వెంట్రిలాక్విజం

వెంట్రిలాక్విజం వేదికల మీద ప్రదర్శించే ఒక కళ. ఇందులో కళాకారుడు ఒక బొమ్మను చేతిలో ఉంచుకుని దానిని ముఖ కవళికలు మారుస్తూ, తన నోరు కదపకుండా మాట్లాడుతూ బొమ్మ మాట్లాడుతున్నట్లు భ్రమను కలుగజేస్తాడు.[1]

The GreatLester 1904 - Wielki Lester 1904.png

చరిత్రసవరించు

వెంట్రిలాక్విజం మొదట్లో ఒక మతాచారంగా ఉండేది.[2] వెంట్రిలాక్విజం అనే పదానికి లాటిన్ భాషలో కడుపులోనుంచి మాట్లాడటం అనే అర్థం ఉంది.[3] గ్రీకు ప్రజలు దీన్ని గ్యాస్ట్రోమాన్సీ అని పిలిచేవారు. వీరు కడుపులో ఉత్పన్నమయ్యే శబ్దాలను చనిపోయిన వారి గొంతులనీ, వెంట్రిలాక్విస్ట్ ఆ శబ్దాలను అర్థం చేసుకుని చనిపోయిన వారితో మాట్లాడగలడనీ, భవిష్యత్తును గురించి చెప్పగలరనీ విశ్వసించేవారు.

భారతదేశంలో వెంట్రిలాక్విజంసవరించు

భారతదేశంలో ఈ కళ అడుగుపెట్టి సుమారు వందేళ్లకుపైగా అవుతుంది. భారతదేశంలో ఈ కళను మొట్టమొదటిసారిగా వై. కె. పథ్యే అనే వ్యక్తి ప్రదర్శించాడు.[4] ఈయన వృత్తి రీత్యా మెజీషియన్. తనకు కావలసిన వస్తువుల కోసం ఇంగ్లండు వెళ్ళేవాడు. అలా అనుకోకుండా అక్కడ ఓ సైనికుడు బొమ్మతో మాట్లాడిస్తూ తన తోటివారిని నవ్వించడం చూసి దానిమీద ఆసక్తి పెంచుకున్నాడు. అమెరికా నుంచి వెంట్రిలాక్విజం మీద ఓ పుస్తకం కూడా తెచ్చుకుని చదివాడు. దాన్ని చదివి సొంతంగా వెంట్రిలాక్విజం నేర్చుకుని 1916లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో వెంట్రిలాక్విజం ప్రదర్శన ఇచ్చాడు.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "ఈ బొమ్మ ఎలా మాట్లాడుతుందో తెలుసా..." andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 15 నవంబర్ 2016. Retrieved 26 April 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. Howard, Ryan (2013). Punch and Judy in 19th Century America: A History and Biographical Dictionary. McFarland. p. 101. ISBN 0-7864-7270-7
  3. The Concise Oxford English Dictionary. 1984. p. 1192. ISBN 0-19-861131-5.
  4. "రాందాస్ పథ్యే గురించి". vpuppets.com. Retrieved 26 April 2017.