శ్రావణ శుక్రవారం

వర్ష ఋతువునందు వచ్చు శ్రావణ మాసములొని శుక్రవారములను శ్రావణ శుక్రవారములందురు. హిందువులకు ఇది చాలా పవిత్రమైన మాసము.

శ్రావణ మాసములో స్త్రీలు అభ్యంగనస్నానం చేసి ఇంటిని శుభ్రముగా చేసి వరలక్ష్మి దేవిని పీట వేసి పెద్ద ముగ్గు వేసి అమ్మవారిని చీరతో అలంకరించి, దీపము వెలిగించి, ఆవాహన చేసి వరలక్ష్మి వ్రతం కథ చదివి 3 లేదా 5 లేదా 7 లేదా 9 లేదా 12 రకాల పిండి వంటలతో నైవేద్యం పెట్టాలి.

వరలక్ష్మి నైవేద్యం

1. పులిహొర
2. రవ్వ కేసరి
3. బూరెలు
4. బొబ్బ్తలు
5. గొదుమనుక ప్రసదం 
6. అన్నం పాయసం
7. ఉండ్రాళ్ళు
8. గారెలు, ఆవడలు
9. దోస, లడ్లు
10. కొంత బెల్లం ప్రసాదం
11. పూర్ణం
12. కొబ్బరికాయ

ఇవి కాక వడపప్పు పానకం బెల్లం అరటి పళ్ళు కొబ్బరికాయ అరిసెలు అప్పాలు చక్ర పొంగలి పెద్దన్నం మొదలైనవి వివిధ ఆచారాల ప్రకారం వరలక్ష్మీదేవికి నైవేద్యం చేస్తారు