ప్రధాన మెనూను తెరువు

విలాస్‌రావ్ దేశ్‌ముఖ్

(విలాస్‌రావు దేశ్‌ముఖ్ నుండి దారిమార్పు చెందింది)

విలాస్‌రావ్ దగడోజీరావ్ దేశ్‌ముఖ్ (మరాఠీ: विलासराव दगडोजीराव देशमुख) (మే 26, 1945 - ఆగష్టు 14, 2012) భారత ప్రభుత్వంలో భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రిగా పనిచేశారు.[1] ఆయన రాజ్యసభ సభ్యుడిగా మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాకుండా ఆయన రెండుసార్లు, 1999 నుంచి 2003 వరకు మరియు 2004 నుంచి 2008 వరకు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా ఉన్న ఆయన మహారాష్ట్ర రాష్ట్రంలోని మరాఠ్వాడ ప్రాంతంలో ఉన్న లాతూర్ జిల్లాకు చెందిన వ్యక్తి.

విలాస్‌రావ్ దేశ్‌ముఖ్
विलासराव दगडोजीराव देशमुख
విలాస్‌రావ్ దేశ్‌ముఖ్

విలాస్‌రావ్ దేశ్‌ముఖ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
మే 28 2009
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్
ప్రధాన మంత్రి మన్‌మోహన్ సింగ్

పదవీ కాలము
సెప్టెంబర్ 7 2004 – డిసెంబర్ 5 2008

పదవీ కాలము
అక్టోబర్ 18 1999 – జనవరి 16 2003

వ్యక్తిగత వివరాలు

జననం మే 26, 1945
లాతూర్ జిల్లా లోని బభల్గావ్‌
మరణం ఆగష్టు 14, 2012
ముంబై
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి వైశాలి దేశ్‌ముఖ్
సంతానము 3
వృత్తి న్యాయవాది
మతం హిందువు

విషయ సూచిక

ప్రారంభ జీవితం మరియు కుటుంబంసవరించు

దేశ్‌ముఖ్ మే 26, 1945 న లాతూర్ జిల్లాలోని బభల్గావ్‌లో జన్మించారు. ఎం.ఈ.ఎస్. అబాసాహెబ్ గార్వార్ కళాశాల (పూణే విశ్వవిద్యాలయం) నుంచి సైన్స్ (B.Sc.) మరియు ఆర్ట్స్ (B.A.) కోర్సుల్లో పట్టభద్రుడయ్యారు, తరువాత ఎల్.ఎల్.బి చదివేందుకు ఐ.ఎల్.ఎస్. లా కళాశాల (పూణే విశ్వవిద్యాలయం)లో చేరారు.[2] ఆయన యువకుడిగా ఉన్న దశలోనే, ముఖ్యంగా కరువు సహాయ పనుల ద్వారా, సామాజిక కార్యకలాపాలు ప్రారంభించారు. ఆయన 1979లో ఉస్మానాబాద్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్‌గా మరియు మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు.[2]

ఆయన భార్య పేరు వైశాలీ దేశ్‌ముఖ్. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు - అమిత్, రితేష్ మరియు ధీరజ్.[2] అమిత్ దేశ్‌ముఖ్ లాతూర్ జిల్లా నుంచి మహారాష్ట్ర శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. రితేశ్ దేశ్‌ముఖ్ బాలీవుడ్ సినిమాల్లో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందాడు.[3] తెలుగు సినిమా నటి, జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్ళిచేసుకున్నది.

ఆయన చిన్న సోదరుడు దిలీప్‌రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. ఆయన మహారాష్ట్ర ప్రభుత్వంలో సహాయ, పునారావాస, క్రీడల, యువజన సంక్షేమ మరియు ప్రోటోకాల్ శాఖ మంత్రిగా పనిచేశారు.[4]

రాజకీయ జీవితంసవరించు

దేశ్‌ముఖ్ 1974 మరియు 1979 మధ్యకాలంలో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ సమయంలో ఆయన బభల్గావ్ గ్రామ పంచాయితీ సభ్యుడిగా ఉన్నారు, 1974 నుంచి 1976 వరకు ఈ గ్రామ సర్పంచ్ (గ్రామపెద్ద)గా విధులు నిర్వహించారు. 1974 నుంచి 1980 వరకు ఆయన ఉస్మానాబాద్ జిల్లా పరిషత్ సభ్యుడిగా మరియు లాతూర్ తాలూకా పంచాయితీ సమితి (లాతూర్ జిల్లా పంచాయితీ కమిటీ) ఉప-ఛైర్మన్‌గా పనిచేశారు.[2]

1975 నుంచి 1978 వరకు ఉస్మానాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో, ఆయన యువజన కాంగ్రెస్ పార్టీ ఐదు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కృషి చేశారు. ఉస్మానాబాద్ జిల్లాలో యువకులను సమీకరించి, భారత జాతీయ కాంగ్రెస్ జిల్లా విభాగానికి అధ్యక్షుడు అయ్యారు.[2]

1980 నుంచి 1995 వరకు మహారాష్ట్ర శాసనసభ సభ్యుడిగా పనిచేశారు, 1980, 1985 మరియు 1990 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.[5] ఈ కాలంలో, దేశ్‌ముఖ్ రాష్ట్ర మంత్రివర్గంలో హోంశాఖ, సాధారణ పరిపాలన, సహకార, ప్రజా పనుల, రవాణా, శాసనసభ వ్యవహారాలు, పర్యాటకం, వ్యవసాయం, జంతు పెంపకం, పాడిపరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, విద్య, సాంకేతిక విద్య, క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖలకు సహాయ మంత్రిగా మరియు మంత్రిగా పనిచేశారు.

1995 ఎన్నికల్లో 35,000 ఓట్ల తేడాతో ఆయన పరాజయం చవిచూశారు. 1999 సెప్టెంబరు లో జరిగిన ఎన్నికల్లో లాతూర్ నియోజకవర్గం నుంచి ఆయన రాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఆయన 91,000 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు, మహారాష్ట్రలో రెండు వరుస ఎన్నికల్లో ఇదే అతిపెద్ద విజయంగా గుర్తింపు పొందింది. 1999 అక్టోబరు 18న ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2003 జనవరి 17 వరకు ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర విభాగంలో బలమైన వర్గపోరు కారణంగా, కాంగ్రెస్ రాష్ట్ర పార్టీలో ప్రభావవంతమైన దళిత సభ్యుడు సుశీల్ కుమార్ షిండేకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించేందుకు 2003, జనవరిలో ఆయన ఈ పదవి నుంచి వైదొలిగారు.

అక్టోబరు 2004లో జరిగిన ఎన్నికల్లో కూడా లాతూర్ నియోజకవర్గం నుంచి ఆయన రాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యారు.[5]

1982 నుంచి 1995 వరకు వివిధ మహారాష్ట్ర ప్రభుత్వాల్లో ఆయన రెవెన్యూ, సహకార, వ్యవసాయ, హోం, పరిశ్రమలు మరియు విద్యా శాఖ మంత్రి పదవులు నిర్వహించారు.[2]

2004 నవంబరు 1లో ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.[6][7] నవంబరు 2008 ముంబయి దాడుల పరిణామాల నేపథ్యంలో దేశ్‌ముఖ్ 2008 డిసెంబరు 2న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.[8]

ఆయన తరువాత రాజ్యసభలో అడుగుపెట్టారు, తరువాత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2009 మే 28న దేశ్‌ముఖ్‌ను కేంద్ర మంత్రి మండలిలో భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రిగా నియమించారు.[9]

విదేశీ పర్యటనలుసవరించు

1980లో దేశ్‌ముఖ్‌కు జపాన్, థాయ్‌ల్యాండ్, ఫిలిప్పీన్స్, తైవాన్ మరియు హాంకాంగ్ దేశాల్లో పర్యటించే అవకాశం లభించింది, అంతేకాకుండా నెదర్లాండ్స్‌లోని అమెస్టర్‌డ్యామ్‌లో సహకార ఉద్యమాన్ని మరియు వ్యవసాయ అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు ఆయన విదేశీ పర్యటనలు చేపట్టారు. 1981లో ఆయన పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు జపాన్ దేశాల్లో కూడా పర్యటించారు.[2] మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, మే 2000లో, U.S.A. మరియు UK దేశాల్లో పర్యటించిన అధికార బృందానికి దేశ్‌ముఖ్ నేతృత్వం వహించారు, మహారాష్ట్రకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పెట్టుబడిదారులతో చర్చలు జరిపేందుకు ఈ సందర్భంగా వారు న్యూయార్క్, లాస్ ఏంజెలెస్, శాన్ జోస్, వాషింగ్టన్ మరియు లండన్ నగరాల్లో పర్యటించారు.

