శివ్‌పురి
శివ్‌పురి, మధ్యప్రదేశ్ రాష్ట్రం, శివ్‌పురి జిల్లాలోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్య పట్టణం. మునిసిపాలిటీ . ఇది వాయవ్య మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ డివిజన్లో భాగం. ఇది సముద్ర మట్టం నుండి 462 మీటర్ల ఎత్తున ఉంది..
శివ్‌పురి | |
---|---|
పట్టణం | |
శివ్‌పురి | |
Coordinates: 25°26′N 77°39′E / 25.43°N 77.65°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | శివ్‌పురి |
Elevation | 468 మీ (1,535 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,79,977 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 473551 |
ISO 3166 code | IN-MP |
Vehicle registration | MP-33 |
భౌగోళికం
మార్చుశివ్పురి సుమారు 25.43 ° ఉత్తర అక్షాంశం, 77.65 ° తూర్పు రేఖాంశం వద్ద ఉంది. [1] పట్టణం గ్వాలియర్కు దక్షిణాన 120 కిమీ, ఝాన్సీకి పశ్చిమాన 96 కిమీ దూరంలో ఉంది. శివ్‌పురి సముద్ర మట్టం నుండి 462 మీ. ఎత్తున ఉంది. [2]
వాతావరణం
మార్చుభారతదేశంలోని ఉత్తర ప్రాంతాల మాదిరిగానే శివ్‌పురిలో కూడా ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది, ఇక్కడ ప్రధానంగా మూడు ప్రధాన ఋతువులు - వేడి వేసవి, వర్షాకాలం, చల్లని శీతాకాలం - ఉంటాయి. [3]
వేసవి
మార్చుశివ్పురిలో వేసవి ఏప్రిల్‌లో వచ్చి జూన్ వరకు ఉంటుంది. ఈ కాలంలో శివ్‌పురి సగటు 40°C తో వేడిగా ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 30°C చుట్టూ ఉంటుంది. మేలో సగటు అధిక ఉష్ణోగ్రత 43°C కు చేరుకుంటుంది. ఇదే అత్యంత వేడిగా ఉండే నెల. [3]
వర్షాకాలం
మార్చువర్షాకాలం, జూలై-సెప్టెంబరు నెలల్లో ఉంటుంది. సగటున 34°C గరిష్ట ఉష్ణోగ్రత ఉంటుంది. కనిష్టంగా 20 - 24°C మధ్య ఉంటుంది. [3]
శీతాకాలం
మార్చుశీతాకాలపు చల్లగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఋతువు, నవంబరు నుండి మార్చి వరకు ఉంటుంది. సగటు కనిష్ట ఉష్ణోగ్రత 14°C తో కొంత చల్లగా ఉంటుంది. అయితే ఇది కనిష్ట ఉష్ణోగ్రత 6°C వరలు పడిపోతూ ఉంటుంది. [3]