వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదన

వికీపీడియా అవగాహన సదస్సు మార్చు

తెలుగు వికీపీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును మరియు వికీపీడియాలో వ్యాసాలు రాసే కార్యక్రమానికి అవసరమైన మూలాల గురించి చర్చ నిర్వహిస్తున్నాం.

ఈ సదస్సులో పాల్గొనువారు వికీపీడియాకి తోడ్పడటమెలాగో నేర్చుకుని తద్వారా తెలుగులో కూడా అపూర్వ విజ్ఞాన సంపందని పోగేసే మహా ప్రయత్నంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నాం.

తేదీ :డిసెంబర్ 7 2019 స్థలం: ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గచ్చిబౌలీ , హైదరాబాద్ - 500032 సంభాషించుటకు : 9959263974/ 9396533666 మీ రాకను తెలియచేయుటకు ఈమెయిల్ : bhashakadhambari@gmail.com వాట్సాప్ / ఎస్ యం ఎస్ : 9959263974

చర్చకు ఆహ్వానం మార్చు

మీ  విలువైన అభిప్రాయలకు ధన్యవాదాలు. రచ్చబండ లొ మీరు అడిగిన  ప్రశ్నలకి సంబందించిన జవాబులు  చాలా వరకు ఈ ప్రాజెక్ట్ పేజీని ఇక్కడ (https://te.wikipedia.org/wiki/వికీపీడియా:ఐఐఐటి_హైదరాబాదు_వారి_వికీపీడియా_ప్రాజెక్టు_ప్రతిపాదన) సృష్టించిన, ప్రతిపాదనలొ చెప్పాము. తెవికీ కమ్యూనిటీతో సమిష్టి కలయికలను కలిగి ఉండాలని మేము ప్రతిపాదించాము (మొదటిది నవంబర్ 16, 2019 న ప్రతిపాదించబడింది) మీ అనుభవలు, అలొచనలు, మాకు మార్గదర్శకత్వం అవ్వాలని కొరుకొంటూ మొత్తం  తెవికీ సముదాయంని అహ్వనిస్తున్నాము. ప్రాజెక్ట్ చర్చ పేజీలొ మున్ముందు చర్చించుకొందాము. Dollyrajupslp 08:59, 13 నవంబర్ 2019 (UTC)

మీ ప్రాజెక్టు చక్కగా సాగాలని, తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడాలని కోరుకొంటున్నాను. అయితే మీ ప్రాజెక్టులో వికీపీడియాతో పాటుగా, విక్షనరీ, వికీసోర్సు వంటి ఇతర వికీమీడియా విభాగాలను చేర్చాలని నా అభ్యర్ధన. ఒక్కొక్కటిగా చిన్నగా మొదలుపెడితేనే వికీపీడియాలో లోటుపాట్లు మీకు బోధపడగలవు. చెన్నైలో ఉండడం మూలంగా ఆదివారం సమావేశానికి హాజరు కాలేకపోయాను. నేను మీ ప్రాజెక్టుకు సాధ్యమైనంత తోడ్పాటును అందించగలనని హామీ యిస్తున్నాను. శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 19:11, 17 నవంబర్ 2019 (UTC)

"సమాచార లభ్యత మరియు సముదాయ అభివృద్ధి" సమావేశం, ఐఐఐటీ, హైదరాబాదు* సమావేశంలో చర్చించిన కొన్నివిషయాల సారాంశం మార్చు

"సమాచార లభ్యత మరియు సముదాయ అభివృద్ధి" సమావేశం, ఐఐఐటీ, హైదరాబాదు*

వికీపీడియాలో తెలుగు సమాచారాన్ని పెంచేలా కృషి చేయడం కోసం సముదాయాల ఏర్పాటు ద్వారా సంఘటిత కృషి జరగాలని ఐఐఐటి, హైదరాబాద్ ప్రాంగణంలో “వికీపీడియా సమాచార లభ్యత మరియు సముదాయ అభివృద్ధి” అన్న అంశంపై జరిగిన చర్చాగోష్టిలో వక్తలు అభిప్రాయపడ్డారు. ఇందుకు గాను “సముదాయ అభివృద్ధి”, “సమాచార లభ్యత”, “శిక్షణ మరియు అవగాహన”, “సాంకేతికత”, “పరిశోధన” అనే ఐదు విభాగాలకింద ఈ ప్రయత్నం జరగాలని స్థూలంగా చర్చాగోష్టి ఒక అభిప్రాయానికి వచ్చింది.

