భారతీయ రాజపుత్రవశాలలో " శిశోడియా " రాజవంశం ఒకటి. వారు తమను సూర్యవంశీ రాజవంశంగా పేర్కొన్నారు. సూర్యవంశానికి చెందిన ఈ రాజవంశం రాజస్థానులోని మేవారు రాజ్యాన్ని పరిపాలించారు.వంశం పేరు శిశోడియా, సెసోడియా, షిషోడియా, షిషోడ్యా, సిసోడియా, అని కూడా లిప్యంతరీకరణ చేయబడింది.

Maharana Kumbha, one of the most notable Sisodia rulers

పూర్వీకులు మార్చు

రణసింహ కుమారుడు రహపా శిశోడియా రాజవంశానికి పూర్వీకుడిగా గుర్తించబడుతున్నాడు. రహపా 12 వ శతాబ్దపు గుహిలా రాజు రణసింహ కుమారుడు. చిట్టోర్గడు ముట్టడిలో (1303) ఖిల్జీ గుహిలా రాజవంశం ప్రధాన శాఖను ఓడించడంతో ఈ రాజవంశం ముగింపుకు వచ్చింది. తరువాత 1326 లో ఆ వంశానికి చెందిన క్యాడెటు శాఖకు చెందిన రాణా హమ్మీరు సింగు ఈ ప్రాంతం మీద నియంత్రణ సాధించి రాజవంశాన్ని తిరిగి స్థాపించాడు. హమ్మీరు గుహిలా రాజవంశంలో ఒక శాఖ అయిన శిశోడియా రాజవంశ స్థాపకుడు అయ్యాడు. తరువాత ఒకప్పటి మహారాణాకు చెందిన గుహిలా రాజధాని చిత్తోడు శిశోడియాల నియంత్రణలోకి వచ్చింది.[1][2]

అనేక ఇతర రాజపుత్ర వంశాల మాదిరిగా శిశోడియా కూడా పురాణకాల సూర్యవంశ నుండి ఉద్భవించినట్లు పేర్కొంటున్నారు.[3] మేవారు పాలకుడు రాణా రాజసింగు రూపొందించిన 17 వ శతాబ్దపు రాజప్రశస్తి గ్రంథమైన మహాకావ్యంలో పాక్షికపౌరాణిక, పాక్షిక చారిత్రక వంశవృక్షంలో శిశోడియాల ప్రస్తావన ఉంది. ఈ రచనను రాంచోడు భటు అనే తెలంగాణ బ్రాహ్మణుడు రచించాడు. ఆయన కుటుంబం శిశోడియాల నుండి క్రమం తప్పకుండా బహుమతులు అందుకున్నది. వంశవృక్షం రాజవంశం మూలం అయోధ్య పాలకులకు చెందినదిగా భావించబడుతుంది. మనుతో మొదలైన ఇక్ష్వాకు రాజవంశం నుండి రాముడు వంటి అనేక మంది చక్రవర్తులు వచ్చారు. వీరిలో ఒక పాలకుడైన విజయ స్వర్గం నుండి లభించిన ఆజ్ఞ ఆధారంగా అయోధ్యను విడిచి"దక్షిణం" (ఖచ్చితమైన ఆయన స్థావరం గురించి ప్రస్తావించబడలేదు)వెళ్ళాడని ప్రస్తావించబడింది. ఆయన తరువాత 14 మంది పాలకుల పేరు -ఆదిత్య ("సూర్యుడు") అనే ప్రత్యయంతో ముగియడం ఇందుకు ఒక ఆధారంగా భావించబడుతుంది. వీరిలో చివరివాడు అయిన గ్రహాదిత్య, గ్రహపుత్ర గుహిలా రాజవంశం అనే కొత్త రాజవంశాన్ని స్థాపించాడు. ఆయన పెద్ద కుమారుడు వశాపా 8 వ శతాబ్దంలో చిత్రకూట (ఆధునిక చిత్తోరు) ను జయించాడని శివుడి వరం కారణంగా రావా అనే బిరుదును స్వీకరించాడని చెబుతారు.[4]

గ్రహాదిత్య, వశాపా (బాప్పా రావలు అని పిలుస్తారు) ఇద్దరూ రాజస్థానీ జానపద కథలలో ప్రసిద్ధ వ్యక్తులుగా ప్రశంసించబడుతున్నారు.[5] వారి వారసులు చారిత్రక ప్రాధాన్యతకలిగిన వ్యక్తులుగా వ్యక్తులు గుర్తించబడ్డారు. రాజప్రశస్తి వంశావళి ఆధారంగా వీరిలో ఒకరు సమర సింగు - పృథ్వీరాజ చౌహాను సోదరి పృథీని వివాహం చేసుకున్నాడు. ఆయన మనవడు రహపా రాణా (చక్రవర్తి) అనే బిరుదును స్వీకరించారు. రహపా వారసులు శిశోడియా అనే ప్రదేశంలో కొంత సమయం గడిపారు. అందువలన దీనిని "శిశోడియా" అని పిలుస్తారు.[4]

పర్షియా రచన మాజరు-అల్-ఒమ్రా ఆధారంగా ఉదయపూరు శిశోడియా రాణాల మూలపురుషుడు నొషిజాదు అని భావించబడుతుంది. నోషిజాదు మూడవ యాజ్దేగర్డు పెద్ద కుమార్తె నోషిర్వాన్-ఇ-ఆదిల్ కుమారుడు.[6]

