విల్లియం ఆర్థర్ స్టాంటన్

విల్లియం ఆర్థర్ స్టాంటన్ అమెరికా నగరం నుండి భారతదేశానికి 1890 లో వచ్చారు. మొదటిగా ఆయన నెల్లూరు ప్రాంతమునకు వెళ్ళారు. అక్కడ కొన్నిదినములు తర్ఫీదు తీసుకున్నతరువాత సతీసమేతంగా కర్నూలు ప్రాంతమునకు 1894 లో వచ్చారు. ఆయనకు ముందు ఏడుగురు మిషనరీలు ఆ ప్రాంతములో పరిచర్య చేశారు. అయితే వారెవ్వరూకూడ ఒకటిన్నర, రెండు సంవత్సరములకంటే ఎక్కువగా పనిచేయలేకపోయారు. అందుకు కారణం అక్కడ తరచుగా ప్రబలే జ్వరాలు, కరువు కాటకాలే.అందుకే కర్నూలును తెల్ల మనుషుల సమాధితోట అని పిలిచేవారు. అయితే స్టాంటన్ నలువది సంవత్సరములు ఈ ప్రాంతంలో పరిచర్య చేశారు.

పరిచర్య ప్రారంభం మార్చు

వీరు కర్నూలు నుండి తూర్పు, పడమటి దిశగా ఐదు మైళ్లు ప్రయాణం చేసి ఆ పరిధిలో వున్న గ్రామాలన్నిటిలో సువార్తను ప్రకటించారు. ఒక గ్రామంలో సాలె కులమునకు సంబంధించిన శూద్రుడు కన్నీటితో తన పాపాలు ఒప్పుకుని యేసు క్రీస్తు ప్రభువులో తన విశ్వాసాన్ని ప్రకటించాడు.

హిందూ సన్యాసి మార్చు

ఒక ఆదివారమున ఆత్మకూరు ఆలయములో విలియంగారు వాక్యమును బోధించుచుండగా అక్కడ చేతులు, తలపై విభూతి రేఖలతో, పొడవాటి జుట్టుతో, పచ్చని వస్త్రాలు ధరించిన హిందూ సన్యాసి వాక్యము వినుట చూసి విల్లియం గారు చూసి ఆశ్చర్యపోయారు. ఆరాధన ముగిసిన తర్వాత ఆ సన్యాసి విల్లియం గారి దగ్గరకు వచ్చి యేసు ప్రభునందు తన విశ్వాసాన్ని ఒప్పుకుని ఆయన వెంట వెళ్లుటకు నిర్ణయించుకున్నాడు. [ఆధారం చూపాలి]

ఈ సన్యాసీ విల్లియం గారితో సువార్త ప్రకటించుటకు గ్రామాలలో సంచరించేవాడు. అందరూ సన్యాసులకున్నట్లే ఈయనకు కూడా భంగి మత్తు సేవించే అలవాటు వుండేది. క్రైస్తవుడుగా వుండాలనుకుంటే దానిని వదిలివేయాలని విల్లియం గారు చెప్పినప్పుడు ఆ సన్యాసి దానిని వదిలేశారు.అతని చేతిలో హిందూ సన్యాసులు భజనకొరకు వుపయోగించే ఒక తంబుర వుండేది. వారు గ్రామాలకు వెళ్లినప్పుడు అతడు ఆ తంబురను పట్టుకుని క్రైస్తవ భక్తి గీతాలు పాడుతూ తన సాక్షాన్ని చెప్పేవాడు. అదే విధంగా ఒక సారి తన స్వజనులు నివసించే తన గ్రామానికి సువార్త చెప్పుటకు వచ్చినప్పుడు ఒక రాత్రి ఉన్నట్టుండి ఆయన కనిపించకుండా పోయారు.తరువాత ఆయన ఎక్కడా, ఎవ్వరికి కనిపించలేదు.ఇది వారి బంధువుల పనియే, వారు ఆయనను చంపివుండవచ్చు. [ఆధారం చూపాలి]

బనగానపల్లె మార్చు

ఆ మరుసటి సంవత్సరం కర్నూలుకు 50 మైళ్ల దూరంలో వున్న ఒక మహమ్మదీయ ఆస్థానమైన బనగానపల్లెను దర్శించారు.అప్పటికి ఈ ప్రాంతంలో సువార్త బహు కొద్దిగా పరిచయమైంది.అక్కడి ప్రతి స్థలములో సువార్తకు ద్వారాలు తెరువబడ్డాయి.[ఆధారం చూపాలి]

