శోభా కరంద్లాజే

ఉడిపి-చిక్ మగళూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ

శోభా కరంద్లాజే (జననం 23 అక్టోబర్ 1966)[3]ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో వ్యవసాయం,రైతుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు.ఆమె కర్ణాటక లోని భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలిగా,ఉడిపి చిక్ మంగళూరు లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యురాలు.[4]ఆమె కర్ణాటక ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నది.ఆమె కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్ యడ్యూరప్పకు సన్నిహిత నమ్మకస్థురాలు. ఈవిడ రాజకీయ ఎదుగుదలలో బి.ఎస్. యడ్యూరప్ప ప్రోత్సాహం ఉన్నది. [5]

శోభా కరంద్లాజే
MP Shobha Karandlaje.jpg
వ్యక్తిగత వివరాలు
జననం (1966-10-23) 1966 అక్టోబరు 23 (వయసు 56)
పుత్తూరు, కర్ణాటక
జాతీయతభారతీయురాలు
చదువుM.A. (Sociology), M.S.W.[1]
కళాశాలమంగుళూరు విశ్వవిద్యాలయం
మారుపేరుShobhakka

ప్రారంభ జీవితంసవరించు

కోస్తా కర్ణాటకలోని పుత్తూరుకు చెందిన శోభ చాలా తక్కువ వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో అనుబంధం కలిగి ఉంది,[6]

శోభ తన ఎం.ఎ. సోషియాలజీ ,మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ను ఓపెన్ యూనివర్సిటీ, మైసూరు,స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ రోషిని నిలయ,మంగళూరు విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసింది.[ఆధారం చూపాలి]

రాజకీయ జీవితంసవరించు

ఆమె మే 2008లో బెంగళూరులోని యశవంతపుర నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైనది, బి ఎస్ యడ్యూరప్ప ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి,పంచాయితీ రాజ్ మంత్రిగా పని చేసింది.

ఆర్ డిపిఆర్ మంత్రిగా ఆమెకు ప్రశంసలు వచ్చాయి. మంచి అడ్మినిస్ట్రేటర్ గా ప్రసిద్ధి చెందింది.[7]ఆమె జగదీష్ శెట్టర్ మంత్రిత్వ శాఖలో విద్యుత్ మంత్రిగా ఉన్నారు.ఆహార, పర సరఫరాల శాఖ అదనపు బాధ్యతలు కూడా కలిగి ఉన్నారు. ఆమె బిజెపికి రాజీనామా చేసి, 2012 లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప ఏర్పాటు చేసిన కెజెపిలో చేరారు.[8]కెజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించబడింది.[9]

ఆ తర్వాత ఆమె ఉడిపి చిక్కమగళూరు నియోజకవర్గం నుంచి 2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి 1.81 లక్షల ఓట్ల తేడాతో గెలిచింది.2019 సార్వత్రిక ఎన్నికలలో ఆమె 7,18,916 ఓట్లను పొంది రెండవసారి గెలిచింది.[10] [11]

వివాదంసవరించు

 • కర్ణాటక లోని హోన్నవర్ లో మైనర్ బాలికపై దాడి చేసిన ఆరోపణపై ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన "రెచ్చగొట్టే" ట్వీట్లకు భారతీయ శిక్షాస్మృతిలోని 153 మరియు 503 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.[12][13]

మూలాలుసవరించు

 1. https://www.india.gov.in/my-government/indian-parliament/shobha-karandlaje
 2. loksabha
 3. "Shobha Karandlaje | National Portal of India". www.india.gov.in. Retrieved 2021-07-08.
 4. "Members : Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2021-07-08.
 5. https://www.newindianexpress.com/states/karnataka/2017/may/02/yeddyurappa-shobha-karandlaje-too-under-fire-in-muralidhar-raos-report-1599979.html
 6. Swamy, Rohini (2020-02-17). "Shobha Karandlaje — from devout Sangh follower to 'most powerful woman' in Karnataka". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-07-08.
 7. "So it seems, Shobha Karandlaje was indeed chief minister of Karnataka". The News Minute (in ఇంగ్లీష్). 2014-09-17. Retrieved 2021-07-08.
 8. January 9, Vanu Dev; January 18, 2013UPDATED:; Ist, 2013 21:02. "BS Yeddyurappa's KJP heading for split over Shobha Karandlaje?". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-07-08.{{cite web}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
 9. "Yeddyurappa appoints Shobha Karandlaje as KJP's working president". The Hindu (in Indian English). PTI. 2013-08-30. ISSN 0971-751X. Retrieved 2021-07-08.{{cite news}}: CS1 maint: others (link)
 10. "Karandlaje wins by 3.5-lakh vote margin". Deccan Herald (in ఇంగ్లీష్). 2019-05-23. Retrieved 2021-07-08.
 11. "Udupi Chikmagalur Lok Sabha Election Results 2019 Live: Udupi Chikmagalur Constituency Election Results, News, Candidates, Vote Paercentage". News18. Retrieved 2021-07-08.
 12. "WATCH | FIR filed against BJP MP Shobha Karandlaje for her controversial remark". www.timesnownews.com (in ఇంగ్లీష్). Retrieved 2021-07-08.
 13. "FIR filed against Karnataka BJP MP Shobha Karandlaje for provocative tweets on minor girl's murder-Politics News , Firstpost". Firstpost. 2017-12-24. Retrieved 2021-07-08.