విజయానికి అయిదు మెట్లు
(విజయానికి ఐదు మెట్లు నుండి దారిమార్పు చెందింది)
విజయానికి అయిదు మెట్లు అనేది ఆధునిక తెలుగు నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన ఒక పుస్తకం. ఇందులో వ్యక్తిత్వ వికాసం, మనో విజ్ఞానానికి సంబంధించిన విషయాలున్నాయి. ఈ పుస్తకం లక్ష కాపీలకు పైగా అమ్ముడైంది.[1] జీవితంలో నిస్పృహకు గురైనప్పుడు ఈ పుస్తకం చదవడం ద్వారా స్ఫూర్తి పొందినట్లు యండమూరికి పలువురు చెప్పారు.[2]
విజయానికి అయిదు మెట్లు. | |
విజయానికి అయిదు మెట్లు పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | యండమూరి వీరేంద్రనాథ్ |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | మనో విజ్ఞాన గ్రంథం |
ప్రచురణ: | నవసాహితీ బుక్ హౌస్, ఏలూరు రోడ్, రామమందిరం వద్ద, విజయవాడ |
విడుదల: | జూన్-1995 |
పేజీలు: | 453 |
పుస్తకంలో ఐదు మెట్లు
మార్చు- 1. గెలుపుకు పునాది ఓటమి
- జీవితం ఒక యుద్ధం -- బలహీనతలు, ఆత్మన్యూనత, టెన్షన్, కోపం, భయం, ఆందోళన, విసుగు, అనుమానం, అశాంతి, దిగులు, బోర్, అభద్రతాభావం, వ్యసనం, ఒంటరితనం.
- 2. మేరే ది-బెస్ట్
- మానవ సంబంధాలు -- అవసరం, అభిరుచి, ఐడెంటిటీ క్రైసిస్, ఆకర్షణ, కమ్యూనికేషన్, ఆధారపడటం, మొహమటం, శాడిజం, అసూయ, కసి, స్వార్థం, నిస్వార్థం, నిర్మాణాత్మక స్వార్థం, స్వేచ్ఛ.
- 3. గెలుపు వైపు మలుపు
- మన ఆయుధాలు -- కామన్ సెన్స్, పాజిటివ్ థింకింగ్, ఏకాగ్రత, స్థాయి సామర్థ్యం, పగటి కలలు, నాయకత్వ లక్షణాలు, ప్రేరణ, అంతర్ముఖాలోచనం, భాష సంభాషణ, తప్పులను ఒప్పుకోవడం, గొప్పతనం గుర్తించడం, ఆత్మావగాహన, తర్కం, దృక్పథం, టైమ్ మానేజ్ మెంట్, అన్వేషణ, మానసిక వ్యాయామం, జ్ఞాపక శక్తి, వయసు, అందం, ఆరోగ్యం, రొమాన్స్, రిలాక్సేషన్, పరిణతి, రిస్క్, నిర్వహణ, అంకితభావం.
- 4. డబ్బు సంపాదన
- డబ్బు ఎలా సంపాదించాలి -- ప్రో ఆక్టివ్ థింకింగ్, డబ్బు ఎందుకు సంపాదించాలి, కౌటిల్యుని అర్థశాస్త్రం, డబ్బు నిర్వహణ, ఆలోచన.
- 5. అంతిమ విజయం
- వైకుంఠ పాళి -- ఓటమి, అస్పష్ట విజయం, నిరర్ధక విజయం, సంపూర్ణ విజయం, ప్రేమ, శాంతి, సంతృప్తి.
కొన్ని విశేషాలు
మార్చు- విజయానికి ఐదు మెట్లు పుస్తకం మార్కెట్ లో రిలీజయిన నెలరోజులలో మొదటి ప్రచురణ పూర్తిగా అమ్ముడయి రికార్డు సృష్టించింది.
- ఎలక్ట్రానిక్ రంగపు ఉధృతానికి దాదాపు పాపులర్ నవలా రచయితలందరూ అస్త్ర సన్యాసం చేస్తున్న ఈ రోజులలో ఒక ప్రాంతీయ భాషలో మానసిక విశ్లేషణ పై వ్రాసిన పుస్తకం వరుసగా ఇరవైసార్లు ముద్రితమయ్యేంతగా విజయవంతమవడం ఒక రికార్డు.
- ఈ పుస్తకంపై ప్రచురణ కర్తకూ రచయితకూ కలసి లక్షకు పైగా ఉత్తరాలు వచ్చాయి.
- ఈ పుస్తకం ప్రచురించిన తరువాత నవసాహితి అధినేత కొండపల్లి ప్రకాశరావుకి 1996 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక ప్రచురణ కర్తగా అఖిలభారత ప్రచురణల సమాఖ్య ఢిల్లీ వారిచే అవార్డు లభించింది.
మూలాలు
మార్చు- ↑ "తెలుగు నవలకు "కమర్షియల్" హీరో.. యండమూరి". Zee News Telugu. 2017-11-14. Retrieved 2022-02-16.
- ↑ Nadadhur, Srivathsan (2017-06-08). "Yandamoori Veerendranath interview: Turning a new page". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-02-16.