నాణ్యమైన, విశ్వసనీయమైన సమాచారం కోసం ప్రజలు వికీపీడియాపై ఆధారపడతారని, అందుకే ప్రతీ సెకనుకు సుమారు ఎనిమిదివేల మంది వికీపీడియాను సందర్శిస్తారని చర్చా గోష్టిని ప్రారంభిస్తూ ఐఐఐటి ఆచార్యులు, శ్రీ వాసుదేవ వర్మ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే 25 భాషల్లో ఎనిమిది భారతీయ భాషలున్నప్పటికీ, వికీపీడియాలో ఇంగ్లీషు భాషతో పోలిస్తే కేవలం 0.5 నుండి 2 శాతంలోపే సమాచారం ఆయా భాషల్లో ఉందని అయన తెలిపారు. వికీపీడియాలో తెలుగు సమాచార పెంపుకై స్వీడన్ వికీపీడియా తరహా సమిష్టి కృషి జరగాలని ఆయన సూచించారు.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక రంగాలకు చెందిన సమాచారం అందుబాటులో ఉందని, రాష్ట్ర అవతరణ తర్వాత భాష, సాంస్కృతిక శాఖ అనేక పుస్తకాలను ప్రచురించిందని వాటిని వికీపీడియాలో పొందుపరిచేందుకు (స్వేచ్ఛా నకలు) అనుమతిచ్చామని భాష, సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ తెలిపారు. వికీపీడియాలో తెలుగు సమాచారాన్ని పొందుపరిచే ప్రయత్నంలో భాష, సాంస్కృతిక శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు.

డిజిటల్ మీడియా వేదికలలో తెలుగు వాడుకను పెంచేందుకు తెలంగాణ ఐటీ శాఖ కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే ప్రపంచ తెలుగు మహాసభల సందర్బంగా ‘డిజిటల్ తెలుగు’ కార్యక్రమాన్ని నిర్వహించామని డిజిటల్ మీడియా విభాగం సంచాలకులు శ్రీ దిలీప్ కొణతం పేర్కొన్నారు. చాలా మంది వ్యక్తులు, సముదాయాలు ఇప్పటివరకు చేసిన కృషిని వివరిస్తూ ఇకపై రెట్టించిన ఉత్సాహంతో తెలుగు వికీపీడియా అభివృద్ధికై సంఘటితంగా పనిచేయాలని అయన అన్నారు. ఆ దిశగా జరిగే అన్ని కార్యక్రమాలలో తెలంగాణ ఐటీ శాఖ భాగస్వామి అవుతుందని తెలిపారు.

భవిష్యత్తు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా తెలుగు వికీపీడియా, ఇతర సహ ప్రాజెక్టులు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని వికీపీడియా ఔత్సాహికులు శ్రీ వీవెన్ అభిప్రాయపడ్డారు. రాశిపైనే కాకుండా వాసిపై కూడా దృష్టిపరచాలని, వికీపీడియా నియమాలను అనుసరిస్తూ సమాచారాన్ని పొందుపరచాలని దీనిపై అవగాహన పెంపొందించేందుకు శిక్షణా సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలుగు వికీపీడియా నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఐటీ శాఖ సహాయ సంచాలకులు శ్రీ మాధవ్ ముడుంబై, శ్రీమతి రాధిక మామిడి, శ్రీ కృపాల్ కశ్యప్, శ్రీ కూర్మనాథ్, శ్రీ ప్రణయ్ రాజ్, శ్రీ చిట్టిపంతులు, శ్రీ కట్టా శ్రీనివాస రావు, శ్రీ నరేందర్ గున్రెడ్డి, శ్రీ అరవింద్ ఆర్య, శ్రీ మనోహర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Dollyrajupslp 10:37, 25 నవంబర్ 2019 (UTC)

Enhancing Content and Community Development - Round Table meeting - Minutes of the meeting మార్చు

Enriching content and Community development in Wikipedia - first Round Table meeting 16-11-2019 - Minutes of the meeting

1.Prof. Vasudeva Varma 2.Prof. Radhika Mamidi 3.Sri. Dileep Konatham 4.Sri. Praveen Garimella 5.Prof. Suryakanth V. Gangasetty 6.Sri. Veeven 7.Sri.Pranay Raj Vangari 8.Sri. Katta Srinivasa Rao 9.Sri. Aravind Arya P 10.Sri. Mahesh Idupulapati 11.Ponnala Chandrasekhar 12.Burra Manohar Goud 13.Sri. Kripal Kasyap 14.Sri. Narendar Gun Reddy 15.Sri. V. Jagan Reddy 16.Sri. Chitti pantulu 17.Sri. Kurmanath 18.Sri. Madhav M 19.Sri. Satyaprasad 20.Sri. Nikhil Pretham 21.Smt. P.S.L. Prasanna

Issues for the discussion

1. Introduction to the project, its vision, and its goals. 2.Comparison and analysis with other Wiki projects. 3. Discussed the development happened in the past 6 months. 4. The participants are requested to share their experiences, ideas for the enhancement of the project. 5. Creating focus groups like Community Development, Training, and Awareness, Content creation, Technology. 6. Scheduling the next meeting


Action Items and timelines

1. Starting a Web page for the Project - Completed

2. As suggested adopting Wiki Sandbox for the project – Sandbox is ready to use

3. Online enroll form for volunteers – Yet to be created

4. Paericaiptents enroll as a member of their preferred focus group.

5. Volunteers for Wikipedia stall in Bookfair – Need to finalize

6. Team identification for creating Training material - Need to finalize

7. The next Meeting date fixed for December 7th, 2019 and a training workshop will be conducted for learning to create an article. – Planning has to be done.


