వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/గోదావరి పుష్కరాలు

పరిధిని గోదావరి నదీ సంస్కృతికి విస్తరింపజేయడం మార్చు

గోదావరి పుష్కరాల నుంచి ప్రాజెక్టు పరిధిని గోదావరి నదీ పరిసర గ్రామాలను గుర్తించడం వరకూ ఎలానూ విస్తరించారు. పుష్కరాల సమాచారం అతిముఖ్యమైన ప్రాధాన్యతగా పెట్టుకుని కొద్దిమాత్రం ప్రాధాన్యతతో గోదావరి సంస్కృతిని కూడా పరిధిలో చేర్చుకుంటే ఎలావుంటుందో ప్రాజెక్టు కోఆర్డినేట్ చేస్తున్న ప్రణయ్ రాజ్, కృషిచేస్తున్న రాజశేఖర్ గార్లు పరిశీలించండి. ఆ పరిధిలో గోదావరి వల్ల స్ఫూర్తిపొందిన రచయితలు కొందరు, సినీదర్శకులు కొందరు, గోదావరికి ఆనకట్ట కట్టిన కాటన్ దొర, అన్నపూర్ణగా పేరుపొందిన డొక్కా సీతమ్మ వంటి అతిముఖ్యులైన కొందరు వస్తారు. అలానే గోదావరి డెల్టా గురించి కూడా వ్యాసాన్ని అభివృద్ధి చేయవచ్చు. డెల్టాలో చూడముచ్చటైన లాకుల గురించి వ్రాయొచ్చు, ఫోటోలు విశ్వనాథ్ గార్ని అడగొచ్చు. అలానే పూర్తిగా గోదావరిని నేపథ్యంగా స్వీకరించిన గోదావరి, అందాలరాముడు వంటి సినిమాలు, పడవప్రయాణం వంటి కథలు, గోదావరి కథలు లాంటి పుస్తకాలూ స్వీకరించవచ్చు. వీలున్నంత అతిస్పష్టంగానే నిర్దేశించుకుంటే బావుంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పరిధిలో వీటిని అభివృద్ధి చేశాకా విజయవంతమైందనిపిస్తే వచ్చే ఏడాదో, ఆపై ఏడాదో వాడుకరి:విశ్వనాధ్.బి.కె. గారిని రిక్వెస్ట్ చేసి గోదావరి డెల్టా సంస్కృతి అనే పెద్ద ప్రాజెక్టు, దానికి పైన జిల్లాలవారెవరైనా సహకరిస్తే గోదావరి సంస్కృతి అన్న మరింత విస్తృతమైన ప్రాజెక్టూ చేపట్టవచ్చు. ప్రస్తుతం విశ్వనాథ్ గారు బిజీగా ఉన్నందున పూర్తిగా సహకరించలేకపోయినా, వెళ్ళిన ప్రతిచోటా తీసే ఫోటోలు మాత్రం చాలు మహాప్రసాదంగా స్వీకరించవచ్చు. ఏదేమైనా ప్రణయ్ చేసిన ప్రయత్నం, రాజశేఖర్ గారి ప్రోత్సాహం పరమాద్భుతం. గోదావరి ఎన్నో కోట్లమందికి అన్నపూర్ణ, మరెంతో గొప్ప సంస్కృతికి మూలం, ఎందరెందరో వైతాళికులను కన్న తల్లి. ఈ తల్లిని గురించి నాలుగుముక్కలు రాసే అవకాశం అపురూపం. మా గోదావరమ్మని గురించి రాస్తున్న తమ్ముడు ప్రణయ్ గొప్ప పరిశోధకునిగా పేరొందాలని, ఆ తల్లి తయారుచేసిన అందమైన పొదరిల్లైన మా డెల్టా ఫోటోలతో తెవికీ కళకళ్ళాడాలని నా ఆకాంక్ష. --పవన్ సంతోష్ (చర్చ) 07:00, 17 మార్చి 2015 (UTC)Reply

నిజంగా అద్భుతమైన ప్రాజెక్టు. దీనిని గురించి రేపు రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో జరుగనున్న తెలుగు వికీపీడియా అవగాహనా కార్యక్రమంలో వివరిస్తాను. ఆసక్తి ఉన్న వారిని చేర్చుతాను. సమాచార సేకరణలో నేనూ ఒక చేయ్యేస్తాను...--విశ్వనాధ్ (చర్చ) 11:09, 17 మార్చి 2015 (UTC)Reply
ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు, వాడుకరి:విశ్వనాధ్.బి.కె. గారు... మీరందరి సహకారంతో ప్రాజెక్టుకు మరింతగా ముందుకు తీసుకెళ్లగలను. --Pranayraj1985 (చర్చ) 10:18, 18 మార్చి 2015 (UTC)Reply
Return to the project page "వికీప్రాజెక్టు/గోదావరి పుష్కరాలు".