విజయ విలాసము
విజయవిలాసం కావ్యాన్ని చేమకూర వెంకటకవి రచించారు. ఈయనను వెంకన్న, వెంకటయ్య అని వ్యవహరించేవారు.
విజయ విలాసము | |
కృతికర్త: | చేమకూర వెంకటకవి |
---|---|
దేశం: | భారత దేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | ప్రబంధం |
ప్రచురణ: | |
విడుదల: | 17వ శతాబ్దం |
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/c/c3/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B8%E0%B0%AE%E0%B1%81.webp/200px-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B8%E0%B0%AE%E0%B1%81.webp.png)
కథ
మార్చువిజయుడు అనగా అర్జనుడు. అతడి విజయగాధను తెలిపేది కనుక ఇది విజయవిలాసం అనబడింది. ఇందులో ముగ్గురు కావ్యనాయికలు, ఈ నాయకుడు అర్జునుడు కలరు. కావ్యనాయికలు, ఉలూచి, చిత్రాంగద, సుభద్ర లు.
రచన నేపథ్యం
మార్చుసా.శ.1630 కాలానికి చెందిన చేమకూర వెంకన్న స్వయంగా కవియైన రఘునాథ నాయకుని ఆస్థానంలోని ప్రముఖ కవి. దక్షిణాంధ్ర కాలానికి సంబంధించిన శృంగారభరితమైన ఇతివృత్తాన్ని చేమకూర వెంకన్న చమత్కారభరితమైన శైలితో మేళవిస్తూ విజయ విలాసము కావ్యాన్ని రచించారు.
ఇతివృత్తం
మార్చువిజయ విలాసంలో కథ భారతంలోనిది. బ్రాహ్మణ గోసంరక్షణార్థం, విల్లంబుల కోసం అర్జునుడు ధర్మరాజు అంతఃపురం వైపు వెడతాడు. ఆ ఏడాది ద్రౌపదీదేవి ధర్మరాజు సన్నిధిని ఉంది. నియమం ప్రకారం అర్జునుడు అటు వెళ్లకూడదు. కానీ పరాకున వెళ్ళాడు. దానికి ప్రాయశ్చిత్తంగా భూప్రదక్షిణకు బయలుదేరాడు. తోడుగా విశారదుడనే నర్మసచివుడు కూడా వెళ్ళాడు. గంగానది యొక్క పరీవాహక ప్రాంత పుణ్యక్షేత్ర సంధర్శనలో ఉలూచి అనే నాగకన్య అతడిని మోహించి తనవెంట నాగలోకానికి తీసుకెళ్ళడం వారిరివురకూ ఇలావంతుడు జన్మించడం, తదనంతరం పాండ్యరాజ్యం సంధర్శనలో మలయధ్వజ మహారాజు కూతురు అయిన చిత్రాంగదను వివాహమాడి బబ్రువాహనుని కని అతడిని మామగారికి దత్తతివ్వడం, తర్వాత ద్వారక సంధర్శనలో శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్రనీ వివాహమాడడం ఇదీ కావ్యంలోని ఇతివృత్తం.
అంకితము
మార్చుఈ గ్రంథమును తంజావూరు రాజయిన రఘునాథరాజు నాకు అంకితము ఇవ్వబడింది.
విశేషములు
మార్చుఈ గ్రంథమునకు తాపీ ధర్మారావు గారు రచించిన హృదయోల్లాస విలాసము అను వ్యాఖ్యానము బహుళ ప్రాముఖమైనది.
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- సారస్వత బ్లాగ్ స్పాట్లో విజయవిలాసము యొక్క విపులమైన వ్యాసం.
- మధుర తంజావూరు నాయక రాజుల నాటి ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - మధుర తంజావూరు నాయకరాజుల కాలంలో విలసిల్లిన సాహిత్యాన్ని గురించిన పరిశోధన.
- సారస్వత బ్లాగ్ స్పాట్లో విజయవిలాసము యొక్క విపులమైన వ్యాసం.
Dhakshinandra yugam lo vachana rachanalu శ్రీ రంగ మహాత్యం, మాఘ మాసం,జైమిని భారతం, mahaabaaratham, vachana vichitra రామాయణం.