వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/మినీ టిటిటి 2019

హైదరాబాద్ నగరంలో తెలుగు వికీపీడియన్లకు, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇతర వికీపీడియన్లకు 2019 జూలైలో నిర్వహిస్తున్న కార్యక్రమం. కొత్తవారిని నిలపడం (Retention) అన్న అంశంపై ఈ కార్యక్రమం దృష్టి కేంద్రీకరిస్తుంది.

వివరాలుసవరించు

 • తేదీలు: 2019 జూలై 6, 7
 • సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 వరకు
 • ప్రదేశం: హైదరాబాద్
 • వేదిక: హోటల్ ఆదిత్య పార్క్, అమీర్ పేట, హైదరాబాద్
 • ఈథర్పాడ్ లింక్: Mini_TTT_2019

ఉద్దేశంసవరించు

కొత్తవారిని తీసుకురావడంతో పాటుగా వచ్చినవారిని నిలపడం ముఖ్యమైన అంశం. అవతలివారి దృక్పథం అర్థంచేసుకోవడం, వారి సమస్యలు తీర్చడం, ఆసక్తి కలిగించడం, నిలబెట్టడం వంటి అంశాలన్నీ దానిలో ఇమిడి ఉంటాయి.

 1. కొత్తవారికి శిక్షణనిచ్చి నిలిపేందుకు అవసరమైన అంశాలపై వికీపీడియన్లకు శిక్షణనివ్వడం
 2. వికీపీడియన్ల అనుభవాల నుంచి సమష్టిగా నేర్చుకునే వేదిక కల్పించడం
 3. కొత్తవారిని నిలపడానికి అవసరమైన సామగ్రి, వనరుల జాబితా రూపొందించుకుని వాటి ఏర్పాటు ప్రారంభించడం.

పాల్గొనేవారుసవరించు

దరఖాస్తు చేసుకోవడంసవరించు

అర్హతలు మీరే పరిశీలించి, అర్హులైన వారు దయచేసి పాల్గొనేవారు అన్న దగ్గర సంతకం చేయండి.

అర్హతలుసవరించు

 • తెలుగు వికీమీడియా ప్రాజెక్టులపై పనిచేస్తూ తోటివారికి శిక్షణనిద్దామని, తెలుగు వికీమీడియా సముదాయం విస్తరణపై ఆసక్తి ఉన్నవారు
 • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసిస్తున్న ఇతర ప్రాజెక్టుల వారికీ అవకాశం ఉంటుంది
 • జూన్ 15 నాటికి కనీసం 250 ఎడిట్లు ఉన్నవారికి, ప్రస్తుతం సచేతనంగా కృషిచేస్తున్నవారికి ప్రాధాన్యత.
 • తెలుగు వికీమీడియా సముదాయం చర్చించి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాని వాడుకరులకు ప్రాధాన్యం.

పాల్గొనేవారి నుంచి ఆశించేవిసవరించు

 • జూలై 5వ తేదీ రాత్రి హాజరై, 7వ తేదీ కార్యక్రమం ముగిసేవరకు మా ఆతిథ్యం స్వీకరిస్తూ కార్యక్రమంలో పాల్గొనడం
 • కార్యక్రమానికి వారం రోజులు ముందు జరిగే ఆన్లైన్ సెషన్లో పాల్గొనడం

పాల్గొనేవారి జాబితాసవరించు

 1. యర్రా రామారావు (చర్చ) 07:02, 29 జూన్ 2019 (UTC)
 2. ఆదిత్య పకిడే
 3. యశ్వంత్ ఆలూరు
 4. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:41, 1 జూలై 2019 (UTC)
 5. IM3847 (చర్చ) 11:48, 1 జూలై 2019 (UTC)
 6. I'm Irfan (చర్చ) 16:03, 1 జూలై 2019 (UTC)
 7. మేకల హరిక (చర్చ) 16:15, 1 జూలై 2019 (UTC)
 8. గుంటుపల్లి రామేశ్వరం
 9. Sumanth699 (చర్చ) 18:13, 1 జూలై 2019 (UTC)
 10. సూస్వేత (చర్చ) 18:59, 1 జూలై 2019 (UTC)
 11. Asrija1 (చర్చ) 14:53, 2 జూలై 2019 (UTC)
 12. గత 5 ఏండ్ల తరబడి (ప్రధానంగా బాంగ్లా వికీలో నా సవరణలు) వివిధ ఎడిటింగ్లు చేస్తుండగా నేను వికీలో ఎదుదురుకున్న సమస్యలు & వాటిని ఎలా అధిగమించాలో, మెరుగైన మరియు ఉన్నత ఎడిటింగ్ కొరకు వికీలో అందుబాటులో ఉన్న నానా సాధనాలు, నూతన గ్యాడ్జట్లు, చివరఖిరిలో నా సొంత అనుభవాలను, అభిప్రాయాలను తెలుగు కమ్యూనిటీతో ఆదివారం (జులై 7 తేదీ) పంచుకోవాలనుకుంటున్న. -- Mouryan/మౌర్య/মৌর্য্য (నాతో సంభాషించడానికి సంకోచించకండి, ప్లీజ్ ❤) 15:11, 6 జూలై 2019 (UTC)

