ప్రధాన మెనూను తెరువు

వినోద్ ఖోస్లా (జననం జనవరి 28, 1955 మహారాష్ట్ర లోని పుణెలో జన్మించిన ఒక ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ [2]). సిలికాన్ వ్యాలీని ప్రభావితం చేసిన ప్రధానమైన వ్యక్తుల్లో ఒకరు. సన్ మైక్రోసిస్టమ్స్ సహవ్యవస్థాపకుల్లో ఒకరు. 1986 లో ప్రారంభించబడిన క్లీనర్, పెర్కిన్స్, కౌఫీల్డ్, బయ్యర్స్ సంస్థలో ప్రధాన వాటాదారు.'ఫోర్బ్స్' 2013 లో అమెరికాలో అత్యంత ధనవంతులైన 400 మందితో కూడిన జాబితాలో వినోద్ ఖోస్లా 352 స్థానంలో నిలిచారు. ఆయన సంపద 1.5 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ లెక్కగట్టింది.

వినోద్ ఖోస్లా
Vinod Khosla, Web 2.0 Conference.jpg
జననం: (1955-01-28) 1955 జనవరి 28 (వయస్సు: 64  సంవత్సరాలు)
పుణె
వృత్తి: వెంచర్ క్యాపిటలిస్ట్
Net worth:$1.5 billion [1]
భర్త/భార్య:నీరు ఖోస్లా
సంతానం:నీనా, అను, వాని, నీల్

బాల్యం, విద్యాభ్యాసంసవరించు

ఖోస్లా 14 ఏళ్ళ వయసులో ఉండగా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టైమ్స్ అనే పత్రికలో ఇంటెల్ కంపెనీ స్థాపించడాన్ని గురించి చదివి దానివల్ల ఉత్తేజితుడై సాంకేతికరంగంలో ప్రవేశించాలని కలలు కన్నాడు. ఐఐటి ఢిల్లీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ పట్టాను, కార్నెగీ మిలన్ విశ్వవిద్యాలయం నుంచి బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్యనూ పూర్తి చేశాడు. తరువాత స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీయే పూర్తి చేశాడు.

కెరీర్సవరించు

సన్ మైక్రోసిస్టమ్స్సవరించు

1980లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాక, సహోధ్యాయులైన స్కాట్ మెకన్లీ, యాండీ బెక్టోల్షీమ్, చాలిఫోర్నియా, బర్కిలీ విశ్వవిద్యాలయానికి చెందిన బిల్ జాయ్ మొదలైనవారితో కలిసి సన్ మైక్రోసిస్టమ్స్ ను స్థాపించాడు. 1985లో ఖోస్లా సన్ ను వదిలి వేసి క్లీనర్ పెర్కిన్స్ కాఫీల్డ్ అండ్ బయ్యర్స్ అనే వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థలో భాగస్వామిగా చేరాడు.

వ్యక్తిగత సమాచారంసవరించు

ప్రస్తుతం ఖోస్లా వుడ్‌సైడ్ కాలిఫోర్నియాలో తన భార్య నీరూ ఖోస్లా, పిల్లలు నీనా, వాణి, అను, నీల్ లతో కలిసి నివాసముంటునన్నాడు.

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు