Legality of corporal punishment in the United States
Legality of corporal punishment in Europe
  Corporal punishment prohibited in schools and the home
  Corporal punishment prohibited in schools only
  Corporal punishment not prohibited

మూస:Corporal punishment శారీరక దండన అన్నది ఒక నేరానికి దండనగా, లేదా ఒక తప్పుచేసిన వ్యక్తికి క్రమశిక్షణ నేర్పడానికి లేదా సరిదిద్దడానికి, లేదా అనంగీకారమైన వైఖరి లేదా ప్రవర్తనను నిరోధించడానికి ఉద్దేశపూర్వకంగా నొప్పిని శిక్షగా వేయడం. ఈ పదం సామాన్యంగా నేరంచేసిన వ్యక్తిని న్యాయ, గృహ లేదా విద్యా నేపథ్యంలో ఒక ఆయుధంతో కొట్టడం.

శారీరక దండనను మూడు ప్రధాన రకాలుగా విభజించవచ్చు:

 • తల్లిదండ్రుల లేదా గృహసంబంధ శారీరక దండన : కుటుంబంలో -- సామాన్యంగా, పిల్లల్ని తల్లిదండ్రులు లేదా సంరక్షకులు దండించడం;
 • పాఠశాల శారీరక దండన : విద్యాలయాల్లో, విద్యార్థులను ఉపాధ్యాయులు లేదా విద్యాలయ అధికారులు దండించడం;
 • న్యాయసంబంధ శారీరక దండన : ఒక న్యాయస్థానం ఆజ్ఞ ప్రకారం నేరానికి శిక్షగా విధించడం. దీనికి దగ్గరి సంబంధం కలిగినది చెరసాల శారీరక దండన, దీనిని చెరసాల అధికారులు లేదా అక్కడికి వచ్చిన న్యాయస్థానం విధించడం జరుగుతుంది.

గృహసంబంధ నేపథ్యంలో మైనర్లను శారీరకంగా శిక్షించడం అన్ని 50 సంయుక్త రాష్ట్రాలలోనూ చట్టసమ్మతం, మరియు ఒక 2000 సర్వే ప్రకారం తల్లిదండ్రుల అనుమతి పొందింది.[1] దీనిని అధికారికంగా 26 దేశాలలో చట్టవిరుద్ధంగా ప్రకటించారు.[2]

పాఠశాల శారీరక దండన ఇప్పటికీ ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలలో చట్టసమ్మతం, ఇందులో USA లోని 20 రాష్ట్రాలు కూడా ఉన్నాయి, కానీ ఇతర ప్రదేశాల్లో, కెనడా, కెన్యా, జపాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, మరియు చెక్ రిపబ్లిక్[3] మరియు ఫ్రాన్సు మినహా దాదాపు అన్ని యూరోప్ దేశాల్లోనూ చట్టవిరుద్ధం.[4]

న్యాయసంబంధ శారీరక దండన పశ్చిమ ప్రపంచంలో దాదాపు అంతరించినా, ఆఫ్రికా మరియు ఆసియాలోని ఎన్నో ప్రదేశాల్లో ఇప్పటికీ అమలులో ఉంది.

శారీరక దండన యొక్క చరిత్రసవరించు

శారీరక దండనయొక్క ప్రారంభ చరిత్ర అస్పష్టంగా ఉంది, ఈ పద్ధతి సుమారు క్రీ.పూ. 10వ శతాబ్దంలో మిష్లీ ష్లోమోలో వ్రాయబడింది (సాల్మన్ సామెతలు, [5] మరియు ఇది నిశ్చయంగా శాస్త్రీయ నాగరికతల్లో ఉండేది, గ్రీసు, రోమ్, మరియు ఈజిప్ట్‌లలో న్యాయసంబంధ మరియు విద్యాసంబంధ క్రమశిక్షణలో భాగంగా ఉండేది.[6] కొన్ని రాష్ట్రాల్లో అటువంటి దండనలను క్రూరంగా విధించేవారని ప్రతీతి; ముఖ్యంగా, స్పార్టలో, వాటిని దృఢ నిశ్చయం మరియు శారీరక బలం పెంపొందించడానికి క్రమశిక్షణా ప్రవృత్తిలో భాగంగా వాడేవారు.[7] స్పార్ట ఉదాహరణ తీవ్రమైనది అయినప్పటికీ, శారీరక దండన బహుశా ఎంతో తరచుగా విధించే దండన. రోమన్ సామ్రాజ్యంలో, చట్ట సమ్మతమైన గరిష్ఠ శిక్ష 40 "కొరడాదెబ్బలు" లేదా వీపు మరియు భుజాలపై కొరడాతో "దెబ్బలు", లేదా "పదునైన రాతిగద"ను (చెక్క గదను పోలినది, కానీ కొండరావిచెట్టుకన్నా విల్లో చెట్టు యొక్క 8-10 చెక్కలు కలిగినది) పిరుదులపై ప్రయోగించడం. ఈ దండనలలో రక్తం కారేది, ఇవి తరచూ బహిరంగంగా విధించేవారు.

మధ్యయుగ యూరోప్‌లో, శారీరక దండనను మానవ శరీరంపట్ల మధ్యయుగ చర్చియొక్క వైఖరి కూడా ప్రోత్సహించేది, స్వయం-క్రమశిక్షణలో కొరడా దెబ్బలు తినడం సామాన్య భాగంగా ఉండేది. పాఠశాలల్లో శారీరక దండన ఉపయోగించడంపై ఇది ప్రభావం చూపింది, ఎందుకంటే ఈ కాలంలో విద్యా సంస్థలు ఎక్కువగా చర్చికి సంబంధించినవిగా ఉండేవి. అయినప్పటికీ, శారీరక దండన విమర్శలకు గురికాకపోలేదు; దాదాపు పదకొండవ శతాబ్దంలోనే సెయింట్ అన్సేలం, కాంటర్బరీ యొక్క ఆర్చ్-బిషప్, పిల్లలతో ప్రవర్తించే విధానంలో శారీరక దండనయొక్క అతి ఉపయోగానికి వ్యతిరేకంగా మాట్లాడాడు.[8]

16వ శతాబ్దం మొదలూ, శారీరక దండనలో క్రొత్త పోకడలు మొదలయ్యాయి. న్యాయసంబంధ దండనలు మరింతగా బహిరంగ దృశ్యాలు అయ్యాయి, ఇతర నేర పోకడలు కలిగిన వ్యక్తులను నిరుత్సాహపరచడానికి నేరస్థులను బహిరంగంగా కొట్టేవారు. ఈ మధ్యలో, విద్యపై ప్రారంభ రచయితలూ, రోజర్ అస్చంవంటివారు, పిల్లలను శిక్షించడంలో నిరంకుశత్వంపై ఫిర్యాదు చేసారు.[9] బహుశా ఈ విషయంలో ఎంతో ప్రభావం చూపిన రచయిత ఆంగ్ల తత్త్వవేత్త జాన్ లాకే, ఇతడి సమ్ థాట్స్ కన్సెర్నింగ్ ఎడ్యుకేషన్, విద్యలో శారీరక దండనయొక్క ప్రధాన పాత్రను ప్రత్యక్షంగా విమర్శించాడు. లాకేయొక్క రచన ఎంతో ప్రభావం చూపింది, మరియు పోలండ్ లోని విద్యాలయాల నుండి 1783లో శారీరక దండనను రద్దు చేయడంలో పోలిష్ ధర్మశాస్త్రకర్తలపై ప్రభావం చూపి ఉండవచ్చు.[10]

18వ శతాబ్దంలో, శారీరక దండన అనే భావనపై కొందరు తత్త్వవేత్తలు మరియు చట్ట సంస్కర్తలు దాడి చేసారు. నేరస్థులకు కేవలం నొప్పిని కలగజేయడం వ్యర్థమని భావించేవారు, ఇందులో వ్యక్తిపై తక్కువ కాలం ప్రభావం ఉంటుంది కానీ, వారి ప్రవర్తనలో శాశ్వతమైన మార్పు ఉండదని భావించేవారు. కొందరు శిక్షయొక్క ఉద్దేశం సంస్కరణ కావాలని, ప్రతీకారం కాదని నమ్మేవారు. దీనిని బహుశా అత్యుత్తమంగా జెరెమీ బెంతంయొక్క విశాలమైన చెరసాల భావన వ్యక్తం చేసింది, ఇందులో ఖైదీలను ఎల్లవేళలా నియంత్రిస్తూ గమనిస్తూ ఉండేవారు, దీంతో శారీరక దండన అవసరం తగ్గగలిగే లాభం ఉండేది[11]

ఈ ఆలోచనా దృక్పథంయొక్క పరిణామంగా పంతొమ్మిదవ శతాబ్దంలో యూరోప్ మరియు ఉత్తర అమెరికాలలో శారీరక దండన విధించడం తగ్గింది. కొన్ని దేశాల్లో శారీరక దండన సమయంలో వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్టూ వచ్చిన పుకార్ల వలన ప్రోత్సహించబడింది. ఉదాహరణకు, బ్రిటన్‌లో, దండనకు ప్రధాన వ్యతిరేకత రెండు ప్రముఖ సంఘటనలతో మొదలైంది, ప్రైవేట్ ఫ్రెడరిక్ జాన్ వైట్ మరణం, యితడు సైన్యంలో కొరడాదెబ్బలవలన 1846లో మరణించాడు, [12] మరియు పాఠశాల విద్యార్థి రేజినల్డ్ కాన్సేలర్, ఇతడి మరణానికి ఉపాధ్యాయుడు 1860లో కారకుడయ్యాడు.[13] ఇటువంటి సంఘటనలు ప్రజాభిప్రాయాన్ని ప్రేరేపించాయి, మరియు సమాధానంగా, ఎన్నో దేశాలు ప్రభుత్వ సంస్థలైన పాఠశాలలు, చెరసాలలు మరియు సంస్కరణ సంస్థలలో శారీరక దండన విధించడంపై కఠినమైన చట్టాల్ని రూపొందించాయి.

1870లలో, సంయుక్త రాష్ట్రాలలోని న్యాయస్థానాలు, భర్తకు "నీతితప్పిన భార్యను శారీరకంగా దండించే" హక్కు ఉందన్న సామాన్య చట్ట సూత్రాన్ని రద్దు చేసింది.[14] UKలో, భార్యను "కర్తవ్య నిర్వహణ పరిధిలో" ఉంచడానికి సామాన్య శారీరక దండన విధించగల భర్త హక్కు, ఇదే విధంగా 1891లో తొలగించబడింది.[15][16] మరింత సమాచారానికి గృహ హింస చూడండి.

యునైటెడ్ కింగ్డంలో, 20వ శతాబ్దం ప్రథమార్థంలో న్యాయసంబంధ శారీరక దండన ఉపయోగం తగ్గింది, మరియు దీనిని సంపూర్ణంగా 1948లో రద్దుచేసారు, ఎన్నో ఇతర యూరోపియన్ దేశాలు దానిని అంతకు మునుపే రద్దుచేయడం జరిగింది. ఈ మధ్యలో ఎన్నో పాఠశాలలలో, బెత్తం, చిన్నకర్ర, లేదా తోలుబెల్టు వంటివి వాడడం U.K. మరియు సంయుక్త రాష్ట్రాలలో 1980ల వరకూ సామాన్యంగా ఉండేది. ఎన్నో ఇతర దేశాలలో, ఇప్పటికీ ఉంది: చూడండి పాఠశాల శారీరక దండన.

