ప్రధాన మెనూను తెరువు

విజయవాడ నగరం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందినది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో గల నగరం. విజయవాడ రెండు వేల సంవత్సరాల చరిత్ర కలదిగా చరిత్రకారుల అభిప్రాయం.

చారిత్రక పేర్లుసవరించు

ఇంద్రకీలాద్రి పర్వతంపై లభించిన క్రీస్తు శకం 927-933 కాలం నాటి రెండవ యుద్ధమల్లుని శాసనం (ఇది ఒక శిలాఫలకంగా లభ్యం) ప్రకారం నేటి విజయవాడ రాజేంద్ర చోళపురం అనే పేరున్నట్లు పేర్కొన్నప్పటికి రెండు సవత్సరాల చరిత్రలో బెజవాడ, హెచ్చవాడ, విజయవాటిక (శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో విజయవాటిక అని పేర్కొనటం జరిగింది) గా పిలువబడి నేడు విజయవాడగా పిలవబడుతోంది.