వికీపీడియా:సమావేశం/మార్చి 8, 2013 సమావేశం
2013, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వికీపీడియా సమావేశం, శిక్షణ శిబిరం నిర్వహించడింది.
వివరాలుసవరించు
- స్థలం
- థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, నాంపల్లి, హైదరాబాద్
- సమయం
- ఉదయం 10 గం.ల నుండి మధ్యాహ్నం 2 గం.ల వరకు
హాజరయిన వారుసవరించు
- పెద్ది రామారావు
- విష్ణు
- రహ్మానుద్దీన్
- రాజశేఖర్
- ప్రణయ్ రాజ్
- త్రినాధరావు
- సాయి
- శివకాశి
- రాజ్ కుమార్
- పోచం మధు
- నరేష్
కార్యక్రమ వివరాలుసవరించు
- ముందుగా ప్రతినిధుల పరిచయం జరిగింది. అనంతరం వికీపీడీయా అంటే ఏమిటి? దాన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయంపై చర్చ జరిగింది. ఈ చర్చలో విష్ణువర్ధన్ సమగ్ర సమాచారాన్ని అందిచారు.
- పెద్ది రామారావు మాట్లాడుతూ... తాను ఏవిషయం గురించైనా తెలుసుకోవాలంటే ముందుగా వికీపీడియాను ఆశ్రయిస్తానని, మనకు తెలియని చాలా వివరాలు అందులో ఉంటాయని, దురదృష్టవశాత్తు తెలుగు వికీపీడియాలో చాలా తక్కువ సమాచారం ఉందని, ఎక్కువ సమాచారం అందించేందుకు మనందరం కృషిచేయాలని అన్నారు.
- అటుపిమ్మట రహ్మనుద్దిన్ గారు వికీపీడియా ఉపయోగించండం గురించి ప్రాక్టికల్ గా చూపించారు. ప్రతినిధుల యొక్క సందేహాలను నివృత్తి చేశారు.
భోజన విరామం తర్వాత హాజరైన ప్రతినిధులందరిచే వికీపీడియాలో ఖాతాలను తెరిపించి, వారందరిని వికిపీడియన్లుగా మార్చారు. కొత్త వికీపీడియన్లు వారివారి ఖాతాలతో వ్యాసాలు వ్రాసారు.