ఆధునిక ఉపయోగంసవరించు

ఇంటిలో శారీరక దండనసవరించు

గృహసంబంధ శారీరక దండన, అంటే, పిల్లలనూ మరియు యుక్తవయస్కులనూ వారి తల్లిదండ్రులు దండించడం, వ్యావహారికంలో సామాన్యంగా "పిరుదులపై చరచడం", "కొరడాతో కొట్టడం", "దెబ్బవేయడం," లేదా "చెంపదెబ్బ కొట్టడం."

ఎన్నో దేశాల్లో దీనిని చట్ట విరుద్ధం చేయడం జరిగింది, ప్రథమంగా స్వీడెన్‌లో 1979లో జరిగింది.[2] కొన్ని ఇతర దేశాల్లో, శారీరక దండన, చట్ట సమ్మతమైనప్పటికీ, నియంత్రించబడింది (ఉదా. తలపై కొట్టడం చట్ట విరుద్ధం మరియు ఉపకరణాలు ఉపయోగించకూడదు, మరియు/లేదా ఒక వయసు స్థాయి పిల్లలను మాత్రమే పిరుదులపై చరచవచ్చు).

సంయుక్త రాష్ట్రాలలో మరియు ఆఫ్రికన్ మరియు ఆసియన్ దేశాలలో, తల్లిదండ్రులు "పిరుదులపై చరచడం", "కొరడాతో కొట్టడం", "దెబ్బవేయడం," లేదా "చెంపదెబ్బ కొట్టడం" ప్రస్తుతం చట్టసమ్మతం; బెల్ట్ లేదా చిన్న కర్ర వంటి ఉపకరణాలు ఉపయోగించడం కూడా చట్టసమ్మతం.

కెనడాలో, తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు (కానీ మరెవరూ కాదు) పిల్లలు 2 సంవత్సరాల వయసుకన్నా చిన్నవారు లేదా 12 సంవత్సరాల వయసుకన్నా పెద్దవారు కానంతవరకూ, పిరుదులపై చరచడం చట్టసమ్మతం, మరియు కేవలం చేయి తప్ప ఏ ఇతర ఉపకరణం ఉపయోగించకూడదు (బెల్టులు, చిన్నకర్రలు, మొదలైనవి పూర్తిగా నిషేధం). పైన చెప్పిన జాతీయ నిర్బంధాలకన్నా ఎక్కువగా నిర్బంధాలు చట్టపరంగా విధించడం మండలాల పరిధిలో ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఏవీ అలా చేయడం లేదు.

UKలో, పిరుదులపై చరచడం లేదా దెబ్బవేయడం చట్టసమ్మతం, కానీ అది చర్మంపై మచ్చ ఏర్పరచకూడదు మరియు స్కాట్లాండ్లో అక్టోబరు 2003 నుండి పిల్లలకు క్రమశిక్షణ నేర్పేటప్పుడు ఉపకరణాలు ఉపయోగించడం చట్టవిరుద్ధం.

పాఠశాలల్లో శారీరక దండనసవరించు

పాఠశాల విద్యార్థుల దుష్ప్రవర్తనకు చట్టపరమైన శారీరక దండన విధించడంలో, ముందే నిర్ణయించిన సమయంలో విద్యార్థి యొక్క పిరుదులపై లేదా అరచేతిపై అదే ఉపయోగానికి ఉంచిన ఉపకరణం చెట్టు కొయ్య లేదా పిరుదులపై చరిచే చిన్నకర్ర, లేదా చేతిని ఉపయోగించి కొట్టడం.

దీనిని ఉపాధ్యాయుడు క్షణికోద్రేకంలో కొట్టడంతో పోల్చకూడదు, ఇది "శారీరక దండన" కాదు కానీ హింస లేదా క్రూరత్వం, ఇది దాదాపు ప్రతిచోటా చట్టవిరుద్ధం.

ప్రపంచంలోని ఎన్నో ప్రదేశాలలో పాఠశాలల్లో శారీరక దండన ఉపయోగించేవారు, కానీ ఇటీవలి దశాబ్దాలలో సుమారు యూరోప్ అంతటా, జపాన్, కెనడా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మరియు ఇతర దేశాల్లో దీనిని నిషేధించడం జరిగింది. ఎన్నో ఆసియన్, ఆఫ్రికన్ మరియు కారిబ్బియన్ దేశాలలో ఇది సామాన్యం మరియు చట్టసమ్మతం. వివిధ దేశాల ప్రత్యేక వివరాల కొరకు పాఠశాల శారీరక శిక్ష చూడండి.

సంయుక్త రాష్ట్రాలలో అత్యున్నత న్యాయస్థానం, ఇంగ్రహం వర్సెస్ రైట్ (1977) లో పాఠశాల శారీరక దండన, ఎనిమిదవ సవరణ ప్రకారం క్రూరమైన మరియు అసాధారణ దండన పరిధిలోకి రాదని తీర్పు ఇచ్చింది. దక్షిణాది రాష్ట్రాలలో ఎన్నో పాఠశాలల్లో చిన్నకర్రతో కొట్టడం వాడుకలో ఉంది, కానీ ఇది క్రమంగా తగ్గుతోంది. కానీ, 30 రాష్ట్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో శారీరక దండనను నిషేధించాయి, మరియు రెండు రాష్ట్రాలు, న్యూ జెర్సీ మరియు ఇయోవ, అదనంగా ప్రైవేటు పాఠశాలల్లో కూడా దీనిని నిషేధించాయి.

