులో మీ బాధ్యత ఎంతవరకూ ఉందో పరిశీలించి ఉండాల్సింది. ఒక్కో జిల్లాలో అన్నేసి మండలాలు ఉండడంలో అసంబద్ధత ఉందని ఎవరైనా అంటారు. నాకు గుర్తున్నంతలో చంద్రకాంతరావు గారు ఈ విషయమై మీకు గతంలో చెప్పి ఉన్నారు. అయినా అవి కొనసాగాయి. గతంలో వివిధ వాడుకరులు వివిధ సందర్భాల్లో ఎన్నోసార్లు మీరు చేస్తున్న మార్పు చేర్పుల గురించి మీకు చెప్పి ఉన్నారు.. మీరు చేరుస్తున్న ఖాళీ విభాగాల గురించి, మీరు తయారు చేస్తున్న కొత్త పేజీల గురించి, మీరు ఇస్తున్న లింకుల గురించీ.. మీకు చెప్పి ఉన్నారు. ఆయా లోపాలను గమనించానని మీరు చెప్పినప్పటికీ, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన దాఖలాల్లేవు -ఎందుకంటే అవే తప్పులు పునరావృతమౌతున్నై. కె.వెంకటరమణ గారు ఎన్నోసార్లు మీకు చెప్పి, రచ్చబండలో కూడా చెప్పి, ఎన్నో కొత్త పేజీలను తొలగించడం నాకు తెలుసు. నాబోటి వాడుకరులకు మార్గదర్శకులు కావాల్సినంత అనుభవం ఉంది మీకు. కానీ, దురదృష్టవశాత్తూ అలా జరగడం లేదు. వీటిని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. సరైన స్ఫూర్తితో తీసుకుంటారనే ఆశతో- చదువరి (చర్చరచనలు) 16:03, 25 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
కూరగాయలు పండించని గ్రామం లేదు. కనీసం రైతులు వారి ఇళ్ళముందు తప్పనిసరిగా పండిస్తున్నారు. ఇది నిజం వ్యూహాత్మకంకారు. ఇది కూడా చెర్చవద్దంటీ మానేస్తాను. చెత్త అనే పదం అభ్యంతరకరం దీన్ని సమర్దించుకొనే అవకాశంలేదు --Nrgullapalli (చర్చ) 01:01, 26 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ముందుగా చర్చకు స్పందించిన పాలగిరి, విశ్వనాథ్, చదువరి గార్లకు కృతజ్ఞతలు. చర్చ ప్రారంభమై వారం రోజులు గడిచిననూ సదరు సభ్యుడి నుంచి ఎలాంటి సరైన ప్రతిస్పందన లేదు. తప్పుడు / ఊహాజనిత దిద్దుబాట్లుగా అభ్యంతరపర్చిన దిద్దుబాట్లు మాత్రం చాలావరకు ఆగిపోయాయి. (కొన్ని జరిగాయిలెండి). అభ్యంతరపర్చిన వాక్యాల చివరన ఉన్న ఆధారం కోరబడిన మూసలు మాత్రం అలాగే ఉన్నాయి. అంటే నేను అభ్యంతరపర్చిన ఆ దిద్దుబాట్లు తప్పుడు దిద్దుబాట్లుగా రూఢి అయ్యాయన్నమాట! అయితే ఇది పదో, పాతికో కాదు. వేలల్లో ఇలాంటి తప్పుడు దిద్దుబాట్లు చేస్తున్ననూ మనం అభ్యంతరపర్చకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. వికీలో ఏదేని సమాచారం చేర్చాలంటే ఆధారం తప్పనిసరి అనేది మూలనియమమే. అలాంటి మూలనియమాల ఉల్లంఘన అప్రతిహతంగా జరుగుతున్ననూ చెప్పడానికి సాహసించలేకపోతున్నాము! లేదా సీనియర్ సభ్యులకు దిద్దుబాట్లు చేయడంలో ఏదైనా అనధికార మినహాయింపు ఇస్తున్నామా! ఒక కొత్త సభ్యుడు చిన్న తప్పుచేస్తే నిరోధం విధిస్తున్నాము, మరి వేలాది అనవసర దిద్దుబాట్లు చేస్తున్న సీనియర్ సభ్యుల దిద్దుబాట్లను మాత్రం చూస్తూ ఊరకుండిపోతున్నాము! ఈ సభ్యుడి దిద్దుబాట్లు చెత్తదిద్దుబాట్లుగా పరిగణించడానికి కారణం అతని దిద్దుబాట్లు తెవికీకి ఏ కోశాన ఉపయోగపడకపోవడమే! అంతేకాకుండా ఆ దిద్దుబాట్లు తెవికీకి నష్టాన్ని, తోటి సభ్యులకు చికాకును, పాఠకులకు అసహనాన్ని, నిర్వహణ చేసేవారికి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇక్కడ మనం రచనలు చేయడం ఎంత ముఖ్యమో ఉన్న వ్యాసాలను, వ్యాస నాణ్యతను కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యం. సభ్యుడి దిద్దుబాట్ల వల్ల వ్యాసనాణ్యత ముఖ్యంగా గ్రామవ్యాసాలలో ఘోరంగా దెబ్బతింటోంది. అసలు ఏ ఉద్దేశ్యంతో సదరు సభ్యుడు దిద్దుబాట్లు చేస్తున్నాడో అర్థంకావడం లేదు. సభ్యునికి తెవికీ నియమాలపై అవగాహన ఉన్నట్లు, చర్చలను పట్టించుకున్నట్లు, చెప్పిననూ అర్థం చేసుకోగల స్థోమత ఉన్నట్లు, విషయ పరిజ్ఞానం ఉన్నట్లుగా పరిణతి చూపించడం లేదు. సరే ఏవీ లేకున్ననూ దిద్దుబాట్లు చేయరాదనే నియమం లేదు కదా! ఎవరైనా, ఏమైనా దిద్దుబాట్లు చేయవచ్చనుకుందాం. కాని ఆ దిద్దుబాట్ల వల్ల తెవికీకి నష్టం కలుగకుండా మరియు తోటి సభ్యులకు చికాకు కల్పించకుండా ఉంటే చాలు. కాని సభ్యుడి దిద్దుబాట్లు వల్ల తెవికీ నిర్వహణ చేసేవారికి ఇబ్బందిగా మారింది. ఇటీవలి దిద్దుబాట్లు గమనించిననూ మనం ఒక విషయం గమనించాలి. వ్యాసాలలో లింకులు బాటు లేదా AWB ద్వారా అతి సునాయాసంగా చేయడానికి వీలున్ననూ మనం ఎందుకు చేయడం లేదో పరిశీలిద్దాం. అసలు లింకులివ్వడం అంటే పదాలను బ్రాకెట్లలో ఇరికించడం మాత్రమే కాదు. దీనికి చాలా కసరత్తు ఉంది. బాటు లేదా AWB ద్వారా చేయడంలో ఇబ్బందులుంటాయనే అలా చేయడం లేదు. మరి ఈ సభ్యుడు చేస్తున్నదేమిటి? కేవలం బాటు చేసే పనులే కదా! సభ్యుడిచ్చిన చాలా లింకులు దారిమార్పులకు లేదా ఎర్రలింకులకే దారితీస్తున్నాయి. అంతేకాకుండా ఒక పదానికి కాకుండా పదసముదాయానికి ఇచ్చే లింకులు చాలానే ఉంటాయి. ఖచ్చితంగా పదాలు లేనప్పుడు వాక్యనిర్మాణం చెడిపోకుండా పైపులు ఉపయోగిస్తూ లింకులు ఇవ్వాల్సి ఉంటుంది. లింకులివ్వడంలో పైపుల ఉపయోగం ఎనలేనిది. కాని సదరు సభ్యుడు ఎక్కడా పైపులు ఉపయోగించిన దాఖలాలు నా దృష్టికి రాలేదు. మానవ ప్రయత్నం ద్వారా చేస్తూ కూడా కేవలం బాటు లేదా AWB చేసే పనులే చేయడం సరైనది కాకపోవడమే కాకుండా తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారు. ఉన్న సరైన పదాలు కూడా మార్చి లింకులకోసం తప్పుడు పదాలు చేర్చిన విషయం అతని దిద్దుబాట్లు తెలుపుతాయి. చాలా లింకులు అయోమయ నివృత్తి పేజీలకు, వ్యాసానికి సంబంధం లేని పేజీలకు దారితీస్తున్నాయి. ఇది పాఠకులకు తీవ్ర అసహనానికి గురిచేసే అవకాశం ఉంది. చాలా గ్రామవ్యాసాలలో కవులకు సంబంధించిన వర్గాలు, కథారచయితలకు సంబంధించిన వర్గాలు, ప్రాజెక్టులకు సంబంధించిన వర్గాలు, వికీపీడియన్ల వర్గాలు చేర్చే ఉద్దేశ్యం ఏమిటో అస్సలు తెలియడం లేదు. మండలం కాని గ్రామ వ్యాసాలలో కూడా వందలసంఖ్యలో వర్గాలు చేర్చి మండలాలుగా చేసిన (!) సంగతి ఇదివరకే తెలియజేశాను. ఏది చెప్పిననూ రెండు రోజులు ఆపి మళ్ళీ అదేపని ప్రారంభించిన సంగతి చాలా సార్లు గమనించాను. ఖాళీ విభాగాలు చేర్చడం, తప్పుడు ఇన్ఫోబాక్సులు చేర్చడం, గ్రామవ్యాసాలలో అతిసాధారణ సమాచారం చేర్చడం లాంటి గురించి ఇదివరకే చర్చలు జరిగిననూ సభ్యుడు చేర్చడం మాత్రం ఆపడంలేదు. నిర్వాహకులు, తోటి నైపుణ్య సభ్యులు కూడా ఈ సభ్యుడికి చెప్పీ చెప్పీ విసిగిపోయి తెవికీకి దూరమయ్యే సూచనలున్నాయి. పైగా అతని దిద్దుబాట్లను సమర్థించుకుంటూ మాట్లాడటం జరుగుతోంది. కూరగాయలు పండించే గ్రామం లేదా అని ప్రశ్నించడం వల్ల ఒక విజ్ఞానసర్వస్వంలో చేర్చాల్సిన సమాచార స్థాయిపై అతనికి తగిన నైపుణ్యం లేదనే తెలుస్తోంది. ఏదేని వ్యాసంలో మనం అతిసాధారణ విషయాలు చేర్చరాదు. ఒక వ్యక్తి వ్యాసంలో అతనికి రెండు చేతులున్నాయి, రెండు కాళ్ళున్నాయి, ముక్కుతోనే గాలిపీలుస్తాడు, నోటితోనే తింటాడు ... అని వ్రాయడంలో ఎంత అసంబద్ధత కనిపిస్తుందో గ్రామ వ్యాసంలో ఈ సభ్యుడు వ్రాసే విషయాలు అలాగే ఉంటున్నాయి. ఈ సమాచారం తప్పు కాకున్ననూ వ్యాసంలో ఉండాల్సిన విషయాలు మాత్రం కావు. కొద్దిగానైనా ప్రత్యేకత ఉండే విషయాలు మాత్రమే వ్యాసాలలో చేర్చాలి. ఉదా:కు కాళ్ళు లేకున్ననూ, కళ్ళు లేకున్ననూ తమ నైపుణ్యాన్ని చూపించిన వారి వ్యాసంలో మాత్రం ఆ విషయాలు వ్రాయవచ్చు. ఇదివరకు ఒక కొత్తసభ్యుడు (?) కూడా ఈ సభ్యుడి దిద్దుబాట్లను వెక్కిరిస్తూ, హేళనపరుస్తూ వందలాది గ్రామవ్యాసాలలో సాధారణ సమాచారం చేర్చిన సంగతి మనకు తెలుసు (ఉదాహరణకు ఇది చూడండి). చేర్చవద్దంటే మానేస్తాను అనడం చూస్తే ఈ సభ్యుడికి సరాసరిగా పాఠశాలలో చిన్నపిల్లలకు చెప్పినట్లుగా వద్దు అనేవరకు తప్పుడు మరియు అతిసాధారణ విషయాలు చేర్చే దిద్దుబాట్లు ఆపేటట్లుగా లేరని తెలుస్తోంది. అసలు చర్చ ఎందుకు తీశారో అర్థం చేసుకోవడం లేదు. విజ్ఞానసర్వస్వంలో పనిచేస్తున్నామంటే మనం ఆ స్థాయిలో సమాచారం చేర్చాలి కాని ఏదో చెత్తసమాచారం చేర్చడం కాదు, చెత్త దిద్దుబాట్లు చేయడం అంతకన్నా కాదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:35, 27 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
సదరు వ్యక్తులు ఎడిట్ కౌంట్ కోసమే ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. తెవికీలో ఎడిట్ల సంఖ్యను బట్టి కాకుండా, బైట్ల సంఖ్యను బట్టి గ్రేడింగ్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:36, 29 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఆయన ఇప్పటివరకు సృష్టిచిన సుమారు 500 మొలక గ్రామవ్యాసాలలో సగం వ్యాసాలు యిదివరకు ఉన్నవే తిరిగి సృష్టించడం వలన తొలగించాను. అనేక సార్లు వారి చర్చాపేజీలలో, రచ్చబండలో తెలియజేసినప్పటికీ ఆయన ధోరణిలో మార్పులేదు. ఉన్న వ్యాసాలనే అక్షర బేధాలతో సృష్టించడం, సునాయాస దిద్దుబాట్లు చేయడం, ఖాళీ విభాగాలు చేర్చడం, వ్యాసాలలో రాసిన వాక్యాలకు మూలాలు యివ్వకపోవడం మరియు సమాచారం లేని వ్యాసాలను సృష్టించడం నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఆయన మార్పులను సరిదిద్దడానికి నిర్వాహకులకు తలకు మించిన భారంగా పరిణమిస్తుంది. ఎవరైనా తెలిసినవాళ్ళు చెప్పినా ఆయన ధోరణిని మార్చుకోకపోవడం శోచనీయం. -- కె.వెంకటరమణచర్చ 16:19, 30 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
స్పందించిన ప్రణయ్‌రాజ్, కె.వెంకటరమణ గార్లకు కూడా కృతజ్ఞతలు. సదరు సభ్యుడిపై తగు చర్య నిమిత్తము ప్రక్రియ ప్రారంభించాను. పలు నియమ-నిబంధనల ఉల్లంఘన మరియు రచ్చబండ చర్చలను పట్టించుకోకపోవడం, తెవికీ నాణ్యత దెబ్బతినడం, తోటిసభ్యులకు ఇబ్బంది మరియు విలువైన కాలం వృధాకావడం, నిర్వహణ ఇబ్బందులు తదితర కారణాల వల్ల ముందుగా దిద్దుబాట్లు ఆపవలసిందిగా సభ్యుడి చర్చాపేజీలో తెలియజేశాను. సభ్యుడి వైఖరిలో మార్పులేనప్పుడు మరో అవకాశం కూడా ఇచ్చి సభ్యునిపై నిరోధం విధించే అవకాశం ఉంది. సీనియర్ సభ్యులు, నిర్వాహకులు గమనించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:00, 31 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

MediaWiki Training 2017: Invitation to participate మార్చు

 

Hello,
We are glad to inform that MediaWiki Training or MWT 2017 is going to be conducted between 24-26 February 2017 at Bangalore.

MWT is a residential training workshop that attempts to groom technical leadership skills among the Indian Wikimedia community members. We invite active Indian Wikimedia community members to participate in this workshop.

Please find details about this event here.

Let us know if you have any question.
Regards. -- Tito Dutta (CIS-A2K) sent using MediaWiki message delivery (చర్చ) 03:25, 21 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మీడియా వికీ ట్రైనర్ 2017: పాల్గొనడానికి ఆహ్వానం మార్చు

నమస్కారం,
సీఐఎస్-ఎ2కె నిర్వహించనున్న మీడియా వికీ ట్రైనర్ (ఎండబ్ల్యుటి) 2017 కార్యక్రమం 24-26 ఫిబ్రవరి 2017 తేదీల్లో జరగనుంది.

ఎండబ్ల్యుటి అనేది రెసిడెన్షియల్ ట్రైనింగ్ కార్యశాల. ఈ కార్యక్రమం భారతీయ వికీమీడియా సముదాయ సభ్యుల్లో సాంకేతిక నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. భారతీయ వికీమీడియా సముదాయ సభ్యులను ఈ కార్యశాలలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తున్నాం.

ఈ కార్యక్రమం గురించి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ చూడండి


మీకు మరేదైనా సందేహం కానీ, ప్రశ్నలు కానీ ఉంటే, దయచేసి మాకు తెలియజేయండి. ధన్యవాదాలు,
--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:01, 21 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

హాజరు మార్చు

నేను సీఐఎస్-ఎ2కె నిర్వహించనున్న మీడియా వికీ ట్రైనర్ (ఎండబ్ల్యుటి) 2017 కార్యక్రమం 24-26 ఫిబ్రవరి 2017 తేదీల్లో హజరు అవుతున్నాను . మెన్న పోరపాటున TTE లో 20 22 feb పాల్గోన పోతున్నట్లు పేర్కోంన్నాను --కశ్యప్ (చర్చ) 09:43, 22 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ అనువాద వ్యాసాలను శుద్ధి చేసే ప్రాజెక్టు కృషి మార్చు

అందరికీ నమస్కారం,
గూగుల్ అనువాద వ్యాసాలను నిర్ధారిత విధానంలో ప్రాధాన్యత క్రమం నిర్ధారించుకోవడం, వాటిని శుద్ధి చేయడం సాగుతోంది. అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్న వ్యాసాలను తిరగరాయడమో, సంస్కరించడమో చేయొచ్చు, తీసేయాల్సినవని నిర్ధారించిన వ్యాసాలు డిలీట్ చేయొచ్చు. ఇలా అభివృద్ధి చేసేందుకు 51 వ్యాసాలు, తీసేసేందుకు 39 వ్యాసాలు నిర్ణయమైపోయాయి. ఆ ప్రకారంగా 39 వ్యాసాలు తొలగించి, 12 వ్యాసాలు అభివృద్ధి చేశారు. ఇంకా అభివృద్ధి చేయాల్సిన వ్యాసాలు మొదటి దఫా వ్యాసాల్లో 42 ఉన్నాయి. ఆసక్తి గల సభ్యులు ఈ నాణ్యతాభివృద్ధి కృషిలో భాగం పంచుకుంటారని ఆశిస్తూ --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:27, 22 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

7వ తేదీ వరకూ ప్రాధాన్యతా క్రమం నిర్దారణ సాగుతుందని ఆశించినా చదువరి గారు తప్ప మరెవరూ స్పందించి తమ ప్రాధాన్యతలు నిర్ధారించలేదు. కనక 13, 14 తేదీల్లో (అనగా నేడు, రేపు) మాత్రం ఈ అంశంపై సభ్యులు పాల్గొని, ప్రాధాన్యతా క్రమం నిర్ధారించేందుకు మినహాయిస్తున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:42, 13 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

AWB ట్యాగు మార్చు

కొత్తగా "AWB" అనే ఎడిట్ ట్యాగును చేర్చాను. ఇకపై, ఆటో వికీ బ్రౌజరుతో చేసే మార్పులకు ఆటోమాటిగ్గా "AWB" అనే ట్యాగు చేరుతుంది. దిద్దుబాటు సారాంశంలో "using AWB" అనే ముక్కను ఉండనివ్వాలి. తీసేస్తే ఇది పనిచెయ్యదు. ఇకపై AWB తో చేసే మార్పులను "చిన్న"విగా గుర్తు పెట్టాల్సిన పనిలేదు.__చదువరి (చర్చరచనలు) 10:46, 28 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

స్వేచ్ఛా నకలు హక్కుల్లో రచనలు విడుదల అవగాహన కార్యక్రమం మార్చు

2017 ఫిబ్రవరి 5న గుంటూరులో స్వేచ్ఛా నకలు హక్కుల గురించి మరింత అవగాహన కలిగించేందుకు, ఇప్పటికే తెలుగు వికీసోర్సుకు స్వేచ్ఛా నకలు హక్కుల్లో పుస్తకాలు విడుదల చేసిన రచయితలను గౌరవించుకునేందుకు కార్యక్రమం నిర్వహించదలిచాం. కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే స్వేచ్ఛా నకలు హక్కుల్లో తమ రచనలు విడుదల చేసిన గుంటూరు ప్రాంత రచయితలను ఆహ్వానించి గౌరవించడం జరుగుతుంది. ప్రాంత రచయితలకు స్వేచ్ఛా నకలు హక్కుల గురించి, తెలుగు వికీసోర్సు గురించి అవగాహన వంటివి కల్పించడం ఈ కార్యక్రమంలో భాగం. కార్యక్రమంలో సోమేపల్లి వెంకట సుబ్బయ్య వంటి రచయితలు, స్వేచ్ఛా నకలు హక్కుల్లో పుస్తకాలు విడుదల చేసిన, విడుదలకు కృషిచేసిన భూసురపల్లి వెంకటేశ్వర్లు, పెద్ది సాంబశివరావు, తదితరులు పాల్గొంటారు. కార్యక్రమంపై వికీపీడియన్ల సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 18:44, 30 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ కార్యక్రమంలో భాగంగా cc by sa లైసెన్సు క్రింద వెలువడిన నా పుస్తకం "ఆంధ్రసాహిత్యములో బిరుదనామములు" నా గైరుహాజరులో ఆవిష్కరించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించండి--స్వరలాసిక (చర్చ) 01:27, 31 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నేటి పరిస్థుతులకు తగిన కార్యక్రమము --Nrgullapalli (చర్చ) 01:56, 31 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

స్వరలాసిక గారూ తప్పనిసరిగా చేద్దాం అండీ. గుళ్లపల్లి గారూ మీ స్పందనకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:18, 31 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

విజయవాడలో వికీసోర్సు డిజిటైజేషన్, కంటెంట్ డొనేషన్ గురించి కార్యక్రమం మార్చు

విజయవాడ ఆంధ్ర లొయోలా కళాశాలకు చెందిన విద్యార్థి వికీపీడియన్లు తెలుగు వికీసోర్సులో వేలాది పేజీలను ప్రూఫ్ రీడింగ్ చేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా చరిత్ర, సమకాలీన అంశాల గురించి 13 పుస్తకాలను కొన్ని నెలల క్రితం జర్నలిస్టు, రచయిత కానూరి బదరీనాథ్ స్వేచ్ఛా నకలు హక్కుల్లోకి విడుదల చేశారు, అలానే మరో కథారచయిత కొత్తపల్లి ఉదయబాబు పుస్తకాన్ని విడుదల చేయడమే కాక స్వయంగా ప్రూఫ్ రీడింగ్ సహా అన్ని పనులూ నేర్చి చేసుకుంటానని ముందుకువచ్చారు. వీటన్నిటినీ పురస్కరించుకుని విజయవాడ ఆంధ్ర లొయోలా కళాశాలలో ఫిబ్రవరి 8 తేదీన ఫ్రీడం ఇన్ ఫెబ్ (స్వేచ్ఛా నకలు హక్కుల గురించి అవగాహణ క్యాంపైన్) కార్యక్రమం నిర్వహించదలుచుకుంటున్నాం. కార్యక్రమంలో కళాశాల వారు తామ వికీసోర్సులో చేపట్టనున్న మరో బృహత్తర కార్యక్రమం వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమం గురించి వికీపీడియన్ల సూచనలు, సలహాలు ఆహ్వానిస్తున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:37, 2 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ అనువాద వ్యాసాల ప్రాధాన్యత క్రమం నిర్ధారణ - రెండో దఫా మార్చు

అందరికీ నమస్కారం,
గూగుల్ అనువాద వ్యాసాల ప్రాధాన్యత క్రమం నిర్ధారణ రెండవ దఫా ప్రారంభమైంది. ఇప్పటి నుంచి వారం రోజుల వరకూ అంటే 2017 ఫిబ్రవరి 9 తేదీ వరకూ సాగుతుంది. మొదటి దఫా ద్వారా 54 వ్యాసాలు అభివృద్ధికి, 39 వ్యాసాలు తొలగింపుకి నిర్ధారించడమైంది. తదనుగుణంగా 12 వ్యాసాలు అభివృద్ధి చేసి, 39 వ్యాసాలు తొలగించాం. ఇప్పుడు మరో 116 వ్యాసాలను జాబితా వేశాం. వాటి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ధారించేందుకు తెవికీపీడియన్లు సహకరించాలని విజ్ఞప్తి. ఇప్పటికే తమవంతుగా నిర్ధారణ చేసిన చదువరి గారికి ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:01, 2 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నిరోధం తొలగించ వలెనని విజ్నప్తి మార్చు

తెలుగు వికీపీడియా సముదాయానికి విజ్నప్తి,
నేను గుళ్ళపల్లి నాగేశ్వర రావుని. కొన్ని సాంకేతిక విషయాలు తెలియకపోవడంతో జరిగినవాటి వల్ల నన్ను నిరోధించారు. ఇప్పుడు అవి నేర్చుకున్నాను. ఇదివరకు తెలుగు వికీపీడియా కోసం ఎంతో సమయం ఖర్చుపెట్టి పనిచేశాను, ఇకముందు నేర్చుకున్న విషయాలను ఉపయోగించి తెలుగు వికీపీడియాకు మరింత సమయం పనిచేస్తాను. కనుక నా నిరోధాన్ని తొలగించమని విజ్నప్తి.— Preceding unsigned comment added by 157.48.2.238 (talk)

గుళ్ళపల్లి గారు, ఆసక్తి, ఉత్సాహం ఉండి తన సమయాన్ని పూర్తిస్థాయిలో తెలుగు వికీమీడియా ప్రాజెక్టులకే వెచ్చించి పనిచేస్తూంటారు. ఈరోజు ఆయన కోరగా నేను వ్యక్తిగతంగా ఆయనను, భాస్కర నాయుడు గారిని కలిసినప్పుడు గుళ్ళపల్లి గారు విజువల్ ఎడిటర్ ఉపయోగించి తేలికగా, సరైన లింకులు ఇచ్చే పద్ధతి వంటివి నేర్చుకుని, పాలసీ అంశాలు, మౌలికాంశాలు వంటి అనేక అంశాలను గురించి చర్చించి అవగాహన విస్తృతపరుచుకున్నారు. తన సమయాన్ని వెచ్చించి, తెవికీలో వ్యాసాలను సకారాత్మకంగా అభివృద్ధి చేసేందుకు ముందుకువస్తున్నందున ఈ నిరోధాన్ని తగ్గిస్తూ, తొలగించడం సమంజసం అని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:40, 12 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
గత 4 సంవత్సరాలుగా గుళ్ళపల్లిగారు తెవికీలో కృషి చేస్తున్నారు... ఆయన కోరికను మన్నించి నిరోధాన్ని తొలగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:02, 12 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
సభ్యునికి అవకాశాలపై అవకాశాలు ఇచ్చి సరిదిద్దుకోమని పలుమార్లు చెప్పిననూ పరిస్థితిలో మార్పు లేనందున, మళ్ళీమళ్ళీ అవేపొరపాట్లు చేస్తున్నందున రచ్చబండచర్చ, సభ్యుడి చర్చాపేజీలో తెలిపిన ప్రకారం చర్య తీసుకోబడింది. ముందుగా ఒకరోజు, ఆ తర్వాత 3 రోజులు నిరోధం విధించిననూ దిద్దుబాట్ల వైఖరిలో మార్పులేదు కాబట్టి నిరోధకాలం పెంచబడింది. పొరపాటు జరిగినట్లుగా సదరు సభ్యుడు కూడా అంగీకరించాడు. ఇప్పుడు నేర్చుకున్నట్టు తెలుపుతున్నారు. అవకాశమిచ్చిననూ పొరపాట్లను సరిదిద్దుకోనందున మాత్రమే నిరోధం విధించబడింది కాబట్టి ప్రస్తుతమున్న నిరోధకాలం తగ్గించే అవసరం లేదు. మరో 4 రోజుల అనంతరం ఆటోమేటిగ్గా నిరోధం తొలిగించబడుతుంది. నిరోధకాలం అనంతరం అవాంఛనీయ దిద్దుబాట్లు లేనప్పుడు మళ్ళీ నిరోధం విధించే పరిస్థితే ఉండడు. సభ్యులు గమనించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:59, 12 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
వికీకి కావలసినది సభ్యులు తప్పు చెయ్యకుండా ఉండడమే. నాగేశ్వరరావు గారి విషయంలో తప్పులను నివారించేందుకు చెయ్యాల్సిన ప్రయత్నాలను మనం చేస్తూనే ఉన్నాం. పవన్ సంతోష్ గారు స్వయంగా వివరించడంతో ఆయన తన తప్పులను గ్రహించినట్లుగాను, వాటిని సవరించుకునే దిశలో ఆలోచిస్తున్నట్లుగానూ తెలుస్తోంది. మనకు కావలసినదీ అదే.
చేసిన తప్పులకు కాదు నిరోధం, ఇక చెయ్యకుండా ఉండేందుకు. అందుకు ఆయన మానసికంగాను, సాంకేతికంగానూ సన్నద్ధమైనట్లు తెలుస్తోంది కాబట్టి, నిరోధాన్ని తగ్గించవచ్చు. సముదాయం ఈ విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. __చదువరి (చర్చరచనలు) 03:16, 13 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
సభ్యుడు జరిగిన తప్పులను ఒప్పుకొని ఇకముందు అలాంటి పొరపాట్లను చేయనని చెప్పియుంటే నిరోధం తగ్గించడానికి నేను ఆలోచించేవాడిని కాని సాంకేతిక కారణాలు తెలుసుకున్నాననీ (సాంకేతిక కారణాల వల్ల నిరోధం విధించబడలేదు), ఎంతో సమయం, ఖర్చుపెట్టి పనిచేశాననీ, మరింత పని చేస్తాననీ చెప్పడం లాంటి మాటల వల్ల ఎదుటి వ్యక్తులు సంతృప్తి చెందరు. నిరోధం విధించడానికి కారణం తప్పులు చేసినందుకు కాదు, తప్పులు చేయకుండా విధించడమైనది కాబట్టి ఇదివరకు చేసిన తప్పులు నిరోధం తొలిగింపు అనంతరం చేయను అన్నట్లుగా సభ్యుడి నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. సదరు సభ్యుడికి గతంలో పలుమార్లు చర్చాపేజీలలోనూ, రచ్చబండలోనూ సూచించినవాటికి కూడా ఒక్క ప్రతిస్పందన లేకుండా తప్పులపై తప్పులు చేస్తూ తోటి సభ్యులను చికాకు పర్చిన విషయం అందరికీ తెలిసిందే. మరో మూడు, నాలుగు రోజులలో నిరోధం తొలిగిపోయే దశలో కూడా ఆఫ్‌లైన్ చర్చలు, ఒప్పందాల ప్రకారం స్వల్పకాల నిరోధం తొలిగింపునకు పవన్ సంతోష్ గారు ఒప్పుకోవడమే ఆశ్చర్యం కలుగుతుంది. సాధారణంగా సీఐఎస్ పదవులలో ఉన్నవారు గణాంకాలకు, గణాంకాలకు ప్రాధాన్యత ఇచ్చే సభ్యులవైపే మొగ్గుచూపడం జరుగుతుంది కాని సదరు సభ్యుడి గత చరిత్ర మరియు నిర్వహణ ఇబ్బందులను కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటే బాగుండేది. అలాగే గ్రామ వ్యాసాలలో 10 కిమీ లోపు, 10 కిమీ పైబడి .... లాంటి సమాచారం గతంలోనే ఆపివేయబడింది. అలాంటి సమాచారం చేర్చవలసిందిగా కూడా సభ్యులను సూచిస్తున్నారు. రోజురోజుకు గ్రామాలలో సదుపాయాలు మారుతున్న ఈ కాలంలో సుమారు 17 సం.ల క్రిందటి సమాచారం చేర్చడం, పాఠకులకు సరైన సమాచారం అందించని (అస్పష్టమైన) సమాచారం ఇప్పుడు చేర్చే అవసరం లేదు. ఆ సమాచారం గణాంకాలకు తప్ప దేనికీ పనికిరాదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:35, 16 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
సభ్యుడు తాను నేర్చుకుంటానని అడిగినప్పుడు నేర్పించడం విధి కనుక నేర్పించాను. అలానే గుళ్ళపల్లి గారికి విజువల్ ఎడిటర్ ఉపయోగించి, తప్పుగా కాక సరిగా ఎలా లంకెలు ఇవ్వాలో తెలియజేయమని చదువరి గారు కూడా విజ్ఞప్తి చేయడంతో ఆ విషయాన్ని కూడా నేర్పించాను. నేర్పడానికి నేరుగా అయితే వీలుంటుంది కనుక నేరుగా నేర్పించడం జరిగింది. దీనిలో ఒప్పందాలు వంటివాటి ప్రసక్తి లేదండీ. అలానే వీలైనంతవరకూ ఆంగ్లంలోనూ, ఇక్కడా నిబంధనలు పరిశీలించే చేశాను. తెవికీలో నిర్వాహకత్వ బాధ్యతలు ఉన్నందున, నా వ్యక్తిగత స్థాయిలోనే ఈ విభాగంలో చర్చిస్తున్నానని గమనించమని మనవి. --పవన్ సంతోష్ (చర్చ) 11:35, 18 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  1. నాకు తెలిసి ఆఫ్‌లైనులో జరిగినవి శిక్షణా కార్యక్రమాలు. పవన్ సంతోష్ గారికి ఓ రోజంతా గుళ్ళపల్లిగారికి శిక్షణ ఇవ్వడంలో గడిచిపోయింది.
  2. శిక్షణ ఇవ్వడంలో తప్పేమీ లేదు. అది వికీకి ఎంతో అవసరం.
  3. శిక్షణా కార్యక్రమాన్ని చర్చలు, ఒప్పందాలూ అంటూ మాట్టాడ్డం ఆయన తీసుకున్న శ్రద్ధను, శ్రమనూ కించపరచినట్లు అవుతుంది.
__చదువరి (చర్చరచనలు) 03:14, 19 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
శిక్షణ ఇవ్వడాన్ని తప్పని ఎవరూ చెప్పడం లేదు. చర్చలు, ఒప్పందాలు అని చెప్పడంలో పొరపాటేమీ లేదు. ఏ ఇద్దరు కలిసినా జరిగేవి చర్చలు, ఒప్పందాలే! ఆఫ్‌లైన్ చర్చలు తెవికీలో అంగీకరించబడవని చెప్పడమే నా ఉద్దేశ్యం. పొరపాటుగా అర్థం చేసుకుంటే నేను చేసేదేమీ లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:20, 21 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
నా వైపు నుంచి చివరగా ఒకే మాట చెప్పదలుచుకున్నాను, తెలుగు వికీపీడియాకు సంబంధించి ఏ ఆఫ్‌లైన్‌ చర్చ అయినా చేయవచ్చు కానీ అక్కడి చర్చను, ఆన్‌లైన్‌లోనే చర్చించి నిర్ణయాలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయన్న విధానాన్ని నూటికి నూరుపాళ్ళూ గుర్తుంచుకునే వ్యవహరిస్తున్నానని స్పష్టం చేస్తున్నాను. ఇది గతంలో చర్చించి, సముదాయం అంగీకరించిన అంశం. ఒక్కసారి అలా అంగీకరించిన ఏ అంశంపై అయినా మరో సవివరమైన, సరైన చర్చ జరిగితే తప్ప నేను పక్కకు జరగను. స్వస్తి. --పవన్ సంతోష్ (చర్చ) 06:15, 22 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
నేను చెప్పేది అదేకదా! ఆఫ్‌లైన్ చర్చలు చేయరాదని ఎవరూ చెప్పడంలేదు, ఎవరైనా ఎవరితోనైనా ఏమైనా ఎందుకైనా ఎన్నైనా ఎందరితోనైనా చర్చలు చేసుకోండి, ఎవరికీ అభ్యంతరం లేదు. కాని అవి సభ్యుల ఆమోదం లేనిదే తెవికీలో అంగీకరించబడవు, ఆమోదించేంతవరకు ఆఫ్‌లైన్ చర్చలకు విలువుండదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:04, 23 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Review of initial updates on Wikimedia movement strategy process మార్చు

