శాసనసభ

రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల రాజకీయ సభ
(శాసన సభ నుండి దారిమార్పు చెందింది)


ప్రతి రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకునే సభ్యులతో కూడిన ఒక సభ ఉంటుంది. దీన్ని శాసనసభ లేదా విధానసభ అంటారు.[1] కొన్ని రాష్ట్రాల్లో రెండు సభలుంటాయి. ఈ రెండో సభను శాసనమండలి అంటారు. రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా శాసనసభలో 500 కంటే ఎక్కువ కాకుండాను, 60 కంటే తక్కువ కాకుండాను స్థానాలు ఉండాలి.

భారతదేశం
Emblem of India.svg

ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వం

రాజ్యాంగం


ఇతర దేశాలు

సభ్యుల అర్హతలుసవరించు

  • శాసనసభ సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి.
  • కనీసం 25 ఏళ్ళ వయసు ఉండాలి

సభానిర్వహణసవరించు

సభా నిర్వహణ బాధ్యతలు నిర్వహించేందుకు ఒక సభాపతి (స్పీకరు) ని, ఒక ఉపసభాపతి (డిప్యూటీ స్పీకరు) ని సభ్యుల నుండి ఎన్నుకుంటారు. సాంప్రదాయికంగా సభాపతిగా అధికార పక్షానికి, ఉపసభాపతిగా ప్రతిపక్షానికి చెందిన వారిని ఎన్నుకుంటారు. అయితే ఇది నియమం కాదు.

తమ పదవికి రాజీనామా సమర్పించదలచిన పక్షంలో సభాపతి ఉపసభాపతికి, ఉపసభాపతి సభాపతికి సమర్పించాలి. వారి తొలగింపుకు మెజారిటీ సభ్యుల మద్దతు అవసరం.

సమావేశాలుసవరించు

శాసనసభను సమావేశపరచడం, సమావేశాలను ముగించడం, సభను రద్దు చెయ్యడం వంటి అధికారాలు రాష్ట్రపతి వద్ద ఉంటాయి. శాసనసభ సమావేశాల చివరి రోజుకు, తదుపరి సమావేశాల మొదటి రోజుకు మధ్య 6 నెలలకు మించి అంతరం ఉండరాదు. సభలో సభ్యులు కాని రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, రాష్ట్ర అడ్వొకేటు జనరల్ సభనుద్దేశించి ప్రసంగించవచ్చు, సభా కమిటీలలో పాల్గొనవచ్చు. కాని వారికి సభలో ఓటు వేసే అధికారం ఉండదు.

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Vidhan Sabha". TheFreeDictionary.com. Retrieved 2021-06-26.

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=శాసనసభ&oldid=3360324" నుండి వెలికితీశారు