కెనడాలో, శారీరక దండనను ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో 2004 నుండి నిషేధించడం జరిగింది. అల్బెర్ట, సస్కచేవాన్, మరియు ఒంటారియో మినహా మిగిలిన అన్ని ప్రాంతాలూ 2004కు పూర్వమే స్థానిక నిషేధాలు కలిగి ఉండేవి. 1973లో పాఠశాల శారీరక దండనను నిషేధించిన మొదటి ప్రాంతం బ్రిటిష్ కొలంబియా.

UKలో, శారీరక దండనను ప్రభుత్వ పాఠశాలల్లో 1987లోనూ మరియు అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 2003లోనూ నిషేధించడం జరిగింది.

ఎన్నో సంస్కృతులలో, విద్యార్థినులకన్నా మగ విద్యార్థులకు ఎక్కువగా మరియు తీవ్రమైన శారీరక దండన విధించడం పరిపాటి.[17] క్వీన్స్ ల్యాండ్, ఆస్ట్రేలియాలో, బాలికలకు పాఠశాల శారీరక దండన విధించడం 1934లో రద్దయింది, కానీ ప్రైవేటు పాఠశాలల్లో బాలురకు ఇప్పటికీ 2010లోనూ ఇది చట్టసమ్మతం.[18] సింగపూర్ మరియు మలేషియాలలో, మగపిల్లలను దుష్ప్రవర్తనకు బెత్తంతో కొట్టడం సామాన్యం కానీ పాఠశాలలో బాలికలను బెత్తంతో కొట్టడం చట్టం ద్వారా నిషేధించబడింది. U.S.లో గణాంకాలు, 80% చిన్నకర్రలతో కొట్టడం బాలురనే అని స్థిరంగా చూపుతున్నాయి.

న్యాయసంబంధ లేదా న్యాయాన్ని పోలిన దండనసవరించు

 
[28]

కొన్ని దేశాలు, ఎన్నో మాజీ బ్రిటిష్ ప్రాంతాలైన బోట్స్వానా, మలేషియా, సింగపూర్ మరియు టాంజానియాలతో సహా, ఇప్పటికీ న్యాయసంబంధ శారీరక దండనను ఉపయోగిస్తున్నాయి. మలేషియా మరియు సింగపూర్లలో, కొన్ని నిర్దిష్ట నేరాలకు, పురుషులకు చెరసాల దండనకు అదనంగా బెత్తం దెబ్బలు కూడా విధిస్తారు. సింగపూర్‌లో బెత్తంతో కొట్టే పద్ధతి 1994లో అమెరికన్ టీనేజర్ మైకేల్ P. ఫేను వస్తు-నాశనానికి శిక్షగా బెత్తంతో కొట్టినపుడు, ప్రపంచవ్యాప్తంగా చర్చించబడింది.

ఇస్లామిక్ న్యాయ వ్యవస్థ కలిగిన ఎన్నో దేశాలు, సౌది అరేబియా, ఇరాన్, సుడాన్ మరియు ఉత్తరాది నైజీరియావంటివి, ఎన్నో నేరాలకు న్యాయసంబంధ కొరడాదెబ్బలు విధిస్తాయి. 2009 నాటికి, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో చట్టం మరియు ప్రభుత్వం కూలిపోవడంతో, తాత్కాలిక ఇస్లామిక్ న్యాయస్థానాలు శారీరక దండనను తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది.[19] సౌది అరేబియాలో కొరడాదెబ్బలే కాక, అవయవచ్ఛేదం లేదా అన్గావిహీనం చేయడాన్ని శిక్షాపద్ధతిగా ఇప్పటికీ వాడడం జరుగుతుంది.[20] అటువంటి శిక్షలు ఎంతో వివాదాస్పదమైనవి.[21][22] కానీ, "శారీరక దండన" అనే పదం 19వ శతాబ్దం నుండి అవయవచ్ఛేదం వంటి శారీరక శిక్షలకన్నా, సామాన్యంగా బెత్తం దెబ్బలు, కొరడాదెబ్బలు లేదా తోలు-వస్తువు దెబ్బలనే సూచించేది.[23][24][25][26][27][28][29]

శారీరక దండన యొక్క లాభాలు మరియు నష్టాలుసవరించు

శారీరక దండన సమర్థకుల ప్రకారం, ఇతర రకాల దండనలకన్నా ఇది ఎన్నో లాభాలను కలిగి ఉంది, ఎందుకంటే దీనిని వెంటనే అమలు చేయవచ్చు, ఖర్చు ఉండదు, మరియు దుష్ప్రవర్తనను అరికడుతుంది.[30][31]

అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ పిల్లలను జాగ్రత్తగా చూసుకునే లేదా చదివించే పాఠశాలలు, యువత వసతిగృహాలు, పిల్లల సంరక్షణ శాలలు, మరియు అన్ని ఇతర ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలలో శారీరక దండన వాడకాన్ని వ్యతిరేకిస్తుంది. దీని అభిప్రాయంలో శారీరక దండన హింసతో కూడినది మరియు అనవసరమైనది, ఆత్మ-గౌరవాన్ని తగ్గించవచ్చు, మరియు చెడు ప్రవర్తనను తగ్గించడంకన్నా శత్రుత్వాన్ని మరియు కోపాన్ని పెంచుతుంది. APA ఇంకా శారీరక దండన పిల్లలకు శారీరక హింసను అలవాటు చేయవచ్చని భావిస్తుంది.[32]

