విజయ్ కేల్కర్

భారతీయ ఆర్థికవేత్త

విజయ్ కేల్కర్ (జననం: మే 15, 1942) ఈయన భారతీయ ఆర్థికవేత్త, విద్యావేత్త. ఈయన పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత.[1]

విజయ్ కేల్కర్
జననం (1942-05-15) 1942 మే 15 (వయసు 81)
జాతీయతభారతీయుడు
రంగంమాక్రో ఆర్థికశాస్త్రం, పబ్లిక్ ఎకనామిక్స్
పూర్వ విద్యార్థికాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పూణే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్కిలీ
పురస్కారములుపద్మవిభూషణ్

తొలినాళ్ళ జీవితం మార్చు

ఈయన 1942, మే 15 న జన్మించాడు. ఈయన 1963లో పూణే లోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బి.ఈ. పూర్తిచేసాడు. 1965లో తన ఎమ్. ఎస్ ను మిన్నెసోటా విశ్వవిద్యాలయం నుంచి, తన పిహెచ్. డి. విద్యను ఆర్థిక శాస్త్రం విభాగంలో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ నుంచి పూర్తిచేసాడు.

కెరీర్ మార్చు

ఈయన హైదరాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, సెంటర్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఖాట్మండు, సౌత్ ఆసియా ఇన్స్టిట్యూట్, హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయం, జర్మనీ, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా బోధించాడు. ఈయన భారత ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయ సంస్థలలో వివిధ సీనియర్ స్థాయి పదవులను నిర్వహించాడు:

  • ప్రెసిడెంట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్
  • CSIR-Tech Pvt Ltd (www.csirtech.com) ఛైర్మన్.
  • నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్
  • ఫోరం ఆఫ్ ఫెడరేషన్స్, ఒట్టావా ఛైర్మన్, భారతదేశం
  • డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు.
  • 1999 నుండి ఆగస్టు 2002 వరకు అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ దేశాల సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
  • భారత ప్రభుత్వంలో ఆర్థిక కార్యదర్శి
  • 1998-1999 టారిఫ్ కమిషన్ చైర్మన్, భారత ప్రభుత్వం.
  • 1997-1998 పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి, భారత ప్రభుత్వం.
  • 1994-1997 ఇంటర్నేషనల్ ట్రేడ్ డివిజన్ కు డైరెక్టర్ & కోఆర్డినేటర్, జెనీవా, స్విట్జర్లాండ్.
  • 1991-1994 బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ కాస్ట్స్ & ప్రైసెస్ ఛైర్మన్
  • 1987-1991 ప్రధాన మంత్రికి ఆర్థిక సలహా మండలి కార్యదర్శి, భారత ప్రభుత్వం, న్యూ ఢిల్లీ.
  • 1985-1988 ఆర్థిక విధానం & ప్రణాళిక, పెట్రోలియం , సహజ వాయువు మంత్రిత్వ శాఖ సలహాదారు,
  • 1982-1987 వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆర్థిక సలహాదారు, భారత ప్రభుత్వం.
  • 1977-1981 గ్రీన్ ఇన్ఫ్రా లిమిటెడ్ బోర్డు ఛైర్మన్.

కమిటీలు, కమీషన్లు మార్చు

ఈయన నేతృత్వం వహించిన కమిటీలు మారు కమిషన్లు

  • పిపిపిపై కెల్కర్ కమిటీ
  • ఎన్‌సిఎడి జాయింట్ వెంచర్ (జెవి) కమిటీ (90 సీట్ల నేషనల్ సివిల్ ఎయిర్క్రాఫ్ట్)
  • కెల్కర్ టాస్క్ ఫోర్స్ (ఇది జీఎస్టీని సిఫారసు చేసింది).

పురస్కారాలు మార్చు

ఈయనకు 2011 లో భారత ప్రభుత్వం , రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

మూలాలు మార్చు