మంజ్రా ప్రాజెక్టుసవరించు

ఏప్రిల్ 1995 నుంచి 1999 అక్టోబరు 17 వరకు, విలాస్‌రావ్ పూర్తిగా మంజ్రా కో-ఆపరేటివ్ ప్రాజెక్టు విస్తరణపై దృష్టి సారించారు. ఇది ఒక చక్కెర మిల్లు. 1994-95లో మరియు 1997-98లో భారీస్థాయిలో చెరుకును పిప్పి చేయడం ద్వారా ఈ మిల్లు ఒక ప్రపంచ రికార్డును సృష్టించింది[ఆధారం కోరబడింది]. ఉత్పాదకత మరియు నిర్వహణలో నైపుణ్యానికి గుర్తుగా ఈ మిల్లు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో 34 అవార్డులు గెలిచింది[ఆధారం కోరబడింది].

విద్యా కార్యకలాపాలుసవరించు

దేశ్‌ముఖ్ మంజ్రా ఛారిటబుల్ ట్రస్టును స్థాపించారు. ఇది లాతూర్ మరియు ముంబయిల్లో అనేక కళాశాలలు నడుపుతుంది. వీటిలో కొన్ని - మంజారా ఆయుర్వేద వైద్య కళాశాల; లాతూరు వైద్యశాల, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెర్సోవా, అంథేరీ, ముంబయి[10] మరియు సుశీలాదేవి దేశ్‌ముఖ్ విద్యాలయం, ఐరోలీ, నవీ ముంబై.

మంజారా ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి రైతు "సంపన్నుడి"గా ఉండాలనే ఆయన చిరకాల కోరిక ఫలితంగా లాతూర్ జిల్లాలో అన్ని అభివృద్ధి పనులు ఆయన కృషి ఫలితంగానే జరిగాయి.

పుస్తక పఠనం, శాస్త్రీయ సంగీతం వినడం, వాలీబాల్ మరియు టేబుల్ టెన్నిస్ ఆడటాన్ని ఆయన అభిరుచులుగా చెప్పవచ్చు.[2]

ముంబయి క్రికెట్ సంఘంసవరించు

జులై 10, 2009న జరిగిన ఎన్నికల్లో విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఎటువంటి పోటీ లేకుండా ముంబయి క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడిగా (2009-2011) ఎన్నికయ్యారు.[11]

మరణంసవరించు

విలాస్‌రావు దేష్‌ముఖ్, 2012, ఆగష్టు 14 న మరణించారు.

మూలాలుసవరించు

 1. "Department of Heavy Industry". Ministry of Heavy Industries and Public Enterprises. Retrieved 6 February 2010.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 "Shri. Vilasrao Dagadoji Deshmukh" (PDF). Ministry of Heavy Industries and Public Enterprises. Retrieved 6 February 2010.
 3. "Ritesh Deshmukh Biography". apunkachoice.com. Retrieved 6 February 2010.
 4. "Dilip Deshmukh takes oath as Cabinet Minister". webindia123.com. 1 March 2009. Retrieved 6 February 2010.
 5. 5.0 5.1 "Election result Analysis 1978-2004". Election Commission of India. Retrieved 27 Janaury 2010. Check date values in: |accessdate= (help)
 6. "Wheel has taken full circle for Vilasrao Deshmukh". Rediff.com. 30 October 2004. Retrieved 6 February 2010.
 7. "Deshmukh sworn in Chief Minister of Maharashtra". The Hindu. 2 November 2004. Retrieved 6 February 2010.
 8. "Vilasrao Deshmukh quits as Maharashtra CM". India Today. 4 December 2008. Retrieved 6 February 2010.
 9. "Big comeback: Deshmukh in Union Cabinet". CNN-IBN. 28 May 2009. Retrieved 6 February 2010.
 10. "MANJARA Charitable Trust". Rajiv Gandhi Institute of Technology, Mumbai. Retrieved 6 February 2010.
 11. "Vilasrao Deshmukh Enters MCA Election Fray". Outlook. 3 July 2009. Retrieved 6 February 2010.