శారీరక దండన సమర్థకుడు, డేవిడ్ బెనటార్ ఈ చివరి వాదాన్ని ఉపయోగిస్తూ, ప్రజలకు జరిమానా విధించడం వలన ఇతరుల అవాంఛిత ప్రవర్తనకు ప్రతిగా కొంత సంపదను బలవంతంగా ఇప్పించడం మంచిదని బోధిస్తుందని అంటాడు. బెనటార్ ప్రకారం, ముఖ్యమైన తేడా ఆ శిక్షను విధించే అధికారంయొక్క న్యాయసమ్మతినిబట్టి ఉంటుంది: "న్యాయసమ్మతమైన అధికారాల మధ్య ప్రపంచమంత తేడా [అ]క్కడే ఉంది -- న్యాయవ్యవస్థ, తల్లిదండ్రులు, లేదా ఉపాధ్యాయులు -- శిక్షించే అధికారాన్ని బాధ్యతాయుతంగా నేర దండనకు వాడడం, మరియు పిల్లలు లేదా ఇతర పౌరులు ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు బంధించడం, మరియు ఆర్ధిక లాభాలను (భోజనానికి గాను) పొందడం. ఇక్కడ ఎంతో పెద్ద నీతిపరమైన తేడా ఉంది మరియు పిల్లలు దానిని నేర్చుకోకపోవడానికి కారణం లేదు. పిల్లలు తప్పు చేసినప్పుడు దండించడం అన్నది ఇలా చేయడానికి ఒక ముఖ్యమైన మార్గం."[33]

మానసిక శాస్త్రవేత్త అలైస్ మిల్లర్ అభిప్రాయంలో శారీరక దండనకు ఎన్నో చెడు ఫలితాలుంటాయి.

శారీరకమైన లక్ష్యంసవరించు

శరీరంలో వివిధ భాగాల్ని లక్ష్యంగా పెట్టుకోవచ్చు:

 • పిరుదులు, దుస్తులు ఉన్నా లేకున్నా, తరచుగా శిక్షకు లక్ష్యంగా ఉండేవి, ముఖ్యంగా యూరోప్ మరియు ఆంగ్లం-మాట్లాడే ప్రపంచంలో.[26] నిజంగా, కొన్ని భాషల్లో దండనకు ప్రత్యేక పదాలున్నాయి: ఆంగ్లంలో స్పాంకింగ్, ఫ్రెంచ్ లో ఫెస్సీ, స్పానిష్ లో నల్గడ (ఈ రెండు రోమన్ పదాలూ ప్రత్యక్షంగా పిరుదులకై వాడేపదం నుండి పుట్టాయి). ఈ మెత్తని శరీర భాగాల లాభమేమిటంటే ఇవి దృఢముగా ఉండి శిక్ష కచ్చితంగా అమలు చేయడానికి ఉపకరిస్తాయి, ఇందులో శరీర ధర్మాలేవీ కుంటుపడవు; ఇవి త్వరగా మరియు బాగా నయమవుతాయి; కొన్ని సంస్కృతులలో పిరుదులపై విధించిన శిక్ష అవమానకరంగా భావిస్తారు, దీనిని శిక్షలో భాగంగా అనుకోవచ్చు లేదా లేకపోవచ్చు.
 • కొన్నిసార్లు దక్షిణ కొరియా విద్యాలయాలలో విధించేట్టు, తొడలు మరియు పిక్కల వెనుకభాగానికి దండన విధించడం, ఎక్కువ కాకున్నా కనీసం ఆ మాత్రం నొప్పి కలిగి ఉంటుంది, కానీ ఇది మచ్చలు మరియు గాయాల విషయంలో, మరింత హానిని కలిగించవచ్చు.
 • వీపు మరియు భుజాలు చారిత్రకంగా కొరడాదెబ్బల లక్ష్యంగా ఉండడం పరిపాటి, ఉదా. UKలో రాయల్ నేవీలో మరియు కొన్ని 1948 పూర్వ న్యాయసంబంధ శిక్షలలో, మరియు ప్రస్తుతం సాధారణంగా మధ్యప్రాచ్యంలో మరియు ఇస్లామిక్ ప్రపంచంలో విధించే తొమ్మిది ముడులు కలిగిన కొరడా శిక్ష.
 • తలపై కొట్టడం ఎంతో అపాయకరం, ముఖ్యంగా "చెవుల్ని మెలిపెట్టడం".
 • చెయ్యి ఎంతో సున్నితం మరియు మృదువుగా ఉంటుంది, మరియు ఒక ఉపకరణాన్ని వాడడం ఎక్కువ హాని కలిగించవచ్చు.[34]
 • అరికాళ్ళు తీవ్రంగా సున్నితమైనవి, మరియు వాటిని కొరడాతో కొట్టడం (ఫలకా), మధ్యప్రాచ్యంలో కొన్నిసార్లు జరిగినట్టూ, మరింత బాధాకరం.

ఆచారం మరియు దండనసవరించు

పాఠశాలలు మరియు చెరసాలల్లో అధికారిక నేపథ్యంలో శారీరక దండన సామాన్యంగా క్రమబద్ధమైన క్రియగా, ఒక స్థిరమైన పద్ధతిలో, ఆ సందర్భంయొక్క గాంభీర్యతను తెలుపడానికి వాడతారు. దీనిని, ఇతరులకు నిరోధకంగా పనిచేయడానికి, ఇతర విద్యార్థులు/సహవాసుల ముందు మతకర్మలా నిర్వహించడం కూడా కద్దు.

చెరసాల లేదా న్యాయసంబంధ దండనలలో, అధికారిక శిక్ష చివరికి నేరస్థుడిని ఒక చెక్క సామాను, బల్ల లేదా చట్రం, [35][36] (X-క్రాస్), దండన చట్రం లేదా ఫలకాకు, అతడి దుస్తులను కొద్దిగా లేదా పూర్తిగా తొలగించి, కట్టడంతో ప్రారంభం కావచ్చు. కొన్ని సందర్భాలలో నేర స్వాభావాన్ని చదివి వినిపించి శిక్షను (ముందే నిర్ణయించిన దెబ్బల సంఖ్యతో) అధికారికంగా విధించవచ్చు. నేరస్థుడిని దెబ్బలు కొట్టడానికి వివిధరకాలైన ఉపకరణాలు వాడవచ్చు. ఈ ఉపకరణాలను వివరించడానికి వాడే పదాలు, దేశాన్ని మరియు సందర్భాన్ని బట్టి మారతాయి. కానీ, ఎన్నో సామాన్య రకాలు శారీరక దండన గురించి చదివేటప్పుడు చూడవచ్చు. ఇవి:

 • కర్ర. ఒక సన్నని, వంగెడు కర్రను తరచూ బెత్తం అంటారు.
 • కొండరావి కొయ్య, బలమైన, వంగెడు కొండరావి లేదా అటువంటి చెక్క ముక్కలను ఒక త్రాడుతో కట్టి ఒక ఉపకరణంగా చెయ్యడం.
 • చెట్టు కొయ్య (తరచూ తప్పుగా చెప్పినట్టూ వెదురు కాదు). బ్రిటిష్ కామన్వెల్త్ లో పాఠశాల మరియు న్యాయసంబంధ ఉపయోగాలలో వాడబడేది.
 • చిన్న కర్ర, ఒక పిడి కలిగి, రంధ్రాలు కలిగిన లేదా లేని, చదునైన చెక్క బల్ల. US పాఠశాలలలో వాడబడేది.
 • తోలు బెల్టు. ఒక చివర ఎన్నో తోకవంటి భాగాలు కలిగి, తోలు బెల్టుగా పిలువబడేది, దీనిని స్కాట్లాండ్ మరియు ఉత్తరాది ఇంగ్లాండ్ లో కొన్ని ప్రదేశాలలో పాఠశాలలలో వాడతారు.
 • కొరడా, సామాన్యంగా తోలుతో తయారైనది. ఇందులోని రకాలు కొరడా మరియు ఫ్రెంచ్ మార్టినేట్లకు అదనంగా, రష్యన్ క్నౌట్ మరియు దక్షిణాఫ్రికా స్జంబోక్, .
 • బ్రిటిష్ నావికా క్రమశిక్షణలోనూ మరియు న్యాయసంబంధ మరియు చెరసాల దండనగా విధించే తొమ్మిది ముడులు కలిగిన కొరడా శిక్ష.
 • సంయుక్త రాష్ట్రాలు మరియు బ్రిటన్లలో జుట్టుదువ్వే బ్రష్ మరియు బెల్ట్‌లను సంప్రదాయంగా గృహసంబంధ పిరుదులపై చరచడంలో వాడేవారు.
 • బ్రిటిష్ మరియు కామన్వెల్త్ పాఠశాలలలో వాడేది, తరచూ "ది స్లిప్పర్"గా పిలిచే ప్లిమ్సాల్ లేదా వ్యాయామశాల షూ. చూడండి చెప్పుతో కొట్టడం(దండన).
 • జెస్యూట్ పాఠశాలలలో వాడే ఫెరులా, దీనిని ఎ పోర్ట్రైట్ అఫ్ ది ఆర్టిస్ట్ యాజ్ ఎ యంగ్ మాన్ లోని ఒక దృశ్యంలో వివరంగా చూపడం జరిగింది.

కొన్ని సంఘటనల్లో నేరస్థుడు ఆ ఉపకరణాన్ని తానే తయారు చేసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు, నావికులు తొమ్మిది ముడుల కొరడాను తయారు చేయడానికి నియోగించబడేవారు, దీనిని వారి వీపులపైనే ప్రయోగించేవారు, ఇంకా పాఠశాల విద్యార్థులు కొన్నిసార్లు ఒక బెత్తం లేదా కర్రను కోసుకు రావడానికి పంపబడేవారు.

దీనికి విరుద్ధంగా, అనధికార దండనల్లో, ముఖ్యంగా గృహసంబంధ నేపథ్యంలో, ఇటువంటి కర్మసంబంధ స్వభావం లోపించి మరియు తరచూ చేతికి ఏ వస్తువు అందితే దాంతో దండించడం జరుగుతుంది. ఉదాహరణకు, గృహసంబంధ దండనలలో బెల్టులు, చెక్క స్పూన్లు, చెప్పులు, జుట్టుదువ్వే బ్రష్షులు, లేదా దుస్తుల హాన్గర్లు వాడడం, మరియు పాఠశాలల్లో రూలర్లు మరియు ఇతర తరగతి వస్తువులు వాడడం మామూలు.

ఇంగ్లాండ్‌లోని ప్రదేశాలలో, బాలురను ఒకప్పుడు పాత సంప్రదాయమైన "బీటింగ్ ది బౌన్డ్స్" ద్వారా కొట్టేవారు, ఇందులో ఒక బాలుడిని నగరం లేదా పారిష్ ఎల్ల చుట్టూ త్రిప్పి, ఆ సరిహద్దును గుర్తించడానికి ఒక బెత్తం లేదా కర్రను ఉపయోగించి పిరుదులపై కొట్టేవారు.[37] ఒక ప్రసిద్ధ "బీటింగ్ ది బౌన్డ్స్" సెయింట్ గైల్స్ మరియు మధ్య లండన్‌లో ప్రస్తుతం తోట్టేన్హం కోర్ట్ రోడ్ ఉన్న ప్రదేశం సరిహద్దు చుట్టూ జరిగింది. ఆ సరిహద్దును విడదీసే నిజమైన రాయి ప్రస్తుతం సెంటర్ పాయింట్ ఆఫీసు టవర్ క్రింద ఉంది.[38]

