శివ మహిమ్న స్తోత్రము

పుష్పదంతాచార్య రచించిన శివ మహిమ్న స్తోత్రం శివ స్తోత్రాలన్నిటిలో చాలా విశిష్టమైనదిగా పెద్దలు చెప్తారు.[1][2][3] ఈ సంస్కృత రచనను బేతపూడి లక్ష్మీకాంతం తెలుగులోని అనువదించాడు.[4] దీనిని ఆంగ్లంలోకి "A Paean to Lord Shivaís Power and Glory" తో వి.వి.బి.రామారావు 2009లో అనువదించాడు.[5]

పురాణ కథనం మార్చు

పూర్వం తమిళనాట ఒక రాజు గారు ఉండేవారు. ఆ రాజు మహా శివ భక్తుడు. ఆయన భక్తికి మెచ్చిన పరమశివుడు ఒకనాడు ప్రత్యక్షం అయి, ఏమి వరం కావాలి అని అడుగుతారు. అప్పుడు ఆ రాజు, "తండ్రీ, నేను భూలోకంలో యోగ్యమైన అన్ని పుష్పముల తోనూ మే పూజ చేసుకోగలగుతున్నాను, కాని మా ఈ భూలోకంలో లభించనివి, కేవలం మీరు ఉండే కైలాసంలో పూసే విశేష పుష్పాలు ఇక్కడ భూమి మీద కూడా పూసేలా వరమివ్వండి, వాటితో కూడా మిమ్మల్ని పూజించాలని ఉంది." అని వరం అడుగుతారు రాజు గారు. మెచ్చిన ఆ ఉమాపతి కైలాసంలో ఉండే అనేక దివ్యమైన పుష్పాలను ఆ రాజు గారు ఉన్న చోట పూయిస్తాడు. ఈ రాజు గారు చక్కగా రోజూ, ఆ పూలతో కూడా శివ పూజ చేసుకుంటూ ఉంటారు.

ఇదిలా ఉండగా, చిత్రరథుడు అనే ఒక గంధర్వుడు ఉండేవాడు. ఆయన ఎంతో శ్రావ్యంగా గంధర్వ గానం చేస్తూ ఉండేవాడు. ఆ చిత్రరథుడు ఒకనాడు ఈ రాజు గారి పూలతోట మీదుగా ఆకాశంలో వెడుతూ ఉంటే, ఇంత అద్భుతమైన సువాసన వస్తోంది అని, చూసి, ఇవి ఏవో ప్రత్యేక దేవతా పుష్పాలు అని అర్ధం అయ్యి, ప్రతీ రోజూ రాత్రి అందరూ నిద్రించిన వేళకి ఆ పూల వనం లోకి అదృశ్య రూపంలోవచ్చి, ఆ పూలన్నీ కోసుకుని వెళ్లి పూజ చేసుకునే వాడు. ఇలా కొన్ని రోజులు జరుగుతుంది. ఈ విషయం తెలిసిన రాజు గారు చాలా విచారించి, అయ్యో పరమశివుడు ఎంతో ప్రేమతో నాకు వరమిచ్చిన పుష్పాలను పూజకు వినియోగించలేకపోతున్నానే అని బాధపడి, ఒక ఉపాయం ఆలోచించి, ఆయన సేవకులను పిలిచి చెప్తాడు, "రోజూ ఆయన తోటలో ఉండే పూవులను శివ పూజ అయిపోయిన తరువాత (నిర్మాల్యం అంటారు కదా..), ఆ నిర్మాల్యం తీసుకువెళ్ళి, పరమశివుడు వరమిచ్చిన కైలాస పుష్పములు ఉన్న తోట చుట్టూ చల్లమని చెప్తారు".

