వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి

తెవికీ-ఐఐఐటీ ప్రాజెక్టు , ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐఐటి హైదరాబాద్) ఇండిక్ వికీ ప్రాజెక్టు[1]]లో భాగం, దీని ద్వారా ఆధునిక పారిశ్రామిక సాంకేతిక యుగంలో విజ్ఞాన సంపదను తెలుగులోనికి ఉచితంగా, ఎవరైనా స్వేచ్ఛగా ఎప్పుడైయినా,ఉపయోగించుకోగల, సహకరించగల , అభివృద్ధి చేయగల సమాచారాన్న ,వికీ వ్యాసాల రూపంలో అందుబాటులోకి తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తున్నాము , శాస్త్ర , సాంకేతిక అంశాల వ్యాసాలు , దానికి సంబంధించిన సమాచారం స్వేచ్ఛా గా , అందరికీ అందుబాటులో ఉండాలి అనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం . ప్రాజెక్టు ప్రతిపాదన కు ఇక్కడ చూడగలరు. ఈ ప్రతిపాదనపై రచ్చబండలో చర్చించి ప్రతిపాదన మెరుగుకు వికీపీడియనులు సూచనలు చేశారు. [2]

ప్రాజెక్ట్ ఇండిక్ వికీ మార్చు

భారతీయ భాషలలో వ్యాసాలు గణనీయంగా పెంచాలన్న లక్ష్యంతో ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ‘ప్రాజెక్ట్ ఇండిక్ వికీ’ చేపట్టింది .ఇందులో భాగంగా అవగాహన పెంచే కార్యక్రమాలు, బోధన వనరులు , కొత్త వాడుకరుల సంఖ్యను అభివృద్ధి చేయటం, అనువాద పరికరాలు, నిఘంటువులు, భాష అనువర్తనాలు తయారు చేయటం మొదలైనవి . మా ఈ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకర స్పందనలు వచ్చాయి. ఇందులో భాగంగా తెలుగులో విజ్ఞాన వ్యాప్తికి కృషి చేస్తున్న వ్యక్తులతో లేదా సంస్థలతో కలిసి శాస్త్ర , సాంకేతిక రంగాల్లో తెలుగు భాష అభివృద్ధి కోసం కార్యశాల తో వికీ ను అభివృద్ధి చేయటానికి కావలసిన శిక్షణను ఉచితంగా అందిస్తున్నాము.

ప్రాజెక్టు ఉద్దేశం మార్చు

వికీపీడియన్లతో కలిసి తెలుగు వికీపీడియాను వాసిపరంగా, రాసిపరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చెయ్యడం. ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన పనులు • ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో తెలుగు వికీపీడియా గురించి అవగాహన కలిగి • ఆసక్తి కలిగిన వ్యక్తులతో ఔత్సాహిక వికీపీడియనుల సముదాయాలను తయారుచెయ్యడం. వీరికి వికీపీడియాలో రచనలు చెయ్యడం గురించి శిక్షణ ఇవ్వడం. (ఈ పనిలో అనుభవజ్ఞులైన వికీపీడియనుల సాయంతో.) • ఈ ఔత్సాహిక ఎడిటర్ల నుండి కొందరిని ఎంచుకుని మరింత లోతైన శిక్షణ ఇవ్వడం. తద్వారా వారు భవిష్యత్తులో కింది స్థాయిలకు వెళ్ళగలరు –

o  ఉన్నత స్థాయి ఎడిటర్లు (మూసలు, మంచి వ్యాసాలు, విశేష వ్యాసాల వంటి వాటిపై పనిచెయ్యగల శక్తియుక్తులతో)
o  నిర్వాహకులు
o  శిక్షకులు

లక్ష్యిత ప్రజలు మార్చు

ప్రాజెక్టు తొలినాళ్ళలో కింది వర్గాల ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తాము 1. ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్స్ సముదాయం 2. పాత్రికేయులు 3. రచయితలు 4. విద్యార్థులు 5. ఔత్సాహికులు

పని విధానం మార్చు

ఈ ప్రాజెక్టు పనులు మూడు విధాలుగా సాగాలని భావిస్తున్నాం –

  1. క్షేత్ర స్థాయిలో కృషి చేసి, కొత్త ఎడిటర్లను తయారు చెయ్యడం
  2. వ్యాసాల నాణ్యతను అభివృద్ధి చేసేందుకు అవసరమైన వనరులను సమకూర్చడం
  3. ఎడిటర్ల ఉ ఉత్పాదకతను వేగవంతం చేసేందుకు దోహదపడే సాంకేతికతను అభివృద్ధి చేసి అందించడం

క్షేత్ర స్థాయి కార్యకలాపాలు క్షేత్ర స్థాయి కార్యకలాపాలు ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం. వికీకి దూరంగా ఉన్న సమర్ధులు, ఆసక్తిపరుల వద్దకు వికీపీడియాను తీసుకొని పోవడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తాం. ఇందులో కొన్ని పనులు:

  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణా జిల్లాల్లోని పాఠశాలలకు వెళ్ళి అక్కడి ఉపాధ్యాయులకు వికీపీడియాను పరిచయం చెయ్యడం, వికీలో రాయడం పట్ల ఆసక్తి కలిగించడం.
  • ఉపాధ్యాయ సంఘాల ద్వారా విశ్రాంత ఉపాధ్యాయులను కలిసి వారిలో వికీపీడియా పట్ల ఆసక్తి కలిగించడం.
  • మీడియా ద్వారా ప్రజల్లో ఈ ప్రాజెక్టు పట్ల అవగాహన కలిగించడం.
  • సెమినార్లు, శిక్షణా తరగతులు, వర్కుషాపులూ మొదలైన వాటి ద్వారా ఔత్సాహికులకు వికీ శిక్షణ ఇవ్వడం, వికీలో దిద్దుబాట్లు చెయ్యడం మొదలుపెట్టించడం.
  • వాడుకరులు వాడుకరి సముదాయాలను స్థాపించుకుని, తమలో తాము సమావేశాలు నిర్వహించుకునేలా ప్రోత్సహించడం
  • కొత్త వాడుకరులకు అవసరమైతే కంప్యూటరు పరిజ్ఞానం కలిగించడం
  • తెవికీలో ఒకప్రాజెక్టును మొదలుపెట్టి కొత్త వాడుకరులకు ఆన్‌-వికీ సహాయం అందించడం.

కంటెంటు సహాయం మార్చు

కొత్త వికీపీడియన్లకు తమ పనిలో సహాయకంగా ఉండేందుకు గాను, కింది అంశాలను అందిస్తుంది. (వీటిలో కొన్ని పాత వికీపీడియన్లకు కూడా ఉపయోగపడవచ్చు.) 1. వికీపీడియా గురించి స్వయం శిక్షణ పొందేలా పాఠాలు, ట్యుటోరియళ్ళు, వీడియోలు, మొదలైన వాటిని రూపొందించడం, కావలసిన వారికి ఉచితంగా అందించడం 2. వ్యాసాలకు అవసరమైన రిఫరెన్సులను - పుస్తకాలు, ఆన్‌ లైన్ గ్రంథాలయ సభ్యత్వాలు, ఫొటోలు, మొదలైన వాటికి- అందుబాటుకు ప్రయత్నం 3. వివిధ అంశాలవారీగా తెవికీలో ఉండాల్సిన ముఖ్యమైన వ్యాసాల జాబితాలను తయారు చేసి ఎడిటర్లకు సహాయకంగా ఉంచడం.

సాంకేతిక సహాయం మార్చు

ఐఐఐటీ బృందం క్రింది వాటికి సాఫ్టువేరు అప్లికేషన్లను రూపొందించి అందరికీ అందుబాటులో ఉంచాలని ఉద్దేశిస్తోంది. ఎడిటర్ల ఉత్పాదకతను పెంచడం వీటి ఉద్దేశం. యాంత్రికానువాదం లోని లోటుపాట్ల గురించి, గతంలో తెవికీలో జరిగిన పొరపాట్ల గురించీ, నాణ్యత లేని వ్యాసాల గురించీ ఐఐఐటీ బృందానికి కొంత అవగాహన ఉంది. తెవికీ సముదాయంతో కలిసి పనిచేసి అటువంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు కృషి చేస్తాము. కొన్ని ఉపాయాలు – · పరికరాన్ని వాడుతూ, నాణ్యతను మెరుగుపరచడంలో కొత్త ఎడిటర్లకు శిక్షణ ఇవ్వడం. · సాటివారి సమీక్ష లేకుండా అనువాద వ్యాసాన్ని ప్రచురించే వీలు లేకుండా చెయ్యడం. · అనువాద నాణ్యతను పరీక్షించేందుకు గాను ఎడిటర్లకు ఒక చెక్‌లిస్టును తయారు చేసి ఇవ్వడం (పాసివ్-యాక్టివ్ వాయిస్, “మరియు” వగైరాలు) · తరచూ వాడే పదాలు, వాటి అనువాదాల గురించి ఒక పదకోశాన్ని తయారు చేసి అందుబాటులో ఉంచడం. మామూలు నిఘంటువు లాగా విస్తారంగా కాకుండా, ఇది కొద్ది పదాలతో (సందర్భోచితంగా ఏ పదాన్ని వాడాలో తెలిపేలా) మాత్రమే కూడుకుని ఉంటుంది

జరిగిన సమావేశాలు మార్చు

సమాచార లభ్యత మరియు సముదాయ అభివృద్ధి సమావేశ సారాంశం మార్చు

వికీపీడియాలో తెలుగు సమాచారాన్ని పెంచేలా కృషి చేయడం కోసం సముదాయాల ఏర్పాటు ద్వారా సంఘటిత కృషి జరగాలని ఐఐఐటి, హైదరాబాద్ ప్రాంగణంలో “వికీపీడియా సమాచార లభ్యత మరియు సముదాయ అభివృద్ధి” అన్న అంశంపై 25 నవంబర్ 2019 నాడు జరిగిన చర్చాగోష్టిలో వక్తలు అభిప్రాయపడ్డారు. ఇందుకు గాను “సముదాయ అభివృద్ధి”, “సమాచార లభ్యత”, “శిక్షణ మరియు అవగాహన”, “సాంకేతికత”, “పరిశోధన” అనే ఐదు విభాగాలకింద ఈ ప్రయత్నం జరగాలని స్థూలంగా చర్చాగోష్టి ఒక అభిప్రాయానికి వచ్చింది.
నాణ్యమైన, విశ్వసనీయమైన సమాచారం కోసం ప్రజలు వికీపీడియాపై ఆధారపడతారని, అందుకే ప్రతీ సెకనుకు సుమారు ఎనిమిదివేల మంది వికీపీడియాను సందర్శిస్తారని చర్చా గోష్టిని ప్రారంభిస్తూ ఐఐఐటి ఆచార్యులు, శ్రీ వాసుదేవ వర్మ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే 25 భాషల్లో ఎనిమిది భారతీయ భాషలున్నప్పటికీ, వికీపీడియాలో ఇంగ్లీషు భాషతో పోలిస్తే కేవలం 0.5 నుండి 2 శాతంలోపే సమాచారం ఆయా భాషల్లో ఉందని అయన తెలిపారు. వికీపీడియాలో తెలుగు సమాచార పెంపుకై స్వీడన్ వికీపీడియా తరహా సమిష్టి కృషి జరగాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక రంగాలకు చెందిన సమాచారం అందుబాటులో ఉందని, రాష్ట్ర అవతరణ తర్వాత భాష, సాంస్కృతిక శాఖ అనేక పుస్తకాలను ప్రచురించిందని వాటిని వికీపీడియాలో పొందుపరిచేందుకు (స్వేచ్ఛా నకలు) అనుమతిచ్చామని భాష, సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ తెలిపారు. వికీపీడియాలో తెలుగు సమాచారాన్ని పొందుపరిచే ప్రయత్నంలో భాష, సాంస్కృతిక శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు.
డిజిటల్ మీడియా వేదికలలో తెలుగు వాడుకను పెంచేందుకు తెలంగాణ ఐటీ శాఖ కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే ప్రపంచ తెలుగు మహాసభల సందర్బంగా ‘డిజిటల్ తెలుగు’ కార్యక్రమాన్ని నిర్వహించామని డిజిటల్ మీడియా విభాగం సంచాలకులు శ్రీ దిలీప్ కొణతం పేర్కొన్నారు. చాలా మంది వ్యక్తులు, సముదాయాలు ఇప్పటివరకు చేసిన కృషిని వివరిస్తూ ఇకపై రెట్టించిన ఉత్సాహంతో తెలుగు వికీపీడియా అభివృద్ధికై సంఘటితంగా పనిచేయాలని అయన అన్నారు. ఆ దిశగా జరిగే అన్ని కార్యక్రమాలలో తెలంగాణ ఐటీ శాఖ భాగస్వామి అవుతుందని తెలిపారు. భవిష్యత్తు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా తెలుగు వికీపీడియా, ఇతర సహ ప్రాజెక్టులు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని వికీపీడియా ఔత్సాహికులు శ్రీ వీవెన్ అభిప్రాయపడ్డారు. రాశిపైనే కాకుండా వాసిపై కూడా దృష్టిపరచాలని, వికీపీడియా నియమాలను అనుసరిస్తూ సమాచారాన్ని పొందుపరచాలని దీనిపై అవగాహన పెంపొందించేందుకు శిక్షణా సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలుగు వికీపీడియా నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణా ప్రభుత్వ ఐటీ శాఖ సహాయ సంచాలకులు శ్రీ మాధవ్ ముడుంబై, శ్రీమతి రాధిక మామిడి, శ్రీ కృపాల్ కశ్యప్, శ్రీ కూర్మనాథ్, శ్రీ ప్రణయ్ రాజ్, శ్రీ చిట్టిపంతులు, శ్రీ కట్టా శ్రీనివాస రావు, శ్రీ నరేందర్ గున్రెడ్డి, శ్రీ అరవింద్ ఆర్య, శ్రీ మనోహర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2019 తెవికీ స్టాల్ నివేదిక మార్చు

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ - హైదరాబాద్) భారతీయ భాషలలో వికీపీడియా వ్యాసాలు గణనీయంగా పెంచాలన్న లక్ష్యంతో ‘ప్రాజెక్ట్ ఇండిక్ వికీ’ చేపట్టింది. ఈ బృహత్తర ప్రాజెక్ట్ కు కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఇందులో భాగమైన ‘ప్రాజెక్ట్ తెలుగు వికీ’ కి తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయి.తెలుగు వికిపీడియా పై అవగాహన పెరిగితే అది సముదాయ అభివృద్ధిలో, వికీ వాలంటీర్ల సంఖ్య పెంచడంలో దోహదపడుతుంది కాబట్టి ‘అవగాహన’ విభాగం కింద కార్యక్రమాలు తక్షణమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో జరిగే పుస్తక ప్రదర్శన (బుక్ ఫెయిర్- 2019) మంచి వేదిక అవుతుందని, కాబట్టి బుక్ ఫెయిర్ లో వికీపీడియా స్టాల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టాల్ ఏర్పాటు ప్రణాళిక- బాధ్యతల వివరాలు: బుక్ ఫెయిర్ లో తెలుగు వికీ స్టాల్ ఏర్పాటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సమష్టి బాధ్యతగా భావించినప్పటికీ, నిర్వహణా సౌలభ్యం కోసం పనుల విభజన జరిగింది. స్టాల్ కి అనుమతి తీసుకోవడం, స్టాల్ ఏర్పాటు, ప్రచార సామగ్రిగా కరపత్రాలు, ప్రోత్సాహక బహుమతులు సమకూర్చడం లాంటి బాధ్యతల్ని డిజిటల్ మీడియా విభాగం, తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ, తీసుకోగా, తెలుగు వికీపీడియా గురించి సందర్శకులకు వివరించే వాలంటీర్లను స్టాల్ లో అందుబాటులో ఉంచే బాధ్యతను ఐఐఐటీ హైదరాబాద్ వారు తీసుకున్నారు .విశేష ప్రజాదరణ కలిగిన హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ప్రతీ సంవత్సరం లాగానే , ఈసారి కూడా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సందర్శకులు వికీ స్టాల్ ను చాలా ఆసక్తితో తిలకించారు. స్టాల్ గూర్చి అడిగి తెలుసుకున్నారు. సుమారు ఒక వెయ్యి మంది స్వచ్చందంగా వికీ వాలంటీర్లు గా ఉండ డానికి ముందుకు వచ్చి, తమ వివరాలను అందించి, వికీ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉత్సాహాన్ని కనబరిచారు అలా వివరాలు అందచేసిన వారందరికీ ప్రతి శనివారం ఐఐఐటీ ప్రాంగణం లో తెలుగు వికీపీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నాం. తెలుగు వికీపీడియా పుస్తక ప్రదర్శన సంద‌ర్శకులను కొంతమంది ఫిబ్రవరి 8, 2020న నిర్వహించిన తెలుగు వికీపీడియా - 2020 సదస్సు లో కూడా పాల్గొన్నారు,

తెవికీ స్టాల్ పూర్తి నివేదిక ను ఇక్కడ చూడవచ్చు.

వికీపీడియా అవగాహన ,ప్రాధమిక శిక్షణ సదస్సులు మార్చు

ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన పనులు లలో భాగంగా , తెలంగాణా ప్రభుత్వ సహాయంతో హైదరాబాదు పుస్తక ప్రదర్శన లో తెలుగు వికీపీడియా స్టాలు ఏర్పాటు చేసాం , తెలుగు వికీపీడియా సదస్సు 2020 : ఈ శనివారం 08 ఫిబ్రవరి, 2020 న ఉదయం తొమ్మిది గంటలకు ఐఐఐటి గచ్చిబౌలి క్యాంపస్ లో నిర్వహించాం. ఐఐఐటి లొ జనవరి 4 వ తారీఖు నుండి ప్రతిశనివారము కంప్యూటర్ , మొబైల్ లలో తెలుగు వాడటానికి , రాయటానికి అవగాహనతోపాటు , వికీపీడియా గురించిన ప్రాధమిక ప్రాధమిక శిక్షణ సదస్సు నిర్వహిస్తున్నాం. మార్చి నెల 2020 తరువాత లాక్ డౌన్ కారణంగా ఈ కార్యక్రమం కొనసాగించలేదు. ఇందులో తెలుగు వికీపీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును నిర్వహించాము . ఈ సదస్సులో పాల్గొనువారు వికీపీడియాకి తోడ్పడటమెలాగో నేర్చుకుని తద్వారా తెలుగులో కూడా అపూర్వ విజ్ఞాన సంపందని పోగేసే మహా ప్రయత్నంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నాం . ఈ సదస్సులో తెలుగు వికీపీడియన్ లు కూడా పాల్గొని కొత్త వారికి తొర్పాటు అందించవలసినదిగా , ఈ కార్యక్రమం ఇంకా మెరుగుపడటానికి తగిన సూచనలు అందచేయవలసినదిగా విన్నపం. ఇలాంటి కార్యక్రమాలు ఇతర ప్రదేశాలలొ కూడా జరపటానికి సంబందిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాము , మీకు తెలిసిన సంస్థల పేరుకూడా సూచించగలరు. ఇది పూర్తిగామూడు గంటలకు పరిమితమైన ప్రాధమిక శిక్షణ కాబట్టి కొత్త వాడుకరులు నేర్చుకోవడానికి ఒక sandbox ద్వారా శిక్షణ ఇస్తున్నాం, దీని కోసం తయారు చేసిన ఒక ప్రజంటేషన్ ఇక్కడ చూడవచు, మార్పులు వుంటే సమూహ సబ్యులు కింద చర్చలొ తెలియచేయగలరు , ఇక్కడ వికీనిబంధనల ప్రకారం రాయగలిగిన వారికి తెలుగు వికీ లో రావలసినదిగా సూచిస్తున్నాం, ఒక కరపత్రం కూడా ఇస్తున్నాం.