Note: Apologies for cross-posting and sending in English. Message is available for translation on Meta-Wiki.

The Wikimedia movement is beginning a movement-wide strategy discussion, a process which will run throughout 2017. For 15 years, Wikimedians have worked together to build the largest free knowledge resource in human history. During this time, we've grown from a small group of editors to a diverse network of editors, developers, affiliates, readers, donors, and partners. Today, we are more than a group of websites. We are a movement rooted in values and a powerful vision: all knowledge for all people. As a movement, we have an opportunity to decide where we go from here.

This movement strategy discussion will focus on the future of our movement: where we want to go together, and what we want to achieve. We hope to design an inclusive process that makes space for everyone: editors, community leaders, affiliates, developers, readers, donors, technology platforms, institutional partners, and people we have yet to reach. There will be multiple ways to participate including on-wiki, in private spaces, and in-person meetings. You are warmly invited to join and make your voice heard.

The immediate goal is to have a strategic direction by Wikimania 2017 to help frame a discussion on how we work together toward that strategic direction.

Regular updates are being sent to the Wikimedia-l mailing list, and posted on Meta-Wiki. Beginning with this message, monthly reviews of these updates will be sent to this page as well. Sign up to receive future announcements and monthly highlights of strategy updates on your user talk page.

Here is a review of the updates that have been sent so far:

More information about the movement strategy is available on the Meta-Wiki 2017 Wikimedia movement strategy portal.

Posted by MediaWiki message delivery on behalf of the Wikimedia Foundation, 20:31, 15 ఫిబ్రవరి 2017 (UTC) • Please help translate to your languageGet help

శివరాత్రి శుభాకాంక్షలు మార్చు

ఒక పది నెలలుగా మా తల్లిగారి అస్వస్థత కారణంగా వికీ కార్యక్రమాలలో మనసుపెట్టలేకపోయాను. ఆమె ఈ నెల 11వ తేదీన శివునిలో కలసిపోయారని తెలియజేయడానికి చింతిస్తున్నాను. బంధాలను త్రెంచడమే ఆ హరుని పని; దానిని ఆమోదించడమే తప్ప మానవులుగా మనం ఏమీ చేయలేదు.

ఇక నుండి మెల్లమెల్లగా వికీ అభివృద్ధిలో పాల్గొనాలని కోరుకొంటున్నాను. అది మీ అందరి సహకారంతో మాత్రమే సాధ్యమని నాకు తెలుసు. ఇంతవరకు నిర్వహకునిగా ఏమంత ఉపయోగపడలేనందులకు క్షమించండి.--Rajasekhar1961 (చర్చ) 13:51, 24 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ చాలా బాధాకరమైన విషయం అండీ. ఈ విషయంలో మీరు కోలుకునేలా ఆ భగవంతుడు మనోబలం అందించాలని కోరుకుంటున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:03, 2 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారూ, వికీలో మీరు ఎప్పుడు పాల్గొనాలన్నది మీ వ్యక్తిగత స్వేచ్ఛ. దాన్ని ఎవరూ కాదనలేరు. మాతృమూర్తికి సేవలు చేశారు. అంతకంటే మంచిపని మరోటి లేదు కదా. మీరు ఆ బాధ నుంచి తొందరగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.--రవిచంద్ర (చర్చ) 00:49, 3 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
తల్లి లేని లోటు తీర్చలేనిది. మీ రుణం తీర్చుకున్నారు. త్వరగా మీరు మానసికంగా కోలుకోవాలి కోరుకుంటున్నాను.Palagiri (చర్చ) 04:30, 3 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
మనస్పూర్తిగా సంతాపాన్ని తెలియజేసిన/తెలియజేయని సభ్యులందరికీ ధన్యవాదాలు. ఆమె జ్ఞాపకాలు జీవితాంతం నాతోనే వుంటాయి. మల్లీ కలుద్దాం / కలసి పనిచేద్దాం.--Rajasekhar1961 (చర్చ) 14:37, 3 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా వ్యాసాల వర్గీకరణ మార్చు

మంచి ప్రయత్నం. మొన్న నేను చూసినపుడు సినిమా వ్యాసాల వర్గీకరణ ఎక్కువగా జరగలేదు. మీరు సృష్టించిన వర్గాలను ఉపయోగించి సినిమా వ్యాసాలను వర్గీకరిస్తాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:08, 9 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారూ... ముఖ్యమైన వర్గాలైతే పర్వాలేదు. కానీ ప్రతి నటుడు / నటి నటించిన చిత్రాలు, సంగీత దర్శకుడికి, నిర్మాతకు ఇలా వ్యక్తిగతంగా కుప్పలు తెప్పలుగా వర్గాలు సృష్టించుకుంటూ పోతే నిర్వహణ కష్టతరమౌతుంది. ఆలోచించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:26, 10 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
మీ సూచనలకు ధన్యవాదాలు సుల్తాన్ ఖాదర్ గారు. ఒక అంశానికి సంబంధించిన వ్యాసాలన్నింటిని ఒకచోట చేర్చడానికి వర్గాలు ఉపయోగపడతాయని నా అభిప్రాయం. అంగ్ల వికీపీడియాలోని సినిమా వ్యాసాలను దర్శకుడు, నిర్మాత, నిర్మాణ సంస్థ మరియు ఇతరములు లను బట్టి వర్గీకరణ చేశారు. అయితే, తెలుగు సినిమాలు ఎక్కువగా నటీనటలు, దర్శకులు, నిర్మాత, నిర్మాణ సంస్థలను బట్టే జనానికి తెలుసు కాబట్టి... నటుడు/నటీ, దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, నిర్మాణ సంస్థలకు సంబంధించిన మరికొన్ని సినిమా వ్యాసాలు వెతకడానికి వీలుగా ఆయా నటుడు/నటీ, దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, నిర్మాణ సంస్థల వర్గాలను సృష్టించాను. అయితే మీరు చెప్పిన దాంట్లోనూ కొంత సమంజసం కనిపిస్తోంది. మన సినిమా రంగం ప్రధానంగా కథానాయకుడు, కథానాయకిల కేంద్రంగా ఉంటుంది కనుక వారికి మాత్రం వర్గాలు ఉంచి ఇతర నటుల వర్గాలు అవసరం లేదని భావిస్తున్నాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:43, 10 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణా ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టరుతో సమావేశం మార్చు

అందరికీ నమస్కారం,
తెలంగాణా ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తో ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం తెలుగు వికీపీడియా సముదాయం, సీఐఎస్-ఎ2కెలతో జరిపిన గత చర్చల్లో భాగంగా సమావేశం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానంగా గతంలో ఈ ప్రాజెక్టు విషయమై సంప్రదింపుల్లో పాల్గొన్న వికీపీడియన్లు హాజరుకానున్నారు. ప్రాజెక్టు విషయమై ఆసక్తి కలిగిన వికీపీడియన్లు తెలియపరచగలరు. ఆయా సమావేశాల్లో జరిగిన అంశాలపై సమావేశాల తర్వాత తెలుగు వికీపీడియాలో వివరాలను తెలియపరిచి సముదాయంతో చర్చించగలము. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 19:21, 9 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Overview #2 of updates on Wikimedia movement strategy process మార్చు

Note: Apologies for cross-posting and sending in English. This message is available for translation on Meta-Wiki.

