ప్రధాన మెనూను తెరువు

విప్రనారాయణ (1937 సినిమా)

(విప్రనారాయణ ( అరోరా) నుండి దారిమార్పు చెందింది)

1937లో విడుదలైన విప్రనారాయణ తెలుగు చిత్రాన్ని కలకత్తాలో నిర్మించారు. దీని దర్శకుడు అహీంద్ర చౌదరి, ఛాయాగ్రాహకుడు నిమాయి ఘోష్, సంగీతదర్శకుడు ప్రఫుల్ల మిత్ర తదితర సాంకేతిక వర్గమంతా బెంగాళీవాళ్ళే. ఈ సినిమాలో 12 ఏళ్ల సూర్యకుమారితో పాటపాడించటానికై ప్రత్యేకంగా ఆమె కొరకు సినిమాలో ఒక పాత్రను సృష్టించారు.[1] ఈ సినిమాతోనే ఛాయాగ్రాహకునిగా పరిచయమైన నిమాయి ఘోష్ కాంచనమాలకు తొలిసారిగా తెరపరీక్ష చేశాడు.[2] 1937, నవంబర్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రంకు ఆహింద్ర చౌదరి దర్శకత్వం వహించగా ఈ చిత్రంలో చిత్తజల్లు కాంచనమాల, కస్తూరి లక్ష్మీనరసింహారావు, టంగుటూరి సూర్యకుమారి తదితరులు నటించగా, ప్రఫుల్ల మిత్ర సంగీతం అందించాడు.

విప్రనారాయణ
(1937 తెలుగు సినిమా)
దర్శకత్వం అహీంద్ర చౌదరి
తారాగణం చిత్తజల్లు కాంచనమాల,
కస్తూరి లక్ష్మీనరసింహారావు,
టంగుటూరి సూర్యకుమారి
సంగీతం ప్రఫుల్ల మిత్ర
నేపథ్య గానం కాంచనమాల, కస్తూరి నరసింహారావు
గీతరచన త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి
ఛాయాగ్రహణం నిమాయి ఘోష్
నిర్మాణ సంస్థ అరోరా పిక్చర్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం :అహీంద్ర చౌదరి
 • సంగీతం: ప్రఫుల్ల మిత్ర
 • నేపథ్య గానం: కాంచనమాల, కస్తూరి నరసింహారావు
 • గీతరచన: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి
 • ఛాయాగ్రహణం: నిమాయి ఘోష్
 • నిర్మాణ సంస్థ: అరోరా పిక్చర్స్

పాటలుసవరించు

 1. ఆర్తత్రాణపరా రంగా అనవరతాశ్రితరక్షణ దీక్షా
 2. ఆహాహా ఆ పిల్ల ఎవ్వతె వోహో బంగారు పసిమి తళుకు
 3. ఏ నవరసగీతికలను పాడునో నా హృది వీణ
 4. ఏబ్రసాపడి తోటకేతెంచు నందాక పనిజేయు
 5. ఒరే మూఢ నీ వొక్కడవే ధృతితోడ మాయా బాధ త్రోసి కస్తూరి నరసింహారావు
 6. కరములు నీ పాద కైంకర్యమును మాని లలితాంగి
 7. కరుణామృతస్యందివిలోకన పాహిమాం రంగా రంగా
 8. కరుణింపగదవయ్య విపృపయినన్ గాసంత దోసము
 9. కాకులు రావిపండ్లు దిని జేర శిలామయదేవమందిరా
 10. గతించెగా యవ్వనభాగ్యము ఏవిధి తాళుదున్ కాంచనమాల
 11. గతియేమున్నది నాకు నీ చరణ కైంకర్యము లేకున్న
 12. చాల్ ఛీ ఛీ సిగ్గులేదా నీకు చాలు పొ బొంకులేలా టక్కుజేసి
 13. దడదడమని హృదయము దిన నిశము కొట్టుకొనెడి
 14. దేవా నాదు హృది జొచ్చితివా ఓహో దేవా
 15. నాధా నీ పదముల కర్పణజేసెద ప్రీతితో గైకొను
 16. నాధు కౌగలించునొ నాదు బాహులత నాదు మదిలోని వాంఛ
 17. నీపాదపద్మముల నిరతము గొలిచెద నెనరున బ్రోవవే
 18. ప్రేమకు ఫలితమిట్లు గలుగునే విరిసి కనుల నింపనాయె
 19. ప్రేమమె ధర్మము ప్రేమమె కర్మము ప్రేమమె ఈశ్వర చింత
 20. భరింప భరింప ప్రియ నిశ్చయము భరింప
 21. ముద్దులు పెట్టుకొంటాన్ ఓ పెండ్లమ నా పెండ్లమ
 22. రంగనాధ ప్రభో రావగదేల పిలిచి పిలిచి నే నలసితిన్
 23. రంగుపిల్లా వేయకుమా పదను చూపు బాణములు
 24. రతిసుఖసారే గతమభిసారే మదనమనోహర వేషం
 25. రూపమున గుంటికాదు కురూపి కాదు వారసతియై
 26. శ్రీహరీ కరుణాసాగరా దీనుల బ్రోవంగన్ భారంబంతయు
 27. స్మర శాస్త్రంబు పటింపజేతు జలజాక్షధ్యానమున్ మాన్పి
 28. స్వామి యేమని విన్నవింతు నతికష్టంబైన నా జన్మ
 29. హరిహరి యెంతమాట యెటులాడితివే తరలాయతాక్షి

మూలాలుసవరించు

బయటిలింకులుసవరించు