తెలుగు వికీపీడియా - 2020 సదస్సు మార్చు

ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐఐటి, హైదరాబాద్) ఫిబ్రవరి 8, 2020న తెలుగు వికీపీడియా - 2020 సదస్సును నిర్వహించింది. ఇందులో ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు ఐఐఐటి, హైదరాబాద్ ఛైర్మన్ ప్రొఫెసర్ రాజ్ రెడ్డి, రిటైర్డ్ IAS మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ జయప్రకాష్ నారాయణ్, మాజీ MLC శ్రీ కె. నాగేశ్వర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ, ఐఐఐటి, హైదరాబాద్ సంచాలకులు ఆచార్య పి.జె. నారాయణన్, ఇండిక్ వికీ ప్రాజెక్ట్ పరిశోధకులు, ఆచార్య వాసుదేవ వర్మ, ఐటీ శాఖ సహాయ సంచాలకులు శ్రీ మాధవ్ ముడుంబై తదితరులు పాల్గొన్నారు. దీనికి 1200 పైగా తెలుగు భాషాఅభిమానులు విద్యార్థులు , సాంకేతిక నిపుణులు , తెలుగు బ్లాగరులు పాల్గొన్నారు . భోజనానంతరం సమాచార లభ్యత & అభివృద్ధి , ప్రాజెక్టు అవలోకనం మరియు వ్యూహం భాగంగా ఇండిక్ వికీపీడియా యొక్క వివిధ అంశాలపై పనిచేసే ఫోకస్ సమూహాల మధ్య మేధో మధన కార్యక్రమం జరిగినది ఇందులో ఇండిక్ వికీపీడియా ప్రాజెక్టు సభ్యులు పాల్గొన్నారు.

తెలుగు వికీపీడియా - 2020 సదస్సు పూర్తి నివేదిక కోసం ఇక్కడ చూడగలరు

తెవికీ ప్రయోగశాల మార్చు

తెలుగు వికీపీడియాలో మొదటి సారి వ్రాయాలి అనుకునే ప్రాథమిక వాడుకదారులకు వికీపీడియా ఇంటర్ఫేస్ నేర్చుకునేందుకు ఐఐఐటి తెవికిప్రాజెక్టు ఈ ప్రయోగశాల ఈ ప్రవేశపెట్టింది.
ఇది మీడియా వికీ సహకారముతో ఐఐఐటీ ఇండిక్ వికీ ప్రాజెక్టు అద్వర్యంలో చేయబడిన తెలుగు వికీపీడియా నకలు
ఈ ప్రాజెక్టులో పనిచేసే యంత్ర అనువాదాలు ఎక్కువగా సాండ్ బాక్స్ (https://tewiki.iiit.ac.in) లో ప్రస్తుతానికి ప్రముఖ బాట్ లను తెలుగు భాషమీద అభివృద్ధి కోసం తెలుగు వికీపీడియాలో కాకుండా లోకల్ గా టెస్ట్ వికీమీడియా సర్వర్ మీద పరీక్ష చేస్తున్నాము. ఇందువలన తెలుగు వికీపీడియాలో ఎలాంటి కృతమైన వ్యాసాలు, నాణ్యతకు చేటు తెచ్చే వ్యాసాలూ చేరవు. ఈ ఏర్పాటు వలన నాణ్యత కోసం స్వచ్ఛందముగా పాటుపడుతున్న నిర్వాహకుల శ్రమ తగ్గుతుంది, అనేక పద్దతుల ద్వారా (https://tewiki.iiit.ac.in) లో చేర్చిన వ్యాసాలు ఒక సంతృప్త స్థాయికి చేరుకొన్న తరువాత ఆ వ్యాసాలను తెవికీ సముదాయంతో చర్చించి వాటికి తెలుగు వికీపీడియాలో చేర్చే సాద్యాసాధ్యాలు నిర్వాహకుల , వాడుకరులు సూచనలు పరిగణలోకి తీసికొని, వికీపీడియా పాలసీలు అనుగుణంగా తెలుగు వికీపీడియాలో చేర్చాలని మా ఆలోచన. అయితే తెలుగు వికీపీడియా సముదాయం తో కలసి పనిచేసేందుకు ,ఇప్పటికే యంత్రిక అనువాదం అర్ధం చేసుకునేందుకు , యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ మీద ఒక నిర్ణయానికి రావటానికి కొన్ని అనువాదాలు , అల్గారిధం లు పరీక్ష చేస్తున్నాం. ఇందులో మీరు తెలుగు వికీపీడియాలో గల రకరకాల పేజీల గురించి, వెబ్ సైట్ లో నావిగేషన్ చెయ్యటం ఎలా, ఇతర ఫీచర్లు గురించి నేర్చుకుంటూ దీనిమీద ప్రయోగాలు చేయచ్చు
https://tewiki.iiit.ac.in/ వెబ్ అడ్రస్ పై క్లిక్ చేసి ప్రయోగశాలను చేరుకోంగలరు.

తెవికీ ప్రయోగశాల ఉపయోగాలు మార్చు

ఇందులో కూడా వాడుకరి, ఖాతా సృష్టించుకోవచ్చు, లాగిన్ పాస్వర్డ్ మార్పులు, ఇంటరుఫేసు వంటివి నేర్చుకోవచ్చు
ఇది కేవలం తెలుగు వికీపీడియా ను నేర్చుకునేందుకు ఉద్దేశించినది
ఇందులో రాసిన వ్యాసాలు, వాటిలో చేసిన మార్పులు, చేర్పులు ప్రయోగశాల వరకే పరిమితం
ఇందులో ఎలాంటి దోషాలు లేకుండా రాయగలిగిన తరువాత అసలు వికీపీడియాలో సులువుగా రాయవచ్చు.
ఇందులో ప్రాక్టీసు చేస్తున్నపుడు ఏమైనా ఇబ్బందులు ఎదురుకొంటే , ప్రాజెక్టు టీం మీ సమస్యను పరిష్కరించగలదు.
ఇది ఆన్లైన్ లోఅందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా , ఎక్కడైనా, ఎవరైనా ఉచితంగా నేర్చుకోవచ్చు.

వికీ శిక్షణా తరగతులు మార్చు

తెలుగు వికిపీడియాను ఎప్పుడైనా , ఎక్కడైనా ,వెబ్ ఆధారంగా నేర్చుకోవటం కోసం గూగుల్ సాంకేతిక పరిజ్ఞానం ( classroom , codelabs ) ఆధారంగా కొన్ని ఆన్లైన్ పాఠాలువీడియోలు ఐఐఐటీ ఇండిక్ వికీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రూపొందించదలచాము. ఇవి కొత్తగా వికీలో రాయబోయే ఔత్సాహికులను దృష్టిలో పెట్టుకొని రాసిన ప్రాధమిక జాబితా వీటిని అందరికీ అందుబాటులో ఉంచటం ద్వారా ఎవరైనా వికీలో వ్యాసం రాయగలరని మా ఆలోచన , వీటి ఆధారంగా వికీడేటా, వికీ సోదర ప్రాజెక్టులు వంటి మరిన్నిపాఠ్యాంశాలు చేర్చగలం. ఇందులో ఈ విభాగాలుచేర్చాలని మా ఆలోచన , ఇలా చేసిన తెలుగు వికీ కోడ్ లాబ్స్ నమూనా ను https://teluguwiki-aa8c2.web.app/ లో మీరు చూడవచ్చు , ఏమైనా సూచనలు , చేర్చదగిన అంశాలు ఉంటే మాకు తెలియచేయగలరు.

వికీపీడియా వర్క్ షాప్ లో ఉపయోగించడానికి అభ్యాస కంటెంట్ సృష్టించడం కొరకు అంశాలు 1) వికీపీడియా ఉపోద్ఘాతం , సంక్షిప్తం గా వికీపీడియా పరిచయం , వికీపీడియా - ఐదు మూలస్థంభాలు, వికీపీడియా ఆవశ్యకతలు 2) Google మూలాంశ ఉపకరణాల పొడిగింపు (డెస్క్ టాప్ ) 3)వాయిస్ ,కీబోర్డ్ లు ఉపయోగించి మొబైల్ పరికరాల్లో తెలుగును టైప్ చేయడం ఎలా Gboard (మొబైల్ అప్లికేషన్) 4)tewiki.iiit.ac.in పరిచయం, తెవికీ ప్రయోగశాల ( Sandbox) లో నమోదు 5)తెలుగు వికీపీడియాలో లాగిన్ ప్రక్రియ, ఒక వాడుకదారుని పేజీని సృష్టించడం , స్వ పరిచయం జోడించడం 6) వికీపీడియా లో అన్వేషణ , వికీపీడియాలో ఉన్న ప్రాథమిక నావిగేషన్ 7) వికీపీడియాను ఒక పరిశోధన సాధనంగా ఉపయోగించడం, వికీ పేజీ నుండి PDF గా ఎగుమతి మొదలైనవి 8)వికీ ప్రామాణిక వ్యాసం పరిచయం 9) వాడుకదారుని శాండ్ బాక్స్ లో ప్రయోగాలు చేయడం ద్వారా ఒక వ్యాసం రాయడం 10) ఎడిటింగ్ ప్రాధమిక అంశాలు

శీర్షికలు ,ఉపశీర్షికలు, బోల్డ్, ఇటాలిక్, లింక్ లు, రిఫరెన్సింగ్, చర్చించడం (విజువల్ ఎడిటర్) టేబుల్స్, జాబితా, ఇండెంట్ లు , వచన దస్త్రాలు , ప్రత్యేక క్యారెక్టర్లు ,ఫార్ములాలు మొదలైనవి(విజువల్ ఎడిటర్) శీర్షికలు ,ఉపశీర్షికలు, బోల్డ్, పట్టికలు, జాబితాలు, సూచికలు, రివర్ట్, Referencing, చర్చించడం (క్లాసిక్ ఎడిటర్) టేబుల్, లిస్ట్ లు, ఇండెంట్ లు, టెక్ట్స్ ఫైళ్లు, స్పెషల్ క్యారెక్టర్లు ,ఫార్ములాలు మొదలైనవి(క్లాసిక్ ఎడిటర్) మీడియా - ఇమేజ్ వినియోగం,ఆడియో వినియోగం, ఎంబెడెడ్ వీడియో, వీడియోకు లింక్ చేయడం (విజువల్ ఎడిటర్) సాంకేతిక పరిమితులు మీడియా - ఇమేజ్ వినియోగం,ఆడియో వినియోగం, ఎంబెడెడ్ వీడియో, వీడియోకు లింక్ చేయడం (క్లాసిక్ ఎడిటర్) టెక్నికల్ పరిమితులు

11) వ్యాసం పేరు మార్చడం ,తొలగించటానికి నివేదించటం 12) వికీ కామన్స్ ,ఇతర సోదర ప్రాజెక్టులు 13) గూగుల్ డ్రైవ్ ,డాక్స్ లను మొబైల్ లో ఇన్ స్టాల్ చేయడం ,గూగుల్ డ్రైవ్ ,డాక్స్ లను తెలుగులో వ్యాసములు డ్రాఫ్టింగ్ చేయడం కొరకు ఎలా ఉపయోగించాలి. 14)వ్యాస పరిధి ,నాణ్యత మదింపు సరైన మూలలకోసం శోధన నాణ్యత పరిశోధన - సంబంధిత డాక్యుమెంట్ లు/ఆర్టికల్/పుస్తకాలను కనుగొనడం వ్యాసమును సుసంపన్నం చేయటం వ్యాసమును ప్రయోగశాల ( శాండ్ బాక్స్ )నుండి తెవికీ లో ప్రచురించటం వికీపీడియాలో వ్యాసాల ను సవరించటం/ నవీకరించడం స్వంత వ్యాసాలను అప్ డేట్ చేయడం ఇతర వ్యాసాలను సంకలనం చేయడం, వ్యాసం చర్చాపేజీ 15)వికీపీడియా లో మంచి వ్యాసం ఎలా ఉండాలి? 16)ఈ ఆన్లైన్ అభ్యాసము యొక్క ఫలితం అంచనా వేయటం


ఇంటర్న్‌షిప్ అవకాశం @ తెలుగు వికీ - IIIT మార్చు

తెలుగు వికీలో విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక అంశాల మీద వ్యాసాలు రాస్తూ , అందుకు అవసరం అయిన వాలంటీర్లను చేర్చుకొని, వారికి తెలుగులో వ్యాసాలు రాయటానికి, వివిధ సాంకేతిక , అనువాద ఉపకరణాల మీద ఆన్ లైన్ లో శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. దానికి సంబంధించిన సహాయ , సహకారాలు ప్రాజెక్టు ద్వారా అందిస్తాం. ఈ కార్యక్రమం లో నమోదు అయిన వారికి ఫిబ్రవరి 1 , 2021 నుండి వికీ మీద ఆన్ లైన్ లో శిక్షణ ఇస్తున్నాము., ఇందులో భాగంగా ఆంగ్ల వికీపీడియా ముఖ్య వ్యాసాలు (English wikipedia vital articles) తెలుగు లోకి అనువదిస్తున్నాం.ఈ శిక్షణ అనంతరం అనేక బృందాలకు శిక్షణ అందించడం జరిగినది . తాజాగా 2022 ఫిబ్రవరి లో మరో బ్యాచ్ కు శిక్షణ అందించాము . 2022 ఏప్రిల్ లో మరో బ్యాచ్ కు శిక్షణ ఇవ్వనున్నాం .

2021 ప్రణాళిక మార్చు

  • 1 ఫిబ్రవరి 2021 ఇంటర్న్‌షిప్ అవకాశం @ తెలుగు వికీ - IIIT - Summer Internship Opportunity 2021 హైదరాబాదులోని

ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) ‘ప్రాజెక్ట్ ఇండిక్ వికీ’ కార్యక్రమం లో భాగంగా ప్రారంభం అయింది. దీనిలో భాగంగా రెండు వారాల పాటు నమోదు చేసుకొన్న అభ్యర్థులకు రోజూ గంట పాటు ఆన్లైన్ లో శిక్షణ ఉంటుంది.

  • 31 మార్చి 2021 వరకు మొదటి శిక్షణా శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.
  • ఇందులో సుమారు 700 వందల వ్యాసాలు కొత్తగా శిక్షణ తీసుకున్న వారు వ్రాశారు. (ఈ 60 రోజుల్లో)
  • 5 ఏప్రల్ 2021 నుండి 30 మే 2021 వరకూ రెండవ శిక్షణా శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.
  • 8 జూన్ 2021 నుండి 31 జూలై 2021 వరకూ మూడవ శిక్షణా శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.
  • 9 ఆగస్టు 2021 నుండి 30 సెప్టెంబర్ 2021 వరకూ నాలుగవ శిక్షణా శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.
  • 4 అక్టోబరు 2021 నుండి 30 నవంబరు 2021 వరకూ ఐదవ శిక్షణా శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.
  • 6 డిసెంబరు 2021 నుండి 31 జనవరి 2022 వరకూ ఆరవ శిక్షణా శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.
  • 22 ఏప్రిల్ 2022 నుండి 24 జూన్ 2022 వరకూ ఏడవ శిక్షణా శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.

తెలుగు వికీపీడియా అభివృద్ధి మెరుగుదల అంతర్జాతీయ అంతర్జాల సమావేశం మార్చు

ఇండిక్ వికీ ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIIT-H) నుంచి అభినందనలు, వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్ 2021 కు అహ్వానిస్తున్నాము , ఈ సమావేశం నవంబర్ 19 మరియు 20, 2021 నాడు వర్చువల్ మోడ్ లో ఉంటుంది. ఈ శిఖరాగ్ర సమావేశం యొక్క ఇతివృత్తం "కమ్యూనిటీ ఎన్సైక్లోపీడియాలలో టెక్నాలజీ పాత్ర". ఇందులో భాగంగా శనివారం నవంబరు 20 వ తేదీన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు & ఇంగ్లీష్ భాషల్లో తెవికీ – తెలుగు వికీపీడియా అభివృద్ధి మరియు మెరుగుదల (TeWiki – Development and Enhancement of Telugu Wikipedia) మీద ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నాము. ఇది పూర్తిగా ఆన్‌లైన్ జరిగే, ఉచితంగా హాజరయ్యే అంతర్జాతీయ అంతర్జాల సమావేశం, పూర్తి వివరములకు, మీ పేరు నమోదు చేసుకునేందుకు ఇక్కడ చూడగలరు .

వ్యాసాలను చేర్చే ప్రతిపాదన మార్చు

ఐఐఐటి ఇండిక్ వికీ శాండ్ బాక్స్ లో సాంకేతిక పరిజ్ఞానంతో సృష్టించిన వేలాది వ్యాసాలను మానవీయ పరిశీలన చేసి , అవసరమైన చోట మానవీయ సహాయంతో మార్పులు చేశాము. మచ్చుకు కొన్ని వ్యాసాలను వర్గీకరించి వాడుకరి:Po.indicwiki/ప్రయోగశాల లో ఉప వ్యాసాలు గా చేరుస్తున్నాం. తెలుగు వికీపీడియా సభ్యులు తమ అభిప్రాయాలను ఆయా వ్యాసాల చర్చ పేజీలలో వెల్లడించవలసిందిగా కోరుతున్నాం. మీ సూచనలు , అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకుని మిగిలిన వ్యాసాలను కూడా తదనుగుణంగా సవరించి అందుబాటులోకి తీసుకువస్తాం. తయారుచేసిన వ్యాసాలను తెలుగు వికీపీడియాలో ప్రచురించే ముందు, ఆయా వ్యాసాల నాణ్యతను పరిశీలనలో మార్గదర్శకంగా ఉండే ఈ చెక్‌లిస్టును పరిశీలించాలి.

నమూనా వ్యాసాలు మార్చు

మీరు సూచించిన విధంగా కొన్ని వ్యాసాలను ఇక్కడ మీ పరిశీలనకు ఉంచాము . దయచేసి వ్యాసాలను పరిశీలించి మీ సూచనలు ఆయా వ్యాసాల చర్చా పేజీలలో తెలియజేయగలరు . మరికొన్ని నమూనా వ్యాసాలను కూడా పొందుపరుస్తాము.

ఫుట్‌బాల్ క్రీడాకారులు మార్చు

సినిమాలు మార్చు

కర్ణాటక సంగీత రాగాలు మార్చు

శాస్త్రవేత్తలు మార్చు

వాహనాలు మార్చు

విశ్వవిద్యాలయాలు మార్చు

పాఠశాలలు మార్చు

విద్యాసంస్థలు మార్చు

సినిమా కళాకారులు మార్చు

క్రికెట్ ప్లేయర్ మార్చు

నక్షత్రాలు మార్చు

*https://te.wikipedia.org/wiki/వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా_వ్యాసాలు/ఎక్రీషన్

మూలాలు మార్చు

  1. "ఇండిక్ వికీ ప్రాజెక్టు". Retrieved 2021-02-24.
  2. తొలిగా జరిగిన రచ్చబండ చర్చ తేది 2019 సెప్టెంబరు 20