Spokespersons at the conference on "Enriching content and Community development in Wikipedia " at the IIIT and Hyderabad campus said that collective efforts should be made to create a collective effort to increase Telugu information on Wikipedia. For this purpose, round table discussion was based on the idea that this effort should be undertaken in five categories: "community development", "information availability", "training and awareness", "technology" and "research".

Inaugurating the conference, IIIT professor, Sri Vasudeva Verma, said that people rely on Wikipedia for quality and reliable information and that about eight thousand people visit Wikipedia every second. he informed that Indian languages, but Wikipedia contains only about 0.5 to 2 percent of their information compared to English Wiki. He suggested that Sweden wiki case should help to the development content of Telugu Wikipedia

Sri Mamidi Harikrishna, Director, Department of Language and Culture, said. After the emergence of the state, the Department of Language and Culture has published many books. and There an availability of the information in different fields form the state of Telangana and it is available as copyright-free content. He added that the Department of Language and Culture is fully cooperating with the effort to make Telugu information available on Wikipedia.

Dileep Konatham, Director, Digital Media, IT&C Department, Government of Telangana said taht Telangana IT department is working to increase Telugu usage in digital media platforms, as part of the World Telugu Conferences he also explained the contributions of so many people and groups so far, he said that with the doubling enthusiasm, the Telugu Wikipedia needs to work together for development. Telangana IT department will be a partner in all the activities that are going on.

Wikipedian and Technical Telugu enthusiasts Veeven said that There is a need to develop Telugu Wikipedia and other collaborative projects to meet future technical requirements. Telugu Wikipedia administrators said they were ready to conduct training seminars to raise awareness on the need to focus on more on information Telugu Wikipedians has stated that they are ready to conduct training seminars to raise awareness of this.

Thanks Dollyrajupslp 11:00, 25 నవంబర్ 2019 (UTC)

చర్చలను సంబంధించి మార్చు

వాడుకరి:Dollyrajupslp గారు... తెవికీలో సమాచారం, ప్రచార వివరాలు, సమావేశ వివరాలు, నివేదికలు అన్ని తెలుగులోనే రాయాల్సివుంటుంది. అలాగే, చర్చపేజి లేదా రచ్చబండలో కొత్త అంశాలను చేర్చడం వంటివి అప్పటివరకు ఉన్న అంశం కింద రాయాల్సివుంటుంది. అలా రాస్తే సముదాయ సభ్యులు చూసేందుకు అనుకూలంగా ఉంటుంది. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:33, 2 డిసెంబరు 2019 (UTC)Reply

Pranayraj Vangari గారు.... సమావేశ వివరాలు తెలుగుతొ పాటు ఆంగ్లములొ కుడా పబ్లిష్ చెయ్యలని ముఖ్య సభ్యులు నిర్ణయించారు. Dollyrajupslp 10:33, 3 డిసెంబరు 2019 (UTC)Reply

ఇప్పటివరకైతే అలా రాయలేదు. వికీపీడియాలో ముఖ్య సభ్యులు అంటూ ఎవరూ ఉండరు, అందరూ ముఖ్యమైన వారే. కాబట్టి, ఈ విషయం గురించి రచ్చబండ ద్వారా సముదాయంలోని సభ్యులతో చర్చించి నిర్ణయించుకుంటే మంచిది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:09, 3 డిసెంబరు 2019 (UTC)Reply

వికీపీడియా అవగాహన సదస్సు మార్చు

తెలుగు వికీపీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును మరియు వికీపీడియాలో వ్యాసాలు రాసే కార్యక్రమానికి అవసరమైన మూలాల గురించి చర్చ నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులో పాల్గొనువారు వికీపీడియాకి తోడ్పడటమెలాగో నేర్చుకుని తద్వారా తెలుగులో కూడా అపూర్వ విజ్ఞాన సంపందని పోగేసే మహా ప్రయత్నంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నాం.