As we mentioned last month, the Wikimedia movement is beginning a movement-wide strategy discussion, a process which will run throughout 2017. This movement strategy discussion will focus on the future of our movement: where we want to go together, and what we want to achieve.

Regular updates are being sent to the Wikimedia-l mailing list, and posted on Meta-Wiki. Each month, we are sending overviews of these updates to this page as well. Sign up to receive future announcements and monthly highlights of strategy updates on your user talk page.

Here is a overview of the updates that have been sent since our message last month:

More information about the movement strategy is available on the Meta-Wiki 2017 Wikimedia movement strategy portal.

Posted by MediaWiki message delivery on behalf of the Wikimedia Foundation, 19:44, 9 మార్చి 2017 (UTC) • Please help translate to your languageGet help

మొదటి పేజీ నిర్వహణ మార్చు

గత కొన్నేళ్ళుగా మొదటి పేజీ నిర్వహణ ఏ ఒడుదుడుకులూ లేకుండా సాగింది. ఇందులో సహసభ్యుల కృషితో పాటుగా ప్రధానంగా వెంకటరమణ గారి అలుపెరుగని కృషి ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదనుకుంటాను. అలానే రవిచంద్ర వంటివారు మీకుతెలుసా విషయంలో సాయం చేసేవారు. ఐతే ఇటీవల కాలంలో బహుశా వృత్తిగత బాధ్యతల కారణంగానూ, ఇతర పనుల ఒత్తిడి కారణంగానూ వారు కొన్నాళ్ళు తెవికీకి సమయం కేటాయించలేకున్నట్టు తెలుస్తోంది. తెవికీలో కృషి అన్నది వ్యక్తిగతంగా, స్వచ్ఛందంగా కుదిరినప్పుడే చేయగలిగే పని, సుదీర్ఘకాలపు స్వచ్ఛంద కృషిలో స్వల్ప విరామాలు సహజం.
ఐతే ఇటీవల మొదటి పేజీ నిర్వహణలో ఒడిదుడుకులు మొదలయ్యాయి. సాధారణంగా వారాలకు వారాలు ముందుగా నిండిపోయివుండే మీకు తెలుసా? భాండాగారం గత వారం (2017 9వ వారం) ప్రారంభమైన రెండు రోజుల పాటు ఏకవాక్యంతో ఉంది. నేను గమనించాకా మరో రెండువాక్యాలు చేర్చడం జరిగింది. అలానే రహ్మానుద్దీన్ ఈవారం వాక్యాలను క్రితం వారం వరకూ ఖాళీగా ఉంటే చూసి, సరిగ్గా ఒక్కరోజు ముందు (శనివారం, 11 మార్చి) పూర్తిగా నింపారు. వచ్చే వారం మటుకు ఓ మూడు వాక్యాలు ఇప్పటికి తయారైవున్నాయి.
ఇక వచ్చేవారం, పై వచ్చేవారం విశేష వ్యాసం అయితే ఎంపిక కూడా ఇంకా జరగలేదు. ఈవారం బొమ్మల జాబితా కూడా వచ్చే నెల ప్రారంభం వరకే నిండివుంది. ఆపైన ఖాళీగా ఉంది. సహ సభ్యులు తమకు ఆసక్తి కలిగిన విభాగాన్ని స్వీకరించి పనిచేసేందుకు వీలుగా అందరి దృష్టికి తీసుకువచ్చే ఉద్దేశంతో ఇది వ్యక్తిగత స్థాయిలో రాస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:23, 12 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Hardware donation program మార్చు

వికీమీడియా ఫౌండేషన్ 20 వినియోగించిన లాప్‌టాప్‌లను వితరణ చేయడానికి ముందుకు వచ్చారు. నేను వాటిలో ఒక లాప్‌టాప్ కొరకు అభ్యర్థన పంపుతున్నాను. సముదాయ సభ్యులు మీ సమ్మతిని తెలుపుచూ ఇక్కడ సంతకం చేయవచ్చు.

స్వరలాసిక (చర్చ) 07:55, 17 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

We invite you to join the movement strategy conversation (now through April 15) మార్చు

05:09, 18 మార్చి 2017 (UTC)

నెలవారీ సమావేశాల తీరు-పేరు మార్పు మార్చు

అందరికీ నమస్కారం,
హైదరాబాద్ నెలవారీ సమావేశాలు సంవత్సరాల పాటు కొనసాగుతున్న వికీపీడియా సమావేశాల్లో ఒకటి. వీటి నిర్వహణా బాధ్యతలు పలువురు పెద్దలు నిర్వహించివుండగా, ఇటీవల వరకూ వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Pranayraj1985 గార్లతో కలిసి నేను నిర్వహణ బాధ్యతలు వహించివుండడం తెలిసిందే. కార్యక్రమానికి నిరంతరాయంగా హాజరవుతూండే వికీమీడియన్ వాడుకరి:Nrgullapalli ఈ సమావేశాలు మరింత ఉత్సాహపూరితంగా, మరింత నేర్చుకునే విధంగా ఉండాల్సిన ఆవశ్యకత చెప్తూ వస్తున్నారు. అలాగే ఒడియా వికీమీడియన్లు నిర్వహించుకుంటూన్న నెలవారీ సమావేశాల తీరు, వాటి ఫలితాలు కూడా ఉత్సాహపూరితంగా ఉంటున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణ చేస్తూన్న ప్రణయ్, రాజశేఖర్ గార్లు, నేను వీటి తీరు-పేరు ఈ కింది విధంగా మారిస్తే బావుంటుందన్న ఆలోచనకు వచ్చాం:

  1. తీరు: కార్యక్రమంలో తప్పకుండా మూడు అంశాలు - పరస్పరం నేర్చుకోవడం, దాన్ని అక్కడే అమలులో పెట్టడం, కొంత సరదాగా గడిపడం ఉండాలి అన్నది ముఖ్యమైన మార్పు. ఇప్పటివరకూ చేసిన కార్యక్రమాల్లో ఇవి లేవని కాదు కానీ నిర్వహణ పరంగా సమీక్ష ప్రధానమైన భాగంగా, ముఖ్యాంశంగా ఉండేది. కానీ దాన్ని తొలగించట్లేదు కానీ ఆ ప్రధాన భాగంలో సమీక్షను పై మూడు అంశాలతో పూరించనున్నాం.
  2. చోటు: ఇప్పటివరకూ ఎక్కువ భాగం గోల్డెన్ థ్రెషోల్డ్ లోనే, అదే గదిలో నిర్వహించుకోవడం జరిగింది, కనీసం ఇటీవలి సంవత్సరాల వరకూ ఇదే వాస్తవం. ఐతే ఇక్కడ నిర్వహించడంలో పలు ఇబ్బందులు రావడం, తద్వారా నిర్వహణ చేయకుండా చాలా నెలలు గడిపివేయడం గమనిస్తే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ చేస్తూనే మిగతా ప్రదేశాలను ప్రయత్నించి చూడాలని అర్థం అవుతోంది. వీలున్నంతలో ఇప్పటి గోల్డెన్ థ్రెషోల్డ్ కి కొంత సమీపంగా ఉండే ప్రదేశాలే ఎన్నుకుందాం. ఈ చోటు మార్చినప్పుడు గది వాతావరణం కాకుండా ఇతర విధాలైన ప్రదేశాలు కూడా ప్రయత్నించి చూడడం వల్ల హాజరయ్యే కొత్త సభ్యులకు కొంత ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నాం. ప్రస్తుతం ఈ ఆదివారం నిర్వహించే కార్యక్రమాన్ని రవీంద్రభారతి వద్ద నిర్వహించుకుంటున్నాం. మరోమారు సాలార్జంగ్ మ్యూజియంలో నిర్వహించిచూద్దాం. అలానే వీలుకుదిరినప్పుడు గోల్డెన్ థ్రెషోల్డ్ లో కూడా.
  3. పేరు: హైదరాబాద్ నెలవారీ సమావేశాలకు పైన మారుస్తున్న తీరును అనుసరించి పేరు పెడదామని ఆలోచిస్తున్నాం. విన్నవారికి వెనువెంటనే పై విషయాలు స్ఫురింపజేసి ఆసక్తి కలిగించే పేరు, క్లుప్తంగా ఉండేలాంటి పేరు అయితే మేలని భావన. దీనికి మేం వికీమిత్ర అన్న పేరు అయితే బావుంటుందని భావిస్తున్నాం. తద్వారా ఇదొక వికీపీడియన్ మిత్రులు కలిసి సరదాగా, కొంగొత్త విషయాలు నేర్చుకుని, దాన్ని వికీలో ప్రయత్నించి చూసే వేదిక అన్న విషయాన్ని స్ఫురింపజేస్తుందని ఆలోచన.

