వికీపీడియా:వికీహాస్యం

వికీ సరదా శాఖ ఈ పేజీని నిర్వహిస్తుంది

ఆవు చేలో పడితే ? మార్చు

ఆవు చేలో పడితే ?

ఒక ఆవు చేను (పొలం)లో పడితే అనే సంఘటనపై మన తెవికీ సభ్యులు ఎలా స్పందిస్తారో ఊహావ్యాఖ్యలు పొందుపర్చాను. ఇది కేవలం సరదా కోసమేనని ప్రత్యేకంగా ఎలాంటి వారిని ఉద్దేశించి, వ్యతిరేకించి పెట్టిన వ్యాఖ్యలు కావని గమనించగలరు. ఈ ఊహా సంఘటనపై సభ్యులు ఈ విధంగానే స్పందిస్తారని కాకుండా గత కొంత కాలంగా ఆయా సభ్యులు చేసిన వ్యాఖ్యలు గమనించి వారి ఆహాభావాలు మాత్రమే తీసుకోవడమైనది. చురుకుగా ఉన్న సభ్యులకు ఎవరి వాక్యనిర్మాణాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి ఇక్కడ సభ్యుల పేర్లు కూడా ఇవ్వబడలేదు. దీన్ని తేలిగ్గా తీసుకోగలరని మరోసారి విజ్ఞప్తి. ఇది రచ్చబండకు సంబంధం లేకున్నా సభ్యులందరి దృష్టిలో రావడానికి ఇక్కడ పెట్టాను. ఇక చదవండి --

