శివలింగ వృక్షం చెట్టు శాస్త్రీయ నామం కౌరౌపిటా గియానెన్సిస్. ఆంగ్ల పరిభాషలో కేనన్ బాల్ ట్రీ అంటారు. ఇది దక్షిణ అమెరికాలోను, దక్షిణ భారతదేశంలోను కనిపిస్తుంది. ఈ వృక్షాన్ని నాగలింగ వృక్షమని కూడా అంటారు. వీటి పుష్పాల మధ్య భాగం పడగ విప్పిన సర్పం వలె ఉంటుంది.

శివలింగపుష్పాల చెట్టు
శివలింగపుష్పం.
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
కౌరోపిటా
Species:
సి. గయానెన్సిస్
Binomial name
కౌరోపిటా గయానెన్సిస్

లక్షణాలు

మార్చు
 
శివలింగపుష్పాలు, పండ్లు.

శివలింగ వృక్షం శివుడి జటాజూటముల ఆకృతిలో,వెండ్రుకలు విప్పారినట్లుగా ఉంటాయి.పుష్పాలు కొమ్మలకు పూయకుండా వెంట్రుకల లాంటి జడలకు పూస్తాయి. పైభాగాన నాగ పడగ కప్పి ఉన్నట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి. శివలింగపుష్పాల్ని నాగమల్లి పుష్పాలుగా,మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు.ఇవి అద్భుత సుగంధ పరిమళాలు వెదజల్లుతుంటాయి.

దస్త్రం:Shiva linga pushpam.jpg
శివలింగపుష్పం

హిందూమతం

మార్చు

హిందువులు శివలింగపుష్ప రూపంలో, వృక్షరూపంలో శివుడు కొలువై ఉన్నాడని బావిస్తారు. శివలింగపుష్పాలు సర్వదేవతలకు ముఖ్యంగా శివునికి ప్రీతికరం. ఈ పుష్పాలతో శివపూజ చేయడం ప్రతి శివభక్తునికి నిజంగా ఒక వరం. శివలింగపుష్పాలతో శివపూజ చేసిన వారికి జన్మరాహిత్యాన్ని పొంది, అంత్యమున కైవల్యం పొందునని శివపురాణంలో ఉంది. ఏ దేవునికైనా ఈ పుష్పం సమర్పించినప్పుడు, తప్పనిసరిగా ఆ దేవతల శిరస్సుపై లేదా భుజస్కందాలలో మాత్రమే అలంకరించాలి. పాదాలదగ్గర వేయరాదు. పార్వతికి మాంగల్యంలో అలంకరించాలి.

 
Couroupita guianensis