శారీరక దండన, అసాధారణ లైంగిక చర్య మరియు వస్తు-కాముకతసవరించు

జర్మన్ మనస్తత్త్వవేత్త రిచర్డ్ వాన్ క్రాఫ్ట్-ఎబింగ్, పాఠశాలలో శారీరక దండన పొందిన పిల్లల అనుభవం నుండి హింసాప్రవృత్తి లేదా స్వయం-హింస వృద్ధి చెందవచ్చని సూచించాడు.[39] కానీ దీనిని సిగ్మండ్ ఫ్రాయిడ్ వ్యతిరేకించాడు, అతడు కొట్టడం లేదా కొట్టించుకోవడంలో లైంగిక సంతోషం ఉంటుందని, అది ప్రారంభ బాల్యంలో పెరుగుతుందని, మరియు అరుదుగా దండన యొక్క వాస్తవ అనుభవంతో సంబంధం కలిగి ఉంటుందని చెప్పాడు.[40]

వీటిని కూడా పరిశీలించండిసవరించు

 • మరణశిక్ష
 • పిల్లల క్రమశిక్షణ
 • తిట్టడం
 • గృహహింస
 • హాట్ సాసింగ్
 • శారీరక హింస
 • పాఠశాల హింస
 • నోటిని సబ్బుతో శుభ్రపరచుకోవటం

