శిరోభూషణం వెంకట కృష్ణమాచార్యులు

శిరోభూషణం వెంకట కృష్ణమాచార్యులు (ఫిబ్రవరి 23, 1893 - ఫిబ్రవరి 2, 1972) రంగస్థల నటుడు, ఉపాధ్యాయుడు.[1]

శిరోభూషణం వెంకట కృష్ణమాచార్యులు
జననంఫిబ్రవరి 23, 1893
మరణంఫిబ్రవరి 2, 1972
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, ఉపాధ్యాయుడు
తల్లిదండ్రులువెంకటకృష్ణమాచార్యులు, అండాళమ్మ

జననంసవరించు

వెంకట కృష్ణమాచార్యులు 1893, ఫిబ్రవరి 23న వెంకటకృష్ణమాచార్యులు, అండాళమ్మ దంపతులకు నెల్లూరు లో జన్మించాడు.

రంగస్థల ప్రస్థానంసవరించు

చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోగా మేనమామ పోషణలో చదువుకున్న కృష్ణమాచార్యులు, సుప్రసిద్ధ నటుడు సరస్వతి రంగస్వామి అయ్యంగారు వద్ద సంగీతం లో శిక్షణ పొందాడు. నెల్లూరు రంగనాయకలుపేట యంగ్ మెన్స్ అసోసియేషన్ వారి మర్చెంట్ ఆఫ్ వెనీసు అనే ఆంగ్ల నాటకంలోని గ్రేసియో పాత్రద్వారా నాటకరంగ ప్రవేశం చేశాడు. ఇంగ్లీషు, తెలుగు నాటకాలలో అనేక పాత్రలు ధరించడేకాకుండా, నెల్లూరులో జరిగిన సత్య హరిశ్చంద్ర నాటక పోటీలలో పాల్లని హరిశ్చంద్ర పాత్రకు బంగారు పతకం లభించింది ఇంగ్లీషు, తెలుగు నాటక పాత్రలను రసవత్తరంగా నటించడంవల్ల ఈయనకు కళానిధి, వెటరన్ బారన్ యాక్టరు బిరుదులు లభించాయి.

గూడూరు నుంచి పాకాల బదిలీ చేయబడినపుడు, తన ఉద్యాగానికి రాజీనామా చేసి నెల్లూరుకు వచ్చి స్థిరపడ్డాడు. కుమార్తె మరణానికి చేరువలో ఉన్న సమయంలోకూడా సారంగధర నాటకంలో నటించాడు. నాటకాలలో సంపాదిస్తున్న మొత్తాన్ని ఇతర సంస్థలకు ఆర్థిక సహాయంగా అందజేసేవాడు.

నటించిన పాత్రలుసవరించు

మరణంసవరించు

అంతిమదశలో దారిద్ర్యంతో కుంగిపోయిన వెంకట కృష్ణమాచార్యులు 1972, ఫిబ్రవరి 2న చెన్నైలో మరణించాడు.

మూలాలుసవరించు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.264.