ప్రస్తుతం నిర్వహించనున్న సమావేశం ఈ అంశానికి ప్రయోగాత్మకమైన ప్రయత్నంగా భావించమని మనవి. సమావేశ ఫలితాలు కూడా సభ్యులకు కొంత ఈ ప్రయత్నంపై సమాచారం ఇవ్వగలవని ఆలోచన. ఈ అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేయగలరని ఆశిస్తున్నాం. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 09:41, 22 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అంతా బాగానే వుంది గానీ ....... పేరులో మాత్రము మన ఉద్దేశము స్పురించుట లేదు. వికీమిత్ర కు పొడగింపుగా వేధిక, కూటమి, సమావేశము, ఇంకా ఏదైన అందమైన పదాన్ని తగిలిస్తే బాగుంటుందేమో ఆలోచించగలరు. భాస్కరనాయుడు (చర్చ) 11:02, 22 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణాళిక బాగున్నది. వికీమిత్ర లేదా వికీమైత్రి అయినా ఫరవాలేదు. కార్యక్రమాల్లో చురుకుదనాన్ని జోడించే ప్రయత్నం హర్షనీయం. శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 11:22, 22 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వికీమిత్ర వేదిక సమావేశం మార్చు

భాస్కరనాయుడు గారు సూచించిన వేదిక పదాన్ని కూడా కలిపి వికీమిత్ర వేదికగా చేద్దాం. ఈ మార్చి 26, 2017న రవీంద్రభారతి ప్రాంగణంలో తొలి కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. దయచేసి హాజరు కాదలిచిన సభ్యులు ఇక్కడ సంతకం చేయగలరు. అలానే కార్యక్రమంలో ఏయే అంశాలు ఉండాలి, ఎలావుంటే బావుంటుందో సహ సభ్యులు సూచించవచ్చు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 13:23, 23 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

సీఐఎస్-ఎ2కె 2017-18 తెవికీ కార్య ప్రణాళిక సముదాయ పరిశీలనార్థం మార్చు

అందరికీ నమస్కారం,
సీఐఎస్-ఎ2కె తమ కార్యప్రణాళికలో భాగంగా ఫోకస్ లాంగ్వేజ్ ఏరియాగా తెలుగు వికీమీడియా ప్రాజెక్టులను తీసుకుని ప్రతి సంవత్సరం కార్యప్రణాళికలు రూపొందిస్తూ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2017-18 సంవత్సరానికి గాను తెవికీ కార్యప్రణాళికకు సముదాయంలో జరిగిన గత చర్చలు, ఇప్పటివరకూ జరిగిన కృషి, సముదాయ సభ్యులు కొందరి సూచనలు స్వీకరించి చిత్తుప్రతిని రూపొందిస్తున్నాం. ఇప్పటివరకూ జరుగుతున్న సమాచారం పెంపు, నాణ్యతాభివృద్ధి, సముదాయ విస్తరణ, ప్రస్తుత సభ్యులకు ప్రత్యేక శిక్షణలకు తోడు ప్రత్యేకించి తెలుగు వికీపీడియా, వికీమీడియా ప్రాజెక్టులు మరింతమంది తెలుగు వారికి చేరడం, జరుగుతున్న ప్రణాళికాబద్ధ కార్యకలాపాలు మరింతగా సముదాయ సభ్యులు స్వీకరించేలా చేయడం వంటివి ఈ సంవత్సరం పరిగణలోకి తీసుకుంటున్నాం. దయచేసి ప్రణాళికను పరిశీలించి తమ విలువైన సూచనలు, అభిప్రాయాలు తెలియజేయగలరు.
గమనిక:మెటా-వికీలో ఈ కార్యప్రణాళిక ఇక్కడ ఉంది. తెవికీలో పెట్టిన కార్యప్రణాళికను తెలుగులోకి అనువదించే పని ఒకటి రెండు రోజుల్లో పూర్తి అవుతుంది. మన్నించగలరు.
ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:43, 25 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ విజయాలు మార్చు

ఇటీవల ఫేస్‌బుక్ ద్వారా రెండు విషయాలు తెలిసాయి.

1.వేణు అనే వ్యక్తి తాను చిన్నప్పుడు ఎప్పుడో చదివిన ఒక పుస్తకం గురించి అన్వేషించి ఎట్టకేలకు ఆ పుస్తకం ఆచూకీ తెలుసుకుని ఆ పుస్తకాన్ని సంపాదించాడు. ఆ కథనం ఈ క్రింది లింకులో చదవవచ్చు.

http://venuvu.blogspot.in/2017/03/blog-post.html

2.తాడిగడప శ్యామలరావు అనే వ్యక్తి స్వయంప్రభ అనే పుస్తకం గురించి అన్వేషిస్తున్నాడు. దానికి సంబంధించిన కథనం ఈ క్రింది లింకులో చూడవచ్చు.

http://syamaliyam.blogspot.in/2017/03/blog-post.html

ఈ రెండు సందర్భాలలోను తెలుగు వికీపీడియా వారికి శ్రీ సూర్యరాయాంధ్ర విద్యానంద గ్రంథాలయ పుస్తకాల జాబితా ద్వారా ప్రాథమిక సమాచారాన్ని అందించింది. పైన పేర్కొన్న వారిలో మొదటి వారి అన్వేషణ ఫలించడానికి, రెండవ వారి అన్వేషణ ఫలించబోవడానికి తెలుగు వికీపీడియా తోడ్పాటు ఉందన్న విషయం నిర్వివాదాంశం. ఇది ఒక విధంగా తెవికీ సాధించిన విజయాలలో ఒకటిగా పేర్కొనవచ్చు. అయితే ఈ వికీ ప్రాజెక్టు పేజీలలో చాలా పేజీలు అసంపూర్ణంగా, కొన్ని అవకతవకగా ఉన్నాయి. వాటిపై ప్రాజెక్టు నిర్వాహకులు శ్రద్ధ చూపాలని కోరుకుంటున్నాను. --స్వరలాసిక (చర్చ) 07:04, 1 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా ఎలా ఉపయోగపడుతుందో సోదాహరణంగా వివరించేవారు బహు తక్కువమండి. దీని మూలంగా లాభం పొందే చాలా మంది మౌనంగా ఉండడానికే ఇష్టపడతారు. ఎందుకోమరి. ఇలాంటి ప్రోత్సాహకరమైన సమాచారాన్ని అందించిన స్వరలాసిక గారికి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:43, 3 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
స్వరలాసిక గారికి - ప్రస్తుతం సమాచారం భద్రపరచబడిన హార్డ్ డిస్క్ క్రాష్ అవడం వలన సమాచారం పోగొట్టుకొనబడినది. దీనిని కొంత వ్యవదిలో మళ్ళీ పునప్రారంభించి పూర్తి చేస్తాను. ఈ ప్రాజెక్టులో ఎవరూ సహకరించకున్నారనుకొనే సంధర్భంలో మీరు మరియు రమణ గార్ల వైపు నుండి ఆలోటు పూడుతున్నది. దానికై మీకు నా హృదయపూర్వక కృతజ్నతలు..--Viswanadh (చర్చ) 06:01, 3 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఓ ఉచిత సలహా స్వరలాసిక గారూ! మీరు ఈ విషయం వివరిస్తూ ఓ చక్కని వ్యాసం రాయవచ్చు. రాస్తే మనం ఏదోక పత్రికకో, ఇ-పత్రికకో పంపే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? విశ్వనాధ్ గారికి అభినందనలు, అలానే నా వైపు నుంచి ఏమైనా సహకారం కావలిస్తే అందుకు అన్నివిధాలుగానూ సిద్ధం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:29, 3 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

రామాయణం కార్యక్రమం మార్చు

ఈవారం శ్రీరామనవమి జరుపుకొంటున్నాము. ఆ సందర్భంగా రామాయణం కు చెందిన వివిధ అంశాలను తెవికీలో అభివృద్ధి చేయవచ్చని భావిస్తున్నాను. ఉదాహరణలు:

  1. వర్గం:రామాయణం ఆధారంగా నిర్మించబడిన సినిమాలు వర్గంలో ఆయా తెలుగు సినిమాలను చేర్చడం. ఆయా సినిమాలను విస్తరించండి.
  2. రామాయణంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు మొదలైన కీలకమైన పాత్రలను గురించిన వ్యాసాలు ప్రారంభించి అభివృద్ధి చేయవచ్చును.
  3. వివిధ తెలుగు రామాయణాలకు చెందిన గ్రంథాల గురించి, లేదా విమర్శలను గురించి వ్యాసాలు తయారుచేయవచ్చును.
  4. తెలుగు రాష్ట్రాలలోను, మరియు ఇతర రాష్ట్రాలు, దేశాలలోని రామాలయాలను గురించి వ్యాసాలను చేర్చవచ్చును.
  5. en:Category:Places in the Ramayana ఆధారంగా తెవికీ ఆ వర్గాన్ని ప్రారంభించి, కోసల, మిథిల, అయోధ్య, కిష్కింద మొదలైన ప్రాంతాల గురించిన వ్యాసాల్ని ప్రారంభించి అభివృద్ధి చేయవచ్చును.
  6. తెలుగు వికీసోర్సులో గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం పుస్తకాన్ని ఇక్కడ అచ్చుదిద్ది సహాయం అందించవచ్చును.
  7. కామన్స్ నుండి ఆయా వ్యాసాలలో బొమ్మలను చేర్చి తెవికీ మీవంతు సహాయాన్ని అందించండి.--Rajasekhar1961 (చర్చ) 11:27, 2 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఓ ఎడిటథాన్ చేసుకుందామా, ఏమంటారు. రామాయణం రకరకాలుగా మన సంస్కృతిలో భాగమైపోయింది. మరీ ముఖ్యంగా వివిధ రామాయణాలు, వివిధ వ్యాఖ్యానాలు, పలు దృక్కోణాలు, ఎన్నో ప్రదేశాలు ఓహ్. ఇంతకన్నా చక్కని అంశం ఉండదనుకుంటున్నాను నా వరకూ నేను. ఏమంటారు? --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:31, 3 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Please accept our apologies for cross-posting this message. This message is available for translation on Meta-Wiki.

 

On behalf of the Wikimedia Foundation Elections Committee, I am pleased to announce that self-nominations are being accepted for the 2017 Wikimedia Foundation Board of Trustees Elections.

The Board of Trustees (Board) is the decision-making body that is ultimately responsible for the long-term sustainability of the Wikimedia Foundation, so we value wide input into its selection. More information about this role can be found on Meta-Wiki. Please read the letter from the Board of Trustees calling for candidates.

The candidacy submission phase will last from April 7 (00:00 UTC) to April 20 (23:59 UTC).

We will also be accepting questions to ask the candidates from April 7 to April 20. You can submit your questions on Meta-Wiki.

Once the questions submission period has ended on April 20, the Elections Committee will then collate the questions for the candidates to respond to beginning on April 21.

The goal of this process is to fill the three community-selected seats on the Wikimedia Foundation Board of Trustees. The election results will be used by the Board itself to select its new members.

The full schedule for the Board elections is as follows. All dates are inclusive, that is, from the beginning of the first day (UTC) to the end of the last.

  • April 7 (00:00 UTC) – April 20 (23:59 UTC) – Board nominations
  • April 7 – April 20 – Board candidates questions submission period
  • April 21 – April 30 – Board candidates answer questions
  • May 1 – May 14 – Board voting period
  • May 15–19 – Board vote checking
  • May 20 – Board result announcement goal

In addition to the Board elections, we will also soon be holding elections for the following roles:

  • Funds Dissemination Committee (FDC)
    • There are five positions being filled. More information about this election will be available on Meta-Wiki.
  • Funds Dissemination Committee Ombudsperson (Ombuds)
    • One position is being filled. More information about this election will be available on Meta-Wiki.

