శొంఠి శ్రీనివాస కవి

శొంఠి శ్రీనివాస కవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, శతక కర్త.[1]

శొంఠి శ్రీనివాస కవి
జననంశొంఠి శ్రీనివాస కవి
1830
లేపాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా
ప్రసిద్ధికవి, శతక కర్త
మతంహిందూ
తండ్రివెంకాల్యుడు
తల్లిగౌరవాంబ

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షిలో 1830 ప్రాంతంలో జన్మించి ఉండవచ్చు.[2] ఇతడి తండ్రి వెంకాల్యుడు, తల్లి గౌరవాంబ.[3]

ఇతడు రాసిని చంపకధామ శతకంలోని ఒక పద్యం ద్వారా కవి గారు తన ఆస్తిని పోగొట్టుకుని దేశాటన చేసారని, మైసూరు ప్రాంతాలకు వెళ్లారని తెలుస్తుంది. అక్కడ కూడా ఆయన ఆశించిన దాతలు కనిపించకపోవడంతో, నిస్సహాయ స్థితిలో "అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ" అని శ్రీరామచంద్రుడిని నమ్మి ఈ శతకం రాసినట్లు తెలుస్తుంది.[4]

ఇతడు కాళహస్తికి వెళ్ళి, అక్కడ సవర్ణముఖి నదిలో నిత్యం స్నానం చేసి కాళహస్తీశ్వరుడిని సేవించారని, ఒకరోజు నది ఒడ్డున ఆయనకు శ్రీరామచంద్రుని విగ్రహం దొరికిందని, అప్పటి నుండి శ్రీరామమూర్తిని ధ్యానిస్తూ ఈ శతకం రాశాడని ఇతని పద్యాల ద్వారా తెలుస్తుంది. ఇతను శ్రీశైలానికి కూడా వెళ్లాడు. "ప్రతిధాన వ్రతము" అను ద్విపద కావ్యాన్ని మొదట రాశాడు. ఆ ప్రతి ప్రస్తుతం లభ్యం కాలేదు.[4]

రచనలు

మార్చు
  • పారిజాతాపహరణము యక్షగానము
  • చంపకధామ శతకము: 1882వ సంవత్సరమునకు సరియైన చిత్రభాను సంవత్సరము శరదృతువులో రాసి ముగించాడు. 1918లో శ్రీ చంపకదామ శతకము రెండవ కూర్పు మైసూరులోని కె. నరసింహయ్య అండ్ కంపెనీ ముద్రాక్షరశాలలో రాజేశ్రీ బి. రామకృష్ణారావు చేత ప్రచురించబడింది. ఈ ప్రతి ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ శతకములో మత్తేభములు, శార్దూలాలు కలిసి 102 పద్యాలు ఉన్నాయి.
  • దుర్గా స్తోత్రము

మూలాలు

మార్చు
  1. రాయలసీమ రచయితల చరిత్ర మూడవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
  2. కల్లూరు అహోబలరావు (1981-08-01). రాయలసీమ రచయితల చరిత్ర-మూడవ సంపుటి.
  3. కల్లూరు అహోబలరావు (1981-08-01). రాయలసీమ రచయితల చరిత్ర-మూడవ సంపుటి.
  4. 4.0 4.1 కల్లూరు అహోబలరావు (1981-08-01). రాయలసీమ రచయితల చరిత్ర-మూడవ సంపుటి.

ఇతర లింకులు

మార్చు