సూచనలుసవరించు

 1. రీవ్స్, జెస్సికా. "సర్వే గివ్స్ చిల్ద్రెన్ సంథింగ్ టు క్రై అబౌట్", టైం , న్యూయార్క్, 5 అక్టోబర్ 2000.
 2. 2.0 2.1 గ్లోబల్ ఇనీషియేటివ్ టు ఎండ్ ఆల్ కార్పోరల్ పనిష్మెంట్ అఫ్ చిల్ద్రెన్ Archived 2014-09-20 at the Wayback Machine. (GITEACPOC).
 3. చెక్ రిపబ్లిక్ స్టేట్ రిపోర్ట్ Archived 2009-07-08 at the Wayback Machine., GITEACPOC, ఫెబ్రవరి 2008.
 4. ఫ్రాన్స్ స్టేట్ రిపోర్ట్ Archived 2008-11-20 at the Wayback Machine., GITEACPOC, ఫెబ్రవరి 2008.
 5. మూస:Bibleref
 6. మక్.కోల్ విల్సన్, రాబర్ట్ . ఎ స్టడీ అఫ్ యాటిట్యుడ్స్ టువార్డ్స్ కార్పోరల్ పనిష్మెంట్ యాస్ యాన్ ఎడ్యుకేషనల్ ప్రొసీజర్ ఫ్రం ది ఎర్లియస్ట్ టైమ్స్ టు ది ప్రెసెంట్ , నిజ్మేగన్ యునివర్సిటీ, 1999, 2.3 to 2.6.
 7. మక్.కోల్ విల్సన్, 2.5.
 8. విక్స్టీడ్, జోసెఫ్ H. ది చాలెంజ్ అఫ్ చైల్డ్ హుడ్: యాన్ ఎస్సే ఆన్ నేచర్ అండ్ ఎడ్యుకేషన్ , చాప్మన్ & హాల్, లండన్, 1936, pp. 34-35. మూస:OCLC
 9. అస్కం, రోజర్. ది స్కోల్మాస్టర్ , జాన్ డే, లండన్, 1571, p. 1. కాంస్స్టేబిల్ చే పునః ప్రచురితమైనది, లండన్, 1927. మూస:OCLC
 10. నేవల్, పేటర్ (ed.). ఏ లాస్ట్ రిసోర్ట్? కార్పోరల్ పనిష్మెంట్ ఇన్ స్కూల్స్ , పెంగ్విన్, లండన్, 1972, p. 9. ISBN 0-15-506372-3
 11. బెంతం, జెరేమి. క్రెస్టోమాథియా (మార్టిన్ J. స్మిత్ మరియు విన్దం H. బర్స్టన్, eds.), క్లారెండోన్ ముద్రణ, ఓక్ష్ఫొర్ద, 1983, pp. 34, 106. ISBN 0-15-506372-3
 12. "ది హిస్టరీ అఫ్ ది 7th క్వీన్స్ ఓన్స్ హస్సర్స్ సం. II, బై C.R.B. బార్రెట్ట్స్". మూలం నుండి 2011-10-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-29. Cite web requires |website= (help)
 13. మిడ్డ్లేటన్. J. థోమస్ హొప్లే అండ్ మిడ్-విక్టోరియన్ యాటిట్యుడ్స్ టు కార్పోరల్ పనిష్మెంట్ ". హిస్టరీ అఫ్ ఎడ్యుకేషన్ 2005.
 14. కల్వేర్ట్, R. "క్రిమినల్ అండ్ సివిల్ లయబిలిటీ ఇన్ హస్బెండ్-వైఫ్ అస్సాల్ట్స్", in వైలెన్స్ ఇన్ ది ఫ్యామిలీ (సుజ్యేన్ K. స్టెయిన్మెత్జ్ మరియు ముర్రే A. స్ట్రాస్, eds.), హర్పెర్ & రో, న్యూయార్క్ , 1974. ISBN 0-15-506372-3
 15. R. v జాక్సన్ Archived 2014-09-07 at the Wayback Machine., [1891] 1 QB 671, LawTeacher.net నుండి గ్రహింపబడినది.
 16. "కార్పోరల్ పనిష్మెంట్ ", ఎన్సైక్లోపెడియా బ్రిటాన్నికా పదకొండవ అధ్యాయం, 1911.
 17. స్ట్రాస్, 1994; కిప్నిస్, 1999; కండ్లోన్ మరియు తోమ్ప్సన్, 1999; న్యూబర్గర్ , 1999; హైమన్, 1997.
 18. "క్వీన్స్‌ల్యాండ్ విద్యా శాఖ". మూలం నుండి 2007-08-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-29. Cite web requires |website= (help)
 19. వాల్ష్, డెక్లన్. "వీడియో అఫ్ గాళ్స్ ఫ్లోగ్గింగ్ యాస్ తాలిబన్ హ్యాండ్ అవుట్ జుస్టిస్ ", ది గార్డియన్ , లండన్, 2 ఏప్రిల్ 2009.
 20. ఆయుధాల విక్రయం పై వ్యతిరేక శిభిరం, ఎవిడెన్స్ టు ది హౌస్ అఫ్ కోమన్స్ సెలెక్ట్ కమిటి ఆన్ ఫారెన్ అఫ్ఫైర్స్, లండన్, జనవరి 2005.
 21. "లాషింగ్ జుస్టిస్", ఎడిటోరియల్, న్యూయార్క్ టైమ్స్ , 3 డిసెంబర్ 2007.
 22. "సౌది అరేబియా: కోర్ట్ ఆర్డర్స్ ఐ టు బి గౌడ్ అవుట్", హ్యూమన్ రైట్స్ వాచ్, 8 డిసెంబర్ 2005.
 23. ఓక్ష్ఫొర్ద ఆంగ్ల నిఘంటువు, 2వ అధ్యాయం, 1989, "కార్పోరల్ పనిష్మెంట్: శరీరం పై చేసిన దండన; సహజంగా ఉండేవి మరణం, అంగచ్ఛేదము, చురకలు, శరీర నిర్బంధము, ఇనుము, అరతూకు వేయుట, మొదలుగునవి. (జరిమానా లేదా శిక్ష ఎస్టేట్ లేక ర్యాంక్ వ్యతిరేకించినపుడు). 19th c. లో సాధారణంగా కొరడా దెబ్బలు లేక అదే రకమైన శరీర నెప్పులు సంభవించవచ్చు."
 24. " కర్ర తో లేదా కోరాడ తో కొట్టడం లాంటి శారీరక శిక్షలు" - కాంసైస్ ఓక్ష్ఫొర్ద నిఘంటువు.
 25. "... శరీరం పై గాయం, ముఖ్యంగా బాదటం వలన." - ప్రస్తుత ఆంగ్ల ఒక్ష్ఫోర్డ్ అమెరికన్ నిఘంటువు.
 26. 26.0 26.1 "ఎక్కువగా బెత్తాలు, కొరడాలు లేక పిరుదులకు కొమ్మలు ఉపయోగించి క్రమశిక్షణ కోసం బలవంతంగా అమలుపరిచేవారు." - చార్లెస్ ఆర్నోల్డ్-బేకర్, ది కంపానియన్ టు బ్రిటిష్ హిస్టరీ , రూట్లేద్జ్, 2001.
 27. "కర్ర తో కొట్టడం లేదా బాదటం లాంటి శారీరక శిక్షలు" - చామ్బర్స్ 21వ సెంచురీ నిఘంటువు.
 28. " కర్ర తో కొట్టడం, కొరడా తో బాదటం లాంటి భౌతిక పరమైన దండనలు" - కొల్లిన్స్ ఆంగ్ల నిఘంటువు.
 29. "ది స్ట్రిక్యింగ్ అఫ్ సంబడీ యాస్ పనిష్మెంట్" - ఎన్కార్ట వరల్డ్ ఇంగ్లీష్ డిక్ష్నరి, MSN. పొందబడినది 2009-10-31.
 30. వోర్హస్, జాన్. "ఏ ఫెయిర్ ప్రైస్ టు పె", ది గార్డియన్ , లండన్, 14 మార్చ్ 1998.
 31. "మజర్ పానిక్స్ ఆన్ పనిష్మేంట్" (సంపాదకీయం), ది డైలీ టెలిగ్రాఫ్ , లండన్, 30 అక్టోబర్ 1996.
 32. రె సోల్యుషన్ ఆన్ కర్పోరాల్ పనిష్మెంట్, అమెరికన్ సైకోలోజికాల్ అస్సోసియేషన్, 1975.
 33. బెనాటర్, డేవిడ్. కర్పోరల్ పనిష్మెంట్, సోషల్ థీరి అండ్ ప్రాక్టిస్ , సం||.24 no.2, 1998.
 34. "కర్పోరల్ పనిష్మెంట్ టు చిల్డ్రన్స్ హాండ్స్", 2002 జనవరి నందు ప్రమాద స్థితి లో మెడికల్ అథోరిటీస్ చేసిన వాక్య.
 35. ఉదాహరణకి చూడుముఇరాన్ లో ప్రజలందరిముందు కోరాడ తో కొడుతున్న చిత్రం (2007).
 36. సింగపూర్ లో మేజా ఉపయొగించి చట్టపరమైన దండన
 37. "మేయర్ మే యాక్ష్ చైల్డ్ స్పాన్కింగ్ రైట్", BBC న్యూస్ ఆన్ లైన్ , 21 సెప్టెంబర్ 20
 38. అక్రోయిడ్, పీటర్. లండన్: ది బయోగ్రఫి , చట్టో & విన్డస్, లండన్, 2000. ISBN 1-57806-051-6
 39. వాన్ క్రాఫ్ఫ్ట్-ఎబింగ్, రిచార్డ్. సైకోపాథియా ఎక్ష్వలిస్ , F.A. డేవిస్ Co., లండన్ & ఫిలడెల్ఫియా, 1892. పునః ప్రచురితమైనది 1978 by స్టెయిన్ & డే, న్యూయార్క్ : ISBN 0-8128-6011-X
 40. ఫ్రాయిడ్, సిగ్మండ్. "ఏ చైల్డ్ ఈస్ బీయింగ్ బీటెన్", ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ సైకోఅనాలిసిస్ 1919; 1:371.

బాహ్య లింకులుసవరించు