వి. ఎం. తార్కుండే

భారతీయ ఉద్యమకారుడు

విఠల్ మహదేవ్ తార్కుండే (3 జూలై 1909 – 22 మార్చి 2004), ప్రముఖ భారతీయ న్యాయవాది, పౌరహక్కుల ఉద్యమకారుడు, మానవవాద నేత. "భారతీయ పౌరహక్కుల ఉద్యమ పితామహుని"గా ఆయన పేరొందారు. బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా ఆయన పనిచేసి పదవీ విరమణ పొందారు.[1][2] భారత సర్వోన్నత న్యాయస్థానం ఆయనను బొంబాయి ఉన్నత న్యాయస్థానంలో "నిస్సందేహంగా 1957 చాగ్లా అనంతర కాలానికి చెందిన అత్యంత విశిష్టమైన న్యాయమూర్తి" అని ప్రశంసించింది.[3]

తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసంసవరించు

విఠల్ మహదేవ్ తార్కుండే మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన సస్వాద్ లో జూలై 3, 1909న జన్మించారు. సస్వాద్ కు చెందిన ప్రముఖ న్యాయవాది, సామాజిక సంస్కర్త అయిన మహదేవ్ రాజారాం తార్కుండేకు 5గురిలో రెండవ సంతానంగా ఆయన జన్మించారు.

మూలాలుసవరించు

  1. Outlook MAR 24, 2004 TRIBUTE – Father Of Civil Liberties In India
  2. PUCL Bulletin Special Issue Justice Tarkunde: Vol. XXVII, No. 3 ISSN 0970-8693 MARCH 2007 ("This is a special number of the PUCL Bulletin dedicated to the memory of V M Tarkunde, the doyen of the Civil Liberties Movement in India")
  3. Full Court Reference in memory of Late Shri V M Tarkunde,Senior Advocate, on Wednesday, 7 April 2004 in the Supreme Court of India Address by Soli J Sorabjee Attorney General for India

బయటి లంకెలుసవరించు