కార్యక్రమ సరళిసవరించు

2019 జూలై 6
 • ఉదయం 10-10.15 - కార్యక్రమ పరిచయం
 • 10.15-10.30 - పాల్గొనేవారి పరిచయం
 • 10.30-11.00 - వివిధ ఆఫ్ వికీ కార్యక్రమాలు, లక్ష్యాలు
 • 11.00-11.20 - టీ, కాఫీ విరామం
 • 11.20-12.00 - మెటీరియల్ ప్రాధాన్యత, రూపకల్పన
 • 12.00-1.00 - భోజన విరామం
 • 1.00-1.40 - నేర్చుకునేవారిలో వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం
 • 1.40-2.15 - మనకు రానిదేమిటి?
 • 2.15-3.00 - వీవీఐటీ ప్రయత్నం, విజయం
 • 3.00-3.20 - టీ, కాఫీ విరామం
 • 3.20-4.30 - వికీ బయటి ప్రయత్నాలు, నేర్చుకోదగ్గ అంశాలు
2019 జూలై 7
 • ఉదయం 10-10.15 - నిన్న, నేడు, రేపు
 • 10.15-11.00 - ఏ ప్రాజెక్టులపై పనిచేస్తారు? - ఒక ఎక్సర్ సైజ్
 • 11.00 - 11.20 - టీ, కాఫీ విరామం
 • 11.20 - 11.50 - జట్ల విభజన
 • 12.00 - 1.20 - కొత్తవారి రాక, భోజన విరామం
 • 1.20 - 2.00 - వికీపీడియా గురించి కొత్తవారికి వివరణ
 • 2.00 - 2.50 - వికీపీడియా, వికీసోర్సు, కామన్సు గురించి కొత్తవారికి వికీమీడియన్లు రివాల్వింగ్ కెఫె తరహా కార్యక్రమం
 • 2.50 - 3.10 - కాఫీ, టీ విరామం
 • 3.10 - 4.00 - వికీపీడియా, వికీసోర్సు, కామన్సు గురించి లోతైన వివరణ
 • 4.00 - 4.30 - ముగింపు

నివేదికసవరించు

మొదటి రోజు

ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. కొత్తవాడుకరులను నిలుపుకోవడం (లేక రిటెన్షన్) అన్నది ఈ కార్యక్రమానికి ఏకైక థీమ్ అని, మొత్తం కార్యక్రమం అంతా అదే థీం మీద సాగుతుందని కార్యక్రమం గురించి పరిచయం చేస్తూ తెలిపారు. తొలి సెషన్లో భాగంగా పాల్గొన్నవారిని వారి ఆసక్తిని, అభిరుచిని, చేసిన కృషిని అనుసరించి వికీపీడియా, వికీసోర్సు, వికీమీడియా కామన్సు ప్రాజెక్టు జట్లలో ఒకదానిలో చేరమని సూచించారు. ఆ ప్రకారం పాల్గొన్నవారంతా ఒక్కో జట్టులో భాగమయ్యారు.

తర్వాతి సెషన్లో భాగంగా వారిని- తమ తమ ప్రాజెక్టుల్లో కృషిచేయడానికి ఆసక్తి చూపించే కొత్తవారిని నిలబెట్టేలా ఏయే ఆఫ్లైన్, ఆన్లైన్ కార్యక్రమాలు చేయవచ్చదన్న అంశంపై చర్చించమని హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీలో కోరారు. పాల్గొన్నవారు తమ తమ జట్లలో చర్చించి, కొన్ని కార్యకలాపాలను, ఒక టైంలైన్ ప్రకారం ప్రణాళిక వేసుకున్నారు. ఈ యాక్టివిటీ టీ విరామానికి ముందు, తర్వాత కూడా కొనసాగింది. ఆపైన అన్ని జట్ల వారు తమ తమ ప్రణాళికలను ప్రెజంట్ చేశారు.