యథావిధిగా ఆ చిత్రరథుడు అనే గంధర్వుడు ఈ తోటలోకి ప్రవేశిస్తాడు, అక్కడ శివ పూజ చేయబడిన నిర్మాల్యం ఉందని చూడక, పొరపాటున కాలితో తొక్కుతాడు. దానితో ఆయన యొక్క దివ్య శక్తులన్నీ నశించిపోయి, ఆయన అదృశ్య రూపంలో ఉండే శక్తి కూడా పోయి, మామూలు వ్యక్తిగా  కనబడతాడు. వెంటనే సైనికులు వచ్చి బంధించి రాజు గారి ముందు ప్రవేశ పెడితే, ఆయన కారాగారంలో బంధిస్తారు. అప్పుడు కారాగారంలో ఉన్న ఆ గంధర్వుడు, పశ్చాత్తాపంతో పరమ శివుని కీర్తిస్తూ చేసిన అద్భుతమైన స్తోత్రమే ఈ శివ మహిమ్న స్తోత్రం. ఈ స్తోత్రం చేసిన తరువాత, శివుడు ప్రీతి చెంది, ఆయనకి మళ్ళీ గంధర్వ రూపం, శక్తులు ఇచ్చి రక్షిస్తాడు. అప్పటి నుంచి ఆయన పేరు, పుష్పదంతుడు , పుష్పదంతాచార్యులుగా మారింది. ఇంత చక్కని స్తోత్రము చదివి, శివ కటాక్షం పొందుదాము.

స్త్రోత్రంలో కొన్ని పద్యాలు[6] మార్చు

మహిమ్నః పారం తే పరమ విదుషో యద్య సదృశీ

స్తుతి ర్బ్రహ్మాదీనా మపి తదవ సన్నాస్త్వయి గిరః ।

అథాఽవాచ్యః సర్వః స్వమతి పరిణామావధి గృణన్

మమాప్యేష  స్తోత్రే హర నిరప వాదః పరికరః ॥ 1॥


అతీతః పంథానం తవ చ మహిమా వాఙ్మన సయోః

అతద్వ్యావృత్త్యా యం చకిత మభిధత్తే శ్రుతి రపి ।

స కస్య స్తోతవ్యః కతి విధ గుణః కస్య విషయః

పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః ॥ 2॥


మధుస్ఫీతా వాచః పరమ మమృతం నిర్మిత వతః

తవ బ్రహ్మన్ కిం వాగపి సుర గురో ర్విస్మయ పదం ।

మమ త్వేతాం వాణీం గుణ కథన పుణ్యేన భవతః

పునామీత్యర్థేఽస్మిన్ పుర మథన బుద్ధిర్వ్యవసితా ॥ 3॥


తవైశ్వర్యం యత్  తజ్జగ దుదయ రక్షా ప్రలయ కృత్

త్రయీ వస్తు వ్యస్తం తిస్రుషు గుణ భిన్నాసు తనుషు ।

అభవ్యానా మస్మిన్ వరద రమణీ యా మ రమణీం

విహంతుం వ్యాక్రోశీం విదధత ఇహైకే జడధియః ॥ 4॥

........................................

........................................

మూలాలు మార్చు

  1. పుష్పదంత, మధుసూధన సరస్వతి(వ్యాఖ్య) (1939). శ్రీశివమహిమ్నస్తోత్రము.
  2. Jan Gonda (1977). A History of Indian Literature: Epics and Sanskrit religious literature. Medieval religious literature in Sanskrit. Otto Harrassowitz Verlag. pp. 259–. ISBN 978-3-447-01743-5.
  3. Anthony Kennedy Warder (1988). Indian Kāvya Literature: The bold style (Śaktibhadra to Dhanapāla). Motilal Banarsidass. pp. 78–. ISBN 978-81-208-0450-0.
  4. బేతపూడి లక్ష్మీకాంతము (1910). మహిమ్న స్తోత్రము.
  5. http://www.telugubhakti.com/telugupages/monthly/Memberszone/shivmahimna.pdf
  6. "Shiva Mahimna Stotram - Telugu | Vaidika Vignanam". vignanam.org. Retrieved 2020-05-23.

బాహ్య లంకెలు మార్చు