Please note that this year the Board of Trustees elections will be held before the FDC and Ombuds elections. Candidates who are not elected to the Board are explicitly permitted and encouraged to submit themselves as candidates to the FDC or Ombuds positions after the results of the Board elections are announced.

More information on this year's elections can be found on Meta-Wiki. Any questions related to the election can be posted on the election talk page on Meta-Wiki, or sent to the election committee's mailing list, board-elections wikimedia.org.

On behalf of the Election Committee,
Katie Chan, Chair, Wikimedia Foundation Elections Committee
Joe Sutherland, Community Advocate, Wikimedia Foundation

Posted by MediaWiki message delivery on behalf of the Wikimedia Foundation Elections Committee, 03:37, 7 ఏప్రిల్ 2017 (UTC) • Please help translate to your languageGet help

Read-only mode for 20 to 30 minutes on 19 April and 3 May మార్చు

MediaWiki message delivery (చర్చ) 17:34, 11 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Wikidata description editing in the Wikipedia Android app మార్చు

Wikidata description editing is a new experiment being rolled out on the Wikipedia app for Android. While this primarily impacts Wikidata, the changes are also addressing a concern about the mobile versions of Wikipedia, so that mobile users will be able to edit directly the descriptions shown under the title of the page and in the search results.

We began by rolling out this feature several weeks ago to a pilot group of Wikipedias (Russian, Hebrew, and Catalan), and have seen very positive results including numerous quality contributions in the form of new and updated descriptions, and a low rate of vandalism.

We are now ready for the next phase of rolling out this feature, which is to enable it in a few days for all Wikipedias except the top ten by usage within the app (i.e. except English, German, Italian, French, Spanish, Japanese, Dutch, Portuguese, Turkish, and Chinese). We will enable the feature for those languages instead at some point in the future, as we closely monitor user engagement with our expanded set of pilot communities. As always, if have any concerns, please reach out to us on wiki at the talk page for this project or by email at reading@wikimedia.org. Thanks!

-DBrant (WMF) 08:41, 14 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మాయాబజార్‌కు తెవికీ అక్షర నీరాజనం - ప్రతిపాదన మార్చు

 
తణుకులో మాయాబజార్ రెస్టారెంట్

అజరామరం అనిపించుకున్న తెలుగు చలన చిత్రం మాయాబజార్ విడుదలై 60 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మాయాబజార్ సినిమా వైభవాన్ని గుర్తుచేసుకుంటూ, తెలుగు భాష, సమాజాలపై మాయాబజార్ చూపిన సాంఘిక, సాంస్కృతిక ప్రభావం అక్షరరూపంలో భద్రపరిచేందుకు కార్యక్రమం, ఎడిటథాన్ నిర్వహించేందుకు ప్రతిపాదిస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా సినిమాలోని పాత్రల రూపంలోనే విగ్రహాలు నిర్మాణం కావడం, హోటళ్ళకు మాయాబజార్ పేరు పెట్టడం, ఘటోత్కచుడు పాత్ర వివాహ భోజనం అంతా తింటున్నట్టుగా నిలువెత్తు పోస్టర్లు హోటళ్ళలో పెట్టుకోవడం మొదలుగా అనేకానేక రూపాల్లో మాయాబజార్ సాంఘిక-సాంస్కృతిక ప్రభావం ఎలా చూపిస్తోందన్న విషయం చర్చిస్తూ ఒక సెషన్ నిర్వహించి, దాని వెంబడి సినిమా ప్రదర్శన జరుగుతుంది. అంతర్జాలంలోని (indiancine.ma, Navatarangam.com), పుస్తకరూపంలోని మాయాబజార్ గురించి చక్కని సమాచారాన్ని, విశ్లేషణను అందించే మూలాలు పరిచయం చేసి వ్యాసాలు సృష్టించి అభివృద్ధి చేసే ఆసక్తి ఉన్నవారికి అవి అందిస్తాం. ఆ కార్యక్రమంలో వికీపీడియన్లు, సినిమాపై ఆసక్తి కలవారూ వికీపీడియాలో మాయాబజార్ తారాగణం, సాంకేతిక వర్గం, పాటలు, పాత్రలు, ఇతరేతర అంశాల గురించి తాము రాయనున్న వ్యాసాల గురించి అక్కడ చెప్తారు. ఆపైన వారం లేదా పదిరోజుల పాటు సాగే ఎడిటథాన్లో భాగంగా ప్రస్తుతం ఉన్న వ్యాసాలను వికీకరించడం, విస్తరించడం, లేనివాటికి కొత్త వ్యాసాలు సృష్టించడం, వికీకోట్, విక్ష్నరీ, వికీమీడియా కామన్స్, వికీడేటా వంటి సోదర ప్రాజెక్టుల్లోనూ మాయాబజార్ సంబంధిత ఎంట్రీలు సృష్టించి, అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కనీసం 15కు పైగా కొత్త వ్యాసాలు సృష్టించే వీలు, ఉన్న వ్యాసాల్లో మరిన్ని మూలాలు, ఫోటోలు చేర్చి విస్తరించే అవకాశం, విక్ష్నరీ, వికీకోట్ వంటి ప్రాజెక్టులపై దృష్టి పరిచడం వంటివి సమాచారం పరంగా జరిగే మేలు కాగా, మాయాబజార్ సినిమాపైన, సినిమా అధ్యయనం పైన, సినిమాలపైన ఆసక్తి ఉన్నవారు తెవికీలో చేరే అవకాశమూ ఉంటుంది. ఇక మన వికీమిత్ర వేదికను కూడా ఉత్సాహవంతం చేసేందుకు ఇదొక అవకాశం కావచ్చు. చివరిగా తెలుగు సంస్కృతిలోనూ, జనజీవితంలోనూ భాగమైన మాయాబజార్ సినిమాకు మనవంతు గౌరవించినట్టు కూడా అవుతుంది. దీనికి కొనసాగింపుగా మాయాబజార్ సందర్భంగా కొత్తగా వికీపీడియాకు వచ్చేవారికి ఓ వికీపీడియా కార్యశాల నిర్వహించుకోవచ్చు. సభ్యులు తమ ఉద్దేశాన్ని తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:16, 14 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఇదొక వినూత్నమైన ఆలోచన, శృజనాత్మకమైన కార్యక్రమం. చక్కగా నిర్వహించిన సత్ఫలితాల్నిస్తుందని నా నమ్మకం. మాయాబజార్ లోని చిన్నమామయ్య లాగా ప్రజల్ని మాయచేయాలి, తెవికీలోకి రప్పించాలి. శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 15:58, 20 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సహకారం మార్చు

కార్యక్రమ నిర్వహణలో తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సహకారం అందుతోంది. రవీంద్ర భారతిని వేదికగా ఉపయోగించుకుందుకు, స్క్రీనింగ్ కి అవసరమైన ప్రొజెక్టర్ వంటి సౌకర్యాలు, కార్యక్రమానికి హాజరయ్యేవారిలో 30 మందికి మధ్యాహ్న భోజనం, ఇతరేతర నిర్వహణ సహకారం తెలంగాణా ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు భాషా సాంస్కృతిక శాఖ తరఫున అందించేందుకు అంగీకరించారు. వారికి తెవికీ వేదికగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం పేజీ సృష్టించి అక్కడ మిగిలిన వివరాలు తెలియజేయగలం. ప్రోత్సహిస్తూ Rajasekhar1961 గారికి ధన్యవాదాలు. కార్యక్రమ నిర్వహణలో ప్రణయ్ రాజ్ భాగం పంచుకుంటున్నారు. ఇతర సభ్యులు తమ సమయాన్ని వెచ్చించగలిగినా, ఎడిటథాన్ సమన్వయకర్తగానో చేయదలిచినా తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:12, 21 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

New Page previews feature మార్చు

గూగుల్ అనువాద వ్యాసాల ప్రాధాన్యత క్రమం నిర్ధారణ - మూడో దఫా మార్చు

అందరికీ నమస్కారం,
గూగుల్ అనువాద వ్యాసాల ప్రాధాన్యత క్రమం నిర్ధారణ మూడో దఫా ప్రారంభమైంది. ఇప్పటి నుంచి వారం రోజుల వరకూ అంటే 2017 మే 1 తేదీ వరకూ సాగుతుంది. ఆసక్తి కల సభ్యులు ఇందులో పాల్గొని ప్రాధాన్యత నిర్ధారణ, తొలగించాల్సిన వ్యాసాల తొలగింపు, అభివృద్ధి చేయాల్సిన వ్యాసాల నాణ్యతాభివృద్ధి వంటి కార్యక్రమాల్లో పాల్గొనగలరు. గత నెల ప్రాధాన్యతా క్రమ నిర్ధారణ చేపట్టనందుకు క్షంతవ్యుణ్ణి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:50, 24 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా అనువాద ఉపకరణం కొద్దిరోజుల పాటు పనిచేయదు మార్చు

మనలో కొందరు వికీపీడియన్లకు వికీపీడియా అనువాద ఉపకరణం చాలా ఉపయోగపడుతోంది. పక్కనే మూలాన్ని చూసుకుని ఇటుపక్క అనువాదం చేసుకునే అవకాశం ఉండడం చాలా వీలుస్తూంటుంది. ఐతే సాంకేతిక కారణాల రీత్యా వారం నుంచి ఈ ఉపకరణం ప్రపంచవ్యాప్తంగా అన్ని వికీపీడియాల్లోనూ పనిచేయట్లేదు. ఇది ఈ నెల 28 తేదీ వరకూ పనిచేయట్లేదు, దీన్ని సరిజేసేందుకు ఇప్పటికే వికీమీడియా ఫౌండేషన్ వారు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఉపకరణం ఉపయోగిస్తున్న సభ్యులు కొందరు అయోమయంలో పడి, సంగతి ఏమిటన్నది తెలుసుకోగోరుతున్నారు కనుక మిగతా వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 10:10, 24 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:పడిగే ప్రశాంత్ అనే కొత్త వికీపీడియా సభ్యుడు తన వాడుకరి పుటలో మరియు తన చర్చపేజిలో వికీమీడియా నియామావళి విరుద్ధంగా వున్న సమాచారం చేర్చినట్లు నా వ్యక్తిగత అభిప్రాయం.కావున మిగతా సభ్యులు కుడా చదివి మీ అభిప్రాయాలు తెల్పగలరు. వీటిని ఆయన వ్యాసరూపంలో ప్రత్యేకంగా చెప్పాలేమో.Palagiri (చర్చ) 13:10, 29 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. ఆయన వికీపీడియా:నిర్ధారిత వాడుకరులు అనే వ్యాసాన్ని ఏవో అసంబద్ధ విషయాలతో వ్రాసారు. దానిని తొలగించాను. వారి చర్చాపేజీలో ఆంధ్రజ్యోతి లోని ఆర్టికల్ అయిన "2013 భూ సేకరణ చట్ట సవరణంటే రాజ్యాంగ ధిక్కరణే" అనే అంశాన్ని యధాతథంగా చేర్చారు. వాడుకరి పేజీలో ఏవో పత్రికలలోని విషయాలను చేర్చారు. వారు కొత్త వాడుకరి అయినందున వికీపీడియాలో వ్యాసాలు వ్రాసే విధానంపై సరియైన అవగాహన లేనట్లుంది! అందుకే యిలా చేర్చారనుకుంటాను.----కె.వెంకటరమణచర్చ 13:41, 29 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
మన చదువరి గారు ఇదివరకు వికీ దత్తత అని ఓ వినూత్నమైన కాన్సెప్ట్ చెప్పారు. ఎవరైనా కొత్త వాడుకరి వికీలోకి వచ్చినప్పుడు ఆ ఒక్కరిని మనలో ఎవరో ఒకరు, (వారే అందరినీ చేయలేరు, గుర్తించాలి) డీల్ చేస్తే మంచిదనీ, కొద్ది రోజులు ఏవైనా పాలసీలు తెలియక చేసే పొరపాట్లు ఉంటే వారే ఇలా కాదు ఇలా అని కొంత గౌరవంగా, కొంత ప్రోత్సాహకరంగా వివరించాలని ఐడియా చెప్పారు. అదేమైనా ప్రయత్నిస్తే మేలంటారా? ఎందుకంటే కొత్తగా తమంతట తాము వచ్చేవారికి తెలియదు కాబట్టి ఇందుకు పాలసీలపై అవగాహన ఉన్నవారు ప్రయత్నించడమూ మంచిది కదా. --పవన్ సంతోష్ (చర్చ) 15:59, 1 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

WikiProject Turkey 2017 మార్చు

Dear friends,

In an unfortunate turn of events, Wikipedia is currently blocked in Turkey, as can be seen from en: 2017 block of Wikipedia in Turkey

In order to express solidarity with the Turkish Wikipedia editors and readers, it is proposed that Indian Wikipedians write articles related to Turkey in their respective languages. Our message is clear — we are not motivated by any politics; we just want the Wikipedia to be unblocked in Turkey.

Participating members can create new articles on Turkish language, culture, political structure, religion, sports, etc. But the essential condition is that the articles should be related to Turkey.

Note: The normal Wikipedia rules also apply to all new articles. Wikipedia admins can facilitate other member contributions by creating project pages where users can list their newly written articles. --Hindustanilanguage (చర్చ) 19:34, 30 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మాయాబజార్ కు ప్రేమతో తెవికీ మార్చు

మాయాబజార్ కు ప్రేమతో తెవికీ (లేదా wiki loves mayabazar) అన్న ఎడిటథాన్ ప్రారంభం అయింది. ఇంతకు మునుపు చర్చించినప్పుడు ప్రోత్సహించిన సభ్యులకు ధన్యవాదాలు. ఇక్కడ సంబంధిత ప్రాజెక్టు పేజీ ఉంది, ఆసక్తి కలిగిన సభ్యులు పాల్గొనమని కోరుతున్నాను. అలానే మీకు ఆసక్తికరమైన వ్యాసాలను రాసేందుకు అవసరమైన మూలాలను కూడా అందించవచ్చు. కాబట్టి ఆసక్తి కలిగినవారు ఇక్కడ నమోదుచేసుకొమ్మని మనవి. ఈ అంశంపై సాక్షి సాహిత్యం పేజీ, టీవీ9 వార్తాకథనం వంటివి విస్తృతమైన ప్రచారం కల్పిస్తున్నాయి. కాబట్టి మరింత మందికి తెవికీ చేరుతుందని, అందుకు ఇదొక మార్గం కాగలదేమోనని ప్రయత్నిస్తున్నాం. ప్రయత్నం విజయవంతం అయితే కొనసాగించవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:11, 1 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

New Wikipedia Library Accounts Available Now (May 2017) మార్చు

Hello Wikimedians!

 
The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for free, full-access, accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

Expansions

  • Gale – Biography In Context database added
  • Adam Matthew – all 53 databases now available

Many other partnerships with accounts available are listed on our partners page, including Project MUSE, EBSCO, Taylor & Francis and Newspaperarchive.com.

Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 18:52, 2 మే 2017 (UTC)

You can host and coordinate signups for a Wikipedia Library branch in your own language. Please contact Aaron.
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

19:14, 3 మే 2017 (UTC)

మండలం మరియు గ్రామాలు మార్చు

@Kvr.lohith:, @Chaduvari:, @Pranayraj1985:, @C.Chandra Kanth Rao: ప్రతి మండలానికి మరియు గ్రామానికి వెర్వేరు వ్యాసం ఉండాలి. గ్రామ వ్యాసాల్లొ మండల సమాచరం కన్నా, మండల వ్యాసం లొ గ్రామాలు, MRO, Tahsildar, నియోజికవర్గం, వివరలు ఉంటే బాగుంటుంది. గ్రామ వ్యాసాల్లొ sarpanch, పంచయతి గురించి ఉండాలి. ఎలా అంటే, దేశ్ం వివరాలు రాష్ట్రంలొ, రాష్ట్రం వివరాలు జిల్లాలొ, జిల్లా వి పట్టణంలొ రయము కదా. ఉదాహరణకి గుంటూరు నగరం, గుంటూరు పట్టణం, గుంటూరు జిల్లా, పేర్లు ఒక్కటే కాని అన్ని వెర్వేరు. ఒక్కటే పెరు ఉన్నంత మాత్రాన రెండు కలిపి రాయము కదా. నేను కొన్ని పేజీలి ఇలా మార్చాను. దీని పై మి అభిప్రాయం తెలియజేయగలరు. ధన్యవాదాలు.--Vin09(talk) 06:10, 31 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది నిర్వాహకుల నోటీసు బోర్డులో వినయ్ గారు ప్రారంభించిన చర్చ. ఐతే మొత్తం వికీపీడియన్లంతా చర్చించి నిర్ణయించుకోవాల్సిన నోటబిలిటీ (విషయ ప్రాధాన్యత) పాలసీ అంశం కనుక తెచ్చి ఇక్కడ చేరుస్తున్నాను గమనించగలరు. అలానే ఇక్కడ చర్చ ప్రారంభించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 06:30, 5 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చపై నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. విజ్ఞాన సర్వస్వంగా విషయ ప్రాధాన్యత కలిగిన ప్రతీ అంశంపైనా వ్యాసం ఉండొచ్చు. గుంటూరు జిల్లా, గుంటూరు నగరం (పట్టణమో, పల్లో, నగరమో ఏదో ఒకటే అవగలదు) గుంటూరు మండలం మూడిటికీ వేర్వేరు వ్యాసాలు ఉండవచ్చు, ఉండాలి కూడా. ఐతే గతానుభవాలు దృష్టిలో పెట్టుకుని నాణ్యతాపరమైన మార్గనిర్దేశకాలు ఉండాలని ఆశిస్తున్నాను. ఇప్పటికే గ్రామ వ్యాసాల అభివృద్ధి విషయంలో మనకున్న అనుభవాన్ని అనుసరించి, మండలం వ్యాసాన్ని ప్రారంభించేవారు దాన్ని కనీసం 3 వేల బైట్లకు విస్తరించి, ఓ మూలాన్నైనా ఉండేలా చేయకుండా వ్యాసాన్ని మొలకగా వదలరాదన్న నియమం ఉంటే బావుంటుంది. అంతేకాక ముందస్తుగా ప్రతిపాదిస్తున్న మీరొక చక్కని మండల వ్యాసాన్ని పూర్తిస్థాయిలో విస్తరించి మంచి స్థితికి తీసుకువస్తే అదొక చక్కని మోడల్ అవగలదనుకుంటాను. కాకుంటే పెద్ద నగరాలను కాకుండా ఏదైనా రూరల్ మండలాన్ని తీసుకుని చేస్తే సగటు మండలం వ్యాసాలతో ఏయే ఇబ్బందులు ఎదురుకావచ్చో మనకూ తెలిస్తుంది. ఇవండీ నా అభిప్రాయాలు. అసలు మీరు ఇంత చొరవ తీసుకుని ముందుకువచ్చినందుకు చాలా అభినందనలు. జయీభవ, దిగ్విజయీభవ. --పవన్ సంతోష్ (చర్చ) 04:24, 11 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]
Vin09(talk) గారి అభిప్రాయం సరైనదే. ఆ ఉద్దేశ్యంతోనే గతంలో నేను ధరూర్ మండలం, ధరూర్ గ్రామాలకు వేరు వేరు వ్యాసాలు రాసే ప్రయత్నం చేశా.--నాయుడుగారి జయన్న (చర్చ) 05:53, 12 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]
@Pavan santhosh.s and Naidugari Jayanna: ఉదాహరణకు తెనాలి మండలం, రేపల్లె మండలం చూడండి.--Vin09(talk) 05:59, 12 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Beta Feature Two Column Edit Conflict View మార్చు

Birgit Müller (WMDE) 14:41, 8 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Editing News #1—2017 మార్చు

18:06, 12 మే 2017 (UTC)

Prototype for editing Wikidata infoboxes on Wikipedia మార్చు

Hello,

I’m sorry for writing in English. It’d be great if someone could translate this message if necessary.

One of the most requested features for Wikidata is to enable editing of Wikidata’s data directly from Wikipedia, so the editors can continue their workflow without switching websites.

The Wikidata development team has been working on a tool to achieve this goal: fill and edit the Wikipedia infoboxes with information from Wikidata, directly on Wikipedia, via the Visual Editor.

We already asked for feedback in 2015, and collected some interesting ideas which we shared with you in this thesis. Now we would like to present to you our first prototype and collect your feedback, in order to improve and continue the development of this feature.

We present this work to you very early, so we can include your feedback before and all along the development. You are the core users of this feature, so we want to make sure that it fits your needs and editing processes.

You will find the prototype, description of the features, and a demo video, on this page. Feel free to add any comment or feedback on the talk page. The page is currently not translated in every languages, but you can add your contribution by helping to translate it.

Unfortunately, I won’t be able to follow all the discussions on Wikipedia, so if you want to be sure that your feedback is read, please add it on the Wikidata page, in your favorite language. Thanks for your understanding.

Thanks, Lea Lacroix (WMDE)

RevisionSlider మార్చు

Birgit Müller (WMDE) 14:44, 16 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

21:09, 16 మే 2017 (UTC)