వెలగపూడి రామకృష్ణ

భారత పారిశ్రామికవేత్త

వెలగపూడి రామకృష్ణ దక్షిణ భారతదేశములో పేరుగాంచిన ఉన్నతోద్యోగి (ఐ.సి.యస్ ), పారిశ్రామికవేత్త, దాత. బ్రిటిషు వారి పరిపాలనా కాలములో (1941) కృష్ణా కమర్షియల్ ప్రాడక్ట్స్ (కె.సి.పి) అను పరిశ్రమల సముదాయము ప్రారంభించాడు. వాటిలో చక్కెర తయారు చేయు పరిశ్రమ ముఖ్యమైనది.[1] ఉమ్మడి మద్రాసు రాష్ట్రములో తొలితరము పారిశ్రామికవేత్తలలో రామకృష్ణ ముఖ్యుడు.

వెలగపూడి రామకృష్ణ
వెలగపూడి రామకృష్ణ
జననం1896
మరణం
1968 నవంబర్ 28
జాతీయతభారతీయుడు
విద్యB.Sc.,M.A.,ICS
వృత్తిప్రభుత్వోద్యోగి, పారిశ్రామిక వేత్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పారిశ్రామికవేత్త, దాత
జీవిత భాగస్వామిశ్రీమతి దుర్గాంబ
పిల్లలుమారుతీ రావు, లక్ష్మణ దత్తు (కుమారులు) ,రాజేశ్వరి(కుమార్తె)

జీవిత విశేషాలు

మార్చు

రామకృష్ణ 1896లో గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, నగరం మండలంలోని బెల్లంవారిపాలెం అను గ్రామంలో వెలగపూడి వెంకట సుబ్బయ్య చౌదరి దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా తేళ్ళపాడు గ్రామంనకు చెందిన కాట్రగడ్డ ఇంటి పేరువారు. వీరి తండ్రి వెలగపూడి వారికి దత్తత వచ్చారు.

1920లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం లో బీఎస్సీ, ఎం.ఏ విద్య నభ్యసించారు.విదేశీ విద్యకొరకు ఇంగ్లాండ్ వచ్చే విద్యార్డులకు సహాయ సహకారాలు అందించేవారు. లండన్ లో ఆచార్య ఎన్,జి.రంగా గారికి రామకృష్ణ మార్గదర్శక మిత్రుడు.[2] వీరి స్నేహం చివరి వరకు కొనసాగింది.

1922 లో ఇండియన్ సివిల్ సర్వీసులో ఉత్తీర్ణుడై మద్రాసు ప్రభుత్వ ఉద్యోగిగా పలు భాద్యతలలో సమర్దవంతంగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసారు.

అలంకరించిన పదవులు:

మార్చు
  • మద్రాసు ప్రభుత్వములో అభివృద్ధి కమీషనరు
  • జిల్లా కలెక్టరు
  • కార్మిక శాఖా కమీషనరు
  • పరిశ్రమల శాఖా కమీషనరు

పారిశ్రామిక వేత్త

మార్చు

మద్రాసు ప్రభుత్వంలొ పరిశ్రమల శాఖా కమీషనరు గా పనిచేస్తూ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించారు. 1941 లో ఉయ్యురులో ఖాయల పడిన పంచదార మిల్లును తీసుకొని కె.సి.పి.(Krishna Commercial Products) షుగరు పేరుతో సహకార రంగంలో అభివృద్ది చేసి ఎంతో మంది పారిశ్రామిక వేత్తలకు స్పూర్తిగా నిలిచారు. ఆంధ్రా షుగర్స్ తణుకు, సర్వారయ షుగర్స్, దక్కన్ షుగర్స్ వంటివి వీరి ప్రొత్సాహాంతో రూపుదిద్దుకున్నవే.

1955 లో నాగార్జున సాగరు ఆనకట్ట నిర్మాణం కొరకుమాచర్లలో సిమెంట్ కంపెనీని కేవలం ఒక సంవత్సరంలో నిర్మించి దాని నిర్మాణాంలో భాగస్వామి అయ్యారు,1958 లో పంచదార పరిశ్రమలకు కావలిసిన యంత్రాలు తయారి కొరకు హెవీ ఇంజినీరింగ్ కంపెనీ మద్రాసులో స్థాపించి విజయం సాధించారు[2]. వీరి మార్గ దర్శకత్వంలో అనేక పంచదార మిల్లులు ఏర్పాటు చేయబడ్డాయి.

కుటుంబం

మార్చు
దస్త్రం:Sri Velagapudi Ramakrishna.png
వెలగపూడి రామకృష్ణ ,దుర్గాంబ వారి సంతానం -1936

రామకృష్ణకు దుర్గాంబ గారితో వివాహం జరిగింది, వీరికి ఇద్దరు కొడుకులు (మారుతీ రావు, లక్ష్మణ దత్తు), ఒక కుమార్తె (రాజేశ్వరి).

వెలగపూడి లక్ష్మణ దత్తు ఫిక్కీ అధ్యక్షునిగా ఉన్నాడు. కె.సి.పి కంపెనీకి ప్రస్తుతము మ్యానేజింగు డైరెక్టరు. భార్య ఇందిర ముక్త్యాల రాజా కూతురు. ప్రపంచ తెలుగు ఫెడరేషన్కు అధ్యక్షురాలు[3].

రామకృష్ణ కుమార్తె రాజేశ్వరి రామకృష్ణన్, జయపూరు చక్కెర కర్మాగారానికి మ్యానేజింగు డైరెక్టరు. రాజేశ్వరి కొడుకు ఆర్. ప్రభు నీలగిరి (ఊటీ) పార్లమెంటు స్థానానికి ఐదు సార్లు వరుసగా ఎన్నికైయ్యారు. మాజీ కేంద్రమంత్రి.

విద్యా దాత

మార్చు

రామకృష్ణ గారు అనేక విద్యాలయాల స్థాపనకు భూరి విరాళాలు ఇచ్చారు. వారి మరణాంతరం రామకృష్ణ గారి అడుగుజాడలలో వారి కుటుంభ సభ్యులు కూడా విరివిగా విరాళాలు ఇస్తున్నారు.

విరాళాలిచ్చిన సంస్థలు

మార్చు
  • వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ కాలేజి, నగరం
  • వి. యస్. ఆర్ & యన్. వీ. ఆర్. కాలేజి, తెనాలి
  • వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజినీరింగు కాలేజి, విజయవాడ
  • శ్రీమతి వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ న్యాయ కళాశాల, విజయవాడ
  • కె,సి.పి. సిద్దార్ధ ఆదర్శ రెసిడెంషియల్ స్కూల్.విజయవాడ
  • ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్సు భవనము, చెన్నై

దక్షిణ భారత దేశం లో పారిశ్రామిక ప్రగతికి బీజం వేసిన తొలి తరం పారిశ్రామిక వేత్త వెలగపూడి రామకృష్ణ గారు. వీరు1968 సెప్టెంబరు 13న పరమపదించారు.

మూలాలు

మార్చు
  1. "KCP Web site". Archived from the original on 2015-07-04. Retrieved 2015-06-19.
  2. 2.0 2.1 Prof.Ranga, N.G. Sri V. Ramakrishna,A Tribute of a collrgue in Plitical life. Nidibrolu: Indian Peasants publications. pp. 1–18. Archived from the original on 2021-07-11. Retrieved 2021-07-11.
  3. http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2004083006950400.htm&date=2004/08/30/&prd=th&[permanent dead link]

ఇతర లింకులు

మార్చు