వెంకటపతి రాజు

క్రికెట్ ఆటగాడు

1969 జూలై 9 న జన్మించిన వెంకటపతి రాజు (Sagi Lakshmi Venkatapathy Raju) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. కుడి చేతితో బ్యాటింగ్ చేసిననూ బౌలింగ్ మాత్రం ఎడమచేతితో చేసేవాడు. 1989-90 లో భారత టెస్ట్, వన్డే జట్టులో ప్రవేశించాడు. అతడు మొదటి సారిగా న్యూజీలాండ్ పై అంతర్జాతీయ క్రీడా జీవితం ప్రారంబించాడు. ఆడిన మొదటి టెస్ట్ లోనే తొలి ఇన్నింగ్సులో నైట్ వాచ్‌మెన్ గా ఆడి రెండు గంటల పాటు క్రీజులో నిల్చి 31 పరుగులు చేసిననూ అవతలి వైపు 6 వికెట్లు పడిపోవడం విశేషం. ఆ తర్వాత 1990లో ఇంగ్లాండు పర్యటనకు కూడా సెలెఖ్ అయ్యాడు.

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు