శ్యామ్ కుమారి ఖాన్

భారత స్వాతంత్ర్య సమరయోదురాలు

శ్యామ్ కుమారి ఖాన్ ( 1904 అక్టోబరు 20 - 1980 జూన్ 9) ఒక భారతీయ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయవేత్త. సామాజిక కార్యకర్త. ఆమె 1963 నుండి 1968 వరకు రాజ్యసభ సభ్యురాలు.

శ్యామ్ కుమారి ఖాన్
జననం
శ్యామ్ కుమారి నెహ్రూ

(1904-10-20)1904 అక్టోబరు 20
మరణం1980 జూన్ 9(1980-06-09) (వయసు 75)
జాతీయతభారతీయురాలు
వృత్తిన్యాయవాది
భారత స్వాతంత్ర్య కార్యకర్త
రాజ్యసభ సభ్యురాలు
సామాజిక కార్యకర్త
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిఅబ్దుల్ జమీల్ ఖాన్
పిల్లలు2, కబీర్ కుమార్ ఖాన్,
కమలా కుమారి ఖాన్
బంధువులుజవహర్‌లాల్ నెహ్రూ
ఆనంద్ కుమార్ (సోదరుడు)
అరుణ్ నెహ్రూ (మేనల్లుడు)

వ్యక్తిగత జీవితం

మార్చు

1904 అక్టోబరు 20న జన్మించిన ఆమె శ్యామ్‌లాల్ నెహ్రూ, ఉమా నెహ్రూలకు పెద్ద సంతానం. ఆమె తండ్రి, భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఇరువురు తోబుట్టువుల పిల్లలు. ఆమె ప్రత్యేక వివాహాల చట్టం - 1872[1] ప్రకారం, 1937 డిసెంబరు 7న అబ్దుల్ జమీల్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత 'శ్యామ్ కుమారి ఖాన్'[2]గా ప్రసిద్ధి చెందింది.

శ్యామ్ కుమారి నెహ్రూ తన 30వ ఏట వివాహం చేసుకున్నారు. అప్పటికి వివాహం చేసుకునే వయస్సు.. దాటిందని ఆమె భావించారు. ఆమె అబ్దుల్ జమీల్ ఖాన్‌ను వివాహం చేసుకున్న తరువాత ఆమె కుటుంబ సభ్యులనుండి దూరం కావాల్సివచ్చింది. అయినా ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది కాబట్టి ఆమె ఆర్థికంగా నిలతొక్కుకుని స్వతంత్రంగా ఉండగలిగారు.[3] పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నా ఆ తర్వాత ఆమె కుటుంబం కలసిపోయింది. వారికి కబీర్ కుమార్ ఖాన్, కమలా కుమారి ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె 75వ ఏట 1980 జూన్ 9న మరణించింది.[4]

కెరీర్

మార్చు

అలహాబాద్ విశ్వవిద్యాలయంలో శ్యామ్ కుమారి ఖాన్ చదువుకున్నారు. ఆమె 1924-28 సంవత్సరాల మధ్య కాలంలో అలహాబాద్ యూనివర్శిటీ యూనియన్‌కి సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ అయిన మొదటి మహిళ. వృత్తిరీత్యా న్యాయవాది అయినా ఆవిడ రచయిత, స్వాతంత్ర్య సమరయోధురాలు. 1932లో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూలదోయడానికి చేసిన ప్రయత్నాల వల్ల రాజకీయ ఖైదీ అయిన యశ్పాల్ జైలుకెళ్లినప్పుడు అతని విచారణ సమయంలో ఆమె వాదించారు.

1932లో ఆమె ఖిలాఫత్ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమాల్లో చేరారు. కమలా నెహ్రూతో పాటు మహిళా స్వాతంత్ర్య సమరయోధులకు నాయకత్వం వహించారు. ఆమె తల్లి ఉమా నెహ్రూతో పాటు సాల్ట్ మార్చ్ సమయంలో ప్రముఖ మహిళా నాయకులలో ఒకరు.

స్వాతంత్ర్యం తరువాత కూడా ఆమె సామాజిక కార్యకర్తగా చురుకుగా కొనసాగింది. 1952 మే 30న, ఆమె ఇందిరా గాంధీ, రాజకుమారి అమృత్ కౌర్, బి.శివరావు వంటి ప్రముఖ వ్యక్తులతో పాటు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ (ICCW) వ్యవస్థాపక సభ్యులలో ఒకరు అయ్యారు. ఆ తర్వాత ఆమె ఐసిసిడబ్ల్యూ జనరల్ సెక్రటరీ అయ్యారు.

రాధా రామన్, శ్యామ్ కుమారి ఖాన్ అధ్యక్షతన, ICCW ఢిల్లీలో అంతర్జాతీయ బాలల ఉత్సవాన్ని నిర్వహించింది. దీనిని 1969 అక్టోబరు 17న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు. ఆమె ఇండియన్ హ్యూమనిస్ట్ యూనియన్ వ్యవస్థాపక సభ్యురాలు కూడా. 1972లో నర్సింహ నారాయణ్ మరణానంతరం ఎన్నికైన ఛైర్మన్ అయ్యారు. ఆమె 1963 డిసెంబరు 11 నుండి 1968 ఏప్రిల్ 2 వరకు రాజ్యసభ సభ్యురాలు.

మూలాలు

మార్చు
  1. Khan, Radha. "My name is Khan: Inter-religious marriages still draw questions and incredulity in India". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-08-19.
  2. "Aboutus". www.iccw.co.in. Archived from the original on 2021-11-07. Retrieved 2021-11-07.
  3. Khan, Radha. "My name is Khan: Inter-religious marriages still draw questions and incredulity in India". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-11-25.
  4. Khan, Shrimati Shya Kumari Archived 2019-03-25 at the Wayback Machine on the Rajya Sabha website.