తేదీ :డిసెంబర్ 7 2019 స్థలం: ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గచ్చిబౌలీ , హైదరాబాద్ - 500032 సంభాషించుటకు : 99592 63974/ 93965 33666 మీ రాకను తెలియచేయుటకు ఈమెయిల్ : bhashakadhambari@gmail.com వాట్సాప్ / ఎస్ యం ఎస్ : 9959263974 Dollyrajupslp 10:44, 3 డిసెంబరు 2019 (UTC)

తెలుగు వికీపీడియా సదస్సు 2020 - ఆహ్వానం మార్చు

ఐఐఐటి హైదరాబాద్, భారత భాషలలో వికీపీడియా అభివృద్ధికి కృషిచేస్తోంది. ఈ కార్యక్రమము లో భాగంగా “తెలుగు వికీపీడియా సదస్సు 2020” ను శనివారం తేదీ 8 ఫిబ్రవరి 2020 ఉదయం 9:00 గంటల నుండి మధ్యాన్నం 1:00 గంట వరకు నిర్వహిస్తున్నారు. భారతీయ భాషలలో (తెలుగు మరియు హిందీపై దృష్టి సారించడం) వికీపీడియా కంటెంట్ను రాబోయే 5 సంవత్సరాలలో అనేక వేల రెట్లు పెంచే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని మేము చేపట్టాము. భారత ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వాలు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి.

ఈ సదస్సులో ప్రొఫెసర్ రాజ్ రెడ్డి, కార్నిగి మేలోన్ యూనివర్సిటీ ,పిట్స్ బర్గ్, ట్యూరింగ్ అవార్డుగ్రహీత, చైర్మన్ ఐఐఐ టి హైదరాబాద్, డా. జయప్రకాశ్ నారాయణ్ , ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, ఉస్మానియా యూనివర్సిటీ, మరియు శ్రీ మామిడి హరికృష్ణ (భాష మరియు సంస్కృతిక శాఖ డైరెక్టర్, తెలంగాణ ప్రభుత్వం) వక్తలుగా పాల్గొంటున్నారు. .

కార్యక్రమము వివరాలు

వేదిక - కే ఆర్ బి ఆడిటోరియమ్ , 4వ అంతస్తు కోహ్లీ బ్లాక్, ఐఐఐటీ, హైదరాబాద్ క్యాంపస్, గచ్చిబౌలి, హైదరాబాద్

సమయం - ఉదయం 9 గంటలనుండి మధ్యాన్నం 1 గంట వరకు. Dollyrajupslp (చర్చ) 09:20, 4 ఫిబ్రవరి 2020 (UTC)Reply

పేజీ మెరుగుపరచడం మార్చు

వాడుకరి:Kasyap గారు, పేజీలో చాలా అంశాల నివేదికలున్నాయి. ప్రతిపాదనవరకే ఈ పేజీలో వుంచి, మిగతా వాటికి వేరే పేజీలు తయారుచేసి, ప్రాజెక్టు పేజీనుండి లింకులివ్వడం బాగుంటుంది. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 09:09, 24 ఫిబ్రవరి 2021 (UTC)Reply

అర్జున గారు మీరు సూచించిన విధంగా తెవికీ-ఐఐఐటి లో సంగ్రహం అయిన సమాచారం ఇచ్చి , వివరాలకోసం లింకులు ఇచ్చాను, ఇంకా ఏమైనా మార్పులు సూచించగలరు Kasyap (చర్చ) 09:22, 24 ఫిబ్రవరి 2021 (UTC)Reply
వాడుకరి:Kasyap గారు, నేను గమనించాను. అది బాగానే వున్నది. నా వ్యాఖ్య ఈ చర్చకు అనుబంధమైన ప్రాజెక్టు పేజీ గురించి. దానిలో చాలా నివేదికలున్నాయి. ఉదాహరణకు వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదన#హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2019 తెవికీ స్టాల్ నివేదిక. ఆ విభాగం వేరే పేజీగా సృష్టించితే స్పష్టత మెరుగవుతుంది.--అర్జున (చర్చ) 09:26, 24 ఫిబ్రవరి 2021 (UTC)Reply
వాడుకరి:Kasyap గారు, దానికి వేరే పేజీ వున్నట్లున్నంది. దానిని ప్రధాన ప్రాజెక్టు నుండి లింకు చేశారు. అప్పుడు ఈ పేజీనుండి తొలగించితే సరిపోతుంది. అలానే మిగతావన్నీకూడా సరిచేయండి--అర్జున (చర్చ) 09:29, 24 ఫిబ్రవరి 2021 (UTC)Reply
వాడుకరి:Kasyap గారు, కొన్ని నివేదికలు చర్చాపేజీలలో కూడా వున్నాయి(ఉదాహరణ). వాటిని కూడా తగిన విధంగా ప్రాజెక్టు ఉపపేజీలుగా చేయటం మంచిది. --అర్జున (చర్చ) 09:34, 24 ఫిబ్రవరి 2021 (UTC)Reply
Return to the project page "వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదన".