విద్యుదావేశం

విద్యుదావేశం ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, ఇంకా ఇతర పరమాణు కణాల ప్రాథమిక లక్షణం.[1] ఎలక్ట్రాన్లు ఋణవిద్యుదావేశం కలిగి ఉంటాయి. ప్రోటాన్లు ధన విద్యుదావేశం కలిగి ఉంటాయి. ధన, ఋణావేశాలు కలిగినవి పరస్పరం ఒకదానితో ఒకటి ఆకర్షింపబడుతూ ఉంటాయి. ఇందువల్లనే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు కలిసి జట్టుగా ఏర్పడి పరమాణువులను ఏర్పాటు చేస్తున్నాయి. ఒకే రకమైన ఆవేశం కలిగినవి వికర్షించుకుంటూ ఉంటాయి.

Electric field induced by a positive electric charge
Electric field induced by a negative electric charge
ధన, ఋణవిద్యువావేశాలు

విద్యుదావేశాన్ని ప్రామాణిక కొలతల ప్రకారం కూలూంబ్స్ (coulombs) లలో కొలుస్తారు.

లోహాలు విద్యుత్ ప్రవాహానికి అనువైన వాహకాలు. వీటిలో విద్యుత్ ప్రవహిస్తున్నపుడు ఏదైనా మధ్యచ్ఛేదం (cross section) ద్వారా ఒక సెకను కాలంలో ఒక ఆంపియరు విద్యుత్ ప్రవహిస్తే అక్కడ ఒక కూలూంబ్ విద్యుదావేశం ఉన్నట్లు లెక్క.

మూలాలుసవరించు

  1. "electric charge | Properties, Examples, Units, & Facts". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2021-04-22.