  • పొలంలో ఆవు పంటనంతా మేస్తోంది. ఎంతో కష్టపడి పండించిన పంట అంతా ఆవు పొట్టలోకి వెళ్ళడం సమంజసం కాదు. ఆ ఆవును వెంటనే వెళ్ళగొట్టాలి. అది రోజూ అలా మేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాల్సిందేనా? పొలం దున్నడం నుంచి విత్తనాలు వేయడం, ఎరువులు చల్లడం, సాగునీటిని కల్పించడం, పురుగుల నివారణ చర్యలు చేపట్టడం తదితర పనులు చేయడం ప్రతి దశలోనూ ఖర్చు చేసి చివరికి పంట చేతికి వచ్చే సమయానికి ఆవులకు భుక్తిగా చేయడం సరైనది కాదు.
  • ఆవును వెళ్ళగొట్టే గురించి అవగాహన ఉన్నవారు ఎవరైనా దీని గురించిన వివరాలు తెలియజేస్తే బాగుంటుంది. లేకపోతే పొలం తిరిగి నష్టపోయే ప్రమాదం ఏర్పడుతుంది. నేను పనిచేస్తున్న తొలిరోజుల్లో ఇలాంటి కొన్ని పొరపాట్లు కనిపించాయి. అప్పుడు ఇప్పుడున్నంత అవగాహన నాకు లేదు. నాకు తెలిసిన విధంగా ఆవును వేరే పొలంకు దారిమార్చాను. దయచేసి ఇప్పుడే ఆవుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని సభ్యులకు మనవి.
  • అది ఆవు తప్పిదంవల్ల కాదని తెలుస్తుంది. ప్రక్క చేనులో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఆవు క్రమక్రమంగా చేనును మేస్తున్నట్లు గమనించితిని. ఆవును వెంటనే వెళ్ళగట్టకపోతే చేనుకు నష్టం కలుగుతుంది. పొలానికి ప్రహరి గేట్లు పనిచేయడం లేదు. కొన్ని సరిచేసితిని.
  • మీరు ఇప్పుడే చెప్పారు. ఇది పెద్ద సమస్య కాదు. ఇక్కడ ఎందరో మహానుభావులు చేను అభివృద్ధికి కృషిచేశారు. ఆవు ఎంతమేసింది అనేది ప్రధానం కాదు. చేను మొత్తం పాడుచేస్తుంది. ఇంతకాన్నా మీకు తెలియజేయడము ఈ సందర్భములో అసందర్బ ప్రస్తావన కావచ్చు. పైవారు పొందు పరచిన ఆలోచనలు అన్నీ, నాకు ఎల్లప్పుడూ దాదాపు అలాగే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆవును వెళ్ళగొట్టడం ఇష్టం ఉండక పోవచ్చును. మనం పెద్దమనసుతో వ్యవహరించి ఆవును నిదానంగా సాగనంపాలి. ఇక్కడ ఆవు ప్రాధాన్యత గురించి కాదు. చేనును రక్షించుకోవాలి. కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా చేయాలి. నా మస్తిష్కములోని కొన్ని ఆలోచనలు సదుద్దేశ్యముతో తదుపరి పొందు పరచుతాను. అవి చేను అభివృద్ధికి ఉపయోగ పడితే మంచిదే.
  • ఈ ఆవును సాగనంపడానికి అయ్యే ఖర్చును ఐ.ఇ.జి. నుంచి తెప్పించుకోవాలి. దీనికోసం ఇక్కడ అప్లై చేయాలి. సభ్యులు తమ అంగీకారం తెలియజేయగలరు.
  • sabhyulu anavasara carcalaku pradhanyata istunnaru.
  • ముందుగా మీరందరు ఇది చదవండి. నాకర్ధం అయిన దానిబట్టి ఏవిటంటే, ఇదో పెద్ద సమస్య కాదు. ...గారూ, మీరు చెప్పినది సరైనదే. అసలు ఏమయిందంటే యజమాని పొలం ఎండిపోయింది. దాంతో ఆవు ఆకలి బాధతో ఇందులో ప్రవేశించింది. మనం త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించుదాం. ప్రక్కచేనులో ఇదే సమస్యను వారు ఇలా పరిష్కరించారు. ఇది చూడండి, ఇదీ చూడండి, ఇది కూడా చూడండి. ఐపీ అడ్రస్ అజ్ఞాతవర్య గారూ, నమస్కారం ఈ విషయం నాకు బాగా అవగతమేనండి. ఎందుకంటే నేను ఎన్ని వందల గంటలు చర్చలకు సమాధానాలు వ్రాస్తూ వెచ్చించానో నాకే తెలియదు. కానీ నలుగురు కలిసి పనిచేస్తున్నప్పుడు చర్చలు తప్పవు మరి. హ్హిహ్హిహ్హి.
  • భవిషత్తులో ఆవులు చేనులో పడకుండా విషయంపై సమవేశంలో చర్చించుకున్నాం. వార్షికోత్సవం నిర్వహించే పనిలో ఉండడం వల్ల ఈ చర్చ కొనసాగలేదు. వచ్చే సమావేశం హైదరాబాదులో జరుగుతుంది. అందులో నిర్ణయం తీసుకుంటాం. అయితే ఇది కేవలం ఆలోచన మాత్రమేననీ, నిర్ణయాలు అందరి సమక్షంలో జరుగుతాయని సభ్యులు గమనించగలరు.
  • ఆవును ఎందుకు వెళ్ళగొట్టాలి. మొత్తం చేనులో అది తినేదెంత. ఎందుకు ఈ సాగనంపు ఇప్పుడు అవసరం. ఇలాంటి పనులు మానవత్వంను సాధించగలవా?
  • ...గారన్నట్లు ఆవును సాగనంపాలి కాని ... గారి వ్యాఖచూశాక సందేహ స్థితిలోనే తటస్థంగా ఉండిపోయాను.
  • ఆవును వెళ్ళగొట్టే విషయం అనేది కొంత కాలంగా నానుతున్న విషయమే. ఇది ఒక క్రొత్త ప్రయోగము గనుక అందరి అభిప్రాయము పరిగణలోనికి తీసుకోవలసి వున్నది. కనుక అప్పుడే తొందర పడవద్దని/ ఏదో నిర్ణయం జరిగిపోతున్నదని అపోహ పడ వద్దని సహ సబ్యులకు మనవి. మనమందరము రెండుమూడు సార్లు కలసి మాట్లాడుకుందాము.
  • ఇదిఅందరికీసమ్మతమే ఎంతోవుపయోగకరం
  • ఆవు ఏయే రోజులలో ఎంత మేసినది పటము ఇక్కడ పొందుపర్చాను. దీనికి సంబంధించిన వివరాలు, పటాలు నా ఈ నాటి తెలుగినక్స్ బ్లాగుపోస్టులో చూడవచ్చు. చేనులోని లోటుపాట్లని సర్వేలు మరియు గణాంకాలసహాయంతో మరింతగా విశ్లేషించి భవిష్యత్ కార్యక్రమాలు చేపట్టితే బాగుంటుంది. దీనికి ఎవరైనా ముందుకువస్తే వీలైనంతలో సహాయపడగలను.
  • అడ్డదిడ్దమైన జంతువులు మేసె వాటిని నిర్వహాకులు ఏమి అనరు,ఏమి చెయ్యరు. ఏమి చెయ్యలేరు. ఈ ఆవును ఒక్క స్ట్రోకు తో గెంటేస్తే ఎలా? పనికి మాలిన జంతువులను గెంటేయటానికి కొన్నిరోజులు ఎదురు చూస్తారు. నిర్వహకులకు పొలాల మీద సర్వహక్కులున్ంట్లు చేస్తూ పోతే మేము ఉండలేము.
ఇది సరదా సరదా కోసం తెవికీలో నేను చేసిన ప్రయోగం మాత్రమేనని సభ్యులు గమనించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:53, 25 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]