కరువు మార్చు

1897 లో సంభవించిన కరువు ఎంతో దుఖాన్నికలిగించింది. శక్తివంచనలేకుండా విల్లియం గారు కరువు బాధితులకు సహాయమందించారు. కరువు నివారణ నిధి ద్వారా ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమంలో విస్తారంగా పాల్గోన్నారు. వాటిలో భాగంగా వృద్దులకు ఆహారధాన్యం సరఫరా చేయడం, పనిచేయలేని తల్లులకు, అనాథ పిల్లలకు ఉచిత వంటశాలలు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత వర్షాలు మొదలైనప్పుడు ప్రభుత్వం తరపున పంటల నాట్ల కొరకు ఉచిత విత్తనాలు సరఫరా వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. వీటిద్వారా విలియంగారు ప్రజలకెంతో దగ్గరయ్యారు. కరువు తర్వాత పైర్లు పచ్చగా పెరిగాయి, మనుష్యుల హృదయాలు దేవునివైపు మరలాయి, 12 నూతన గ్రామాలు క్రైస్తవ్యం వైపు తిరిగాయి.[ఆధారం చూపాలి]

ఆ సంవత్సరాంతమునకు 137 మంది బాప్తీస్మాలు పొందారు.[ఆధారం చూపాలి]

దేవుడు వారి నిట్టూర్పును సంతోషానికి మార్చాడు.

సంఘముల స్థాపన మార్చు

కర్నూలు పొలములో విల్లియంగారు సేవ మొదలుపెట్టిననాటికి ఆత్మకూరు, కర్నూలులో తప్ప ఎక్కడా సంఘాలు లేకుండెను. స్థిరమైన క్రైస్తవ సమాజాభివృద్దికీ సంఘము అవసరమని గ్రహించి వారు ఆ దిశగా పనులు సాగించారు.

గూడూరు మార్చు

కర్నూలు పొలములో ఒక నూతన సంఘస్థాపన ఎంతో ప్రోత్సాహకరమైన సంఘటన. 1899 వ సంవత్సరం, నవంబరు 14న వివిధ గ్రామంలనుండి వచ్చిన దాదాపు 60 మంది సభ్యులతో గూడూరు గ్రామ సంఘంలో ఆరాధనను ప్రారంభించారు. కర్నూలు పొలములో యిదే మొదటి సంఘస్థాపన. గూడూరు కర్నూలుకు 20 మైళ్ళ దూరంలో పడమటి దిశలో ఉన్న ప్రాముఖ్యమైన పెద్ద గ్రామం.

పోలకల్లు మార్చు

1912 లో నవంబరు మాసంలో కర్నూలుకు పశ్చిమాన ఉన్న పోలకల్లు గ్రామంలో ఒక సువార్త కూడికను రెండు రాత్రులు ఏర్పాటు చేశారు. ఆలయం పిల్లలతో పెద్దలతో నిండిపోయింది. రామయ్య అనే ప్రసంగీకుడు తన మారుమనస్సును గూర్చిన సాక్ష్యాన్ని బహు గంభీరంగా వివరించాడు. కూడిక అనంతరం మొదటి రోజున ఐదుగురు, రెండవ రోజున పన్నెండు మంది లేచి నిలబడి ప్రభువును అంగీకరించారు.[ఆధారం చూపాలి]

నందికొట్కూరు మార్చు

అప్పటికి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నా ఈ ప్రాంతంలో పరిచర్య అంతగా జరగలేదు. 1912 లో ఒక రాత్రి ఈ ప్రాంతాన్ని దర్శించినప్పుడు ఆ రాత్రి పాలెం మొత్తం దేవుని వాక్యం వినడానికి కదలివచ్చింది. అంతకుముందెన్నడు జరగనివిధంగా 30 కుటుంబాలలోని స్త్రీ పురుషులు ప్రభువుకు సమర్పించుకున్నారు.[ఆధారం చూపాలి]

గాడిదమడుగు మార్చు

ప్రస్తుతం గార్గేయపురంగా పిలువబడుతున్న ఈ ప్రాంతంలో 20 సంవత్సరాలుగా వాక్యం ప్రకటింపబడుచున్నప్పటికి పాలెంలోని చాలామంది అన్యులుగానే ఉన్నారు. పురాతన మారెమ్మ గుడి అలానే ఉంది. 1912లో ఒక రాత్రి కూటాన్ని ఆలయంలోకాక ప్రజలు నివసించే పాలెంలో ఏర్పాటుచేశారు. గొప్ప జనసమూహం కూడివచ్చారు. దేవుని ఆత్మ వారి హృదయాలలో బలంగా పనిచేశారు. కూడిక అనంతరం స్త్రీ పురుషులందరూ ప్రభువును అంగీకరించారు.[ఆధారం చూపాలి]

పెద్ద మారేడి మార్చు

మూలాలు మార్చు

[1]

  1. సౌజన్య విజయ్, కుమార్. జాగృత భారత్. కర్నూలు: అకర్మన్ కోల్స్ ఫౌండేషన్.