చరిత్ర మార్చు

శిశోడియా పాలకులలో రాణా హమ్మీరు (r. 1326-64), రాణా కుంభ (r. 1433-68), రాణా సంగా (r.1508–1528), రాణాప్రతాప్ (r. 1572-97) వంటి పాలకులు అత్యంత ప్రసిద్ధచెందారు. మరాఠా సామ్రాజ్యం వ్యవస్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజు స్థాపించిన భోంస్లే వంశం కూడా శిశోడియా కుటుంబానికి చెందిన ఒక శాఖ నుండి వచ్చినట్లు పేర్కొనబడింది.[7] అదేవిధంగా నేపాలు రాణా రాజవంశానికి కూడా మేవారు రాణాలు మూలం అని పేర్కొనబడింది.[8]

శిశోడియా క్రానికల్సు ఆధారంగా 1303 లో ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్గడు మీద దాడి చేసినసమయంలో శిశోడియా పురుషులు మరణసదృశ్యపోరాటం చేసి మరణించారు. వారి మహిళలు జౌహరు (సతీసహగమనం) చేశారు. ఇది రెండుసార్లు పునరావృతమైంది: గుజరాతుకు చెందిన మొదటి బహదూర్ షా 1535 లో చిత్తోరుగడును ముట్టడించినప్పుడు ఒకసారి. మొఘలు చక్రవర్తి అక్బరు 1567 లో దీనిని జయించినప్పుడు రెండవసారి.[9]

మొఘలులతో తరచూ జరిగే సంఘర్షణల కారణంగా శిశోడియా రాజ్యం వైశాల్యాన్ని బాగా క్షీణించింది. శిశోడియాలు చివరికి మొఘలు ఆధిపత్యాన్ని అంగీకరించారు. మరికొందరు మొఘలు సైన్యంలో చేరి పోరాడారు. తరువాతి శిసోడియా పాలకుల కళాప్రదర్శన, సాహిత్య రచనలు వారితొ మొఘలులకున్న సంబంధాన్ని నొక్కిచెప్పాయి.[9] మొఘలులతో పొత్తు పెట్టుకున్న చివరి రాజపుత్ర రాజవంశంగా శిశోడియా గుర్తించబడుతుంది. ఇతర రాజపుత్ర వంశాల మాదిరిగా శిశోడియాలు మొఘల్ సామ్రాజ్య కుటుంబంతో వివాహ సంబంధాలు ఏర్పరుచుకోలేదు. మొఘలులతో వైవాహిక సంబంధాలు కలిగి ఉన్న ఇతర రాజపుత్ర వంశాలకు చెందిన మహిళలను శిశోడియాలు వివాహం చేసుకోవడానికి అనుమతించబడలేదు.[10] శిశోడియాలు కవితా ఇతిహాసాలు, దృశ్య కళల (ఇతర రాజపుత్ర వంశాలకు భిన్నంగా) కు గుర్తింపు పొందారు. బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీ అధికారి జేమ్సు టాడు తన పుస్తకం " అన్నల్స్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాను" (భారతదేశం మధ్య, పశ్చిమ రాజపుత్ర రాజ్యాలు (సా.శ.1829-సా.శ.1832) రచించడానికి ఈ రచనల మీద ఆధారపడ్డాడు. విస్తృతంగా ప్రజాదరణపొందిన ఆయన రచన శిశోడియాల ఉన్నతమైన రాజపుత్ర వంశంగా భావించబడుతున్న చరిత్రకారుల అభిప్రాయాలను వ్యాప్తి చేయడానికి సహాయపడింది.[9][11]

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Rima Hooja (2006). A history of Rajasthan. Rupa. pp. 328–329. OCLC 80362053.
  2. The Rajputs of Rajputana: a glimpse of medieval Rajasthan by M. S. Naravane ISBN 81-7648-118-1
  3. Joanna Williams, Kaz Tsuruta, ed. (2007). Kingdom of the sun. Asian Art Museum - Chong-Moon Lee Center for Asian Art and Culture. pp. 15–16. ISBN 9780939117390.
  4. 4.0 4.1 Sri Ram Sharma (1971). Maharana Raj Singh and His Times. Motilal Banarsidass. pp. 2–12. ISBN 9788120823983.
  5. Dineschandra Sircar (1963). The Guhilas of Kiṣkindhā. Sanskrit College. p. 25.
  6. Wessly Lukose (2013). Contextual Missiology of the Spirit: Pentecostalism in Rajasthan, India. Wipf & Stock Publishers. p. 50. ISBN 978-1-62032-894-1.
  7. Singh K S (1998). India's communities. Oxford University Press. p. 2211. ISBN 978-0-19-563354-2.
  8. Greater Game: India's Race with Destiny and China by David Van Praagh
  9. 9.0 9.1 9.2 Melia Belli Bose (2015). Royal Umbrellas of Stone. Brill. pp. 248–251.
  10. Melia Belli Bose (2015). Royal Umbrellas of Stone. Brill. p. 37.
  11. Freitag, Jason (2009). Serving empire, serving nation: James Tod and the Rajputs of Rajasthan. Leiden: Brill. pp. 3–5, 49. ISBN 978-90-04-17594-5. Retrieved 27 జూలై 2011.

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=శిశోడియా&oldid=3709202" నుండి వెలికితీశారు